Bigg Boss Non-Stop Telugu OTT: Nataraj Master Emotional in the Task - Sakshi
Sakshi News home page

Bigg Boss Non Stop: హ్యాండ్‌ ఇచ్చిన అఖిల్‌, ఏడ్చేసిన నటరాజ్‌ మాస్టర్‌

Published Thu, May 12 2022 7:44 PM | Last Updated on Thu, May 12 2022 8:23 PM

Bigg Boss Non Stop Telugu OTT: Nataraj Master Emotional in the Task - Sakshi

బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌లో గుంపులుగా గేమ్‌ ఆడకుండా సొంతంగా ఆటాడుతూ ఇక్కడిదాకా వచ్చాడు నటరాజ్‌ మాస్టర్‌. కానీ కొన్నిసార్లు ఆటలో గెలవాలంటే పక్కవారి సాయం కూడా తప్పనిసరి. లేదంటే గెలుపు తలుపు తడుతున్నామనుకునేలోపే ఓటమి వచ్చి నెత్తిమీద కూర్చుంటుంది. ఇప్పుడు నటరాజ్‌ పరిస్థితి అలాగే ఉంది. ప్రేక్షకులను ఓట్లు అడిగే అవకాశాన్ని పొందేందుకు హౌస్‌మేట్స్‌కు ఓ టాస్క్‌ ఇచ్చాడు బిగ్‌బాస్‌. ఈ టాస్క్‌లో పై నుంచి పడే పూలను ఏరుకుని వారికి ఇచ్చిన తొట్టిలో పెట్టుకోవాలి. మొదటి రౌండ్‌లో నటరాజ్‌ మాస్టర్‌ దగ్గర ఎక్కువ పూలున్నాయి.

దీంతో వెంటనే మిగతా హౌస్‌మేట్స్‌ ఏకమై నట్టూను ఓడించారు. తక్కువ పూలున్న అనిల్‌కు సాయం చేయాలనుకున్నారు. అనుకున్నదే తడవు శివ, అఖిల్‌ తమ దగ్గరున్న పూలను అనిల్‌కు అప్పగించడంతో అతడే గెలుపొందాడు. దీంతో నటరాజ్‌ కంటతడి పెట్టుకున్నాడు. అఖిల్‌ నాలుగోసారి మోసం చేశాడంటూ ఎమోషనల్‌ అయ్యాడు. ఆకాశం వంక చూస్తూ.. 'ఎవరూ సాయం చేయరు. కనీసం ఆడేసి ఓట్లు అడుక్కుందామనుకునే భాగ్యం కూడా లేదు. ఆ అవకాశం కూడా లాక్కున్నావు. సగం చచ్చిపోయి ఉన్నా..' అంటూ ఏడ్చేశాడు. మరోవైపు ఈరోజు హౌస్‌లోకి జీవిత, రాజశేఖర్‌, అనూప్‌ రూబెన్స్‌ వచ్చి సందడి చేశారు. మరి ఆ సందడి, మాస్టర్‌ గుండెల్లో రేగిన అలజడి చూడాలంటే నేడు రాత్రి 9 గంటలకు ప్రసారమయ్యే ఎపిసోడ్‌ చూడాల్సిందే!

చదవండి: నా ఫ్రెండ్స్‌ నన్ను ద్వేషించేవారు, ఎన్నో కష్టాలు అనుభవించాను

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement