
బిగ్‌బాస్ హౌస్‌లో జరిగే ఆటను కన్నార్పకుండా చూసేందుకు బిగ్‌బాస్ తెలుగు ఓటీటీని ప్రవేశపెట్టారు మేకర్స్. నో కామా, నో ఫుల్‌స్టాప్ అంటూ నాన్‌స్టాప్ షోను మొదలుపెట్టారు. తద్వారా హౌస్‌లో 24 గంటలు ఏం జరుగుతుందో చూసే అవకాశం కల్పించారు. కానీ కొన్ని సందర్భాల్లో హౌస్‌మేట్స్ డబుల్ మీనింగ్ డైలాగ్స్ మాట్లాడటం, జోక్స్ శృతిమించడం, బూతులు తిట్టుకోవడం చూస్తుంటే ఈ షోకు సెన్సార్ లేకుండా పోయిందని తిట్టుకునేవాళ్లూ లేకపోలేరు.
తాజాగా షోలో అషూ.. అనిల్‌తో పులిహోర కలిపింది. నిన్ను ముద్దు పెట్టుకోవాలని ఉందని చెప్పడమే కాకుండా అతడి చేతిని తీసుకుని ముద్దాడింది. అషూ తనను ముద్దు పెట్టుకునేసరికి పులకరించిపోయిన అనిల్ ఆమె చేతిని ముద్దాడాడు. ఆ తర్వాత సీక్రెట్ టాస్క్‌లో భాగంగా హౌస్‌మేట్స్ మిత్ర శర్మ, అరియానాను ఏడిపించారు. మరి అషూ అనిల్‌ను కిస్ చేయడం కూడా సీక్రెట్ టాస్క్‌లో భాగమా? కాదా? అనేది తెలియాలంటే బిగ్‌బాస్ నాన్‌స్టాప్ లైవ్ చూడాల్సిందే!
Comments
Please login to add a commentAdd a comment