బిగ్‌బాస్ నాన్‌స్టాప్ షోలో ఎన్నో ప్రయత్నాల అనంతరం ఎట్టకేలకు కెప్టెన్ అయ్యాడు యాంకర్ శివ. మరోపక్క కెప్టెన్సీ కంటెండర్ టాస్క్‌లో అయోమయంతో నిర్ణయాలు తీసుకున్న అషూ వరస్ట్ కంటెస్టెంట్‌గా ఎంపికై జైలు పాలయ్యింది. ఇదిలా ఉంటే తాజాగా బిగ్‌బాస్ వారికి చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకునే అవకాశం కల్పించాడు. కొన్ని ఫ్యామిలీ ఫొటోలను పంపించి దానితో మీకున్న అనుభవాలను తెలియజేయమన్నాడు. ఈ సందర్భంగా నటరాజ్ మాస్టర్ తను డ్యాన్స్ చేస్తున్నట్లుగా ఉన్న ఫొటో చూపిస్తూ ఎమోషనలయ్యాడు. 'చదువుకోకుండా డ్యాన్సులేంట్రా? ప్రభు మాస్టర్ ఏమైనా ఫుడ్ పెడతాడా? అని తిట్టేవారు. కానీ ఈరోజు నేను ఫుడ్ తింటున్నాను, నా ఫ్యామిలీని చూసుకుంటున్నాను, ఇంతపెద్ద ప్లాట్‌ఫామ్ మీదకు వచ్చి మీకు ఫుడ్ పెడుతున్నాను అంటే అదంతా ప్రభు మాస్టర్ వల్లే' అని చెప్పుకొచ్చాడు.
శివ తన ఫ్యామిలీ ఫొటో చూపిస్తూ.. ఈ ఫొటో తర్వాత అమ్మవాళ్లతో కలిసిలేను. అమ్మ నన్ను ఇంట్లో నుంచి పంపించేసింది అని బాధపడ్డాడు. తర్వాత మిత్ర తన చిన్ననాటి ఫొటో చూపిస్తూ భావోద్వేగానికి లోనైంది. 'నన్ను పట్టుకున్న చేయి మా అమ్మది, కానీ నా కన్నతల్లిని నేనెప్పుడూ చూడలేదు. అమ్మ చేయి మాత్రమే నాకు తెలుసు' అని తెలిపింది. తర్వాత అనిల్ వంతు రాగా నా కంటే ముందు అన్నయ్య ఉండేవాడు, కానీ పుట్టిన రెండు రోజులకే చనిపోయాడు అంటూ ఏడ్చేశాడు. అటు బిందుమాధవి కూడా అన్నయ్యతో దిగిన ఫొటోలు చాలా తక్కువ అని, అతడిని మిస్ అవుతున్నానని చెప్పింది.
Comments
Please login to add a commentAdd a comment