Bigg Boss Non-Stop Telugu OTT |Bindu vs Nataraj | Bindu Madhavi Name Trending on Twitter - Sakshi
Sakshi News home page

Bigg Boss Non Stop: నటరాజ్‌ మాస్టర్‌ మీద ఉమ్మేసిన బిందు! ట్విటర్‌లో ఫ్యాన్స్‌ వార్‌!

Published Wed, May 11 2022 7:01 PM | Last Updated on Wed, May 11 2022 7:24 PM

Bigg Boss Non Stop Telugu OTT: Bindu Vs Nataraj, Bindu Madhavi Name Trending on Twitter - Sakshi

సాధారణంగా నామినేషన్స్‌ ప్రక్రియను బిగ్‌బాస్‌ ప్రేమికులు ఎంజాయ్‌ చేస్తారు. కానీ రెండు రోజులుగా సాగిన నామినేషన్స్‌తో ప్రేక్షకుల తల బొప్పి కట్టింది. కొట్టుకోవడం ఒక్కటే తక్కువగా అన్నట్లుగా పోట్లాడుకున్నారు హౌస్‌మేట్స్‌. ఆటలో రఫ్ఫాడించే నటరాజ్‌ మాస్టర్‌ నామినేషన్స్‌లోనూ జూలు వదిలిన సింహంలా పోరాడాడు. తనకు టాప్‌ 5లో ఉండే అర్హత లేదు అన్నందుకు బిందుమాధవిపై నిప్పులు చెరిగాడు. బయట పీఆర్‌ టీంలు పెట్టుకుని హౌస్‌లో కొనసాగుతోందని ఆరోపించాడు. ఈ క్రమంలో నటరాజ్‌ మాస్టర్‌ ముందు నిలబడిన బిందు అతడిని చూస్తూ ఉమ్మేసింది. ఆమె ప్రవర్తనకు అక్కడున్నవారంతా షాకయ్యారు. అటు సోషల్‌ మీడియాలోనూ నట్టూ ఫ్యాన్స్‌ తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.

ఆడపులి అని పిలిపించుకోవచ్చు గానీ దానికి సమర్థత కూడా ఉండాలని చెప్తున్నారు. కనీసం అతడి వయసుకైనా గౌరవం ఇచ్చి ఉండాల్సిందని అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయినా స్ట్రాంగ్‌గా ఆడే నటరాజ్‌ మాస్టర్‌ ఎక్కడ? ఏమీ ఆడకుండా కూర్చునే బిందు ఎక్కడ? అని విమర్శిస్తున్నారు. కిల్లర్‌ టాస్క్‌ దగ్గర నుంచి ప్రతీ టాస్క్‌లోనూ నటరాజ్‌ చెడుగుడు ఆడేస్తూ అందరి మనసులు గెలుచుకున్నాడని, కానీ బిందు ఎక్కడ గేమ్‌ ఆడిందో కనిపించడం లేదని సెటైర్లు వేస్తున్నారు.

 ఆమె పీఆర్‌ టీం బిందుమాధవికి ఆడపులి అన్న ట్యాగ్‌ ఇచ్చిందని, ఇతర కంటెస్టెంట్లు ఆమెను ఏమన్నా సరే వారిపై బూతులతో రెచ్చిపోతూ కామెంట్లు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆమెను గెలిపించుకోవడానికి పీఆర్‌ టీం అహర్నిశలు కష్టపడుతోందని, అటు బిగ్‌బాస్‌ కూడా ఈసారి లేడీ విన్నర్‌కే కిరీటం పెట్టాలని ముందే ఫిక్స్‌ అయిపోయినట్లు కనిపిస్తోందని కామెంట్లు చేస్తున్నారు. అటు బిందు ఫ్యాన్స్‌ ఈ విమర్శలను తిప్పికొడుతున్నారు. ముందు నటరాజ్‌ మాస్టర్‌కు అమ్మాయిలను గౌరవించడం నేర్పించండని కౌంటర్‌ ఇస్తున్నారు. బిందు ఉమ్మేసినందుకే తప్పంటున్నారు, మరి అతడు బాబా భాస్కర్‌ ముందు కాండ్రించి ఉమ్మేశాడు. అప్పుడు మీకు రోషం పొడుచుకురాలేదా? అని తిట్టిపోస్తున్నారు. మొత్తానికి ఈ ఫ్యాన్స్‌ వార్‌తో సోషల్‌ మీడియాలో #BiggBossNonStop, #BinduMadhavi హ్యాష్‌ట్యాగ్‌ తెగ ట్రెండ్‌ అవుతున్నాయి.

చదవండి: నా విషయం పక్కనపెట్టు, నీ ముఖం సంగతేంటి?: ట్రోలింగ్‌కు నటి కౌంటర్‌

పరాశక్తిలా బిందు మాధవి ఫోజు.. శూర్పణఖ ఆడియెన్స్ నీ ముక్కు కోస్తారు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement