Bigg Boss Non Stop Promo: Bindu Madhavi Counter To Natraj Master Satires - Sakshi
Sakshi News home page

Bigg Boss OTT Telugu: అందంపై నటరాజ్‌ మాస్టర్‌ సెటైర్లు, ఇచ్చిపడేసిన బిందు మాధవి!

Published Wed, Mar 9 2022 4:47 PM | Last Updated on Wed, Mar 9 2022 8:55 PM

Bigg Boss Non Stop Promo: Bindu Madhavi Counter To Natraj Master Satires - Sakshi

బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌ షోలో వినోదం కంటే గొడవలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. బిగ్‌బాస్‌ కంటెస్టెంట్లను వారియర్స్‌, చాలెంజర్స్‌ అంటూ రెండు టీములుగా విభజించడంతో వారి మధ్య పోటీ రసవత్తరంగా మారింది. తాజాగా మరోసారి ఈ రెండు టీముల మధ్య బేధాభిప్రాయాలు వచ్చాయి. ఈ మేరకు హాట్‌స్టార్‌ తాజాగా ప్రోమో రిలీజ్‌ చేసింది. వారియర్స్‌.. వారి వసతులు గెలుచుకునేందుకు చివరి అవకాశంగా ఓ టాస్క్‌ ఇచ్చాడు బిగ్‌బాస్‌. బాస్కెట్‌ బొనాంజా టాస్క్‌లో వారియర్స్‌ గెలవగా వారు లగేజీ, బెడ్‌రూమ్‌ యాక్సెస్‌లో ఏదో ఒకటి పొందే చాన్స్‌ దక్కింది. దీంతో వారియర్స్‌ లగేజీ తీసుకుంటున్నామని ప్రకటించారు. ఆ తర్వాత వారియర్స్‌ వంట చేయడంలో బిజీగా అయిపోగా ఆర్జే చైతూ చాలెంజర్స్‌ను వెంటేసుకుని కిచెన్‌లో అడుగుపెట్టాడు.

'బెడ్‌రూం లేదా లగేజీ యాక్సెస్‌.. ఈ రెండింటిలో ఏ వసతిని వారియర్స్‌కు ఇవ్వాల్సి ఉంటుందో చాలెంజర్స్‌ సభ్యులు నిర్ణయించుకోవాల్సి ఉంటుంది' అని కొత్త నిబంధనను వినిపించాడు చైతూ. దీంతో కెప్టెన్‌ అషూ.. మా లగేజీని వెనక్కు తీసుకోవాలుకుంటున్నారా? అని అడిగింది. ఏదివ్వాలని మేము నిర్ణయించాలి, కానీ మీరు ముందుగానే తీసేసుకున్నారని చెప్పడానికి వచ్చామని బిందుమాధవి తెలిపింది. దీనికి నటరాజ్‌ మాస్టర్‌ స్పందిస్తూ.. మనకు అందమెంత ఇచ్చాడో మన మనసు, ఆలోచన కూడా అంతే అందంగా ఉండాలని తేజస్వితో చెప్పుకొచ్చాడు. ఫేస్‌ టు ఫేస్‌ డైరెక్ట్‌గా చెప్తే వింటాను అని గట్టిగా ఇచ్చిపడేసింది బిందు. అందమైన మనసుండాలని చెప్పానంతేనని నటరాజ్‌ మాస్టర్‌ ఆన్సరిచ్చాడు. మరి వీరి గొడవ ఎంతదూరం వెళ్తుందో చూడాలంటే నేడు రాత్రి 9 గంటలకు హాట్‌స్టార్‌లో ప్రసారమయ్యే ఎపిసోడ్‌ చూడాల్సిందే!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement