బిగ్‌బాస్ షోలో ఎవిక్షన్ ఫ్రీ పాస్ కోసం హౌస్‌మేట్స్ మధ్య టఫ్ ఫైట్ నడుస్తోంది. ఎలిమినేషన్ నుంచి గట్టెక్కించే ఈ ఆయుధాన్ని బిగ్‌బాస్ కంటెస్టెంట్లకు అంత ఈజీగా ఇస్తాడా? ఛాన్సే లేదు. నానా టాస్క్‌లు ఆడిస్తూ హౌస్‌మేట్స్‌లో మరింత పట్టుదలను పెంచుతున్నాడు. ఈ క్రమంలో తాజగా యాంకర్ రవి హౌస్‌లో అడుగుపెట్టగా ఎవిక్షన్ ఫ్రీ పాస్ పోటీదారుడిగా యాంకర్ శివను ప్రకటించినట్లు తెలుస్తోంది. కానీ ఆ ఆనందం శివకు ఎంతోకాలం నిలవలేదు.
తను అందుకున్న బాక్స్‌లో తన అవకాశాన్ని వేరొకరికి బదిలీ చేయాలని ఉంది. దీంతో శివ.. బిందుమాధవి ఎవిక్షన్ ఫ్రీ పాస్ కోసం పోటీపడుతుందని ప్రకటించాడు. మూడు రోజులన ఉంచి నువ్వు జీరో పాయింట్స్ దగ్గరున్నావు, ఆడు అని చెప్పాడు. అంటే నేను ఆడలేదని ఇస్తున్నావా? నాకొద్దని తిరస్కరించింది బిందు. నేను సరిగా గేమ్ ఆడుతున్నానని నీకు నమ్మకం లేదు కదా అని ఆమె ఏడుపందుకోవడంతో శివ బిందును ఓదార్చాడు. కాస్త బుజ్జగింపుల తర్వాత బిందు కంటెండర్‌గా నిలిచేందుకు అంగీకరించింది. మరి ఎవిక్షన్ ఫ్రీ పాస్ కోసం ఇంకా ఎవరెవరు పోటీదారులుగా నిలుస్తారో తెలియాలంటే బిగ్‌బాస్ నాన్‌స్టాప్ చూడాల్సిందే!
చదవండి: నన్ను సెక్స్ స్కామ్‌లో ఇరికించి సోనాక్షిని స్టార్‌ను చేశారు
Comments
Please login to add a commentAdd a comment