బిగ్‌బాస్ నాన్‌స్టాప్ షోకు శుభం కార్డు పడింది. తెలుగు బిగ్‌బాస్ చరిత్రలోనే తొలిసారిగా ఒక మహిళా కంటెస్టెంట్ విన్నర్‌గా నిలిచింది. 17 మంది కంటెస్టెంట్లతో పోటీపడి బిందుమాధవి ట్రోఫీ ఎగరేసుకుపోయింది. గతంలో గెలుపుకు ఒక అడుగు దూరంలో ఆగిపోయిన అఖిల్ సార్థక్ ఈసారి ఎలాగైనా ట్రోఫీని సొంతం చేసుకుకోవాలనుకున్నాడు. కానీ అతడికి మరోసారి భంగపాటు ఎదురైంది. ఓటింగ్‌లో అతడిని వెనక్కు నెట్టి మరీ బిందు మాధవి విజేతగా అవతరించడంతో అఖిల్ మరోసారి రన్నర్‌గా నిలిచాడు. బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన అతడు తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
'నేను రన్నర్ అయినా మావాళ్లు నన్ను విన్నర్‌గానే ట్రీట్ చేస్తారు. కానీ నేను ఏడ్చేశానంటూ కొందరు ఏవేవో రాశారు. ఆల్‌రెడీ ఒకసారి దెబ్బ తగిలినప్పుడు దానిపై మళ్లీ తాకితే పెద్దగా ఫరక్ పడదు. బిందు నా పండు. మేం చాలా సరదాగా ఉన్నాం. బిగ్‌బాస్ షో మొదటి నుంచే తనతో కలవడానికి ప్రయత్నిస్తున్నా. కానీ చివరి వారంలో కలిశాము. చాలా సంవత్సరాల నుంచి ఆమె విజయం కోసం ఎదురుచూస్తోంది. చివరకు తను అనుకున్నది సాధించినందుకు హ్యాపీ. హౌస్‌లో తేజు, శ్రీరాపాక, ముమైత్, నటరాజ్ మాస్టర్ బెస్ట్ కంటెస్టెంట్స్. యాంకర్ శివ నన్ను ఇంటర్వ్యూ చేయడానికి వస్తాడట, అప్పుడు అతడి గురించి చెప్తా' అన్నాడు అఖిల్.
చదవండి 👉🏾 నా నామినేషన్స్ బాగా నచ్చాయట, బిగ్‌బాస్‌కు మళ్లీ వెళ్తా: మిత్ర
బిందుమాధవి గెల్చుకున్న ప్రైజ్‌మనీ ఎంతో తెలుసా?
Comments
Please login to add a commentAdd a comment