Buzz: Bigg Boss OTT Telugu Non Stop Winner Bindu Madhavi, Goes Viral - Sakshi
Sakshi News home page

Bigg Boss Non Stop OTT Winner: బిగ్‌బాస్‌ ఓటీటీ విజేతగా బిందు, రన్నర్‌గా అఖిల్‌!

Published Thu, May 19 2022 2:30 PM

Buzz: Bigg Boss OTT Telugu Non Stop Winner Bindu Madhavi, Goes Viral - Sakshi

బుల్లితెర హిట్‌ షో బిగ్‌బాస్‌ను అభిమానించేవాళ్లు ఎంతోమంది. సాధారణ ప్రేక్షకులే కాదు పలువురు సెలబ్రిటీలు సైతం ఈ షోను ఫాలో అవుతుంటారు. గత సీజన్లలో గ్రాండ్‌ ఫినాలేకు వచ్చిన పలువురూ ఇదే మాట చెప్పారు. ఇక వెండితెరపై రాణించాలనుకునేవాళ్లు, జనాల మనసులు గెల్చుకోవాలనుకునేవాళ్లు, ఆర్థిక సమస్యలు చక్కదిద్దుకోవాలనుకునేవాళ్లు ఈ షోకు రావాలని తహతహలాడుతుంటారు. ఆల్‌రెడీ ఫేమస్‌ అయిన వాళ్లనే కాకుండా ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేని ముఖాలను కూడా తీసుకువచ్చి వారికి పాపులారిటీ, అవకాశాలను తెచ్చిపెట్టిందీ షో.

తెలుగులో ఐదు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న బిగ్‌బాస్‌ ఈసారి నాన్‌స్టాప్‌ పేరిట ఓటీటీలో హడావుడి చేసింది. 17 మంది కంటెస్టెంట్లతో ఫిబ్రవరి 26న మొదలైన ఈ షోకు ఈవారంతో శుభంకార్డు పడనుంది. ప్రస్తుతం హౌస్‌లో ఏడుగురు ఉన్నారు. గతంలో ఐదుగురు మాత్రమే ఫినాలేకు చేరుకునే అవకాశం ఉండేది. కానీ ఈసారి ఏకంగా ఏడుగురు ఫినాలేలో అడుగుపెట్టడం విశేషమనే చెప్పాలి. అనిల్‌, బిందు, అఖిల్‌, బాబా భాస్కర్‌, మిత్ర, శివ, అరియానా ఫినాలే వీక్‌లో అడుగుపెట్టారు. వీరిలో టైటిల్‌ ఎవరి సొంతం అవుతుందని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 

అయితే అప్పుడే బిగ్‌బాస్‌ విన్నర్‌గా బిందుమాధవి నిలిచిందంటూ ప్రచారం జరుగుతోంది. అఖిల్‌ను వెనక్కు నెట్టి ఆడపులి బిందు టైటిల్‌ ఎగరేసుకుపోయిందంటూ #BinduTheSensation, #BinduMadhavi అన్న హ్యాష్‌ట్యాగ్‌లు సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతున్నాయి. తెలుగు బిగ్‌బాస్‌ చరిత్రలోనే తొలిసారిగా ఒక అమ్మాయి గెలిచిందంటూ ఆమె అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బిగ్‌బాస్‌ అంటే కేవలం ఫిజికల్‌ టాస్కులే కాదని వ్యక్తిత్వానికి కూడా సంబంధించిందన్న విషయాన్ని అభిజిత్‌ నిరూపించాడు. ఇప్పుడు బిందు తన విజయంతో మరోసారి చాటిచెప్పింది అని కామెంట్లు చేస్తున్నారు.

ఇక సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్న సమాచారం ప్రకారం.. బిందు విన్నర్‌గా, అఖిల్‌ సార్థక్‌ రన్నర్‌గా నిలిచినట్లు తెలుస్తోంది. మిత్ర శర్మ మూడో స్థానంలో ఉండగా యాంకర్‌ శివ నాలుగో స్థానంలో, అరియానా ఐదో స్థానంలో ఉన్నారట. ఇప్పటికే బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌ ఫినాలే షూట్‌ కావడంతో ఈ లీకులు బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. మరి ఇదెంతవరకు నిజమనేది తెలియాలంటే నాగార్జున అధికారికంగా ప్రకటించేవరకు వేచి చూడాల్సిందే!

చదవండి 👇

తప్పు చేస్తే రోడ్డు మీద నిలబెట్టి కొట్టండి, అంతేకానీ..

విడాకుల బాటలో బాలీవుడ్‌ దంపతులు!

Advertisement
 
Advertisement
 
Advertisement