Who Will Win Bigg Boss Non-Stop Telugu? Here Are Grand Finale Details - Sakshi
Sakshi News home page

Bigg Boss Non Stop: బిగ్‌బాస్‌ గ్రాండ్‌ ఫినాలే, అసలైన పోటీ ఆ ఇద్దరి మధ్యే!

Published Wed, May 18 2022 10:53 AM | Last Updated on Wed, May 18 2022 11:09 AM

Bigg Boss Non Stop OTT Telugu Grand Finale Details - Sakshi

బిగ్‌బాస్‌ షో అంటే ఇష్టపడేవాళ్లే కాదు, ఇష్టపడనివాళ్లు కూడా ఉంటారు. బిగ్‌బాస్‌ కాన్సెప్ట్‌ను తిట్టిపోస్తూనే తీరా సమయానికి షో చూసి ఎంజాయ్‌ చేస్తుంటారు. అయితే ఎవరేమన్నా బుల్లితెర ఆడియన్స్‌ మాత్రం బిగ్‌బాస్‌ షోను విపరీతంగా ఆదరిస్తారు. తెలుగులో ఇప్పటివరకు ఐదు సీజన్లను ప్రేక్షకులు విజయవంతం చేశారు. ఈ ధైర్యంతో నిర్వాహకులు బిగ్‌బాస్‌ ఓటీటీని కూడా ముందుకు తీసుకువచ్చారు. కాకపోతే ఇది ఫ్యామిలీ అంతా చూడటానికి వీల్లేకుండా టీవీలోకి బదులుగా హాట్‌స్టార్‌ యాప్‌కు మాత్రమే పరిమితమైంది.

అయినా సరే ఓటీటీలో ప్రయోగాత్మకంగా మొదలుపెట్టిన బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌ విజయవంతంగా చివరిదశకు చేరుకుంది. 17 మందితో మొదలైన ఈ షోలో మధ్యలో ఓ వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీ కూడా చేరడంతో మొత్తం కంటెస్టెంట్ల సంఖ్య 18కి చేరుకుంది. ఇప్పటివరకు శ్రీరాపాక, చైతూ, సరయు, తేజస్వి, ముమైత్‌ ఖాన్‌, స్రవంతి, మహేశ్‌, అజయ్‌, హమీదా, అషూ, నటరాజ్‌ వరసగా ఎలిమినేట్‌ అయ్యారు. ప్రస్తుతం హౌస్‌లో అరియానా, అనిల్‌, మిత్ర, శివ, బిందు మాధవి, అఖిల్‌, బాబా భాస్కర్‌ మిగిలారు. ఈ టాప్‌ 7లో నుంచి ఒకరు వారం మధ్యలోనే హౌస్‌ను వీడే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతోంది. దీంతో మిగిలిన ఆరుగురు ఫినాలేలో అడుగుపెడతారు. ఒకవేళ ఇదే నిజమైతే ఆరుగురు కంటెస్టెంట్లు ఫినాలేకు చేరుకోవడం ఇదే మొదటిసారవుతుంది. 

అయితే ఎప్పటిలా ఈసారి వార్‌ వన్‌సైడ్‌ అయిపోలేదు. అఖిల్‌ సార్థక్‌, బిందుమాధవి మధ్య టఫ్‌ ఫైట్‌ నడుస్తోంది. ఎలాగైనా ఈసారి టైటిల్‌ గెలవాలని కసిగా ఆడిన అఖిల్‌కు అతడి అభిమానులు ఫుల్‌ సపోర్ట్‌ ఇస్తున్నారు. హౌస్‌మేట్స్‌ను ఓ కబడ్డీ ఆడుకున్న బిందుమాధవి ధైర్యానికి ముగ్ధులైపోయిన ఫ్యాన్స్‌ ఆమెను ఎలాగైనా గెలిపించాలని తాపత్రయపడుతున్నారు. ఈరోజుతో ఓటింగ్‌ ముగియనుండటంతో ఇరువురి ఫ్యాన్స్‌ వీలైనన్ని ఓట్లు గుద్దుతున్నారు. ఇక గురు, శుక్రవారాల్లో గ్రాండ్‌ ఫినాలే షూటింగ్‌ జరగనున్నట్లు తెలుస్తోంది. మరి ఫినాలే ఎపిసోడ్‌ కూడా రెండు రోజులు ప్రసారం చేస్తారేమో చూడాలి!

చదవండి: కరాటే కల్యాణితో దెబ్బలు తిన్న యూట్యూబర్‌కు బిగ్‌బాస్‌ 6 సీజన్‌లో ఆఫర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement