టైటిల్: ప్రేమదేశం
నటీనటులు: మధుబాల, త్రిగున్, మేఘా ఆకాష్, మాయ, అజయ్ కతుర్వార్, కమల్ నార్ల తేజ, శివ రామచంద్ర, తనికెళ్ల బరణి, వైష్ణవి చైతన్య మరియు ఇతరులు
దర్శకుడు: శ్రీకాంత్ సిద్ధమ్
సంగీతం: మణిశర్మ
ప్రొడక్షన్ హౌస్: సిరి క్రియేటివ్ వర్క్స్
నిర్మాత: శిరీష సిద్ధమ్
విడుదల తేదీ: ఫిబ్రవరి 3, 2023
సంక్రాంతికి మాస్ మసాలా సినిమాలు థియేటర్‌లో ఎంత గోల చేశాయో చూశాం. ఆ సందడి తర్వాత మనముందుకు వచ్చిన స్వచ్ఛమైన ప్రేమ కథా చిత్రం "ప్రేమదేశం". త్రిగున్, మేఘా ఆకాష్, మాయ, అజయ్ కతుర్వార్, కమల్ నార్ల తేజ, శివ రామచంద్ర ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో అలనాటి అందాలతార మధుబాల ప్రత్యేక పాత్రలో మెరిసింది. శ్రీకాంత్ సిద్ధమ్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రాన్ని సిరి క్రియేటివ్ వర్క్స్ పతాకంపై శిరీష సిద్ధమ్ నిర్మించారు. రఘు కళ్యాణ్ రెడ్డి, రాములు అసోసియేట్ ప్రొడ్యూసర్స్‌గా,కమల్, కిరణ్, రూపా, ఎగ్జిగ్యూటివ్ ప్రొడ్యూసర్స్‌గా వ్యవహరించారు. తాజాగా రిలీజైన ఈ మూవీ ప్రేక్షకులను ఏమేరకు మెప్పించిందో చూద్దాం..
కథ
ఒకే కాలేజీలో చదువుకుంటున్న అర్జున్ (త్రిగున్), ఆద్య (మేఘా ఆకాష్)లకు ఒకరంటే ఒకరికి ఇష్టం ఉన్నా ఎప్పుడూ వారి ప్రేమను ఎక్స్‌ప్రెస్ చేసుకోరు. చివరికి వారిద్దరూ లవర్స్ డే అయిన ఫిబ్రవరి 14న ఒక ప్లేస్ దగ్గర కలుసుకొని లవ్ ప్రపోజ్ చేసుకుందామని నిర్ణయించుకుంటారు. ఆ ప్లేస్ పేరే " ప్రేమ దేశం". ప్రేమికుల దినోత్సవం రోజు లవ్ ప్రపోజ్ చేసుకోవడానికి వస్తున్న వీరికి అనుకోకుండా యాక్సిడెంట్ అవుతుంది. మరోవైపు రిషి (అజయ్ కతుర్వాల్) అనే అబ్బాయి మూడు సంవత్సరాల నుంచి మాయ అనే అమ్మాయి వెంట తిరుగుతుంటాడు, ఎట్టకేలకు ఆమె రిషి ప్రేమకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వీరిద్దరికీ పెళ్లి ఫిక్స్ చేస్తారు.
ఇంకోవైపు పెళ్లి కోసం తంటాలు పడుతుంటాడు శివ. శివకు అమ్మాయి నచ్చితే ఆ అమ్మాయికి శివ నచ్చడు. ఆ అమ్మాయికి శివ నచ్చితే అతడికి ఆ అమ్మాయి నచ్చదు. ఈ క్రమంలో అనూహ్యంగా మాయతో శివ పెళ్లి ఫిక్స్ అవుతుంది. ఎంతో ఇష్టంగా ప్రేమించిన రిషి (అజయ్)తో తాళి కట్టించుకోవాల్సిన మాయ శివను పెళ్లి చేసుకోవడానికి ఎందుకు సిద్దపడింది? అర్జున్, ఆద్యల యాక్సిడెంట్‌కు శివ, రిషి , మాయల మధ్య ఉన్న లింకేంటి? ఈ రెండు కథలు ఒకే దగ్గర కలవడానికి కారణమేంటి ? చివరకు అర్జున్, ఆద్యలు ఒకటయ్యారా లేదా? అనేదే మిగతా కథ.
నటీనటుల పనితీరు
త్రిగున్, మేఘా ఆకాష్ పరిణతితో నటించారు. త్రిగున్‌కు తల్లిగా నటించిన మధుబాల తన పాత్రలో అదరగొట్టింది. కాలేజీ ఎపిసోడ్స్‌లో కూడా మధుబాల అల్లరితో పాటు అద్భుతంగా నటించింది. అజయ్,శివ, మాయల మధ్య వచ్చే ఎమోషనల్ సీన్ బాగుంటాయి. మాయ తండ్రిగా తనికెళ్ల భరణి, రిషిగా అజయ్ తమ నటనతో మెప్పించారు. బేబీ సినిమాలో చేసిన వైష్ణవి చైతన్య మాయ చెల్లి క్యారెక్టర్‌తో కనువిందు చేసింది.
సాంకేతిక నిపుణుల పనితీరు
ఫస్ట్ హాఫ్‌లో యూత్‌ను కాలేజీ డేస్‌లోకి తీసుకెళ్ళిన దర్శకుడు సెకండ్ హాఫ్‌లో లవ్ మ్యారేజ్, అరేంజ్‌డ్ మ్యారేజ్, వన్ సైడ్ లవ్‌లోని డిఫరెంట్ యాంగిల్స్ చూపించాడు. కానీ కొన్ని చోట్ల సీన్స్ నీరసంగా సాగదీసినట్లుగా అనిపిస్తాయి. సినిమాటోగ్రాఫర్ సజాద్ కక్కు ఇచ్చిన విజువల్స్ ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ. మణిశర్మ గారి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. కిరణ్ తుంపెర ఇంకాస్త ఎడిటింగ్ చేయాల్సింది. ఈశ్వర్ పెంటి కొరియోగ్రఫీ, రియల్ సతీష్, డ్రాగన్ ప్రకాష్ ల ఫైట్స్ పర్వాలేదనిపించాయి. హీరో అర్జున్, వాళ్ల అమ్మ మధుభాల మధ్య రాసుకున్న సన్నివేశాలు చూస్తున్నప్పుడు "అమ్మా నాన్న తమిళ అమ్మాయి" సినిమా గుర్తుచేసేలా ఉంటుంది. అక్కడక్కడా ఇది మనకు తెలిసిన కథే అనిపించేలా ఉంటుంది. క్లైమాక్స్ చాలా సింపుల్‌గా ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment