Thrigun
-
‘స్వీటీ నాటీ క్రేజీ’ కామెడీ
కొండా, డియర్ మేఘ, ప్రేమ దేశం సినిమాలతో టాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న త్రిగుణ్.. కొంత గ్యాప్ తర్వాత కొత్త చిత్రాన్ని ప్రకటించాడు. ఆయన హీరోగా డైరెక్టర్ రాజశేఖర్.జి ‘స్వీటీ నాటీ క్రేజీ’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. శ్రీజిత ఘెష్, ఇనయ, రాధ, అలీ, రఘుబాబు, రవి ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. బుధవారం నాడు అతిథుల సమక్షంలో ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ముహూర్తపు సన్నివేశానికి అలీ క్లాప్ కొట్టగా.. దామోదర ప్రసాద్ స్క్రిప్ట్ అందజేయగా.. బెక్కెం వేణు గోపాల్ గారు దర్శకత్వం వహించారు. అనంతరం హీరో త్రిగుణ్ మీడియాతో మాట్లాడుతూ... టైటిల్‌కు తగ్గట్టుగా.. స్వీటీ, నాటీ, క్రేజీలా ఉంటాయి. నాకు ఇంత వరకు కామెడీ చిత్రాలు బాగా వర్కౌట్ అయ్యాయి. ‘కథ’తో మొదలైన నా ప్రయాణానికి మీడియా వారు సపోర్ట్ అందించారు’ అని అన్నారు ‘ఇది నాకు 45వ సినిమా. బాలనటిగా కెరీర్ మొదలు పెట్టాను. ఇందులో నేను నందిని అనే మంచి పాత్రను చేస్తున్నాను. ఈ చిత్రంలో భాగమైనందుకు ఆనందంగా ఉంది’ అని అన్నారు హీరోయిన్ ఇనియ. ‘ఇది ట్రయాంగిల్ లవ్ స్టోరీ, కామెడీ యాంగిల్లో సినిమా ఉంటుంది’ అని అన్నారు దర్శకుడు రాజశేఖర్. -
చిరంజీవికి పరిచయం చేస్తానంటే ఒప్పుకోలేదు: యంగ్ హీరో
ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన వ్యక్తి అదిత్ అరుణ్ (త్రిగుణ్). తనకున్న టాలెంట్‌తో హీరోగా ఎదిగాడు. పలు చిత్రాలు చేసినప్పటికీ ఇప్పటికీ సరైన గుర్తింపు రాలేదు. దీని గురించి తాజా ఇంటర్వ్యూలో అతడు మాట్లాడుతూ.. 'నేను చాలా సినిమాలు చేశాను. కానీ ఇప్పటికీ సరైన గుర్తింపు లేదు. నేను చిరంజీవికి వీరాభిమానిని. స్కూల్లో ఉన్నప్పుడే ఆయన్ను కలిశాను. మా ఇంట్లో చిరంజీవిది తప్ప ఎవరి ఫోటో ఉండదు. ఆయన కూతురు సుష్మితతో పరిచయముంది. నన్ను చిరుకు పరిచయం చేస్తానంది కానీ నేను ఒప్పుకోలేదు. ఏదో ఒక రోజు నా పేరు తనకు తెలుస్తుంది.. ఆరోజే తనను కలుస్తానని చెప్పాను. అది జీవితంలో మర్చిపోలేను నా జీవితంలో మర్చిపోలేని సంఘటన ఇది.. నేను ఉద్వేగం సినిమా చేశాను (త్వరలో రిలీజవుతుంది). ఆ సినిమా చివరి రోజు షూటింగ్... ఉదయం రెడీ అవుతున్నాను, ఇంతలో నాన్న నుంచి ఫోన్‌కాల్ వచ్చింది. అమ్మ చనిపోయిందని చెప్పాడు. నిర్మాతకు షూటింగ్‌కు రాలేనని ఎలా చెప్పాలా? అని చాలా టెన్షన్ పడ్డాను. సినిమాకు డబ్బుల్లేని రోజులు, ఫ్లాప్ అయినప్పుడు, సినిమా ఆగిపోయిననాడు.. ఎన్నడూ అంత టెన్షన్ పడలేదు. ఆరోజు మాత్రం ఓపక్క కన్నీళ్లు, మరోపక్క చెమటలు పట్టాయి. నిర్మాతకు చెప్తే వెంటనే షూటింగ్ క్యాన్సల్ చేశాడు. ఇంటికి రౌడీలను పంపించారు పా.రంజిత్.. అట్టకత్తి సినిమాకు నన్నే హీరో అనుకున్నాడు. కానీ అప్పటికే చేతిలో మరో సినిమా ఒప్పుకోవడంతో అది చేయలేకపోయాను. ఆ విషయంలో ఇప్పటికీ రిగ్రెట్ ఫీలవుతుంటాను. రెండేళ్లక్రితం.. కొందరు ఓ సినిమా షూట్ చేస్తున్నామని అడ్వాన్స్ ఇచ్చి ఫోటోలు తీశారు. తీరా నన్ను పక్కన పెట్టి ఓ హీరో కుమారుడిని పెట్టారు. నాకు కోపమొచ్చి అడ్వాన్స్ తిరిగివ్వలేదు. ఇంటికి రౌడీలను పంపించారు. బెదిరించారు.. అయినా బెదరలేదు' అని చెప్పుకొచ్చాడు అదిత్ అరుణ్. చదవండి: 58 ఏళ్ల వయసులో గర్భం దాల్చిన సింగర్ తల్లి? -
వివాహబంధంలోకి అడుగుపెట్టిన టాలీవుడ్ హీరో..!
కథ అనే సనిమాతో సినిమా పరిశ్రమలో అడుగుపెట్టిన నటుడు త్రిగుణ్. అలాగే ఆర్జీవి తెరకెక్కించిన కొండా చిత్రంతో మంచి పేరు తెచ్చుకోవడంతో పాటు తెలుగు ప్రేక్షకులందరికి చాలా దగ్గరయ్యారు. తాజాగా ఈ హీరో వివాహాబంధంలోకి అడుగుపెట్టారు. బంధుమిత్రుల సమక్షంలో నివేదిత అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. తమిళనాడు తిరుపురులో జరిగిన వీరి పెళ్లికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. నూతన దంపతులను ఆశీర్వదించారు. (ఇది చదవండి: అవార్డులు నాకు చెత్తతో సమానం.. స్టార్ హీరో షాకింగ్ కామెంట్స్! ) చెన్నైలో పుట్టి పెరిగిన త్రిగుణ్ కథ అనే చిత్రంతో వెండితెరపైకి అడుగుపెట్టారు. ఆ తర్వాత త్రిగుణ్ పలు సినిమాల్లో నటించారు. వైవిధ్యభరితమైన కథలతో తన సినీ ప్రయాణాన్ని కొనసాగించారు. రామ్‌గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘కొండా’ చిత్రంతో ఫేమస్ అయ్యాడు. పీవీఎస్ గరుడ వేగ, డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ, డియర్ మేఘ, చీకటి గదిలో చితక్కొట్టుడు, ప్రేమదేశం, కథ కంచికి.. మనం ఇంటికి, తుంగభద్ర, 24 కిస్సెస్, కిరాయి, లైన్మెన్ లాంటి చిత్రాల్లో నటించారు. త్రిగుణ్ ప్రస్తుతం తెలుగు, తమిళంలో పలు చిత్రాల్లో నటిస్తున్నారు. (ఇది చదవండి: స్టార్ హీరో సినిమాకు ఓకే చెప్పిన విజయేంద్ర ప్రసాద్.. పాన్ ఇండియా రేంజ్లో!) -
ప్రేమదేశం సినిమా రివ్యూ, ఎలా ఉందంటే?
టైటిల్: ప్రేమదేశం నటీనటులు: మధుబాల, త్రిగున్, మేఘా ఆకాష్, మాయ, అజయ్ కతుర్వార్, కమల్ నార్ల తేజ, శివ రామచంద్ర, తనికెళ్ల బరణి, వైష్ణవి చైతన్య మరియు ఇతరులు దర్శకుడు: శ్రీకాంత్ సిద్ధమ్ సంగీతం: మణిశర్మ ప్రొడక్షన్ హౌస్: సిరి క్రియేటివ్ వర్క్స్ నిర్మాత: శిరీష సిద్ధమ్ విడుదల తేదీ: ఫిబ్రవరి 3, 2023 సంక్రాంతికి మాస్ మసాలా సినిమాలు థియేటర్లో ఎంత గోల చేశాయో చూశాం. ఆ సందడి తర్వాత మనముందుకు వచ్చిన స్వచ్ఛమైన ప్రేమ కథా చిత్రం "ప్రేమదేశం". త్రిగున్, మేఘా ఆకాష్, మాయ, అజయ్ కతుర్వార్, కమల్ నార్ల తేజ, శివ రామచంద్ర ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో అలనాటి అందాలతార మధుబాల ప్రత్యేక పాత్రలో మెరిసింది. శ్రీకాంత్ సిద్ధమ్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రాన్ని సిరి క్రియేటివ్ వర్క్స్ పతాకంపై శిరీష సిద్ధమ్ నిర్మించారు. రఘు కళ్యాణ్ రెడ్డి, రాములు అసోసియేట్ ప్రొడ్యూసర్స్‌గా,కమల్, కిరణ్, రూపా, ఎగ్జిగ్యూటివ్ ప్రొడ్యూసర్స్‌గా వ్యవహరించారు. తాజాగా రిలీజైన ఈ మూవీ ప్రేక్షకులను ఏమేరకు మెప్పించిందో చూద్దాం.. కథ ఒకే కాలేజీలో చదువుకుంటున్న అర్జున్ (త్రిగున్), ఆద్య (మేఘా ఆకాష్)లకు ఒకరంటే ఒకరికి ఇష్టం ఉన్నా ఎప్పుడూ వారి ప్రేమను ఎక్స్‌ప్రెస్ చేసుకోరు. చివరికి వారిద్దరూ లవర్స్ డే అయిన ఫిబ్రవరి 14న ఒక ప్లేస్ దగ్గర కలుసుకొని లవ్ ప్రపోజ్ చేసుకుందామని నిర్ణయించుకుంటారు. ఆ ప్లేస్ పేరే " ప్రేమ దేశం". ప్రేమికుల దినోత్సవం రోజు లవ్ ప్రపోజ్ చేసుకోవడానికి వస్తున్న వీరికి అనుకోకుండా యాక్సిడెంట్ అవుతుంది. మరోవైపు రిషి (అజయ్ కతుర్వాల్) అనే అబ్బాయి మూడు సంవత్సరాల నుంచి మాయ అనే అమ్మాయి వెంట తిరుగుతుంటాడు, ఎట్టకేలకు ఆమె రిషి ప్రేమకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వీరిద్దరికీ పెళ్లి ఫిక్స్ చేస్తారు. ఇంకోవైపు పెళ్లి కోసం తంటాలు పడుతుంటాడు శివ. శివకు అమ్మాయి నచ్చితే ఆ అమ్మాయికి శివ నచ్చడు. ఆ అమ్మాయికి శివ నచ్చితే అతడికి ఆ అమ్మాయి నచ్చదు. ఈ క్రమంలో అనూహ్యంగా మాయతో శివ పెళ్లి ఫిక్స్ అవుతుంది. ఎంతో ఇష్టంగా ప్రేమించిన రిషి (అజయ్)తో తాళి కట్టించుకోవాల్సిన మాయ శివను పెళ్లి చేసుకోవడానికి ఎందుకు సిద్దపడింది? అర్జున్, ఆద్యల యాక్సిడెంట్‌కు శివ, రిషి , మాయల మధ్య ఉన్న లింకేంటి? ఈ రెండు కథలు ఒకే దగ్గర కలవడానికి కారణమేంటి ? చివరకు అర్జున్, ఆద్యలు ఒకటయ్యారా లేదా? అనేదే మిగతా కథ. నటీనటుల పనితీరు త్రిగున్, మేఘా ఆకాష్ పరిణతితో నటించారు. త్రిగున్‌కు తల్లిగా నటించిన మధుబాల తన పాత్రలో అదరగొట్టింది. కాలేజీ ఎపిసోడ్స్‌లో కూడా మధుబాల అల్లరితో పాటు అద్భుతంగా నటించింది. అజయ్,శివ, మాయల మధ్య వచ్చే ఎమోషనల్ సీన్ బాగుంటాయి. మాయ తండ్రిగా తనికెళ్ల భరణి, రిషిగా అజయ్ తమ నటనతో మెప్పించారు. బేబీ సినిమాలో చేసిన వైష్ణవి చైతన్య మాయ చెల్లి క్యారెక్టర్‌తో కనువిందు చేసింది. సాంకేతిక నిపుణుల పనితీరు ఫస్ట్ హాఫ్‌లో యూత్‌ను కాలేజీ డేస్‌లోకి తీసుకెళ్ళిన దర్శకుడు సెకండ్ హాఫ్‌లో లవ్ మ్యారేజ్, అరేంజ్డ్ మ్యారేజ్, వన్ సైడ్ లవ్‌లోని డిఫరెంట్ యాంగిల్స్ చూపించాడు. కానీ కొన్ని చోట్ల సీన్స్ నీరసంగా సాగదీసినట్లుగా అనిపిస్తాయి. సినిమాటోగ్రాఫర్ సజాద్ కక్కు ఇచ్చిన విజువల్స్ ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ. మణిశర్మ గారి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. కిరణ్ తుంపెర ఇంకాస్త ఎడిటింగ్ చేయాల్సింది. ఈశ్వర్ పెంటి కొరియోగ్రఫీ, రియల్ సతీష్, డ్రాగన్ ప్రకాష్ ల ఫైట్స్ పర్వాలేదనిపించాయి. హీరో అర్జున్, వాళ్ల అమ్మ మధుభాల మధ్య రాసుకున్న సన్నివేశాలు చూస్తున్నప్పుడు "అమ్మా నాన్న తమిళ అమ్మాయి" సినిమా గుర్తుచేసేలా ఉంటుంది. అక్కడక్కడా ఇది మనకు తెలిసిన కథే అనిపించేలా ఉంటుంది. క్లైమాక్స్ చాలా సింపుల్‌గా ఉంటుంది. చదవండి: ఓ మగాడు కాటేసిన మహిళ.. గానమే ప్రాణంగా శంకర శాస్త్రి -
కిరాయి ఫస్ట్ లుక్ చూశారా?
చీకటి గదిలో చితక్కొట్టుడు, 24 కిస్సెస్, డియర్ మేఘ, రీసెంట్ గా రాంగోపాల్ వర్మ డైరెక్షన్ లో వస్తున్న "కొండ" చిత్రాలలో హీరోగా నటిస్తూ తనకంటూ ఒక మంచి గుర్తింపును తెచ్చుకున్న నటుడు త్రిగున్. అతడు తాజాగా నటిస్తున్న చిత్రం "కిరాయి". వీఆర్కే దర్శకత్వంలో అమూల్య రెడ్డి యలమూరి, నవీన్ రెడ్డి వుయ్యూరులు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. గతంలో గుంటూరు, పల్నాడులలో ఎక్కువగా కిరాయి హత్యలు జరిగేవి. ఈ హత్యల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ రోజు(జూన్ 8) హీరో త్రిగున్ బర్త్ డే సందర్బంగా డైరెక్టర్ హరీష్ శంకర్ "కిరాయి" ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఈ సందర్బంగా దర్శకుడు హరీష్ శంకర్ మాట్లాడుతూ.. 'త్రిగున్ నాకు చాలా కాలం నుంచి తెలుసు. తను చాలా ఎనర్జిటిక్ హీరో. గతంలో లవ్, కామెడీ వంటి మంచి మంచి సినిమాలు చేశాడు. తను మొదటి సారిగా డిఫరెంట్ సబ్జెక్టు అటెంప్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించాలని కోరుతున్నాను' అన్నారు. చిత్ర దర్శకుడుV. R. K,(రామకృష్ణ) మాట్లాడుతూ.. 'ఇందులో హీరో కిరాయి తీసుకోకుండా కిరాయిహత్య చేయవలసి వస్తుంది. అలా ఎందుకు చేయవలసి వచ్చింది. ఇలా వరుస హత్యలు ఎందుకు చేస్తారు. ఈ క్రమంలో వారి జీవితాలు ఎలాంటి మలుపులు తిరిగాయి అనేదే ఈ కథ. రీసెంట్గా ఈ సినిమా రష్ & ఫస్ట్ లుక్ చూసిన రామ్ గోపాల్ వర్మ చాలా బాగుందని మెచ్చుకోవడం హ్యాపీగా ఉంది. ఇందులో యాక్షన్ మాములుగా ఉండదు. ఒక ట్రాన్స్ఫారం బద్దలయితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది' అన్నారు. చదవండి: రూ.40 వేల ఖరీదైన టీ షర్ట్ ధరించిన కరీనా, వెరీ చీప్ టేస్ట్ అంటున్న నెటిజన్లు రూ. 150 కోట్లలో మీ వాటా ఎంత? యంగ్ హీరోకు నెటిజన్ ప్రశ్న.. -
‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’ పాటకు మిలియన్ వ్యూస్
త్రిగున్-పాయల్ రాధాకృష్ణ హీరో హీరోయిన్లు తెరకెక్కుతున్న చిత్రం ‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’. లోటస్ క్రియేటివ్ వర్క్స్ పతాకంపై మధుదీప్ సీహెచ్‌ని దర్శకుడిగా పరిచయం చేస్తూ సాఫ్ట్వేర్ టర్నెడ్ ఇంజినీర్ అరవింద్.ఎమ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రం నుంచి విడుదలైన ‘వెన్నెలే వెన్నెలే నాలో వెల్లువై పొంగెలే’పాటకు అనూహ్య స్పందన లభిస్తోంది.ఒకే ఒక లోకం నువ్వే..." పాటతో సంచలనం సృష్టించిన అరుణ్ చిలువేరు సంగీత సారధ్యంలో రూపొందిన ఈ పాటకు ప్రముఖ గీత రచయిత చైతన్య ప్రసాద్ సాహిత్యం సమకూర్చగా ఎన్.సి.కారుణ్య ఆలపించారు. ఇప్పటికే ఈ పాట మిలియన్ వ్యూస్‌ని సాధించింది. హీరో త్రిగున్ పుట్టిన రోజు(జూన్ 8) సందర్భంగా ఈ చిత్రం నుంచి మోషన్ పోస్టర్ని విడుదల చేసింది చిత్ర యూనిట్. తనికెళ్ల భరణి వాయిస్ ఓవర్‌తో మొదలైన ఈ మోషన్ పోస్టర్ అందరిని ఆకట్టుకుంటుంది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటోంది. త్వరలోనే విడుదల తేదిని ప్రకటిస్తామని మేకర్స్ తెలిపారు.అనీష్ కురువిల్లా, సత్యకృష్ణన్, సి.వి.ఎల్.నరసింహారావు, జయశ్రీ రాచకొండ, వివా హర్ష, గుండు సుదర్శన్, నెల్లూరు సుదర్శన్, గిరిధర్, జబర్దస్త్ వేణు తదితరులు కీలకపాత్రల్లో నటించిన ఈ చిత్రానికి అరుణ్ చిలువేరు సంగీతం అందించారు.