![Thrigun And Sreejitha Ghosh Sweety Naughty Crazy Movie Launched](/styles/webp/s3/article_images/2024/08/7/trigun.jpg.webp?itok=KZF0r90z)
కొండా, డియర్ మేఘ, ప్రేమ దేశం సినిమాలతో టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న త్రిగుణ్.. కొంత గ్యాప్ తర్వాత కొత్త చిత్రాన్ని ప్రకటించాడు. ఆయన హీరోగా డైరెక్టర్ రాజశేఖర్.జి ‘స్వీటీ నాటీ క్రేజీ’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. శ్రీజిత ఘెష్, ఇనయ, రాధ, అలీ, రఘుబాబు, రవి ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. బుధవారం నాడు అతిథుల సమక్షంలో ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ముహూర్తపు సన్నివేశానికి అలీ క్లాప్ కొట్టగా.. దామోదర ప్రసాద్ స్క్రిప్ట్ అందజేయగా.. బెక్కెం వేణు గోపాల్ గారు దర్శకత్వం వహించారు.
అనంతరం హీరో త్రిగుణ్ మీడియాతో మాట్లాడుతూ... టైటిల్‌కు తగ్గట్టుగా.. స్వీటీ, నాటీ, క్రేజీలా ఉంటాయి. నాకు ఇంత వరకు కామెడీ చిత్రాలు బాగా వర్కౌట్ అయ్యాయి. ‘కథ’తో మొదలైన నా ప్రయాణానికి మీడియా వారు సపోర్ట్ అందించారు’ అని అన్నారు ‘ఇది నాకు 45వ సినిమా. బాలనటిగా కెరీర్ మొదలు పెట్టాను. ఇందులో నేను నందిని అనే మంచి పాత్రను చేస్తున్నాను. ఈ చిత్రంలో భాగమైనందుకు ఆనందంగా ఉంది’ అని అన్నారు హీరోయిన్ ఇనియ. ‘ఇది ట్రయాంగిల్ లవ్ స్టోరీ, కామెడీ యాంగిల్‌లో సినిమా ఉంటుంది’ అని అన్నారు దర్శకుడు రాజశేఖర్.
Comments
Please login to add a commentAdd a comment