Prema Desam
-
ప్రేమదేశం సినిమా రివ్యూ, ఎలా ఉందంటే?
టైటిల్: ప్రేమదేశం నటీనటులు: మధుబాల, త్రిగున్, మేఘా ఆకాష్, మాయ, అజయ్ కతుర్వార్, కమల్ నార్ల తేజ, శివ రామచంద్ర, తనికెళ్ల బరణి, వైష్ణవి చైతన్య మరియు ఇతరులు దర్శకుడు: శ్రీకాంత్ సిద్ధమ్ సంగీతం: మణిశర్మ ప్రొడక్షన్ హౌస్: సిరి క్రియేటివ్ వర్క్స్ నిర్మాత: శిరీష సిద్ధమ్ విడుదల తేదీ: ఫిబ్రవరి 3, 2023 సంక్రాంతికి మాస్ మసాలా సినిమాలు థియేటర్లో ఎంత గోల చేశాయో చూశాం. ఆ సందడి తర్వాత మనముందుకు వచ్చిన స్వచ్ఛమైన ప్రేమ కథా చిత్రం "ప్రేమదేశం". త్రిగున్, మేఘా ఆకాష్, మాయ, అజయ్ కతుర్వార్, కమల్ నార్ల తేజ, శివ రామచంద్ర ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో అలనాటి అందాలతార మధుబాల ప్రత్యేక పాత్రలో మెరిసింది. శ్రీకాంత్ సిద్ధమ్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రాన్ని సిరి క్రియేటివ్ వర్క్స్ పతాకంపై శిరీష సిద్ధమ్ నిర్మించారు. రఘు కళ్యాణ్ రెడ్డి, రాములు అసోసియేట్ ప్రొడ్యూసర్స్‌గా,కమల్, కిరణ్, రూపా, ఎగ్జిగ్యూటివ్ ప్రొడ్యూసర్స్‌గా వ్యవహరించారు. తాజాగా రిలీజైన ఈ మూవీ ప్రేక్షకులను ఏమేరకు మెప్పించిందో చూద్దాం.. కథ ఒకే కాలేజీలో చదువుకుంటున్న అర్జున్ (త్రిగున్), ఆద్య (మేఘా ఆకాష్)లకు ఒకరంటే ఒకరికి ఇష్టం ఉన్నా ఎప్పుడూ వారి ప్రేమను ఎక్స్‌ప్రెస్ చేసుకోరు. చివరికి వారిద్దరూ లవర్స్ డే అయిన ఫిబ్రవరి 14న ఒక ప్లేస్ దగ్గర కలుసుకొని లవ్ ప్రపోజ్ చేసుకుందామని నిర్ణయించుకుంటారు. ఆ ప్లేస్ పేరే " ప్రేమ దేశం". ప్రేమికుల దినోత్సవం రోజు లవ్ ప్రపోజ్ చేసుకోవడానికి వస్తున్న వీరికి అనుకోకుండా యాక్సిడెంట్ అవుతుంది. మరోవైపు రిషి (అజయ్ కతుర్వాల్) అనే అబ్బాయి మూడు సంవత్సరాల నుంచి మాయ అనే అమ్మాయి వెంట తిరుగుతుంటాడు, ఎట్టకేలకు ఆమె రిషి ప్రేమకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వీరిద్దరికీ పెళ్లి ఫిక్స్ చేస్తారు. ఇంకోవైపు పెళ్లి కోసం తంటాలు పడుతుంటాడు శివ. శివకు అమ్మాయి నచ్చితే ఆ అమ్మాయికి శివ నచ్చడు. ఆ అమ్మాయికి శివ నచ్చితే అతడికి ఆ అమ్మాయి నచ్చదు. ఈ క్రమంలో అనూహ్యంగా మాయతో శివ పెళ్లి ఫిక్స్ అవుతుంది. ఎంతో ఇష్టంగా ప్రేమించిన రిషి (అజయ్)తో తాళి కట్టించుకోవాల్సిన మాయ శివను పెళ్లి చేసుకోవడానికి ఎందుకు సిద్దపడింది? అర్జున్, ఆద్యల యాక్సిడెంట్‌కు శివ, రిషి , మాయల మధ్య ఉన్న లింకేంటి? ఈ రెండు కథలు ఒకే దగ్గర కలవడానికి కారణమేంటి ? చివరకు అర్జున్, ఆద్యలు ఒకటయ్యారా లేదా? అనేదే మిగతా కథ. నటీనటుల పనితీరు త్రిగున్, మేఘా ఆకాష్ పరిణతితో నటించారు. త్రిగున్‌కు తల్లిగా నటించిన మధుబాల తన పాత్రలో అదరగొట్టింది. కాలేజీ ఎపిసోడ్స్‌లో కూడా మధుబాల అల్లరితో పాటు అద్భుతంగా నటించింది. అజయ్,శివ, మాయల మధ్య వచ్చే ఎమోషనల్ సీన్ బాగుంటాయి. మాయ తండ్రిగా తనికెళ్ల భరణి, రిషిగా అజయ్ తమ నటనతో మెప్పించారు. బేబీ సినిమాలో చేసిన వైష్ణవి చైతన్య మాయ చెల్లి క్యారెక్టర్‌తో కనువిందు చేసింది. సాంకేతిక నిపుణుల పనితీరు ఫస్ట్ హాఫ్‌లో యూత్‌ను కాలేజీ డేస్‌లోకి తీసుకెళ్ళిన దర్శకుడు సెకండ్ హాఫ్‌లో లవ్ మ్యారేజ్, అరేంజ్డ్ మ్యారేజ్, వన్ సైడ్ లవ్‌లోని డిఫరెంట్ యాంగిల్స్ చూపించాడు. కానీ కొన్ని చోట్ల సీన్స్ నీరసంగా సాగదీసినట్లుగా అనిపిస్తాయి. సినిమాటోగ్రాఫర్ సజాద్ కక్కు ఇచ్చిన విజువల్స్ ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ. మణిశర్మ గారి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. కిరణ్ తుంపెర ఇంకాస్త ఎడిటింగ్ చేయాల్సింది. ఈశ్వర్ పెంటి కొరియోగ్రఫీ, రియల్ సతీష్, డ్రాగన్ ప్రకాష్ ల ఫైట్స్ పర్వాలేదనిపించాయి. హీరో అర్జున్, వాళ్ల అమ్మ మధుభాల మధ్య రాసుకున్న సన్నివేశాలు చూస్తున్నప్పుడు "అమ్మా నాన్న తమిళ అమ్మాయి" సినిమా గుర్తుచేసేలా ఉంటుంది. అక్కడక్కడా ఇది మనకు తెలిసిన కథే అనిపించేలా ఉంటుంది. క్లైమాక్స్ చాలా సింపుల్‌గా ఉంటుంది. చదవండి: ఓ మగాడు కాటేసిన మహిళ.. గానమే ప్రాణంగా శంకర శాస్త్రి -
ప్రేమ దేశం చిత్రంలో నటించడం నా అదృష్టం: నటి మధుబాల
‘‘ప్రేమదేశం’ వంటి మంచి సినిమాలో నటించడం అదృష్టంగా భావిస్తున్నాను. శ్రీకాంత్ సిద్ధం చెప్పిన కథ, నా పాత్ర నచ్చి ఈ సినిమా చేశా’’ అన్నారు నటి మధుబాల. త్రిగున్, మేఘా ఆకాష్, మధుబాల ప్రధాన పాత్రల్లో శ్రీకాంత్ సిద్ధం దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ప్రేమదేశం’. శిరీష సిద్ధం నిర్మించిన ఈ సినిమా ఈ నెల 3న రిలీజ్ కానుంది. ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకకి ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, ‘హిట్ 1, 2’ డైరెక్టర్ శైలేష్ కొలను అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్బంగా మధుబాల మాట్లాడుతూ.. ‘‘మా నాన్న నన్ను డాక్టర్‌గా చూడాలనుకున్నారు. అయితే నాకు ‘ఫూల్ ఔర్ కాంటే’ సినిమాకి చాన్స్ రావడం, అది హిట్టవడంతో వెనక్కి తిరిగి చూసుకోలేదు’’ అన్నారు. ‘‘ఈ చిత్రాన్ని షార్ట్ ఫిలింగా తీద్దామనుకున్నాను. అయితే నా ఫ్రెండ్స్ సపోర్ట్ చేయడంతో పెద్ద సినిమా అయింది’’ అన్నారు శ్రీకాంత్ సిద్ధం. -
అందుకే ఆ పాత్రకు మధుబాలను తీసుకున్నాం: ‘ప్రేమదేశం’ డైరెక్టర్
‘హైదరాబాద్ లో బి.టెక్ చదువుకొని అమెరికా వెళ్లి సాఫ్ట్ వెర్ లో జాబ్ చేస్తున్న నాకు సినిమా తియ్యాలనే ప్యాషన్ ఉండడంతో ఇండియాకు రావడం జరిగింది. . డైరెక్షన్ పరంగా నేను ఎవరి దగ్గర పని చేయలేదు. షార్ట్ ఫిలిం తీసిన నేను నెక్స్ట్ స్టెప్ లో మంచి లవ్ సబ్జెక్టు ఉన్న ఫ్యూచర్ ఫిలిం తీస్తే బాగుంటుందని, ‘ప్రేమదేశం’ తీశా’ అని చిత్ర దర్శక, నిర్మాత శ్రీకాంత్ సిద్ధం అన్నారు. .సిరి క్రియేటివ్ వర్క్స్’ బ్యానర్ పై త్రిగున్ , మేఘా ఆకాష్ హీరో హీరోయిన్లుగా శ్రీకాంత్ సిద్ధం స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ప్రేమదేశం’. అలనాటి అందాల తార మధుబాల ప్రత్యేక పాత్రలో నటిస్తుంది. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరి 3న విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శక, నిర్మాత శ్రీకాంత్ సిద్దం మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. ► రెండు విభిన్నమైన ప్రేమ కథలను తీసుకొని చేసిన సినిమానే ‘ప్రేమదేశం’. మంచి కంటెంట్ ఉన్న ఈ సినిమాలో మంచి మోడరన్ గెటప్ ఉన్న తల్లి పాత్రకు ఇదివరకే చేసిన వారితో చేస్తే రొటీన్ గా ఉంటుందని అలాగే ప్రేక్షకులకు కొంత ఫ్రెస్ నెస్ తో పాటు ఆ క్యారెక్టర్ లో కొంత బబ్లీ నెస్ ఉంటుందని భావించి మధుబాల గారిని సెలెక్ట్ చేయడం జరిగింది. వారితో పాటు విలక్షణ నటుడైన తనికెళ్ల భరణి గారు ఈ చిత్రంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. ► ఇందులో తల్లీ,కొడుకుల రిలేషన్ చాలా చక్కగా చూపించడం జరిగింది. త్రిగున్ , మేఘా ఆకాష్ పెయిర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. వారిద్దరూ మంచి పర్ఫామెన్స్ ఇవ్వడమే కాకుండా ఎంతో సహజంగా నటించారు. ఇంకా మిగిలిన నటి,నటులు కొత్తవారైనా చాలా చక్కగా నటించారు ► ప్రేమదేశం అంటే ఎక్కువగా కనెక్ట్ అయ్యేది యూత్. యూత్ బేస్డ్ గా చూస్తే సాంగ్స్ పరంగా, సీన్స్ పరంగా, కాలేజీ బ్యాక్ డ్రాప్ పరంగా చాలా కేర్ తీసుకొని చేయడంతో యూత్ ని బాగా ఆకట్టుకుంటుంది. ► నాటి “ప్రేమదేశం” సినిమాకు ఏఆర్ రహమాన్ ప్రాణం పోస్తే.. నేడు మణిశర్మ తన బ్యాగ్రౌండ్ స్కోర్ తోను సంగీతం తోను అంతే ప్రాణం పోశాడు. మేము విడుదల చేసిన “ప్రేమదేశం” టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.. ఇందులోని “పదములే లేవు పిల్ల” పాట, తెలవారెనే స్వామి ఇలా ఈ సినిమాలో ఉన్న అన్ని పాటలు కూడా అన్ని మాధ్యమాలలో టాప్ చార్ట్ బస్టర్ గా నిలిచాయి . ► ఈ సినిమా కథ విషయంలో విజువల్ గా నా మైండ్ లో బౌండ్ స్క్రిప్ట్ రికార్డ్ అయిన అందువల్ల అదే వేలో వెళ్ళాను. డైరెక్టర్ గా నాకు ఎటువంటి ఇబ్బందులు కలగలేదు కానీ ఓన్ గా ప్రొడక్షన్ చేయడం, అలాగే కొంత మంది ఫ్రెండ్స్ తో కలసి ఈ సినిమా చేయడం జరిగింది. సినిమా బాగా రావాలనే క్రమంలో కొంత బడ్జెట్ పెరిగింది. దాంతో ఫైనాన్స్ పరంగా కొంత ఇబ్బంది ఎదురైనా కూడా ఖర్చు విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా చేశాం. ఆలా చెయ్యడానికి కారణం మాకు కథ మీద ఉన్న నమ్మకం, అలాగే మణి శర్మ గారిమీద ఉన్న విశ్వాసం. ఈ రెండు ఉండడం వలన ప్రేక్షకులను కచ్చితంగా థియేటర్స్ రప్పిస్తుందనే నమ్మకం ఉంది. ► అప్పటి బ్లాక్ బస్టర్ ప్రేమదేశం సినిమాకు ఎ మాత్రం తగ్గకుండా కాలేజ్ బ్యాక్ డ్రాప్‌తో ఔట్ అండ్ అవుట్ యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించిన ఈ సినిమా యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ అందరినీ కచ్చితంగా అలరిస్తునే నమ్మకం ఉంది. -
హీరో ఆకాష్ పూరి ని ప్రాంక్ చేసిన ప్రేమదేశం మూవీ టీమ్
-
కామెడీ రోల్స్ చేసేందుకు కూడా సిద్ధమే: మధుబాల
‘‘ప్రేమ దేశం’ సినిమాలో తల్లీకొడుకుల బంధాన్ని చక్కగా చూపించారు. ‘ప్రేమ దేశం’లో నేను ఒక హీరోయిన్లాంటి పాత్రలోనే కనిపిస్తాను’’ అని నటి మధుబాల అన్నారు. త్రిగుణ్, మేఘా ఆకాష్ జంటగా శ్రీకాంత్ సిద్ధం దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ప్రేమ దేశం’. శిరీష సిద్ధం నిర్మించిన ఈ సినిమా డిసెంబర్ 2న విడుదల కానుంది. ఈ చిత్రంలో తల్లి పాత్ర చేసిన మధుబాల మాట్లాడుతూ.. ‘‘ప్రేమ దేశం’లో త్రిగుణ్, మేఘా ఆకాష్ బాగా నటించారు. నా కెరీర్ ప్రారంభంలో అన్ని భాషల్లో సినిమాలు చేశాను. ఇప్పుడు తెలుగులో చేస్తే ఎక్కువ రీచ్ వస్తుంది.. అందుకే తెలుగు సినిమాల మీద ఫోకస్ పెట్టాను. నేను నటించిన మరో తెలుగు సినిమా ‘గేమ్’ మంచి కథతో రాబోతోంది. కథ బాగుంటే నెగెటివ్ రోల్ అయినా, కామెడీ రోల్ అయినా ఓకే. ప్రస్తుతం హిందీలో ‘కర్తమ్ హుక్తమ్’తో పాటు మరో సినిమా చేస్తున్నాను. అలాగే ‘దేజావు’ అనే తెలుగు, తమిళ ద్విభాషా చిత్రం, వివేక్ శర్మ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాను. జీ5లో ఓ వెబ్ సిరీస్ చేస్తున్నాను’’ అని చెప్పుకొచ్చారు. చదవండి: విడాకుల పుకార్లను తీవ్రంగా ఖండించిన శ్రీకాంత్ సినీ నటి జీవిత టార్గెట్‌గా.. జియో పేరుతో టోకరా! -
ఆస్పత్రిలో ప్రేమదేశం హీరో అబ్బాస్, ఫొటో వైరల్
కొన్ని సినిమాలు వచ్చి ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ వాటి క్రేజ్ ఏమాత్రం తగ్గదు. అందులో ప్రేమదేశం సినిమా ఒకటి. కదీర్ దర్శకత్వంలో వచ్చిన ప్రేమదేశం బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించింది. ఈ సినిమాతో ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరయ్యాడు హీరో అబ్బాస్. తర్వాత పలు సినిమాలు చేసిన అబ్బాస్ 2015లో సినీకెరీర్‌కు విరామం పలికాడు. ఫ్యామిలీతో కలిసి విదేశాలకు వెళ్లిపోయి అక్కడే సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా సెటిలయ్యాడు. తాజాగా అతడు సర్జరీ చేయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఫొటోను అబ్బాస్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. 'ఆస్పత్రిలో ఉన్న సమయంలో నా మనసంతా గందరగోళంగా ఉంది. దాన్ని అధిగమించేందుకు నేను ఎంతగానో ప్రయత్నించాను. శస్త్ర చికిత్స తర్వాత కొంత ఉపశమనం కలిగింది. నా కోసం ప్రార్థించిన ప్రతిఒక్కరినీ కృతజ్ఞతలు' అని అని ఫేస్బుక్లో రాసుకొచ్చాడు అబ్బాస్. చదవండి: నీ నుంచి కంటెంటే రాదు, కోపం ఎలా వస్తుంది: యాంకర్ వెకిలి చేష్టలు నేను డబ్బు కోసం ఈ పని చేయట్లేదు: దిల్ రాజు -
‘ప్రేమదేశం’ గ్లింప్స్‌కు అనూహ్య స్పందన
1996లో వచ్చిన ‘ప్రేమదేశం’ చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికి తెలిసిందే. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ అందించిన పాటలు.. అప్పట్లో యువతను విపరీతంగా ఆకట్టుకున్నాయి. దాదాపు దశాబ్దం పాటు ఎక్కడ చూసిన అవే పాటలు వినిపించాయి. చాలాకాలం తర్వాత ఇప్పుడు అదే టైటిల్‌తో ఓ సినిమా తెరకెక్కుతుంది.మేఘా ఆకాశ్, త్రిగున్ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. ఇటీవల ఈ చిత్రం నుంచి విడుదలైన మ్యూజికల్ గ్లింప్స్‌కు అనూహ్య స్పందన లభిస్తోంది. యూట్యూబ్‌లో ఈ సినిమా గ్లిమ్స్ ఇప్పటికే 1 మిలియన్ వ్యూస్‌ని క్రాస్ చేసిందిశ్రీకాంత్ సిద్దం దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సిరి క్రియేటివ్ వర్క్స్ పతాకంపై శిరీష సిద్ధం నిర్మిస్తున్నారు. అలనాటి అందాల తార మధుబాల ఓ కీలక పాత్రలో నటిస్తోంది. కాలేజ్ బ్యాక్ డ్రాప్‌తో లో చిత్రీకరించబడుతున్న ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొంది .అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని జూన్ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. -
చంద్రముఖి టు విక్రమార్కుడు.. ‘సీక్వెల్’పై కన్నేసిన దర్శకనిర్మాతలు
బాక్సాఫీస్ పై కాసుల వర్షాన్ని కురిపించిన సినిమాలకు ఎంతటి క్రేజ్ ఉంటుందో చెప్పుకోనక్కర్లేదు. అందుకే ఈ క్రేజ్ ను క్యాష్ చేసుకునేందుకు ప్రస్తుతం సీక్వెల్ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే చంద్రముఖి సీక్వెల్ కు స్టార్ కాస్ట్ ఫైనల్ అవుతోంది. లారెన్స్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. 25 ఏళ్ల క్రితం దక్షిణాదిన సంచలన విజయం సాధించింది ప్రేమదేశం. ఇప్పుడు ఈ క్లాసిక్ లవ్ స్టోరీకి సీక్వెల్ తెరకెక్కించబోతున్నారు. ప్రస్తుతం మొదటి భాగాన్ని తెరకెక్కించిన దర్శకుడు కదీర్ రెండో భాగానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుపుతున్నాడు. అంతా నూతన నటీనటులతో సీక్వెల్ ను తెరకెక్కించాలనుకుంటున్నాడు. రాజమౌళి తెరకెక్కించిన చిత్రాలన్ని ఆల్ మోస్ట్ బ్లాక్ బస్టర్ లిస్ట్ లో చేరినవే. బాహుబలికి మాత్రమే రెండో భాగం తీసాడు జక్కన్న. నిజానికి తన చిత్రాల్లో ఈగకు సీక్వెల్ తీయాలన్నది రాజమౌళి కోరిక. అయితే ఇప్పటికిప్పుడు ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లేలా లేదు. మరోవైపు విక్రమార్కుడు సీక్వెల్ స్టోరీని రెడీ చేసేసారు కథారచయిత విజయేంద్రప్రసాద్. విక్రమార్కుడు చిత్రం తెలుగులోనే కాదు.. తమిళ, కన్నడ, హిందీ,బెంగాలీ బాషల్లోకి రీమేక్ అయింది. అన్ని చోట్ల మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పటికిప్పుడు ఈ మూవీ సీక్వెల్ ను రాజమౌళి డైరెక్టే చేసే అవకాశాలు తక్కువ. ఆర్ఆర్ఆర్ తర్వాత మహేష్ బాబుతో మూవీతో జక్కన్న బిజీగా ఉన్నాడు. మరి విక్రమార్కుడు సీక్వెల్ బాధ్యతలను ఎవరికి అప్పగిస్తాడు అనేది ఆశక్తికరంగా మారింది. -
‘ప్రేమ దేశం’ వినీత్ టాలీవుడ్‌కి ఎందుకు దూరమయ్యాడంటే..
తెలుగు వెండితెరపై చాలా మంది హీరోలు ఇలా వచ్చి అలా వెళ్లారు. వరుస సినిమాలు ప్లాపులు రావడంతో హీరోగా నిలదొక్కుకోలేనివాళ్లు చాలా మంది ఉన్నారు. కానీ కొందరు మాత్రం ఎంట్రీతోనే హిట్ కొట్టి, తక్కువ సమయంలోనే యూత్‌లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకొని, అంతే తొందరగా కనుమరుగై పోతున్నారు. ఆ కోవకు చెందిన వారే హీరో వినీత్. ‘ప్రేమ దేశం’సినిమాతో తెలుగులో ఒక్కసారి ఉప్పెనలా లేచిన హీరో వినీత్. సరిగమలు అనే మూవీ తో తెలుగు లో ఎంట్రీ ఇచ్చినప్పటికీ.. ప్రేమదేశం(1996)తో ఆయనకు స్టార్డమ్ వచ్చింది. అప్పట్లో ఈ సినిమా సృష్టించిన రికార్డు అంతా ఇంతా కాదు. ఈ సినిమా చూసిన తర్వాత అప్పటి యువకులు హెయిర్ స్టైల్ నుంచి డ్రెస్సింగ్ స్టైల్ వరకు చాలా విషయాలను ఫాలో అయ్యారు. ఈ సినిమాతో హీరో వినీత్ తెలుగింటివాడైపోయాడు. ఆ క్రేజ్‌తోనే తెలుగులో కొన్ని మంచి సినిమాలు చేశాడు వినీత్. కానీ హీరోగా ఎక్కువకాలం నిలబడలేకపోయాడు. సినీ బ్యాగ్రౌండ్(నటి శోభన కజిన్ ) ఉన్నప్పటికీ ఆయనకు అదృష్టం కలిసి రాలేదు. తెలుగులో హీరోగా అవకాశాలు పొందలేకపోయాడు. దానికి కారణం..వినీత్‌కు తెలుగు భాషపై పట్టులేకపోవడం. స్వతహాగా మలయాళి అయిన వినీత్‌కు తెలుగు భాష పై పెద్దగా పట్టు లేదు. రాజశేఖర్, భానుచందర్, సుమన్ మాదిరిగా డబ్బింగ్ చెప్పుకోవడానికి వీలునప్పటికీ.. క్లాస్ పాత్రలు తప్ప మాస్ పాత్రలకు సరిపోలేదు. క్లాసికల్ డ్యాన్సర్ అయిన వినీత్ కి లవర్ బాయ్, డాన్సర్ కథలు మాత్రమే ఎక్కువగా వచ్చేవి. అవి బాక్సాఫీస్ వద్ద బోల్తాపడడంతో వినీత్‌కు అవకాశాలు తగ్గిపోయాయి. ప్రేమ పల్లకి, ఆరో ప్రాణం, రుక్మిణి, వైఫ్ ఆఫ్ వి వరప్రసాద్, పాడుతా తీయగా, ఇలా వరుస సినిమాలు చేసినా పెద్దగా హిట్స్ అందుకోలేకపోయాడు. దీంతో చివరకు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారి లాహిరి లాహిరి లాహిరిలో, బాపు బొమ్మకు పెళ్ళంట వంటి మూవీస్ లో నటించాడు. అదే సమయంలో మలయాళంలో హిట్స్ రావటంతో తెలుగులో ఆఫర్ తగ్గిపోయాయి. మలయాళంలో వరుస అవకాశాలు రావడంతో టాలీవుడ్ వైపు చూడలేదు వినీత్. 2006 థాంక్స్ సినిమా తరువాత ఎక్కువగా కనిపించలేదు. దాదాపు 15 ఏళ్ల తర్వాత ఇటీవల నితిన్ హీరోగా నటించిన రంగ్ దే(2021) మూవీలో కనిపించాడు. మంచి పాత్రలు వస్తే తప్ప తెలుగులో నటించనని వినీత్ భావిస్తున్నారట. చూద్దాం క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానైనా వినీత్‌కి తెలుగులో మంచి గుర్తింపు రావాలని ఆశిద్దాం. చదవండి: నటుడు వేణు గుర్తున్నాడా? ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా! హీరో అబ్బాస్ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు, ఏం చేస్తున్నాడో తెలుసా! -
‘అర్థవంతంగా కాకుండా.. అర్దాంతరంగా ముగించేస్తాడు’
ఒకప్పటి ప్రేమదేశం సినిమా ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ట్రయాంగల్ లవ్‌స్టోరీస్‌లో ఈ సినిమా ఎప్పటికీ ప్రత్యేకమే. అయితే ఈ మూవీ టైటిల్ కూడా అప్పటినుంచి అంతే ప్రత్యేకతను సంపాదించుకుంది. మళ్లీ ఇన్నేళ్లకు ఇదే టైటిల్‌తో మరో సినిమా రాబోతోంది. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను ప్రస్తుతం విడుదల చేశారు. మూడు జంటల ప్రేమకథల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్ర టీజర్‌ను కొద్దిసేపటి క్రితమే విడుదల చేశారు. ఈ టీజర్లో ఒక జంట లవ్‌స్టోరీని మాత్రమే చూపించారు. రెండో కథకు సంబంధించిన టీజర్‌ను ఫిబ్రవరిలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. మంచి ఫీల్‌ను కలిగిస్తున్న ఈ టీజర్లో ట్రయాంగిల్ లవ్‌స్టోరీ ఆకట్టుకునేలా ఉంది. టీజర్ చివరన తనికెళ్ల భరణి చెప్పిన ‘అన్ని కథలు అర్థవంతంగా కాకుండా కొన్ని అర్ధాంతరంగా ముగించేస్తాడు’ అనే డైలాగ్ హైలెట్‌గా నిలిచింది. శ్రీకాంత్ సిద్దం దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శిరీష నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు.