‘‘ప్రేమదేశం’ వంటి మంచి సినిమాలో నటించడం అదృష్టంగా భావిస్తున్నాను. శ్రీకాంత్ సిద్ధం చెప్పిన కథ, నా పాత్ర నచ్చి ఈ సినిమా చేశా’’ అన్నారు నటి మధుబాల. త్రిగున్, మేఘా ఆకాష్, మధుబాల ప్రధాన పాత్రల్లో శ్రీకాంత్ సిద్ధం దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ప్రేమదేశం’. శిరీష సిద్ధం నిర్మించిన ఈ సినిమా ఈ నెల 3న రిలీజ్ కానుంది.
ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకకి ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, ‘హిట్ 1, 2’ డైరెక్టర్ శైలేష్ కొలను అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్బంగా మధుబాల మాట్లాడుతూ.. ‘‘మా నాన్న నన్ను డాక్టర్‌గా చూడాలనుకున్నారు. అయితే నాకు ‘ఫూల్ ఔర్ కాంటే’ సినిమాకి చాన్స్ రావడం, అది హిట్టవడంతో వెనక్కి తిరిగి చూసుకోలేదు’’ అన్నారు. ‘‘ఈ చిత్రాన్ని షార్ట్ ఫిలింగా తీద్దామనుకున్నాను. అయితే నా ఫ్రెండ్స్ సపోర్ట్ చేయడంతో పెద్ద సినిమా అయింది’’ అన్నారు శ్రీకాంత్ సిద్ధం.
Comments
Please login to add a commentAdd a comment