Madhu bala
-
మంచు విష్ణు 'డ్రీమ్ ప్రాజెక్ట్'.. మరో క్రేజీ అప్డేట్!
టాలీవుడ్ హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతోన్న చిత్రం కన్నప్ప. ఇప్పటికే ఈ సినిమా టీజర్ రీలీజ్ చేయగా అభిమానుల అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీ షూటింగ్ ఎక్కువగా న్యూజిలాండ్‌లోని అద్భుతమైన లోకేషన్స్‌లో చిత్రీకరించారు. ఈ చిత్రంలో ప్రభాస్‌తో పాటు డా.మోహన్ బాబు, మోహన్ లాల్, శరత్ కుమార్, బ్రహ్మానందం, మధుబాల లాంటి అగ్రతారలు నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఈ సినిమాలో కనిపంచనున్నారు.తాజాగా ఈ మూవీకి సంబంధించి మరో క్రేజీ అప్డేట్ వచ్చేసింది. కన్నప్ప సినిమా మధుబాల ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ రివీల్ చేశారు. చెంచుల వీరత్వాన్ని తెలిపేలా ఉన్న ఈ లుక్ ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. అంతేకాకుండా పోస్టర్‌పై రాసిన పదాలు వీరనారి తెగువను తెలుపేలా ఉన్నాయి. దీంతో కన్నప్పపై అభిమానుల్లో అంచనాలు మరింత పెరిగాయి. ధైర్యవంతుడైన యోధుడు శివుని భక్తుడైన కన్నప్ప కథను అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు.ఇప్పటికే పలువురు పాన్ ఇండియా స్టార్స్ ఉండటం వల్ల అందరి దృష్టి ఈ సినిమాపైనే ఉంది. ఈ చిత్రాన్ని విజువల్ వండర్‌గా మోహన్ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుంది. త్వరలోనే పూర్తి చేసి ప్రమోషన్ కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. Presenting #Madhubala as #Pannaga; The chief of clan with her fierce & dare-devil spirit she is a force to be reckoned with 🔥#Madhoo #Kannappa🏹 #HarHarMahadevॐ@themohanbabu @ivishnumanchu @Mohanlal #Prabhas @akshaykumar @realsarathkumar @mukeshvachan @MsKajalAggarwal… pic.twitter.com/1qnbiXwQEq— Kannappa The Movie (@kannappamovie) July 29, 2024 -
ఆ హీరోకి తల్లిగా చేయమన్నారు.. యాక్టింగ్ వదిలేశా: మధుబాల
'రోజా' సినిమా హీరోయిన్ మధుబాల ఇప్పటి జనరేషన్‌కు పెద్దగా తెలియకపోవచ్చు. ఎందుకంటే 9-10 ఏళ్లు మాత్రమే ఇండస్ట్రీలో ఉన్న ఆమె.. సడన్‌గా నటించడం మానేసి పెళ్లి చేసుకుంది. దీంతో అభిమానులు ఒక్కసారిగా షాకయ్యారు. అప్పట్లో అసలు మధుబాల ఎందుకలా చేసిందా అని ఫ్యాన్స్ బుర్ర పీక్కున్నారు. కానీ ఇన్నేళ్లపాటు ఆ విషయం రహస్యంగానే ఉండిపోయింది. మధుబాల ప్రస్తుతం మళ్లీ సినిమాలు చేస్తూ బిజీగానే ఉంది. ఆమె నటించిన 'స్వీట్ కారం కాఫీ' వెబ్ సిరీస్ తాజాగా ఓటీటీలో విడుదలైంది. ఈ ప్రమోషన్‌లోనే మాట్లాడుతూ.. అప్పట్లో తను ఇండస్ట్రీ వదిలేయడానికి గల కారణాన్ని బయటపెట్టింది. అమ్మ పాత్రకు నో 1991లో మధుబాల హీరోయిన్గా ఇండస్ట్రీలోకి వచ్చింది. 'పూల్ ఔర్ కాంఠే' సినిమాతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇందులో అజయ్ దేవగణ్ కు హీరోయిన్ గా చేసింది. ఆ తర్వాత 'రోజా', 'అల్లరి ప్రియుడు', 'జెంటిల్‌మేన్' లాంటి సినిమాలతో అటు హిందీ ఇటు దక్షిణాది ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేసింది. ఒకానొక సందర్భంలో ఈమెకు బాలీవుడ్ లో ఓ సినిమాలో అమ్మ రోల్ ఆఫర్ చేశారు. అది కూడా హీరో అజయ్ దేవగణ్‌కు. దీంతో సింపుల్ గా నో చెప్పేసింది. కొన్నాళ్లకు నటన, ఇండస్ట్రీకి దూరమై పెళ్లి చేసుకుంది. (ఇదీ చదవండి: Rangabali Review: 'రంగబలి' సినిమా రివ్యూ) బాలీవుడ్లో అప్పట్లో దాదాపు పాతికేళ్ల క్రితం జరిగిన దాని గురించి తాజాగా ఓ ఈవెంట్ లో మధుబాల బయటపెట్టింది. 'నాకు అజయ్ దేవగణ్ తల్లిగా చేయడం ఇష్టం లేదు. ఎందుకంటే ఇద్దరం ఒకేసారి ఇండస్ట్రీలోకి వచ్చాం. ఇద్దరిదీ ఒకటే వయసు. అయినాసరే నాకు ఎక్కువ వయసున్న రోల్స్ ఆఫర్ చేశారు. నాకు నచ్చలేదు. బాలీవుడ్ లో 90వ దశకంలో పరిస్థితులు దారుణంగా ఉండేవి. హీరోలు యాక్షన్ చేస్తుంటే, హీరోయిన్లకు మాత్రం డ్యాన్స్, రొమాంటిక్ డైలాగ్స్, ఎమోషనల్ సీన్స్ ఉండేవి. నాకేమో డ్యాన్స్ చేయాలని ఉండేది. 'రోజా' తర్వాత అలాంటి పాత్రలు రాలేదు' ఇండస్ట్రీని వదిలేశా 'అయితే 9-10 ఏళ్లపాటు సినిమాల్లో నటించిన చేసిన తర్వాత ఇండస్ట్రీని వదిలేయాలనిపించింది. కారణం కోసం వెతికితే పెళ్లి కనిపించింది. దీంతో ఇండస్ట్రీలో తెలిసిన వాళ్లకు లెటర్స్ రాశాను. ఇకపై సినిమాల్లో నటించట్లేదని క్లారిటీ ఇచ్చేశాను. ఇప్పుడు అదంతా ఆలోచిస్తుంటే.. పిల్లతనంతో చేసిన పనిలా అనిపిస్తుంది. గతంతో పోలిస్తే ఇప్పుడు ఇండస్ట్రీ కాస్త మారింది. సీనియర్స్ కూడా హీరోయిన్ రోల్స్ చేస్తున్నారు. ఈ విషయంలో ఆనందంగా ఉంది' అని మధుబాల చెప్పుకొచ్చింది. (ఇదీ చదవండి: 'సలార్' డైరెక్టర్ని ఓ విషయంలో పక్కా మెచ్చుకోవాలి!) -
మేనకగా సీనియర్ నటి మధుబాల.. ఆకట్టుకుంటున్న లుక్
సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం శాకుంతలం. గుణశేఖర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. దిల్ రాజు సమర్పణలో నీలిమ గుణ నిర్మించిన ఈ సినిమా అనేక వాయిదాల అనంతరం ఏప్రిల్ 14న విడుదలకు సిద్ధం అవుతుంది. ఈ చిత్రంలో సమంత శకుంతలగా నటించగా, మలయాళ నటుడు దేవ్ మోహన్ దుష్యంతుడిగా నటించాడు. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. త్వరలోనే ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో కొన్ని క్యారెక్టర్లను పరిచయం చేస్తూ మేకర్స్ పోస్టర్లు వదిలారు. తాజాగా అప్సర మేనక పాత్రలో సీనియర్ హీరోయిన్ మధుబాల కనిపించనుంది. ఈ మేరకు ఆమె లుక్‌ని రివీల్ చేశారు మేకర్స్. మేనక కూతురే శకుంతల. అంటే ఈ చిత్రంలో మధుబాల సమంతకు తల్లిగా కనిపించనుంది. ఇప్పటికే ఆమె లుక్ నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటుంది. -
ప్రేమ దేశం చిత్రంలో నటించడం నా అదృష్టం: నటి మధుబాల
‘‘ప్రేమదేశం’ వంటి మంచి సినిమాలో నటించడం అదృష్టంగా భావిస్తున్నాను. శ్రీకాంత్ సిద్ధం చెప్పిన కథ, నా పాత్ర నచ్చి ఈ సినిమా చేశా’’ అన్నారు నటి మధుబాల. త్రిగున్, మేఘా ఆకాష్, మధుబాల ప్రధాన పాత్రల్లో శ్రీకాంత్ సిద్ధం దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ప్రేమదేశం’. శిరీష సిద్ధం నిర్మించిన ఈ సినిమా ఈ నెల 3న రిలీజ్ కానుంది. ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకకి ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, ‘హిట్ 1, 2’ డైరెక్టర్ శైలేష్ కొలను అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్బంగా మధుబాల మాట్లాడుతూ.. ‘‘మా నాన్న నన్ను డాక్టర్‌గా చూడాలనుకున్నారు. అయితే నాకు ‘ఫూల్ ఔర్ కాంటే’ సినిమాకి చాన్స్ రావడం, అది హిట్టవడంతో వెనక్కి తిరిగి చూసుకోలేదు’’ అన్నారు. ‘‘ఈ చిత్రాన్ని షార్ట్ ఫిలింగా తీద్దామనుకున్నాను. అయితే నా ఫ్రెండ్స్ సపోర్ట్ చేయడంతో పెద్ద సినిమా అయింది’’ అన్నారు శ్రీకాంత్ సిద్ధం. -
జానకి.. శశికళ
ఏ సినిమాకైనా సరైన ఆర్టిస్టులను ఎంపిక చేయడం ముఖ్యం. బయోపిక్ అయితే అది మరింత ముఖ్యం. ప్రస్తుతం జయలలిత బయోపిక్‌లోనూ ఆర్టిస్ట్‌ల ఎంపికలో రాజీ పడటం లేదు చిత్రబృందం. నటి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా ఏఎల్ విజయ్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘తలైవి’ (నాయకురాలు అని అర్థం). కంగనా రనౌత్ టైటిల్ రోల్ చేస్తున్నారు. దివంగత నటుడు యంజీ రామచంద్రన్ (యంజీఆర్)గా అరవింద స్వామి, నటుడు శోభన్‌బాబు పాత్రలో బెంగాలీ నటుడు జిష్షూ సేన్ గుప్తా నటిస్తున్నారు. తాజాగా జయ జీవితంలో కీలకమైన ఆప్తురాలు శశికళ పాత్రలో పూర్ణ నటిస్తున్నారు. యంజీఆర్ భార్య జానకి పాత్రలో ‘రోజా’ ఫేమ్ మధుబాల నటిస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు విజయ్ మాట్లాడుతూ – ‘‘శశికళ పాత్రకి ప్రియమణిని అనుకున్నాం. కానీ డేట్స్ సమస్య వచ్చింది. పూర్ణ అయితే ఈ పాత్రకు బావుంటారని తీసుకున్నాం. మధుబాలగారిని జయలలిత తల్లి సంధ్య పాత్రలో తీసుకుందాం అనుకున్నాను. కానీ ఆమెను కలిశాక యంజీఆర్ భార్య జానకి పాత్రకు కరెక్ట్‌గా సరిపోతారని తీసుకున్నాం. ప్రస్తుతం చెన్నైలో షూటింగ్ చేస్తున్నాం. మార్చి మొదటివారం వరకూ ఈ షెడ్యూల్ సాగుతుంది’’ అన్నారు. శైలేష్ ఆర్, విష్ణు వర్థన్ ఇందూరి నిర్మిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది జూన్‌లో విడుదల కానుంది. -
యాక్షన్ ఎంటర్టైనర్
తమిళ, మలయాళ భాషల్లో యాక్షన్ హీరోగా చేసిన ఆర్.కె.సురేశ్ ‘శివలింగాపురం’ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమవుతున్నారు. తోట కృష్ణ దర్శకత్వంలో రావూరి అల్లికేశ్వరి సమర్పణలో రావూరి వెంకటస్వామి ఈ చిత్రాన్ని నిర్మించారు. మధుబాల కథానాయిక. ఈ సినిమా ఆడియో, ట్రైలర్ విడుదల కార్యక్రమంలో నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ –‘‘అభిరుచితో ఆయన తీసిన ఈ చిత్రం విజయవంతం కావాలి’’ అన్నారు. ‘‘గతంలో లిటిల్ హార్ట్స్, మా తల్లి గంగమ్మ, కొక్కొరోకో’ వంటి సినిమాలు తీశాను. మేము పెరిగిన లొకేషన్లో ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలను చిత్రీకరించాం. ఈ నెలాఖరులో చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు వెంకటస్వామి. ‘‘గ్రామీణ నేపథ్యంలో యాక్షన్, ఫాంటసీ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని మలిచాను. అన్న, చెల్లెలి సెంటిమెంట్ హైలైట్ అవుతుంది’’అన్నారు. ఈ కార్యక్రమంలో తుమ్మలపల్లి రామసత్యనారాయణ, టి.ప్రసన్నకుమార్, మోహన్ వడ్లపట్ల, సాయివెంకట్, రాకేష్ రెడ్డి, పద్మిని నాగులపల్లి, డి.ఎస్.రావు తదితరులు పాల్గొన్నారు. -
మరోసారి జోడీగా...
‘అల్లరి ప్రియుడు, జెంటిల్‌మేన్, చిలక్కొట్టుడు, గణేష్’ చిత్రాల్లో హీరోయిన్గా నటించి తెలుగుప్రేక్షకుల్లో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు మధుబాల. సెకండ్ ఇన్నింగ్స్‌లో ‘అంతకుముందు ఆ తర్వాత, సూర్య వర్సెస్ సూర్య, నాన్నకు ప్రేమతో’ సినిమాల్లోనూ ముఖ్య పాత్రలతో తనదైన ముద్ర వేశారామె. అటు తమిళ, కన్నడ చిత్రాల్లోనూ నటిస్తున్న మధుబాల తాజాగా ‘కాలేజ్ కుమార్’ అనే మరో తమిళ చిత్రం అంగీకరించారు. దాదాపు 23 ఏళ్ల తర్వాత ఈ చిత్రంలో నటుడు ప్రభుతో కలిసి ఆమె నటిస్తుండటం విశేషం. సీమాన్ దర్శకత్వంలో 1996లో వచ్చిన ‘పాంచాలకురుచ్చి’ సినిమాలో తొలిసారి జోడీ కట్టారు మధుబాల, ప్రభు. ఆ తర్వాత వీరిద్దరూ కలిసి నటించింది లేదు. తాజాగా అరుణ్ విజయ్ హీరోగా, ప్రియా వడ్లమాని జంటగా ప్రియదర్శన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘కాలేజ్ కుమార్’ చిత్రంలో మరోసారి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు మధు–ప్రభు. -
వెండితెరకు వేలుపిళ్లై
ఎల్టీటీ వ్యవస్థాపకుడు, నాయకుడు వేలుపిళ్లై ప్రభాకరన్ జీవితం ఆధారంగా తమిళంలో దర్శకుడు వెంకటేశ్ ఓ చిత్రం తెరకెక్కించనున్నారు. ఈ బయోపిక్‌లో ప్రభాకరన్ పాత్రలో తమిళ నటుడు బాబీ సింహా కనిపించనున్నారు. ఆల్రెడీ శ్రీలంకలో జరిగిన సివిల్ వార్ ఆధారంగా ‘నీలమ్’ తెరకెక్కించారు వెంకటేశ్. సెన్సార్ వివాదాలతో ఆ సినిమా విడుదల కాలేదు. ఇప్పుడు ప్రభాకరన్ బయోపిక్ తెరకెక్కించడానికి సిద్ధమయ్యారాయన. ‘రేజింగ్ టైగర్’ పేరుతో రూపొందబోయే ఈ బయోపిక్ రెండు పార్ట్స్‌గా తెరకెక్కబోతోంది. ‘‘ఫస్ట్ పార్ట్‌లో ప్రభాకరన్ స్టూడెంట్‌గా ఉన్నరోజులు, ఆ తర్వాత రెబల్‌గా ఎలా మారాడు? లీడర్‌గా ఎలా ఎదిగాడు? అనేది చూపిస్తాం. సెకండ్ పార్ట్‌లో తమిళ ఈలమ్ కోసం జరిగిన యుద్ధాన్ని చూపించదలిచాం. ప్రభాకరన్‌కు దగ్గర పోలికలు బాబీ సింహాలో చూశాను. ఈ పాత్ర చేయడానికి బాబీ ఎటువంటి సంకోచం వ్యక్తం చేయలేదు’’ అన్నారు దర్శకుడు వెంకటేశ్. -
లేడీ విలన్
‘రోజా, అల్లరి ప్రియుడు, గణేశ్’ సినిమాల్లో ఆకట్టుకున్న మధుబాల గుర్తుండే ఉంటారు. అప్పట్లో హీరోయిన్గా అలరించిన ఆమె ఇటీవల క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కనిపిస్తున్నారు. ‘నాన్నకు ప్రేమతో’ సినిమాలో హీరోయిన్ తల్లిగా కనిపించారు. ఈసారి ఏకంగా విలన్‌గా మారబోతున్నారు. బాబీసింహా హీరోగా జాన్‌పౌల్ రాజ్, శ్యామ్ సూర్య రూపొందిస్తున్న తమిళం చిత్రం ‘అగ్ని దేవ్’. ఈ సినిమాలో విలన్‌గా నటించనున్నారు మధుబాల. ‘‘చాలా రోజుల తర్వాత తమిళ చిత్రంలో యాక్ట్ చేస్తున్నాను. చాలా హ్యాపీగా ఉంది. ఈ కొత్త క్యారెక్టర్లో కూడా నా బెస్ట్ ఇవ్వాలనుకుంటున్నాను’’ అని పేర్కొ న్నారు మధుబాల. -
కాపులంతా జగన్ వెంటే
సాక్షి, తిరుపతి తుడా : కాపులు సీఎం చంద్రబాబునాయుడి మోసాలను గుర్తించారని, అందుకే వారంతా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్.జగన్మోహన్రెడ్డి వెంట నడిచేందుకు సిద్ధంగా ఉన్నారని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి పేర్కొన్నారు. తిరుపతిలో ఎన్టీఆర్ కుటుంబా నికి అత్యంత ఆప్తులుగా ఉన్న నైనారు కుటుంబానికి చెందిన నైనారు మధుబాల బంధుమిత్రులు, అనుచరులతో కలిసి బుధవారం వైఎస్సార్ సీపీలో చేరారు. భూమన కరుణాకరరెడ్డి నివాసంలో జరి గిన ఈ కార్యక్రమంలో నైనారు మధుబాలకు పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికాయి. కరుణాకరరెడ్డి ఆమెకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయన మాట్లాడుతూ నైనారు కుటుంబంతో తనకు చిన్ననాటి నుంచి విడదీయరాని అనుబంధం ఉందన్నారు. ఆ కుటుంబం పార్టీలోకి రావడం సంతోషంగా ఉందన్నారు. ఓటు బ్యాంకు కోసం గత ఎన్నికల్లో కాపులను వాడుకున్న సీఎం చంద్రబాబు వారిని దారుణంగా మోసం చేశారని దుయ్యబట్టారు. కుల రాజకీయాలతో చంద్రబాబు పార్టీని నడిపిస్తున్నారని మండిపడ్డారు. ఎవరు తీసిన గోతిలో వారే పడతారన్న సామెతను నిజం చేస్తూ కుల రాజకీయాలే ఆయన్ను ముంచనున్నాయని జోస్యం చెప్పారు. కాపులకు వైఎస్సార్ సీపీలో అధిక ప్రాధాన్యత ఉంటుందన్నారు. నైనారు మధుబాల మాట్లాడుతూ పార్టీ అభివృద్ధికి శక్తివంచన లేకుండా పనిచేస్తానన్నారు. కాపు నాయకులు దుద్దేల బాబు, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు బాలిశెట్టి కిశోర్ మాట్లాడుతూ కాపు ఉద్యమానికి జగన్మోహన్రెడ్డి సంపూర్ణ మద్దతు తెలపడంతో బలిజలు వైఎస్సార్ సీపీపై నమ్మకంతో ఉన్నారన్నారు. పార్టీ ఎస్సీ సెల్ తిరుపతి పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు టి.రాజేంద్ర, అజయ్‌కుమార్ మాట్లాడుతూ మానవత్వమే వైఎస్సార్సీపీ కులమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మహిళా విభాగం నగర అధ్యక్షురాలు కుసుమకుమారి, బొమ్మగుంట రవి, బండ్ల లక్ష్మీపతి పాడి శివప్రసాద్ యాదవ్, పుల్లయ్య, రాధామాధవి, శైలజ, లక్ష్మీరెడ్డి, వాసుయాదవ్, కేతం జయచంద్రారెడ్డి, గీతా యాదవ్, సాయికుమారి తదితరులు పాల్గొన్నారు. -
కల్పనలా కనిపించాలనుంది
ఇటీవల బయోపిక్‌ల ట్రెండ్ బాగా ఎక్కువగా కనిపిస్తోంది. బాలీవుడ్, టాలీవుడ్ ఇలా అన్ని ఇండస్ట్రీలు చరిత్రలో నిలిచిపోయిన ప్రముఖులందర్నీ తెరపైకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ మీరు బయోపిక్ చేయాలనుకుంటే ఏ సెలబ్రిటీని సెలెక్ట్ చేసుకుంటారు? అని బాలీవుడ్ భామ, ‘గౌరవం’ ఫేమ్ యామీ గౌతమ్‌ని అడిగితే –‘‘నాకు ఆస్ట్రోనాట్ కల్పనా చావ్లాలా కనిపించాలనుంది. ఒకవేళ తన బయోపిక్ రూపొందిస్తే అందులో యాక్ట్ చేయాలనే ఆసక్తి ఉంది. అలాగే హీరోయిన్ మధుబాల బయోపిక్‌లోనూ యాక్ట్ చేయాలనే కల ఉంది. వీళ్లిద్దరే ఎందుకూ? అని అడిగితే సరైన సమాధానం నా దగ్గర లేదు. కానీ వాళ్ల ఫీల్డ్‌లో వాళ్లు చూపించిన ఇంపాక్ట్ చాలా గొప్పది. వెరీ ఇన్స్పిరేషనల్’’ అని సమాధానమిచ్చారు యామీ. -
రూటు మార్చాలనుకుంటున్న మధుబాల
‘రోజా’ ఫేం మధుబాల దాదాపు పదిహేనేళ్ల విరామం తర్వాత తెలుగులో నటించిన చిత్రం ‘అంతకు ముందు ఆ తర్వాత’. కథానాయికగా సున్నితమైన పాత్రలు చేసి మెప్పించిన మధుబాలకు, కేరక్టర్ నటిగా కూడా అలాంటి పాత్రలే వస్తున్నాయి. అందుకే ఇప్పుడు రూటు మార్చాలనుకుంటున్నారామె. ప్రతినాయిక ఛాయలున్న పాత్రలు చేయాలనే కోరిక ఉందని మధుబాల అంటున్నారు. ముఖ్యంగా అసూయతో రగిలిపోయి, భర్తను చంపే భార్య పాత్ర చేయాలని ఉందని పేర్కొన్నారామె. ప్రతి మనిషిలోనూ మంచి, చెడు రెండు లక్షణాలుంటాయని... మంచి లక్షణాలున్న పాత్రలు చేశాను కాబట్టి... ఇప్పుడు చెడుని కూడా ఆవిష్కరించాలనుకుంటున్నానని తెలిపారు మధుబాల.