
మధుబాల
‘రోజా, అల్లరి ప్రియుడు, గణేశ్’ సినిమాల్లో ఆకట్టుకున్న మధుబాల గుర్తుండే ఉంటారు. అప్పట్లో హీరోయిన్‌గా అలరించిన ఆమె ఇటీవల క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కనిపిస్తున్నారు. ‘నాన్నకు ప్రేమతో’ సినిమాలో హీరోయిన్ తల్లిగా కనిపించారు. ఈసారి ఏకంగా విలన్‌గా మారబోతున్నారు. బాబీసింహా హీరోగా జాన్‌పౌల్ రాజ్, శ్యామ్ సూర్య రూపొందిస్తున్న తమిళం చిత్రం ‘అగ్ని దేవ్’. ఈ సినిమాలో విలన్‌గా నటించనున్నారు మధుబాల. ‘‘చాలా రోజుల తర్వాత తమిళ చిత్రంలో యాక్ట్ చేస్తున్నాను. చాలా హ్యాపీగా ఉంది. ఈ కొత్త క్యారెక్టర్‌లో కూడా నా బెస్ట్ ఇవ్వాలనుకుంటున్నాను’’ అని పేర్కొ న్నారు మధుబాల.
Comments
Please login to add a commentAdd a comment