villan role
-
మగధీర విలన్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ.. ట్రైలర్ వచ్చేసింది!
మగధీర విలన్ దేవ్‌గిల్ హీరోగా నటించిన తాజా చిత్రం అహో విక్రమార్క. ఈ సినిమాలో చిత్ర శుక్లా హీరోయిన్గా నటిస్తోంది. ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీకి రాజమౌళి శిష్యుడు పేట త్రికోటి దర్శకత్వం వహిస్తున్నాడు. వార్డ్ విజర్డ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై ఆర్తి దేవిందర్ గిల్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ చూస్తే దేవ్‌గిల్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. కాగా.. ఈ చిత్రం ఆగస్టు 30న ఇది విడుదల కానుంది. -
సూపర్ స్టార్ సినిమాలో విలక్షణ నటుడు.. మరోసారి విలన్‌గా!
కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రధాన పాత్రను పోషించిన లాల్ సలామ్. విష్ణువిశాల్, విక్రాంత్ ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని ఐశ్వర్యా రజనీకాంత్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇప్పటితే నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్నఈ చిత్రం పొంగల్‌కు విడుదల కానుందని ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్ర విడుదల వాయిదా పడే అవకాశం ఉందనే కోలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది. అయితే దీని గురించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇదిలా ఉండగా ప్రస్తుతం రజనీకాంత్ తన 170వ చిత్రాన్ని జై భీమ్ చిత్రం ఫేమ్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో చేస్తున్నారు. ఇందులో ఆయన మాజీ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్‌గా పవర్‌పుల్ పాత్రను పోషిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతోంది. ఆ తర్వాత లోకేశ్ కనకరాజ్ దర్శకత్వంలో నటించడానికి ఇప్పుటికే రజనీకాంత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. సన్ పిక్చర్ సంస్థ నిర్మించనున్న ఈ చిత్రంలో నటుడు శివకార్తీకేయన్ ముఖ్య పాత్రలో నటించనున్నారనే ప్రచారం జరుగుతోంది. కాగా.. తాజాగా విలక్షణ నటుడు విజయ్ సేతుపతి నటించనున్నట్లు తెలుస్తోంది. కథానాయకుడిగా, ప్రతి నాయకుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఎలాంటి పాత్రనైనా పోషిస్తూ తన స్థాయిని జాతీయ స్థాయికి పెంచుకుంటూ పోతున్న విజయ్ సేతుపతి.. ఆ మధ్య మాస్టర్ చిత్రంలో విజయ్‌తో ఢీకొట్టారు. ఆ తరువాత విక్రమ్ చిత్రంలో కమలహాసన్‌తో పోటీ పడ్డారు. అంతకు ముందే రజినీకాంత్‌తో పేట చిత్రంలో ప్రతినాయకుడిగా నటించారు. తాజాగా విజయ్ సేతుపతి మరోసారి రజినీకాంత్‌కు ప్రతినాయకుడిగా నటించడానికి రెడీ అవుతున్నట్లు టాక్. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. -
'ఆయనతో పని చేయడం చాలా కష్టం'.. జైలర్ విలన్‌పై డైరెక్టర్ కామెంట్స్!
చియాన్ విక్రమ్ కథానాయకుడిగా తెరకెక్కించిన తాజా చిత్రం 'ధృవ నచ్చిత్తిరం'. తెలుగులో ధృవ నక్షత్రం పేరుతో రిలీజ్ చేస్తున్నారు. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిస్తోన్న ఈ చిత్రం నవంబర్ 24న విడుదల కానుంది. విక్రమ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ మూవీలో జైలర్ ఫేమ్ వినాయకన్ విలన్‌గా నటిస్తున్నారు. తాజాగా మూవీ ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన వాసుదేవ్ మీనన్.. పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ముఖ్యంగా వినాయకన్‌తో పనిచేయడం చాలా కష్టమని తెలిపారు. దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ మాట్లాడుతూ.. 'వినాయకన్‌ను హ్యాండిల్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే క్యారెక్టర్ స్టైల్, కాస్ట్యూమ్, క్యారెక్టర్‌కి ఎలాంటి మూడ్ ఇవ్వాలనుకుంటున్నానో అతనికి స్పష్టంగా వివరించాలి. ఈ సినిమాలోని చాలా సన్నివేశాల్లో వినాయకన్‌కి విక్రమ్ మేకప్ వేయాల్సి వచ్చింది. వినాయకన్ సర్ ఓ ఫైట్ సీన్లో గాయపడ్డారు. ఆ తర్వాత విక్రమ్, వినాయకన్ ఇద్దరూ కలిసి ఆ సీన్ ఎలా చేయాలో చర్చించుకున్నారు. అయితే వినాయకన్ ఇంత స్టైలిష్‌గా మరే సినిమాలోనూ కనిపించలేదు. అతని డైలాగ్స్, స్వాగ్, మ్యానరిజమ్ అద్భుతంగా ఉన్నాయని' అన్నారు. మొదట ఈ సినిమాలో విలన్ కోసం వెతుకుతున్నప్పుడు అతని పేరును నటి దివ్యదర్శిని సూచించింది. అతని సినిమాలు చూశాక.. విలన్‌గా ది బెస్ట్ అనిపించించిదని గౌతమ్ మీనన్ తెలిపారు. ఈ సినిమాలో అతనే బెస్ట్ ఫర్మామెన్స్ ఇచ్చాడు. ఇటీవలే డబ్బింగ్ చెప్పి వెళ్లిపోయాడు. కానీ నేను అతని నుంచి మరో రోజు ఆశించా. కానీ దొరకలేదు. వినాయకన్‌కి ఫోన్లో మెసేజ్ పెట్టా. సార్ మీరు ఈ సినిమాలో ఎంత బాగా చేశారో మీకు తెలియదు. ఈ విషయం సినిమా విడుదలయ్యాక మీకే అర్థమవుతుంది. ఇందులో విక్రమ్ సార్ హీరోగా నటించడం నా అదృష్టం.' అని గౌతం వాసుదేవ్ మీనన్ అన్నారు. కాగా.. జైలర్ తర్వాత వినాయకన్ మరోసారి విలన్‌గా అలరించనున్నారు. తమిళ సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం 'ధృవ నచిత్తిరం'. విక్రమ్ హీరోగా గౌతమ్ వాసుదేవ్ మీనన్ తెరకెక్కించిన స్పై థ్రిల్లర్‌లో వినాయకన్ విలన్ పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలకు విశేష ఆదరణ లభించింది. ఈ చిత్రంలో రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్ కథానాయికలుగా కనిపించనున్నారు. పార్తీపన్, మున్నా, సిమ్రాన్, రాధిక శరత్‌కుమార్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. -
స్టార్ హీరో సినిమాలో విలన్‌గా సునీల్!
టాలీవుడ్ నటుడు, కమెడియన్ సునీల్ విభిన్నమైన పాత్రలతో దూసుకెళ్తున్నాడు. పుష్ప సినిమాలో శీనప్పగా మెప్పించిన సునీల్.. వరుస ఆఫర్లు వస్తున్నాయి. రజినీకాంత్ జైలర్‌లోనూ కీలక పాత్ర పోషించారు. తాజాగా శాండల్‌వుడ్‌లోనూ ఎంట్రీకి సిద్ధమయ్యారు. పుష్ప తరహాలో నెగెటివ్ రోల్ చేస్తున్నారు. స్టార్ హీరో కిచ్చా సుదీప్ సినిమాలో విలన్‌గా నటిస్తున్నారు. (ఇది చదవండి: స్టార్ హీరోయిన్ ప్లేస్‌లో ఛాన్స్ కొట్టేసిన అయాలి నటి!) ఇప్పటికే పుష్ప సినిమాతో సునీల్ రేంజ్ మారిపోయింది. కమెడియన్ నుంచి పూర్తిస్థాయిలో విలన్ పాత్రలనే ఎంపిక చేసుకుంటున్నారు. అదే క్రేజ్‌తో శాండల్‌వుడ్‌లోనూ ఎంట్రీ ఇవ్వనున్నారు. కిచ్చా సుదీప్ నటిస్తున్న మ్యాక్స్ మూవీ ఇప్పటికే 75 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ మహాబలిపురంలో జరుగుతోంది. ఇటీవలే సునీల్ ఈ మూవీలో నటిస్తున్నట్లు ప్రొడ్యూసర్ కలైపులి ఎస్ థాను ప్రకటించారు. ఈ చిత్రాన్ని విజయ్ కార్తికేయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. సునీల్ శాండల్‌వుడ్ ఎంట్రీపై ఆయన ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్‌కుమార్, సంయుక్త హోర్నాడ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ప్రస్తుతం బిగ్ బాస్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సుదీప్ ఆ తర్వాత కేజీఎఫ్ భామ శ్రీనిధి శెట్టితో మరో సినిమా చేయనున్నారు. అంతకుముందే సెలబ్రిటీ క్రికెట్ లీగ్‌లోనూ ఆయన పాల్గొననున్నారు. మిశ్రమ స్పందన అయితే సునీల్ ను మ్యాక్స్ లోకి తీసుకోవడంపై కన్నడ సినీ అభిమానుల్లో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. సినిమాకు సునీల్ అదనపు బలం అవుతాడని కొందరు సోషల్ మీడియాలో కామెంట్స్ చేశారు. మరికొందరు మాత్రం స్థానికంగా ఉన్న నటులను కాదని.. పక్క ఇండస్ట్రీలో నుంచి నటీనటులను తీసుకొని రావడమేంటని ప్రశ్నిస్తున్నారు. (ఇది చదవండి: ఎలిమినేట్ చేయండన్న గౌతమ్, చెప్పుతో కొట్టుకుంటానన్న అమర్దీప్) Telugu actor Sunil, who impressed pan-India audience with a negative role in Pushpa, has been roped in to play antagonist in @KicchaSudeep #Max#Kichcha #Sudeep #Kichcha46 #Sudeepfans #Kichchafans #Sunil #Pushpa pic.twitter.com/hIgFMMkGWL — Bangalore Times (@BangaloreTimes1) November 3, 2023 -
మెగా ఫోన్ పట్టనున్న రామ్ చరణ్ విలన్!
అరవింద స్వామి పేరు వినగానే గుర్తొచ్చేది దళపతి, బాంబే, రోజా చిత్రాలే. మణిరత్నం దర్శకత్వంలో రజినీకాంత్, మమ్ముట్టి వంటి దిగ్గజాలతో నటించిన దళపతి చిత్రంలో యువ కథానాయకుడిగా పరిచయమైన నటుడు అరవిందస్వామి. కొన్ని చిత్రాల తర్వాత వ్యక్తిగత కారణాల వల్ల నటనకు దూరంగా ఉన్నారు. అయితే టాలీవుడ్‌లోనూ రామ్ చరణ్ నటించిన ధృవ చిత్రంలో విలన్‌గా మెప్పించారు. (ఇది చదవండి: Bigg Boss 7: మళ్లీ దొరికిపోయిన శివాజీ.. అమర్ ఆ పాయింట్ చెప్పేసరికి!) అయితే ఆ తర్వాత మళ్లీ రీఎంట్రీ అయ్యి తనీ ఒరువన్ వంటి పలు చిత్రాల్లో ప్రతి నాయకుడు గానూ నటించి మెప్పించారు. ప్రస్తుతం పలు చిత్రాల్లో వివిధ రకాల పాత్రలు పోషిస్తూ బిజీగా ఉన్నా ఈయన త్వరలో మెగా ఫోన్ పట్టనున్నట్లు తెలిసింది. ఈయన ఇప్పటికే కథ కథనాన్ని సిద్ధం చేసుకున్నట్లు తెలిసింది. కాగా తాను దర్శకత్వం వహించనున్న చిత్రంలో ఆల్ ఇండియా స్టార్ ఫాహద్ ఫాజిల్‌ను ప్రధాన పాత్రలో నటింపజేయడానికి చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. కాగా ఇందులో అరవిందస్వామి కూడా ఓ కీలకపాత్రను పోషించనున్నట్లు తెలిసింది. ఈ చిత్రం 2024 ప్రథమార్థంలో సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాగా ఇటీవల ఉదయనిధి స్టాలిన్ కథానాయకుడిగా నటించిన మామన్నన్ చిత్రంలో విలన్‌గా తన విశ్వరూపం చూపించిన నటుడు ఫాహద్ ఫాజిల్ ప్రస్తుతం రజనీకాంత్ హీరోగా నటిస్తున్న చిత్రంలో ఆయనకు ప్రతి నాయకుడిగా నటిస్తున్నారు. కాగా అరవిందస్వామి దర్శకత్వం వహించే చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉందని భావిస్తున్నారు. (ఇది చదవండి: ఈ హీరోయిన్ని గుర్తుపట్టారా? నాలుగే సినిమాలు, టీమిండియా క్రికెటర్‌తో పెళ్లి!) -
ఇప్పుడు సౌత్‌పైనే అందరి దృష్టి.. ఆ స్టార్ హీరో విలన్ రోల్ చేస్తాడా.. !
ప్రస్తుతం బాలీవుడ్ సూపర్ స్టార్స్ కన్ను సౌత్ ఇండస్ట్రీపై పడింది. అగ్రనటులు సైతం దక్షిణాదిలో నటించడానికి ఆసక్తి చూపుతున్నారు. విలన్ క్యారెక్టర్లోనూ నటించేందుకు వెనుకాడడం లేదు. ఇప్పటికే సంజయ్‌దత్ శాండల్‌వుడ్ మూవీ కేజీఎఫ్–2లో విలన్‌గా నటించారు. నటుడు వివేక్ ఒబెరాయ్ వివేగం చిత్రంలో అజిత్‌కు విలన్‌గా నటించారు. అలాగే నటుడు జాకీష్రాఫ్ సైతం దక్షిణాది చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. తాజాగా సామాజిక మాధ్యమాల్లో ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. నటుడు విజయ్ లియో చిత్ర షూటింగ్ పూర్తిచేసి త్వరలోనే మరో చిత్రానికి సిద్ధమవుతున్నారు. (ఇది చదవండి: కిందపడ్డ ఎంగిలి మెతుకులు తిన్న రైతుబిడ్డ.. బయటేమో మరోలా..) వెంకట్‌ప్రభు దర్శకత్వం వహించనున్న ఈ చిత్రాన్ని ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ భారీ ఎత్తున నిర్మించడానికి సన్నాహాలు చేస్తోంది. ఇందులో భారీ తారాగణం నటించబోతున్నట్లు కోలీవుడ్ టాక్. ఈ చిత్రం త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంతో పాటు ఈ సంస్థ జయంరవి హీరోగా తనీఒరువన్- 2 చిత్రాన్ని నిర్మించనుంది. దీనికి మోహన్‌రాజా దర్శకత్వం వహించనున్నారు. అయితే ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ఓ న్యూస్ తెగ వైరలవుతోంది. ఈ రెండు చిత్రాలలో ఒకదానిలో బాలీవుడ్ సూపర్‌స్టార్ అమీర్‌ఖాన్‌ను విలన్‌గా నటింపజేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. విజయ్‌కు విలన్‌గా అమీర్‌ఖాన్‌ను నటింపజేసే అవకాశం ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే ఇందులో నిజమెంతమనేది తెలియాల్సి ఉంది. అసలు ప్రతినాయకుడిగా నటించడానికి అంగీకరిస్తారా? అనేది గమనార్హం. అయితే లియో చిత్రంలో సంజయ్‌దత్ నటిస్తోన్న సంగతి తెలిసిందే. (ఇది చదవండి: 'జవాన్' సినిమాను నిలబెట్టిన ఈ ఆరుగురు.. ఇప్పటి వరకు తీసిన సినిమాలు ఇవే) -
వీళ్లూ హీరోలే.. కానీ విలన్లగానూ మెప్పిస్తారు
కథను ముందుకు తీసుకెళతాడు కథానాయకుడు (హీరో). ఆ కథానాయకుడికి అడుగడుగునా అడ్డం పడుతుంటాడు ప్రతినాయకుడు (విలన్). హీరోగా ఒకరు, విలన్‌గా వేరొకరు నటిస్తుంటారు. అయితే నాయకులు అప్పుడప్పుడూ ప్రతినాయకులుగా కూడా నటిస్తుంటారు. ఇలా కొందరు కథానాయకులు ‘ప్రతినాయకులు’గా కనిపించడానికి రెడీ అయిన చిత్రాల గురించి తెలుసుకుందాం. మిషన్.. ప్రాజెక్ట్ కె రెండొందలకు పైగా సినిమాల్లో నటించి, ఏడు పదుల వయసు సమీపిస్తున్న తరుణంలో కూడా కెరీర్లో దూకుడు ప్రదర్శిస్తున్నారు కమల్‌హాసన్. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ‘ఇండియన్ 2’ చిత్రంలో కథానాయకుడిగా నటిస్తున్నారు కమల్‌హాసన్. అలాగే దర్శకులు మణిరత్నం, హెచ్. వినోద్ కథల్లో కథానాయకుడిగా నటించేందుకు కమల్‌హాసన్ ఆల్రెడీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ఇలా హీరోగా వరుస ప్రాజెక్ట్స్‌ను ఆయన లైన్లో పెట్టారు. అయితే కథానాయకుడిగానే కాదు.. కథ నచ్చితే ఆ కథలోని కథానాయకుడికి ప్రతినాయకుడిగా సవాలు విసరడానికి రెడీ అయ్యారు కమల్. ప్రభాస్, దీపికా పదుకోన్ జంటగా అమితాబ్ బచ్చన్, దిశా పటానీ ప్రధాన పాత్రధారులుగా రూపొందుతున్న సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ ‘ప్రాజెక్ట్ కె’లో నటించడానికి కమల్‌హాసన్ అంగీకరించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో కమల్ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నారనే టాక్ ఫిల్మ్‌నగర్‌లో వినిపిస్తోంది. అయితే ప్రతినాయకుడి పాత్రలు చేయడం కమల్‌హాసన్‌కు కొత్తేమీ కాదు. (ఇదీ చదవండి: 'దేవర' తర్వాత జాన్వీని తమిళ్‌కు పరిచయం చేయనున్న టాప్ హీరో) ‘ఇంద్రుడు–చంద్రుడు’ (కాస్త నెగటివ్ టచ్ ఉన్న క్యారెక్టర్), ‘ఇండియన్’, ‘ఆళవందాన్’ (తెలుగులో ‘అభయ్’), ‘దశావతారం’ వంటి సినిమాల్లో ఆయన హీరోగా, విలన్‌గా నటించి మెప్పించారు. సో.. చాలా గ్యాప్ తర్వాత మళ్లీ నెగటివ్ షేడ్ క్యారెక్టర్లో కమల్ కనిపించినట్లు అవుతుంది. మరి.. ‘ప్రాజెక్ట్ కె’లో కమల్ చేస్తున్నది నెగటివ్ షేడ్ ఉన్న క్యారెక్టరేనా? అనే విషయంపై క్లారిటీ రావాలంటే మరికొంత సమయం వేచి చూడాలి. ‘మహానటి’ ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని అశ్వనీదత్ నిర్మిస్తున్నారు. బాలీవుడ్ వార్‌లో... నాయకుడి పాత్రైనా, ప్రతి నాయకుడి పాత్రైనా ఎన్టీఆర్ అవలీలగా చేసేస్తుంటారు. ‘జై లవకుశ’ చిత్రంలో ఎన్టీఆర్ చేసిన జై, లవ, కుశ పాత్రల్లో జై విలన్ క్యారెక్టర్ అనే సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి ఈ తరహా పాత్రను ‘వార్ 2’లో చేసేందుకు ఎన్టీఆర్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. హృతిక్ రోషన్ హీరోగా నటించిన హిందీ హిట్ స్పై థ్రిల్లర్ ఫిల్మ్ ‘వార్’. ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘వార్ 2’ ఈ ఏడాది చివర్లో సెట్స్‌పైకి వెళ్లనుంది. ‘వార్’లో హీరోగా నటించిన హృతిక్ రోషనే సీక్వెల్లోనూ హీరోగా నటించనున్నారు. కాగా.. ఈ చిత్రంలో ఎన్టీఆర్ ఓ లీడ్ రోల్ చేయనున్నారు. ఎన్టీఆర్ పాత్రకు కాస్త నెగటివ్ షేడ్స్ ఉంటాయని బాలీవుడ్ సమాచారం. స్పై థ్రిల్లర్‌గా రూపొందనున్న ఈ సినిమాకు ‘బ్రహ్మాస్త్ర’ ఫేమ్ అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తారు. ఆదిత్యా చోప్రా నిర్మించనున్నారు. మరోవైపు ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ ‘దేవర’ సినిమాలో హీరోగా నటిస్తున్నారు. అలాగే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా కమిట్ అయ్యారు. రాక్షస రాజు హీరో, విలన్, గెస్ట్ రోల్.. ఇలా ఏ పాత్రలో అయినా రానా అదుర్స్. ‘బాహుబలి’ సినిమాలో భళ్లాలదేవుడు పాత్రలో అద్భుతంగా విలనిజమ్ పండించారు రానా. అలాగే ‘నేనే రాజు నేనే మంత్రి’లో హీరోగా నటించిన రానా క్యారెక్టర్లో కాస్త నెగటివ్ షేడ్స్ కనిపిస్తాయి. ఈ సినిమాకు తేజ దర్శకుడు. కాగా రానా, తేజ కాంబినేషన్లోనే ‘రాక్షస రాజు’ అనే టైటిల్‌తో మరో సినిమా తెరకెక్కనుంది. గోపీనాథ్ ఆచంట నిర్మిస్తారు. టైటిల్‌ని బట్టి ఈ చిత్రంలో హీరో క్యారెక్టరైజేషన్లో కాస్త నెగటివ్ టచ్ ఉంటుందని ఊహించవచ్చు. ఈ ఏడాదిలోనే ఈ సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లాలనుకుంటున్నారు. మరోవైపు గుణశేఖర్ దర్శకత్వంలో మైథలాజికల్ ఫిల్మ్ ‘హిరణ్య కశ్యప’, మిలింద్ రావు దర్శకత్వంలో ఓ సినిమాలో రానా హీరోగా నటిస్తారని గతంలో ప్రకటనలు వచ్చాయి. ఈ సినిమాలపై మరో అప్డేట్ రావాల్సి ఉంది. కొత్త ఇన్నింగ్స్ ఐదేళ్ల క్రితం వచ్చిన ‘ఒక్కడు మిగిలాడు’ సినిమా తర్వాత హీరోగా వెండితెరపై కనిపించలేదు మంచు మనోజ్. ప్రస్తుతం ‘వాట్ ది ఫిష్’ చిత్రంలో మనోజ్ హీరోగా నటిస్తున్నారు. వరుణ్ కోరుకొండ దర్శకత్వంలో విశాల్, సూర్య బెజవాడ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఒకవైపు హీరోగా నటిస్తూనే మరోవైపు విలన్‌గా కొత్త ఇన్నింగ్స్‌ను స్టార్ట్ చేయాలనుకుంటున్నారట మనోజ్. రవితేజ హీరోగా ‘కలర్‌ఫోటో’ ఫేమ్ సందీప్ రాజ్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుందని, ఇందులో విశ్వక్ సేన్ కీలక పాత్రలో, మంచు మనోజ్ నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించ నున్నారని టాక్. మరి.. ప్రతినాయకుడి పాత్ర పరంగా మంచు మనోజ్ కొత్త ఇన్నింగ్స్‌ను స్టార్ట్ చేస్తారా? వెయిట్ అండ్ సీ. లంకల రత్న? ‘సామాజిక నిబంధనలను ధిక్కరించే ప్రపంచంలో బ్లాక్ ఉండదు, వైట్ ఉండదు, గ్రే మాత్రమే ఉంటుంది’ అన్నది విశ్వక్ సేన్ తాజా చిత్రంలోని డైలాగ్. దీన్నిబట్టి ఈ చిత్రంలో విశ్వక్ క్యారెక్టరైజేషన్లో కాస్త నెగటివ్ షేడ్స్ ఉంటాయని ఊహించవచ్చు. ఈ సినిమా స్టార్టింగ్ సమయంలో మాస్ కా దాస్ బ్యాడ్‌గా మారాడు అంటూ చిత్ర యూనిట్ నుంచి వినిపించింది. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లోని చీకటి సామ్రాజ్యం నేపథ్యంలో రూపొందుతున్న పీరియాడికల్ ఫిల్మ్ ఇది. ఈ సినిమాకు ‘లంకల రత్న’ టైటిల్ అనుకుంటున్నారనే ప్రచారం ఫిల్మ్‌నగర్‌లో వినిపిస్తోంది. తాజాగా ఈ సినిమా రెండో షెడ్యూల్ ముగిసినట్లు, రాజమండ్రి పరిసర ప్రాంతాల్లోని రిమోట్ లొకేషన్స్‌లో చిత్రీకరించినట్లు శుక్రవారం చిత్ర యూనిట్ ప్రకటించింది. కృష్ణచైతన్య దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మరోవైపు రవితేజ ముళ్లపూడి దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రంలో హీరోగా నటిస్తున్నారు విశ్వక్ సేన్. వీరే కాదు.. ఒకవైపు నాయకులుగా నటిస్తూ మరోవైపు ప్రతినాయకులుగానూ నటిస్తున్న హీరోలు ఇంకొందరు ఉన్నారు. -
ప్రభాస్ ప్రాజెక్ట్ కే లో విల్లన్ గా లోకనాయకుడు..!
-
ఎన్టీఆర్ డాన్స్ తో పోటీపడుతున్న హృతిక్
-
'ఆయన విలన్‌గానే ఫేమస్.. కానీ ఆ విషయం కొద్దిమందికే తెలుసు'
నటుడు దేవరాజ్ తెలుగువారికి పరిచయం చేయాల్సిన పనిలేదు. అప్పట్లో తెలుగులో ఆయనను గుర్తు పట్టని వారు ఉండరు. దాదాపు 38 ఏళ్ల పాటు ఇండస్ట్రీలో కొనసాగారు. తెలుగులో భరతనారి సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. వెండితెరపై విలన్‌గా కనిపించిన దేవరాజ్.. కన్నడ సినిమాల్లో హీరోగా కూడా నటించారు. కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో కలిపి దాదాపుగా 200 పైగా సినిమాల్లో నటించారు. తెలుగులో ఎన్నో సినిమాలలో విలన్ పాత్రలతో ప్రేక్షకులను మెప్పించారు. ఆయన పుట్టింది కర్ణాటకలో అయినా తెలుగు సినిమాల్లోనే ఎక్కువగా కనిపించారు. ప్రేమ యుద్ధం, నేటి సిద్ధార్థ, అన్న, ఎస్పీ పరుశురాం, సమరసింహా రెడ్డి, లక్ష్యం, భరత్ అనే నేను సినిమాలో మెప్పించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దేవరాజ్ తన కెరీర్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. దేవరాజ్ మాట్లాడుతూ.. 'నేను మధ్య తరగతి కుటుంబం నుంచే వచ్చా. మా నాన్న చిన్నప్పుడే చనిపోయారు. మా అమ్మ పాలవ్యాపారం చేస్తూ పెంచింది. నేను చదివేటప్పుడు మా ఆర్థిక పరిస్థితులు బాగాలేవు. అప్పుడు ఓ కంపెనీలో జాబ్‌లో చేరా. జాబ్ చేస్తుండగానే సినిమాల్లో అవకాశాలొచ్చాయి. ఈ ఫీల్డ్‌లో సక్సెస్ కావాలంటే టాలెంట్‌తో పాటు అదృష్టం ఉండాలి. అప్పుడు సినిమాల్లో పరిస్థితులు వేరు. నా భార్య చంద్రలేఖ ఫిల్మ్ ఇండస్ట్రీనే. అలా ఓ సినిమాకు హీరోయిన్ను చూడడానికి వెళ్లా. ఆ రోజు చంద్రలేఖను చూడగానే నచ్చేసింది. ఆ తర్వాత ప్రేమ, పెళ్లి జరిగాయి. కూడా నా చిన్న కుమారుడు చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఒక సినిమా చేశాడు. అందుకే పెద్దోడు కూడా సినిమాల్లోకి వచ్చాడు. అప్పట్లో కన్నడలో ఎందుకు మంచి సినిమాలు చేయలేకపోతున్నాం అనే ఫీలింగ్ ఉండేది. ఇప్పుడైతే కాంతార, కేజీఎఫ్ సినిమాలతో ఆ పరిస్థితి మారిపోయింది. ఆ విషయంలో నాకు గర్వంగా ఉంది. టాలీవుడ్లో జూనియర్ ఎన్టీఆర్‌కు వాళ్ల తాత టాలెంట్ వచ్చింది. అల్లు అర్జున్ సూపర్‌గా డ్యాన్స్ చేస్తారు. ' అంటూ చెప్పుకొచ్చారు. కాగా.. దేవరాజ్ ఇంటిని చూస్తే అచ్చం ఒక కోటలాగే ఉంటుంది. ఆయనకు మైసూర్లోనూ సినిమా ఇండస్ట్రీలో ఆయన అందుకున్న అవార్డులను, ఫ్యామిలీ ఫోటోలు వారి ఇంట్లో అద్భుతంగా అలంకరించారు. కన్నడ నటి చంద్రలేఖను వివాహం చేసుకున్నారు. దేవరాజ్‌కు ఇద్దరు కుమారులు ఉన్నారు. ప్రస్తుతం దేవరాజ్ తనయుడు ప్రణమ్ హీరోగా నటిస్తున్నారు. సాయి శివం జంపాన దర్శకత్వంసో వైరం సినిమాను తెరకెక్కించారు. ఈ మూవీలో మోనాల్ హీరోయిన్. యువాన్స్ నాయుడు సమర్పణలో తెలుగు, కన్నడ భాషల్లో జె. మల్లికార్జున నిర్మించారు. -
రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్.. స్పెషల్ అట్రాక్షన్‌గా విలన్!
బాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ విలన్‌గా పేరున్న నటుడు 'హ్యారి జోష్'. హిందీతో పాటు పలు భాషల్లో నటించి మెప్పించారు. టాలీవుడ్లో బన్నీ చిత్రం బద్రినాథ్‌లో విలన్ పాత్రలో నటించి అందరి దృష్టిని ఆకర్షించాడు. అయితే మరోసారి టాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమయ్యారు. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గ్లోబర్ స్టార్ రామ్ చరమ్ మూవీలో విలన్‌గా కనిపించబోతున్నాడు. హ్యారీ జోష్ ఎంట్రీలో గేమ్ ఛేంజర్ చిత్రంపై అంచనాలు మరింత పెరగనున్నాయి. అలాదే మంచు మంచు లక్ష్మి మెయిన్ రోల్లో సంజీవ్ మేగోటి దర్శకత్వం వహిస్తున్న ఆది పర్వంలోనూ నెగటివ్ రోల్ ప్లే చేస్తున్నాడు. ఓకేసారి రెండు సినిమాలతో రీ ఎంట్రీ ఇవ్వనున్నారు. బాలీవుడ్లో వాంటెడ్, వెల్కమ్, ధూమ్ -2, గోల్ మాల్ -3, టార్జాన్ ది వండర్ కార్, కిస్నా, ముసాఫిర్, సింగ్ ఈజ్ బ్లింగ్ వంటి హిందీ చిత్రాల్లో నటించి మెప్పించారు. ఇక నుంచి తెలుగులో పూర్తి స్థాయిలో దృష్టి సారిస్తాను అంటున్నాడు హ్యారి జోష్. హిందీ, తెలుగు భాషల్లోనే కాకుండా... పంజాబీ, కన్నడ, మరాఠీ చిత్రాల్లోనూ నటించిన హాలీవుడ్‌లోనూ సత్తా చాటారు. దాదాపు వందకుపైగా యాడ్ ఫిల్మ్స్ లోనూ నటించారు. రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ ఛేంజర్, ఆది పర్వం చిత్రాలతో తెలుగులో మరోసారి సత్తా చాటనున్నారు. హ్యారీ జోష్ ఉద్యోగ రీత్యా కెనడాలో ఉండగా...'అక్కడ షూటింగ్ కోసం వచ్చిన హృతిక్ రోషన్ సినిమా లొకేషన్స్ కోసం సాయం చేయడం అతని జీవితాన్ని మలుపు తిప్పింది. అదే అతన్ని ఇండియా తిరిగి వచ్చేలా చేసింది. హృతిక్, రాకేష్ రోషన్ ప్రోత్సాహంతో... అమితాబ్ బచ్చన్‌తో కలిసి యాడ్ ఫిల్మ్ చేసే అవకాశం దక్కించుకున్న హ్యారీ.. అమ్రిష్ పురి తన రోల్ మోడల్ అని సగర్వంగా చెప్పుకుంటాడు. అంతేకాకుండా హ్యారీ జోష్ త్వరలోనే తెలుగులో నటించే సినిమాలకు తానే డబ్బింగ్ చెప్పుకునేలా... తెలుగు నేర్చుకోవడం కోసం విశేషంగా కృషి చేస్తున్నారు. -
నానీ కొంపముంచిన దసరా...?
-
పుష్ప 2 నుండి అదిరిపోయే అప్డేట్..
-
సినిమా ఉన్నంతవరకూ.. జయప్రకాశం
నటుడు కాకముందు టీచర్ జయప్రకాశ్ రెడ్డి.. పిల్లలకు హోమ్ వర్క్ ఇచ్చారు. సినిమాల్లోకి వచ్చాక యాక్టర్ జయప్రకాశ్ రెడ్డి... పాత్రలు బాగా చేయడానికి హోమ్ వర్క్ చేశారు. ప్రతీ పాత్రకు హోమ్ వర్క్ ముఖ్యమనేవారు. కామెడీ–సీరియస్ రెండూ భిన్న ఎమోషన్లు. ఎలా కలుస్తాయి? జేపీకి కుదిరింది. రెంటినీ కలిపారు. ప్రేక్షకులను భయపెట్టారు... నవ్వించారు. తెరపై ‘ప్రతి నాయకుడి’గా కనిపించినా.. తన నటనతో ప్రతి ఇంటికి దగ్గరైన నటుడయ్యారు. ‘‘అలా అడ్డగాడిదల్లా ఖాళీగా కూర్చొని కాలయాపన చేయకపోతే, ఏదైనా నాటకం రాసి రిహార్సల్స్ చేసుకోవచ్చుగా’ – జయప్రకాశ్ రెడ్డి (జేపీ) నాటకాల్లో శ్రద్ధ పెంచుకోవడానికి దారి చూపిన తిట్టు. తిట్టింది జేపీ నాన్నగారే. సాంబిరెడ్డి (జేపీ తండ్రి)కి నాటకాలంటే పిచ్చి. నటుడు కూడా. ఇంట్లోనే విపరీతమైన ప్రోత్సాహం ఉండటంతో నాటికలు రాయడం, వేయడం వైపు అడుగులేశారు జేపీ. స్కూల్ రోజుల్లో రుద్రమదేవి నాటికలో అంబదేవుడు అనే సామంతరాజు వేషం వేశారు. అదే జేపీ తొలి వేషం. చిన్న పాత్ర అయినా రెండు పద్యాలు పడ్డాయి. ఆయన పద్యం పూర్తి చేసేసరికి చప్పట్లు పడ్డాయి. తొలి వేషాన్నే డిస్టింక్షన్లో పాసయ్యారు జేపీ. యాస మీధ ధ్యాస కర్నూలు జిల్లా శిరివెళ్ల మండలం వీరారెడ్డిపల్లెలో సామ్రాజమ్మ, సాంబి రెడ్డి దంపతులకు 1945లో జన్మించారు జేపీ. సాంబిరెడ్డి పోలీస్ ఉద్యోగి. తండ్రి ఉద్యోగరీత్యా బదిలీలు కావడంతో ప్రాంతానికో యాస ఉండటం, అవి గమ్మత్తుగా ఉండటం జేపీలో ఉత్సుకతను పెంచాయి. ఎక్కడికెళ్తే అక్కడి యాసను ఇట్టే పట్టేయడం అలవాటు చేసుకున్నాడు. కడప, కర్నూల్, ప్రొద్దుటూర్, అనంతపురం, గుంటూర్, నల్గొండ.. ఇలా ఉద్యోగం నిమిత్తం తండ్రికి అయిన బదిలీలన్నీ జేపీకి ఉపయోగపడ్డాయి. స్కూల్ చదువులన్నీ సీమ ప్రాంతంలో పూర్తి చేసిన జేపీ కాలేజీ చదువులన్నీ గుంటూరులో చేశాడు. నాటకానికి పనికిరావు అనంతపురంలో చదువుకునేటప్పుడు జేపీ, అతని స్నేహితుడు నాటకం వేయాలనుకున్నారు. ‘దుర్యోధన గర్వభంగం’ అనే నాటికలో పద్యాలు, డైలాగులు బట్టీ పట్టారు. ‘ఏదీ చూపించండి’ అని సైన్స్ మాస్టారు అడిగితే, నాటకాన్ని మొత్తం చేసి చూపించారు. ‘ఇంకోసారి నాటకం అంటే కాళ్లు విరగ్గొడతా’ అని చివాట్లు పెట్టారాయన. అవమానంగా అనిపించింది జేపీకి. మూడు రోజులు ఏడుస్తూనే ఉన్నా, అధైర్యపడలేదు. ఎప్పటికైనా నాటకం వేసి ప్రేక్షకుల్ని అలరించాలని బలంగా నిర్ణయించుకున్నాడు జేపీ. (జయప్రకాశ్ మరణం తీరని లోటు: ప్రధాని మోదీ) ఉత్తమ నటి బహుమతి కాలేజీలో ‘స్టేజీ రాచరికం’ అనే నాటికలో వేషం వేయమని సీనియర్లు కోరితే ‘ఊ’ అన్నాడు జేపీ. చెలికత్తె వేషం అది. అంటే అమ్మాయిగా కనిపించాలి. జేపీ చేసేశాడు. కట్ చేస్తే.. మరుసటి రోజు కాలేజీ నోటీస్ బోర్డ్‌లో ‘ఉత్తమ నటి – జయప్రకాశ్ రెడ్డి’ అని బహుమతుల జాబితాలో రాసుంది. ఆ తర్వాత కాలేజీలో జరిగే సాంస్కృతిక కార్యక్రమాల్లో జేపీ హాజరు పడాల్సిందే అన్నట్టుగా ఉండేది. కాలేజీ స్టార్లా చూసేవాళ్లు. సన్నగా, పొడుగ్గా ఉండటంతో ఎక్కువగా వినోద ప్రధానంగా ఉండే పాత్రలే చేసేవాడు జేపీ. గుంటూరులోనే బీఈడీ పూర్తి చేసి టీచర్ ఉద్యోగంలో చేరారు. చూడ్డానికి డ్రిల్ మాస్టార్లా ఉండటంతో అందరూ ఆయన్ను డ్రిల్ మాస్టార్ అనుకున్నారు. కానీ జేపీ లెక్కల మాస్టార్. టీచర్‌గా మారినా నాటకాల మీద తన ఇష్టాన్ని వదులుకోలేదు. స్కూల్లో పిల్లలతో తరచూ నాటికలు వేయిస్తూ ఉండేవారు. అప్పటికి పెళ్లయింది కూడా.. ఓ బాబు పుట్టాడు. కొడుకుని తన తండ్రి దగ్గర నల్గొండలో ఉంచారు జేపీ. అలా తరచూ నల్గొండ వెళ్లడంతో అక్కడ యాసను పట్టేశారు. కొత్త కెరీర్‌కి అన్‌లాక్ జేపీ నటుడిగా మారే టర్న్ నల్గొండలో జరిగింది. జేపీ శిష్యుడు ఓ పత్రికను స్థాపించారు. అందులో భాగంగా ఓ పెద్ద సభ ఏర్పాటు చేసి, దర్శకుడు దాసరి నారాయణరావును అతిథిగా ఆహ్వానించారు. జెపిని ఒక నాటకం కూడా ఆడాలన్నాడు ఆయన శిష్యుడు. సరే అనుకున్నారంతా. కానీ దాసరికి ఏదో పని ఉండి త్వరగా వెళ్లిపోవాలనుకున్నారు. ఆ విషయం తెలిసి, మైక్ అందుకున్న జేపీ, ‘మా నాటకాన్ని పూర్తిగా అస్వాదించి వెళ్తారనే అనుకుంటున్నాం’ అని దాసరిని లాక్ చేశారు. ఇది తన కొత్త కెరీర్‌ను అన్‌లాక్ చేస్తుందని ఆ నిమిషం జేపీకి తెలియదు. ‘భలే ఫిట్టింగ్ పెట్టావయ్యా. మొదటి పావుగంటా చూస్తా’ అన్నారు దాసరి. అయితే నాటకంలో నిమగ్నమై గడియారాన్ని చూసుకోవడం కూడా మర్చిపోయిన దాసరి చివరి వరకూ ఉన్నారు. ‘నువ్వుండాల్సింది సినిమాల్లో. నిన్ను సినిమాల్లోకి తీసుకెళ్తాను’ అని జేపీని అభినందించారు కూడా. వారం తిరగ్గానే రామానాయుడు స్టూడియోస్ నుంచి వేషం ఉందని ఫోన్. సినిమా ప్రయాణం రామానాయుడు నిర్మించిన ‘బ్రహ్మపుత్రుడు’ (1988) సినిమాలో తొలిసారి నటుడిగా స్క్రీన్ మీద కనిపించారు జేపీ. ఆ తర్వాత ‘బొబ్బిలిరాజా, ప్రేమఖైదీ’ ఇలా వరుస వేషాలు వేస్తూ వచ్చారు. కానీ ఆర్థికంగా నిలదొక్కుకునేంత సంపాదన లేదు. అప్పటికి ఓ కుమార్తె కూడా ఉంది జేపీకి. పిల్లలు పెద్దవాళ్లవుతున్నారు. కొన్ని అప్పులు కూడా మిగిలాయి. అరకొర సంపాదనతో బండి నడపడం కష్టమని గుంటూరు బండెక్కేశారు. టీచర్‌గా పిల్లలకు చదువు చెప్పడంలో పడిపోయారు. ఇలా నాలుగైదేళ్లు గడిచాయి. ఆ తర్వాత ఏదో పని మీద హైదరాబాద్‌లో అనుకోకుండా మళ్లీ రామానాయుడ్ని కలవడం జరిగింది. అప్పుడు ‘ప్రేమించుకుందాం రా’ సినిమాలో రాయలసీమ ఫ్యాక్షనిస్ట్ పాత్ర ఆఫర్ చేశారు రామానాయుడు. అమ్రీష్ పురి, నానా పటేకర్.. ఇంకా ఎవరెవర్నో ఆ పాత్రకు అనుకున్నారు. కానీ జేపీకి కుదిరింది. పాత్ర బాగా పండాలంటే ఏం చేయాలని ఆలోచించిన జేపీకి డైలాగులు రాయలసీమ యాసలో చెబితే ఎలా ఉంటుంది? అనిపించింది. ఆ ఆలోచన చిత్రరచయితలు పరుచూరి బ్రదర్స్‌తో పాటు అందరికీ నచ్చింది. వెంటనే సీమ ప్రాంతంలో మారుమూల ఊళ్లల్లో కొన్నిరోజులు తిరిగి యాస మీద ఇంకా పట్టు సాధించారు. తెలియని పదాలను టేప్ రికార్డర్లో రికార్డ్ చేసుకున్నారు. పరుచూరి సోదరులనుంచి డైలాగ్స్ ముందే తెప్పించుకుని వాటిని యాసలోకి మార్చుకుని, ప్రాక్టీస్ చేసి నటించారు జేపీ. సినిమా సూపర్ హిట్. ఆ తర్వాత ‘శ్రీరాములయ్య, సమరసింహారెడ్డి’ ఇలా వరుస హిట్లు. ఇక కెరీర్ బాగుందని టీచర్ పదవికి రాజీనామా చేసి దృష్టంతా సినిమా మీదే పెట్టాలని నిశ్చయించుకున్నారు. శ్రీను వైట్ల ప్రతి సినిమాలోనూ జేపీ పాత్ర ఉంటుంది. వాటిలో ‘ఢీ’ ఒకటి. డైలాగ్ డెలివరీతో ఆకట్టుకునే జేపీ ఈ సినిమాలో ఒక్క డైలాగ్ లేకున్నా సైగలతో ప్రేక్షకుల్ని నవ్వించారు. తెలుగులో 300కి పైనే సినిమాల్లో నటించారు. తమిళ, కన్నడ సినిమాల్లోనూ కనిపించారు జేపీ. గుర్తుండిపోయే పాత్రలు ‘జంబలకిడి పంబ’లో అల్లరి పిల్లాడిగా, ‘సమరసింహారెడ్డి’లో క్రూరమైన ఫ్యాక్షనిస్ట్‌గా, ‘సొంతం’లో గులాబీ అనే కామెడీ దొంగగా, ‘ఎవడిగోల వాడిది’లో టవల్ మీదే కనిపించే బండ్రెడ్డి.. ఇంకా ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా?, రెడీ, కిక్, ఊసరవెల్లి, నాయక్ వంటి సినిమాల్లోనూ గుర్తుండిపోయే పాత్రలు చేశారు. ఇటీవల విడుదలైన మహేశ్‌బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం ఆయన చివరి రిలీజ్. శివభక్తుడు జేపీకి తెలుగు భాష అంటే ఎనలేని మమకారం. ఖాళీ సమయాల్లో పుస్తకాలు చదవడం, సామెతలు రాయడం చేసేవారు. సినిమాల్లో విలనే అయినా నిజజీవితంలో సౌమ్యుడు. అంతకుమించి శివభక్తుడు. దాదాపు 18 ఏళ్ల పాటు శివ దీక్ష చేశారు. ‘శివ ప్రకాశం’ పేరుతో ఓ ఆల్బమ్ చేశారు. అందులోని పాటలను ఆయనే పాడటం విశేషం. జేపీది సేవాగుణం కూడా. ఎంతోమందిని చదివించారు. రంగస్థలం మీద గుండెపోటు వచ్చినట్లు నటిస్తే.. నిజంగా వచ్చిందా అని కంగారుపడ్డారు ప్రేక్షకులు. జీవితం అనే వేదిక మీద ఆయనకు నిజంగానే గుండెపోటు వచ్చింది. ఇది కూడా నటనే అయితే బాగుండు అని జేపీని అభిమానించేవారు కోరుకోకుండా ఉండరు. జేపీ మరణం పరిశ్రమకే కాదు నాటకానికీ తీరని లోటు. అయితే జేపీ భౌతికంగా మాత్రమే దూరమయ్యారు. తాను చేసిన పాత్రల ద్వారా ప్రకాశిస్తూనే ఉంటారు... సినిమా ఉన్నంతవరకూ జయ‘ప్రకాశం’ ఉంటుంది. సినిమా – నాటకం సినిమాల్లో బిజీ నటుడిగా ఉన్నప్పటికీ జేపీ నాటకాన్ని వదలలేదు. వీలున్నప్పుడల్లా నాటకాలు వేస్తూనే ఉన్నారు. నాటకాల్ని బతికించాలని నాటకాలు వేస్తూనే ఉన్నారు. జేపీకి బాగా పేరు తెచ్చిన నాటకాల్లో ‘అలెగ్జాండర్’ ఒకటి. ఆ నాటకంలో సుమారు వంద నిమిషాలు ఏకపాత్రాభినయంతో ప్రేక్షకుల్ని కట్టిపడేశారు జేపీ. నాటకం క్లైమాక్స్‌లో జేపీ పాత్రకు గుండెపోటు వస్తుంది. ఆ సీన్ చేస్తుంటే, ప్రేక్షకుల్లో ఒకరు నిజంగా గుండెపోటు వచ్చిందేమో అనుకొని అరిచేశారట. అది ఎప్పటికీ గుర్తుండిపోయే జ్ఞాపకం అని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు జేపీ. ఈ నాటకాన్ని వందసార్లు ప్రదర్శించాలనుకున్నారు. కానీ 66సార్లు మాత్రమే వేయగలిగారు. ఈ నాటకాన్ని సినిమాలానూ మలిచారు. తీరా విడుదల సమయానికి లాక్డౌన్ పడింది. – సినిమా డెస్క్ ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ఈసారి కొత్తగా: విలన్‌గా మారిన సునీల్
కమెడియన్‌గానే కాదు, హీరోగానూ పలు చిత్రాల్లో మెప్పించాడు సునీల్. ఎప్పుడూ ఎవరికీ ఏ హానీ తలపెట్టని సునీల్‌ను పట్టుకుని విలన్ అంటున్నాడు ఓ దర్శకుడు. తన కలర్ ఫొటోకు సునీలే అసలైన విలన్ అని పేర్కొంటున్నాడు. మరేమీ లేదు, నేడు సునిల్ పుట్టినరోజు సందర్భంగా ‘కలర్ ఫోటో’ సినిమాలో సునీల్ లుక్‌ను విడుదల చేశారు. దీనికి మంచి రెస్పాన్స్ వస్తోంది. దీనిపై సునీల్ మాట్లాడుతూ.. ‘కలర్ ఫోటోలో రామరాజుగా కనిపిస్తున్నాను. నా కెరీర్లో బెస్ట్ క్యారెక్టర్ చేస్తున్నాను. అలాగే నా పాత్రలో వున్న కొత్తదనమే అందర్నీ ఆకట్టుకుంటుంది. ఇలాంటి పాత్రలతో నా ఫ్యాన్స్‌ను అలరిస్తాన’ని పేర్కొన్నారు. ('కలర్ ఫోటో'తో విలన్‌గా ఎంట్రీ ఇవ్వనున్న సునీల్) ‘హృదయ కాలేయం’, ‘కొబ్బరిమట్ట’ లాంటి స్పూఫ్ కామెడీలతో బ్లాక్‌బస్టర్ హిట్స్ కొట్టిన అమృత ప్రొడక్షన్స్.. లౌఖ్య ఎంటర్టైన్మెంట్స్తో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘కలర్ ఫొటో’. మజిలీ, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, ప్రతిరోజు పండగ చిత్రాల్లో హస్య నటుడిగా గుర్తింపు సంపాదించుకున్న సుహాస్ తొలిసారి హీరో అవతారం ఎత్తాడు. తెలుగమ్మాయి చాందిని చౌదరి హీరోయిన్గా నటిస్తోంది. యూట్యూబ్ వీడియోల ద్వారా పాపులర్ అయిన సందీప్‌రాజ్ తొలిసారిగా దర్శకుడి బాధ్యతలు ఎత్తుకున్నాడు(కానీ కథ మాత్రం ఇతనిది కాదు). ‘మత్తు వదలరా’ చిత్రంతో విజయాన్ని అందుకున్న సంగీత దర్శకుడు కీరవాణి అబ్బాయి కాల భైరవ స్వరాలు సమకూర్చాడు.(దళపతితో రొమాన్స్ చేయనున్న పూజాహెగ్డే !) కామెడీ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ సినిమా అమరావతి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంది. 1995 సంవత్సరంలో ఒక ఇంజనీరింగ్ కాలేజీలో జరిగిన ప్రేమకథను సీరియస్‌గా తీయటానికి సాయి రాజేస్ నీలం, బెన్నీ ముప్పానేనిలు నడుం బిగించారు. బ్యానర్: అమృత ప్రొడక్షన్&లౌఖ్య ఎంటర్టైన్మెంట్, సమర్పణ: శ్రవణ్ కొంక, లౌక్య ఎంటర్త్సైన్మెంట్స్, నటీనటులు: సుహాస్, చాందిని చౌదరి, సునీల్ తదితరులు, నిర్మాతలు: సాయి రాజేష్ నీలం, బెన్నీ ముప్పానేని (నార్త్‌లో సౌత్ నవ్వులు) -
‘హీరో’లు మాత్రమే ఐఫోన్లు వాడాలి!
సాక్షి, న్యూఢిల్లీ : దక్షిణాది, బాలీవుడ్ సినిమాల్లోలాగా హాలీవుడ్ సినిమాల్లో ఎవరు హీరో, ఎవరు విలన్? ఎవరు మంచి వారు? ఎవరు దుష్టులు? అంత సులభంగా కనుక్కోలేం. కొరుకుడు పడని భాష కారణంగానే కాకుండా, కరడుకట్టిన వారు కాకుండా సున్నితమైన విలన్లు ఉండడమూ కారణమే. అయితే ఇప్పుడు వారు వాడుతున్న సెల్ఫోన్లను బట్టి ఎవరు హీరో? ఎవరు విలన్? అనేది సులువుగా కనుక్కోవచ్చని హాలీవుడ్ దర్శకుడు రియాన్ జాన్సన్ తెలిపారు. హాలీవుడ్ చిత్రాల్లో ఐ ఫోన్లు వాడిన క్యారెక్టర్లంతా హీరోలు, మంచివారేనని రియాన్ అన్నారు. సినిమాల్లో మంచి క్యారెక్టర్లు మాత్రమే తమ ఉత్పత్తులను వినియోగించాలని, దుష్ట పాత్రలు తమ ఉత్పత్తులను వినియోగించడాన్ని ఎట్టి పరిస్థితుల్లో తాము ఆమోదించబోమని ఆపిల్ కంపెనీ యాజమాన్యం స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడమే అందుకు కారణమని రియాన్ జాన్సన్ చెప్పారు. ఒక్క సినిమాలకే కాకుండా టీవీ సీరియళ్లకు కూడా తమ కొత్త నిబంధనలు వర్తిస్తాయని ఆపిల్ కంపెనీ యాజమాన్యం పేర్కొంది. సెక్స్ అండ్ టీవీ, దీ ఫ్యామిలీ గై, క్యాప్టెన్ అమెరికా, ది వింటర్ సోల్జర్, ఫాస్ట్ ఫైవ్ సహా పలు టెలివిజన్ సీరియళ్లలో, పలు చిత్రాల్లో ఐ ఫోన్లను విరివిగా ఉపయోగించారు. 2001 వరకు అన్ని సినిమాల్లో హీరోలు మాత్రమే తమ ఉపయోగించేవారని, ఆ తర్వాత హీరోలతోపాటు ఇతర పాత్రలు కూడా ఈ ఉత్పత్తులను ఉపయోగించడం మొదలయిందని ఆపిల్ కంపెనీ వర్గాలు తెలిపాయి. (చదవండి: జైలుకి హార్వీ వెయిన్‌స్టీన్) -
శింబు సినిమాలో విలన్‌గా సుదీప్
ఇటివలే విడుదలైన సల్మాన్‌ఖాన్ దబాంగ్-3 సినిమాలో కన్నడ హీరో సుదీప్ విలన్ పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. సుదీప్ నటనకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి. అయితే సుదీప్ మరోసారి విలన్‌గా నటించనున్నాడు. కాకపోతే ఈసారి తమిళ్ సినిమాలో ఆ పాత్రను చేయనున్నాడు. వివరాల్లోకి వెళితే.. శింబు హీరోగా 'మానాడు' అనే సినిమా చేస్తున్నట్లు 2018లోనే వెంకట్ ప్రభు వెల్లడించారు. అయితే ఈ సినిమాను నిర్మిస్తున్న సురేశ్ కామట్జి, శింబుల మధ్య మనస్పర్థలు రావడంతో నిర్మాణ దశలోనే ఈ చిత్రం ఆగిపోయింది. శింబు తండ్రి, సినీ దర్శకుడు టి. రాజేందర్ జోక్యంతో ' మానాడు' సినిమాను చేస్తున్నట్లు వెంకట్ ప్రభు వెల్లడించారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జనవరిలో ప్రారంభిస్తున్నట్లు నిర్మాత సురేశ్ కామట్జి వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో విలన్‌గా నటించాలని దబంగ్-3 షూటింగ్ సమయంలోనే సుదీప్‌ను అడిగామని ప్రొడ్యూసర్ సురేశ్ కామట్జి తెలిపారు. స్టోరీ విన్న సుదీప్ వెంటనే ఈ సినిమాలో విలన్‌గా నటించడానికి ఒప్పుకున్నారని పేర్కొన్నారు. పొలిటికల్ బాక్డ్రాఫ్లో తెరకెక్కనున్న ఈ చిత్రంలో మిగతా పాత్రలను త్వరలోనే ప్రకటిస్తామని చిత్ర బృందం తెలిపింది. కాగా సుదీప్ గతంలో రాజమౌళి దర్శకత్వం వహించిన 'ఈగ' సినిమాలో విలన్‌గా నటించిన సంగతి తెలిసిందే. -
మీనా.. ఆ సినిమాలో విలనా !
రజనీకాంత్, మీనా అనగానే ఠక్కున గుర్తొచ్చే జ్ఞాపకం ‘థిల్లానా థిల్లానా.. నా కసి కళ్ల కూనా’ పాటే. ముత్తు సినిమాలోని ఈ పాట అంత పాపులర్. ‘వీరా, యజమాన్, ముత్తు’ సినిమాల్లో రజనీకాంత్ సరసన కథానాయికగా నటించారు మీనా. ఇప్పుడు మరోసారి కలసి నటించబోతున్నారని తెలిసింది. అయితే ఈసారి జంటగా కాదని సమాచారం. శివ దర్శకత్వంలో రజనీకాంత్ ఓ ఫ్యామిలీ డ్రామా చిత్రం చేయనున్న విషయం తెలిసిందే. సన్ పిక్చర్స్ ఈ సినిమా నిర్మించనుంది. ఇందులో మీనా కీలక పాత్రలో కనిపిస్తారని తెలిసింది. విలన్ పాత్రలో అని కోలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది. రజనీకాంత్ సరసన ఖుష్భూ, ఆయన కుమార్తెగా కీర్తీ సురేశ్ నటిస్తారన్నది మరో వార్త. ఈ నెల రెండోవారంలో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇదిలా ఉంటే ‘ఎంగేయో కేట్ట కురళ్’ సినిమాలో రజనీ కుమార్తెగా నటించారు మీనా. అలాగే రజనీ హీరోగా నటించిన ‘అన్బుళ్ల రజనీకాంత్’లో బాలనటిగా నటించారు మీనా. అలా బాలనటిగా ఒక హీరో సినిమాలో నటించి, ఆ తర్వాత అతని సరసనే హీరోయిన్గా నటించడం అంటే విశేషమే. ఇప్పుడు అదే హీరోకి విలన్‌గా అంటే ఇంకా విశేషం. -
నిర్మాతల్నీ నవ్విస్తారా
సినిమా హిట్ అయినా నిర్మాత నవ్వని సందర్భాలు ఉంటాయి.కలెక్షన్లు కళకళలాడకపోతే ఏం నవ్వు? ఇంగ్లిష్‌లో ఒక వాడుక ఉంది. ‘లాఫింగ్ ఆల్ ది వే టు ద బ్యాంక్’ అని.అంటే ప్రయత్నం ఏం చేసినా చివరకు డబ్బు సాధించారు అని అర్థం.కమెడియన్లు హీరోలుగా చేసి ప్రేక్షకుల్ని నవ్వించిన సందర్భాలు ఉన్నాయి.హీరోలుగానూ ప్రేక్షకులతో పాటు నిర్మాతల్నీ నవ్విస్తే బాగుంటుంది. నవ్విస్తారని ఆశిద్దాం. విలన్ ఫేస్ మీద పంచ్ కొట్టే హీరో మాత్రమే హీరో కాదు. పొట్ట చెక్కలయ్యేలా పంచ్‌లేసే కమెడియన్ కూడా హీరోయే. ఎంత మెయిన్ రోడ్ అయినా ఫుట్‌పాత్ ఉన్నట్టే ఎన్ని పెద్ద హీరోల కథలు ఉన్నా కమెడియన్లకు సరిపడే కథలు ఉండనే ఉంటాయి. అందుకే గతంలో రేలంగి, నగేశ్, రాజబాబు, పద్మనాభం, చలం వంటివారు కమెడియన్లుగా చేస్తూనే హీరోలుగా కూడా రాణించారు. ఆ తర్వాతి తరంలో బ్రహ్మానందం, బాబుమోహన్, అలీ, వేణుమాధవ్, పృథ్వీలాంటి వారికి అవకాశం వచ్చింది. కృష్ణ భగవాన్ అయితే ఏకంగా సిమ్రాన్ పక్కనే హీరోగా నటించారు. కమెడియన్ వేషాలు ఎన్ని వేసినా హీరోగా మారితే వచ్చే క్యాషు, క్రేజు వేరని సునీల్ లాంటి నటులు హీరోలుగా తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. స్క్రీన్ మీద కాసేపుంటేనే ఇంత నవ్వొచ్చిందే సినిమా అంతా ఉంటే ఇంకెంత నవ్వు వస్తుందో అని కమెడియన్ హీరోగా చేస్తే జనం వచ్చే అవకాశం ఉంది కానీ సినిమా అంతా నవ్వించడం, కథను పండించడం అంత సులువేమీ కాదని కొన్ని పరాజయాల వల్ల, కొందరు కమెడియన్ల బ్యాక్ టు పెవిలియన్ వల్ల అర్థమవుతుంది. అయినప్పటికీ కొత్త కొత్త సినిమాలు, కొత్త కొత్త ప్రాజెక్ట్‌లు జనాన్ని సంతోషపెట్టడానికి కెమెరా ముందుకు వస్తున్నాయి. ఆ వివరాలను చూద్దాం. బ్రహ్మీ ఈజ్ బ్యాక్ బ్రహ్మానందం క్రేజ్ ఉధృతంగా ఉన్న రోజుల్లో జంధ్యాల ఆయనను హీరోగా పెట్టి ‘బాబాయ్ హోటల్’(1992) సినిమా తీశారు. అయితే విడుదలకు ముందు దానికి వస్తున్న క్రేజ్ చూసి ‘ఇది కామెడీ సినిమా కాదు’ అని ట్యాగ్ లైన్ పెట్టాల్సి వచ్చింది. కామెడీ లేకపోతే బ్రహ్మానందం సినిమాకు వెళ్లడం ఎందుకు అని జనం ఆ సినిమా చూళ్లేదు. ఆ తర్వాత బ్రహ్మానందం ఒకటి రెండు సినిమాల్లో హీరోగా నటించినా ఆయనకు మంచి వేషాలు దొరికిన ‘చిత్రం భళారే విచిత్రం’, ‘మనీ’ వంటి సినిమాలతోనే ఎక్కువ పేరొచ్చింది. 2013లో హీరోగా మళ్లీ ‘జఫ్పా’ అనే చిత్రంలో నటించారు. తాజాగా ఆయనతో ‘బ్రహ్మీ ఈజ్ బ్యాక్’ అనే సినిమా తెరకెక్కనుందని ప్రకటన వచ్చింది. శ్రీధర్ శ్రీపాన దర్శకత్వం వహించనున్నారని తెలిసింది. ఇందులో రా (రీసెర్చ్ అండ్ ఎనాలసిస్ వింగ్) ఏజెంట్‌గా బ్రహ్మానందం నటించనున్నారట. అలీ.. అలాగే.. అలీ హీరోగా నటించిన ‘యమలీల’కు (1994) ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఆ తర్వాత ‘పిట్టల దొర’(1994), ‘ఘటోత్కచుడు’ (1995), ‘సర్కస్ సత్తిపండు’ (1997) ‘గుండమ్మ గారి మనవడు’ (2007), ‘అలీబాబా ఒక్కడే దొంగ’ (2013) వంటి సినిమాలు చేశారు. తాజాగా అలీ హీరోగా ‘పండుగాడి ఫోటో స్టూడియో’ సినిమా రూపొందింది. ‘వీడు ఫొటో తీస్తే పెళ్లయిపోద్ది’ అనేది ఉపశీర్షిక. దిలీప్ రాజా దర్శకత్వం. రిషిత హీరోయిన్. నాగదేవత శాపం వల్ల 40 ఏళ్లు దాటినా పెళ్లి కాని వ్యక్తి పాత్రలో హీరోగా అలీ నటించారు. శాపం ఉన్న హీరో ప్రేమలో పడితే అతనికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? అన్నదే చిత్రకథ. షూటింగ్ పూర్తయింది. జూన్‌లో విడుదల. సప్తగిరి నం.3 ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ సినిమాతో సప్తగిరి కెరీర్ ఎక్స్‌ప్రెస్ వేగాన్ని అందుకుంది. ‘పరుగు’ (2008), ‘ప్రేమకథా చిత్రమ్’ (2013) వంటి సినిమాలు అందుకు ఫౌండేషన్ వేశాయి. ఆ తర్వాత వరుస అవకాశాలను దక్కించుకున్న సప్తగిరి 2016లో ట్రాక్ మార్చారు. హీరోగా ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్’ సినిమా చేశారు. అది రిలీజైన ఏడాదికే ‘సప్తగిరి ఎల్ఎల్బీ’ అనే చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెచ్చారు. ఇప్పుడు ‘వజ్ర కవచధర గోవింద’ తో మూడోసారి హీరోగా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. అరుణ్ పవార్ దర్శకత్వం. ఓ వజ్రానికి సప్తగిరి ఎలా కవచంలా నిలబడ్డారన్నదే కథ. యాక్షన్, ఫైట్లు కూడా చేస్తున్న సప్తగిరిని ఈ సినిమాలో చూడవచ్చు. షకలక లకలక టీవీ నుంచి సినిమాకి సినిమా నుంచి హీరో కుర్చీకి ఎదగడానికి ఒళ్లొంచి కష్టం చేస్తున్న నటుడు శంకర్. ‘రాజుగారి గది 2’, ‘ఆనందోబ్రహ్మ’ (2017) సినిమాలు శంకర్‌కు హాస్యనటుడిగా మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. దాంతో గత ఏడాది ‘శంభో శంకర’ సినిమాతో హీరోగా మారారు. ఆ తర్వాత హీరోగా ‘డ్రైవర్ రాముడు’ సినిమా చేశారు. రాజ్ సత్య దర్శకత్వం వహించిన ఈ సినిమా రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఇటీవలే హీరోగా తన మూడో చిత్రాన్ని కూడా సెట్స్‌పైకి తీసుకెళ్లారు శంకర్. ‘నాలుగో సింహం’ టైటిల్‌తో జానీ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో పవర్ఫుల్ పోలీసాఫీసర్‌గా నటిస్తున్నారు ‘షకలక’ శంకర్. ముంబై బ్యూటీ అక్షయ శెట్టి హీరోయిన్గా నటిస్తున్నారు. సినిమాల్లో కమెడియన్‌గా అవకాశాలు తగ్గడం వల్లనే తాను హీరోగా మారాల్సి వచ్చిందని ఓ సందర్భంలో శంకర్ పేర్కొనడం విశేషం. ప్రియ మల్లేశం ‘నా సావు నేను సస్తా... నీ కెందుకు’ బుక్ రైటర్ గుర్తున్నాడుగా! ‘పెళ్ళిచూపులు’ (2016)సినిమాలో ఫుల్‌గా నవ్వించిన కమెడియన్ ప్రియదర్శి ఆ తర్వాత చాలా సినిమాల్లో కమెడియన్‌గా చేశారు. ఇప్పుడు ‘మల్లేశం’ అనే బయోపిక్‌లో హీరోగా నటిస్తున్నారు. నేతకు పనికి వచ్చే ఆసు మిషన్‌ను కనుగొని పద్మశ్రీ పురస్కారం పొందిన చింతకింది మల్లేశం జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. తెలంగాణ యాస ప్రియదర్శికి కొట్టిన పిండి. కనుక ఈ సినిమాలో ఆయన ఆకట్టుకుంటారని ఆశించవచ్చు. చేదు మిఠాయి ‘అర్జున్‌రెడ్డి’ సినిమాలో విజయ్ దేవరకొండ స్నేహితుడిగా నటించి ఒక్కసారిగా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యారు రాహుల్ రామకృష్ణ. ఈ క్యారెక్టర్లో అటు కామెడీ చేస్తూనే సీరియస్ డైలాగ్స్ కూడా చెప్పారు. మహేశ్‌బాబు ‘భరత్ అనే నేను’ సినిమాలో మరో ముఖ్యపాత్ర దక్కింది. ఆ నెక్ట్స్ ‘సమ్మోహనం’(2018), ‘గీత గోవిందం’(2018) సినిమాల్లో మార్కులు పడ్డాయి. దాంతో డార్క్ కామెడీ ఫిల్మ్ ‘మిఠాయి’లో హీరోగా నటించారు రాహుల్ రామకృష్ణ. ఇందులో కమెడియన్ ప్రియదర్శి మరో లీడ్ క్యారెక్టర్ చేశారు. కానీ ఈ ‘మిఠాయి’ ప్రేక్షకులకు రుచించలేదు. అయితే రాహుల్ రామకృష్ణ ముఖ్యపాత్ర పోషించిన ‘హుషారు’ ప్రేక్షకులకు నచ్చింది. హాలీవుడ్ సినిమా ‘సిల్క్‌రోడ్’లో రాహుల్ ఒక కీలక పాత్రకు సెలక్ట్ కావడం కూడా ఒక మంచి వార్తే. ఇన్పుట్స్: ముసిమి శివాంజనేయులు మళ్లీ హీరోగా...! సునీల్ ‘అందాలరాముడు’ (2006) సినిమాతో హీరోగా మారారు. ఆ సినిమా హిట్. రాజమౌళి దర్శకత్వంలో నటించిన ‘మర్యాదరామన్న’ సూపర్‌హిట్ సాధించింది. ఆ తర్వాత ‘పూలరంగడు’ (2012) కమర్షియల్‌గా సక్సెస్ కొట్టింది. నాగచైతన్యతో కలిసి ‘తడాఖా’లో లీడ్ రోల్ చేశారు. కమెడియన్‌గా ఏడాదిలో అరడజనుకు పైగా సినిమాలు చేసిన సునీల్ హీరో అయ్యాక ఏడాదికి ఒక సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. వీటిలో కొన్ని సినిమాలు ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. దీంతో సునీల్ హీరోగా జర్నీకి కామా పెట్టినట్లున్నారు. ప్రస్తుతం కమెడియన్‌గా ఫుల్ బిజీ అయ్యారు. కానీ ఆయనను హీరోగా పెట్టి సినిమా తీయడానికి ఒకటి రెండు ప్రయత్నాలు జరుగుతున్నాయని వినికిడి. హీరోనే టార్గెట్‌నా? ‘వెంకీ’,‘ పోకిరి’, ‘ఢీ’, ‘బిందాస్’ వంటి సినిమాల్లో బాల హాస్యనటుడిగా భరత్ మంచి పేరు సంపాదించుకున్నాడు. ఆడియన్స్ మాస్టర్ భరత్ అని పిలుచుకున్నారు. సునీల్ హీరోగా నటించిన ‘ఈడు గోల్డ్ ఎహే’ (2017)సినిమాలో హాస్యనటుడిగా కనిపించిన భరత్ రీసెంట్గా ‘ఏబీసీడీ’ సినిమాతో క్యారెక్టర్ ఆర్టిస్టుగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. చైల్డ్ కమెడియన్‌గా సక్సెస్ అయిన భరత్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా సక్సెస్ అవుతాడా? లేక భవిష్యత్‌లో హీరోగా కూడా చేసే ఆలోచనలు ఏమైనా ఉన్నాయా? అన్నది చూడాలి. -
యుద్ధ వీరుడు
బాలీవుడ్లో సెట్స్‌పై ఉన్న పీరియాడికల్ మూవీస్ లిస్ట్‌లో ‘తానాజీ: ది అన్సంగ్ వారియర్’ అనే సినిమా ఒకటి. 1670 బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ఈ సినిమాలో అజయ్ దేవగన్ హీరోగా నటిస్తున్నారు. ఛత్రపతి శివాజీ సైన్యంలో మరాఠా చీఫ్ కమాండర్‌గా ఉన్న తానాజీ జీవితం ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రంలో మరో బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ విలన్‌గా కనిపిస్తారట. ఈ సినిమా తాజా లుక్‌ను రిలీజ్ చేశారు. ఓమ్ రౌత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఈ ఏడాదే రిలీజ్ కానుంది. మరోవైపు అజయ్ దేవగన్ హీరోగా నటించిన ‘దేదే ప్యార్ దే, టోటల్ ధమాల్’ చిత్రాల విడుదల కూడా ఈ ఏడాదే కావడం విశేషం. ‘తానాజీ’ కాకుండా ఫుట్‌బాల్ కోచ్ అబ్దుల్ రహీమ్ బయోపిక్‌లోనూ అజయ్ దేవగన్ నటించనున్నారు. -
విలనిజం చూపిస్తా
‘ద్రోణ, పిల్ల జమిందార్, మిస్టర్ నూకయ్య’ వంటి చిత్రాలను నిర్మించారు డీఎస్ రావు. తేజ దర్శకత్వంలో వచ్చిన ‘హోరాహోరీ’ చిత్రంతో విలన్‌గా పరిచయం అయ్యారు. నటుడిగా కొన్ని సినిమాలు చేశారాయన. ఈరోజు ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా డీఎస్ రావు మీడియాతో మాట్లాడుతూ– ‘‘నిర్మాతగా ఇప్పటి వరకూ 20 సినిమాలు నిర్మించా. తేజగారి ప్రోత్సాహంతో నటుడిగానూ మారాను. తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో రాణిస్తున్నాను. మంచి కథ ఉంటే కచ్చితంగా సినిమా నిర్మిస్తాను. విలన్‌గా నిరూపించుకోవాలనుంది. సరికొత్త విలనిజం చూపిస్తా’’ అని పేర్కొన్నారు. -
లేడీ విలన్
‘రోజా, అల్లరి ప్రియుడు, గణేశ్’ సినిమాల్లో ఆకట్టుకున్న మధుబాల గుర్తుండే ఉంటారు. అప్పట్లో హీరోయిన్గా అలరించిన ఆమె ఇటీవల క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కనిపిస్తున్నారు. ‘నాన్నకు ప్రేమతో’ సినిమాలో హీరోయిన్ తల్లిగా కనిపించారు. ఈసారి ఏకంగా విలన్‌గా మారబోతున్నారు. బాబీసింహా హీరోగా జాన్‌పౌల్ రాజ్, శ్యామ్ సూర్య రూపొందిస్తున్న తమిళం చిత్రం ‘అగ్ని దేవ్’. ఈ సినిమాలో విలన్‌గా నటించనున్నారు మధుబాల. ‘‘చాలా రోజుల తర్వాత తమిళ చిత్రంలో యాక్ట్ చేస్తున్నాను. చాలా హ్యాపీగా ఉంది. ఈ కొత్త క్యారెక్టర్లో కూడా నా బెస్ట్ ఇవ్వాలనుకుంటున్నాను’’ అని పేర్కొ న్నారు మధుబాల. -
ముగ్గురు దర్శకుల విశ్వదాభిరామ
‘చిత్రం’ శ్రీను ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం ‘విశ్వదాభిరామ’. ఈ చిత్రానికి సురేష్ కాశీ, సురేంద్ర కమల్, అశోక్ చక్రం దర్శకత్వం వహించడం విశేషం. సోలో స్టార్ ఎంటర్టైన్ మెంట్స్ పతాకంపై సురేంద్ర కమల్(సురేంద్ర వంటి పులి) నిర్మించారు. దర్శకులు మాట్లాడుతూ –‘‘కొండవీటి కోట నేపథ్యంలో జరిగే డెత్ గేమ్ థ్రిల్లర్ ‘విశ్వదాభిరామ’. ఇప్పటి వరకూ కామెడీ పాత్రల్లో అలరించిన ‘చిత్రం’ శీను ఈ చిత్రంలో తొలిసారి విలన్‌గా నటించారు. తెలుగు ప్రేక్షకులకు ఇదొక సరికొత్త థ్రిల్ కలిగిస్తుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే సినిమా విడుదల చేస్తాం’’ అన్నారు. భువన్ తేజ్, అనిల్, ఆనంద్, సహస్ర, రాజారెడ్డి, మానస నటించిన ఈ చిత్రానికి కెమెరా: అజీమ్, తరుణ్ సోనూ. -
తండ్రి పాత్రపై హింటిచ్చిన విష్ణు
సాక్షి, హైదరాబాద్: సీనియర్ హీరో, యాక్షన్ కింగ్ మోహన్ బాబు చాలా కాలం తరువాత లీడ్ రోల్ గా తెరకెక్కుతున్న గాయత్రి సినిమాపై మోహన్‌బాబు కుమారుడు , హీరో, ప్రొడ్యూసర్ మంచు విష్ణు మాట్లాడారు. ముఖ్యంగా ఈ మూవీలో మోహన్ బాబు పాత్రపై హింట్ ఇచ్చారు. ఇప్పటికే ఈ సినిమాలో మోహన్ బాబు హీరోగా, విలన్‌గా ద్విపాత్రాభినయం చేస్తున్నారనేది టాలీవుడ్ టాక్. ఈ వార్తలకు బలాన్నిస్తూ విష్ణు మోహన్ బాబు విలన్, హీరోగా రెండు విభిన్నమైన పాత్రల్లో నటిస్తున్నారని స్పష్టం చేశారు. ముఖ్యంగా గాయత్రి సినిమాలో మోహన్‌బాబు భయంకరమైన విలన్ పాత్ర పోషిస్తున్నారని విష్ణు వెల్లడించారు. అంతేకాదు డైలాగ్ డెలివరీలో ఆయన శైలి, ప్రత్యేకత మరోసారి వెల్లడికానుందని తెలిపారు. మరోవైపు తనకు ప్రొడ్యూసర్‌గా, నటుడిగా ఈ సినిమా యాసిడ్ టెస్ట్ లాంటిదని వ్యాఖ్యానించారు. ఇప్పటివరకు తాను నటించిన పాత్రలతో పోలిస్తే ఇది చాలా విభిన్నంగా ఉంటుందన్నారు. అలాగే తన తండ్రి సెట్స్‌లో ఉండడంతో ప్రతీదీ సక్రమంగా జరిగిందని చెప్పారు. కాగా మదన్ దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీలో శ్రియ శరణ్, నిఖిల విమన్, అనసూయ భరద్వాజ్ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ఫిబ్రవరి 9న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది చిత్ర యూనిట్. -
విలన్‌గా చేస్తా
అందరికీ అన్ని రకాల పాత్రలు అమరడం కష్టం. ఎన్ని చిత్రాలు చేసినా కొందరు తన నట దాహార్తిని తీర్చే పాత్ర లభించలేదని వాపోతుంటారు. కథానాయికల విషయానికొస్తే నటి త్రిష హీరోయిన్గా దశాబ్దకాలం పూర్తి చేసుకున్నా ఇప్పటికీ చెక్కుచెదరని సౌందర్యంతో ప్రకాశిస్తునే ఉన్నారు. ఈ ముద్దుగుమ్మ పలు భాషా చిత్రాల్లో నటించారు. వాటిలో చాలా వరకు విజయం సాధించాయి. అయితే అవన్నీ ప్రేమికురాలి పాత్రలకు పరిమితమయ్యాయి. మొళి, చంద్రముఖి చిత్రాల్లో జ్యోతిక పాత్రల్లా, అరుంధతి చిత్రంలో అనుష్క పాత్ర మాదిరి త్రిషకు లభించలేదనే చెప్పాలి. దీంతో ఈ చెన్నై బ్యూటీకి వైవిధ్యభరిత పాత్రలు చేయాలనే కోరిక పుట్టిందట. దీనిపై త్రి ష మాట్లాడుతూ, తనలోని నటనా ప్రతిభను వెలికి తీసే పాత్ర ఇప్పటికీ లభించలేదన్నారు. మూస పాత్రల్లో నటించి బోర్ కొట్టిందని చెప్పారు. సవాల్‌తో కూడిన పాత్రల్లో నటించాలనుకుంటున్నట్లు తెలిపారు. అది ప్రతినాయకి పాత్ర అయినా చేయడానికి సిద్ధమేనంటున్న కోరిక నెరవేరేనా? ఎందుకంటే ఈ అందాల భామ విలనిజాన్ని ఆమె అభిమానులు హర్షిస్తారా? అన్నది సందేహమే. నటి త్రిషకు అరెస్టు వారెంటా? నటి త్రిషకు కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసిందా? ప్రస్తుతం కోలీవుడ్‌లో కల కలం పుట్టిస్తున్న టాపిక్ ఇదే. ఈ అందాల తార బాత్రూమ్లో జలకాలాడే దృశ్యాలు ఇంటర్నెట్ల్లోనూ, పత్రికల్లోనూ ప్రచారమై ఎనిమిదేళ్ల క్రితం సంచలనం సృష్టించింది. దీన్ని త్రిష తల్లి తీవ్రంగా ఖండించారు. అవి తన కూతురుకు సంబంధించిన ఒరిజినల్ దృశ్యాలు కావని మార్ఫింగ్ చేసిన నకిలీ దృశ్యాలంటూ, ప్రచురించిన ప్రత్రికపై చెన్నై ఎగ్మూర్ కోర్టులో పరువు నష్టం దావా వేశారు. అయితే ఈ కేసు విచారణ సమయంలో త్రిష తల్లి ఉమ కోర్టుకు హాజరు కాలేదు. దీంతో న్యాయమూర్తి త్రిష, ఆమె తల్లి ఉమపై అరెస్టు వారెంట్ జారీ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై స్పందించిన త్రిష తరపు న్యాయవాది కోర్టు త్రిషకు అరెస్టు వారెంట్ జారీ చేయలేదని ఆమె తల్లి ఉమకు అరెస్టు వారెంట్ జారీ చేసిందని వివరించారు. ఈ అరెస్టు వారెంట్‌ను చట్టపరంగా ఎదుర్కొంటామని అన్నారు.