
అజయ్ దేవగన్
బాలీవుడ్‌లో సెట్స్‌పై ఉన్న పీరియాడికల్ మూవీస్ లిస్ట్‌లో ‘తానాజీ: ది అన్‌సంగ్ వారియర్’ అనే సినిమా ఒకటి. 1670 బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ఈ సినిమాలో అజయ్ దేవగన్ హీరోగా నటిస్తున్నారు. ఛత్రపతి శివాజీ సైన్యంలో మరాఠా చీఫ్ కమాండర్‌గా ఉన్న తానాజీ జీవితం ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రంలో మరో బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ విలన్‌గా కనిపిస్తారట. ఈ సినిమా తాజా లుక్‌ను రిలీజ్ చేశారు. ఓమ్ రౌత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఈ ఏడాదే రిలీజ్ కానుంది. మరోవైపు అజయ్ దేవగన్ హీరోగా నటించిన ‘దేదే ప్యార్ దే, టోటల్ ధమాల్’ చిత్రాల విడుదల కూడా ఈ ఏడాదే కావడం విశేషం. ‘తానాజీ’ కాకుండా ఫుట్‌బాల్ కోచ్ అబ్దుల్ రహీమ్ బయోపిక్‌లోనూ అజయ్ దేవగన్ నటించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment