Tanaji
-
ఆ రికార్డుకు అడుగుదూరంలో తాన్హాజీ
బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవ్గన్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘తాన్హాజీ: ది అన్సంగ్ వారియర్’. చారిత్రాత్మక ఇతివృత్తంతో వచ్చిన ఈ సినిమాకు జనాలు నీరాజనం పలికారు. కాగా మరాఠా యోధుడు తానాజీ మలుసరే జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఇందులో రియల్ లైఫ్ జంట అజయ్‌దేవ్‌గన్, కాజోల్ రీల్ లైఫ్‌లోనూ భార్యాభర్తలుగా నటించారు. జనవరి 10న విడుదలైన ఈ చిత్రం థియేటర్ల వద్ద ఏమాత్రం తడబడకుండా ఇప్పటికీ కలెక్షన్లు రాబడుతోంది. సినిమా రిలీజైన పదిరోజులకే దుకాణం బంద్ చేసుకుంటున్న ఈ రోజుల్లో తాన్హాజీ మూడో వారంలోనూ రూ.32.75 కోట్లు సాధించింది. దీంతో మూడోవారంలోనూ అత్యధిక కలెక్షన్లను సాధిస్తున్న చిత్రంగా రికార్డులు సృష్టిస్తోంది. ఈ పాటికే రెండు సెంచరీలు దాటిన తాన్హాజీ రూ.250 కోట్ల మార్క్‌కు అతి చేరువలో ఉంది. కానీ తాజాగా విడుదలైన వరుణ్ ధావన్ ‘స్ట్రీట్ డ్యాన్సర్ 3’, కంగనా రనౌత్ ‘పంగా’ అజయ్ దేవ్గన్ సినిమాకు గట్టి పోటీనిస్తున్నాయి. ఈ క్రమంలో మరికొద్ది రోజులు థియేటర్ల వద్ద స్థిరంగా నిలబడితేనే తాన్హాజీ ఆ మైలు రాయిని చేరుకుంటుందని సినీవిశ్లేషకులు అంటున్నారు. చదవండి: అభిమాని ఫోన్ లాక్కున్న సల్మాన్ -
సైఫ్‌పై విరుచుకుపడుతున్న నెటిజన్లు!
బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ తాజా చిత్రం ‘తాన్హాజీ’. ప్రస్తుతం విడుదలైన ఈసినిమా బీ-టౌన్ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లను రాబడుతూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. కాగా ‘తాన్హాజీ’లో ప్రతినాయడిగా నటించి మెప్పించిన ఈ పటౌడి హీరో తాజాగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాడు. అయితే సినిమా సక్సెస్‌పై కాకుండా ‘కాన్సెప్ట్ ఆఫ్ ఇండియా’లో తను చేసిన వివాస్పద వ్యాఖ్యల వల్ల నెటిజన్ల ఆగ్రహానికి గురవుతున్నాడు. సినిమా ప్రచార కార్యక్రమంలో భాగంగా అనుపమ చోప్రాకు సైఫ్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా సైఫ్‌ను ‘తాన్హాజీలోని ప్రశ్నార్థక రాజకీయాలు మిమ్మల్ని బాధపెట్టాయా?’ అని అనుపమ ప్రశ్నించగా.. ‘ఫస్ట్.. నేను ఇది చరిత్ర అని అనుకోవడం లేదు, బ్రిటీష్ వారు అది తిరిగి ఇచ్చేవరకు ఈ సినిమాలో భారతదేశ ఉనికి ఉన్నట్లు నాకు అనిపించలేదు’ అని సమాధానం ఇచ్చాడు. దీంతో జాతీయతపై సైఫ్ ఇచ్చిన సమాధానంపై నెటిజన్లు తమదైన శైలిలో విరుచుకుపడుతున్నారు. సైఫ్ చేసిన వ్యాఖ్యలకు ఓ ట్విటర్ యూజర్ భారతదేశ పురాతన పటాన్ని షేర్ చేస్తూ ‘చరిత్రను ప్రశ్నించే ముందు మొదటగా ఇది చదవండి మిస్టర్’ అంటూ కామెంట్ చేశాడు. అదేవిధంగా ‘డియర్ సైఫ్ అలీ ఖాన్.. బ్రిటిష్ వారు భారతదేశానికి రావడానికి పూర్వం.. చాలా ఏళ్ల కిందట గీసీన ఈ భారతదేశ చిత్ర పటాన్ని చూడండి!’ అని మరోక ట్వటర్ యూజర్ కామెంట్ చేశాడు. Bollywood ‘history buff’ #SaifAliKhan claims “there was no concept of ‘India’ until the British came.” Yeah right. French East India Company was about China & Vasco D’Gama went to Fiji. Last time he invoked he invoked ‘history’ he named his son ‘Timur’ pic.twitter.com/pyZXERUQy0 — Tarek Fatah (@TarekFatah) January 19, 2020 ఇక తాన్హాజీలో సైఫ్ అలీఖాన్ 1670లో సింహాగడ్ యుద్ధంలో ఛత్రపతి శివాజీ మరాఠా దళాలు చేసిన దాడిలో ఓడిపోయి కోంధన కోటను కొల్పోయిన రాజ్‌పుత్ జనరల్ ఉదయ్‌భన్ రాజు పాత్రలో కనిపించాడు. కాగా అజయ్ దేవగన్ తానాజీ మలుసారే పాత్రలో నటించగా ఆయన భార్య సావిత్రిబాయి మలుసారేగా నటించారు. అంతేగాక చివరిగా తాన్హాజీలో కనిపించిన సైఫ్ తర్వాత హంటర్, భూట్ పోలీసు, జవానీ జానెమాన్ పైప్‌లైన్‌లో వంటి సినిమాలలో కూడ నటిస్తూ బీజీగా ఉన్నాడు. Dear #SaifAliKhan check out some of these ancient maps which clearly mentioned India long before the British even existed. pic.twitter.com/fULTe9WvMI — Bahadur 2.0 (@my2bit) January 20, 2020 -
తిరుగులేని తాన్హాజీ, మరో రికార్డు దిశగా
బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవ్గన్ మరాఠా యోధుడిగా నటించిన చిత్రం ‘తాన్హాజీ: ది అన్సంగ్ వారియర్’. ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నిజజీవితంలో భార్యాభర్తలైన అజయ్ దేవగన్, కాజోల్ రీల్ లైఫ్‌లో భార్యాభర్తలుగా నటించారు. ఈ సినిమా అందరినీ ఆశ్చర్యపరుస్తూ వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. ఇక జనవరి 10న విడుదలైన ఈ చిత్రం 11 రోజుల్లోనే రూ.175 కోట్లు కురిపించింది. అదే రోజు విడుదలైన ‘ఛపాక్’ ఆశించిన ఫలితాలను రాబట్టలేకపోయింది. ఎన్ని ప్రమోషన్లు చేసినప్పటికీ ఛపాక్.. తాన్హాజీ ధాటికి ఎదురునిలవలేకపోయింది. ఇక తాన్హాజీ చిత్రానికి మహారాష్ట్ర ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ సినిమా రెండో వారంలోనూ ధీటుగా వసూళ్లు రాబడుతుండటంతో రూ.200 కోట్లను అందుకోవడం ఖాయమని ఆయన అభిమానులు తేల్చి చెప్తున్నారు. తాన్హాజీ రిలీజైన మూడు రోజులకే హాఫ్ సెంచరీ, ఆరు రోజులకే సెంచరీ కొట్టగా మరిన్ని రికార్డులు బద్ధలు చేసే దిశగా వసూళ్ల కొనసాగుతున్నాయి. ఇక ఈ చారితత్రాత్మక చిత్రం అజయ్ దేవ్గన్ కెరీర్లోనే అత్యధిక వసూళ్లు సాధించిన రెండో చిత్రంగా నిలిచింది. చదవండి: ఆరు రోజుల్లో రూ. 107 కోట్లు.. థాంక్యూ! తాన్హాజీ: కలెక్షన్ల తుఫాన్ -
తన్హాజీ.. కలెక్షన్ల తుఫాన్!
ముంబై: బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవ్గన్ హీరోగా తెరకెక్కిన పిరియడ్ డ్రామ ‘తన్హాజీ : ది అన్సంగ్ వారియర్’. బాక్సాఫీస్ వద్ద అద్భుతంగా రాణిస్తోంది. గత శుక్రవారం విడుదలైన ఈ సినిమా మూడు రోజుల్లో ఏకంగా రూ. 61.7 కోట్లు వసూలు చేసింది. మరాఠా యోధుడి కథ కావడంతో మహారాష్ట్రలో అద్భుతంగా వసూళ్లు రాబడుతున్న ఈ మూవీ... ఇటు మెట్రో నగరాల్లోని మల్టిప్లెక్స్‌ల్లో, మాస్ థియేటర్లలో సత్తా చాటుతోంది. శుక్రవారం తొలిరోజు రూ. 15.10 కోట్లు, శనివారం రూ. 20.57 కోట్లు రాబట్టిన తన్హాజీ.. ఆదివారం మరింతగా పుంజుకొని రూ. 26.08 కోట్లు రాబట్టిందని, మొత్తంగా రూ. 61.75 కోట్లను ఈ సినిమా మూడోరోజుల్లో రాబట్టిందని ట్రెడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. ఓం రౌత్ దర్శకత్వంలో అజయ్ దేవ్గన్ ఫిల్మ్స్, టీ-సిరీస్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించాయి. ఛత్రపతి శివాజీ మహారాజ్ సైన్యాధ్యక్షుడైన తన్హాజీ మలుసరే జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. 1670లో జరిగిన సింహగఢ్ యుద్ధంలో కీలక పాత్ర పోషించిన ఈ మరాఠా యోధుడి పాత్రలో అజయ్ దేవగన్ నటిస్తుండగా, ఆయన భార్య సావిత్రిబాయి ములుసరేగా కాజోల్ నటించారు. విలన్ పాత్రలో సైఫ్ అలీఖాన్ నటించారు. 3డీ టెక్నాలజీలో భారీ బడ్జెట్‌తో ఈ చిత్రం తెరకెక్కింది. -
‘తానాజీ’ నుంచి మరో ట్రైలర్ విడుదల
మరాఠా యోథుడు ఛత్రపతి శివాజీ సేనకు సైన్యాధిపతి తానాజీ మలుసరే జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న బాలీవుడ్ చిత్రం తానాజీ: ది అన్ సంగ్ వారియర్’ నుంచి రెండో ట్రైలర్ ఈరోజు విడుదలైంది. తానాజీ పాత్రలో అజయ్ దేవగణ్, ఆయన భార్య సావిత్రి పాత్రలో కాజోల్ నటిస్తున్నారు. ‘మొఘల్ సామ్రాజ్యాన్ని వణికించిన మెరుపుదాడులు..’ అంటూ ప్రారంభమయ్యే ట్రైలర్ లో యుద్ధ సన్నివేశాలు, నటీనటుల డైలాగ్స్, సెంటిమెంటల్ సీన్స్ ఉన్నాయి. జనవరి 10న విడుదల కానున్న ఈ చిత్రానికి ఓం రావత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో టైటిల్ పాత్రధారి తానాజీగా అజయ్ దేవ్‌గణ్ నటించాడు. ఆయన భార్య సావిత్రిబాయి మలుసరే పాత్రలే అజయ్ నిజ జీవిత భాగస్వామి కాజోల్ నటించడం విశేషం. సైఫ్ అలీ ఖాన్ ఉదయ్ భాన్ అనే ఔరంగజేబుకు నమ్మిన బంటుగా నటించాడు. ఇక ‘సర్ధార్ గబ్బర్ సింగ్’ చిత్రంలో విలన్‌గా నటించిన శరత్ కేల్కర్ ఈ చిత్రంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ పాత్రలో నటించాడు. ఈ సినిమాలో జగపతిబాబు మరో ముఖ్యపాత్ర శెలార్ మామా పాత్రలో నటించాడు. -
తాన్హాజీ: యుద్ధానికి భయపడేదే లేదు
చలనచిత్ర పరిశ్రమలో గతకొంతకాలంగా బయోపిక్‌ల హవా నడుస్తోంది. టాలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా బయోపిక్ సినిమాలు ప్రేక్షకుల మెప్పును సంపాదించుకుంటున్నాయి. ముఖ్యంగా బాలీవుడ్లో వస్తున్న బయోపిక్ చిత్రాలకు లెక్కే లేదు. ఈ క్రమంలో మరాఠా అధినేత చత్రపతి శివాజీ సామ్రాజ్యంలో సుబేదార్‌గా పనిచేసిన మరాఠా యోధుడు తానాజీ జీవితకథ ఆధారంగా తెరకెక్కుతోన్న తాజా చిత్రం ‘తాన్హాజీ: ది అన్సంగ్ వారియర్’. ఈ సినిమాలో అజయ్ దేవ్గన్, కాజోల్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ నేడు రిలీజైంది. యుద్ధ సన్నివేశాలతో కూడిన ఈ ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంటోంది. తానాజీ యుద్ధ సన్నివేశాలు భీకరంగా ఉండేట్టు కనిపిస్తోంది. 1670 వ శతాబ్దంలో మరాఠా సామ్రాజ్యంలో లిఖించబడిన చరిత్రను చిత్రబృందం వెండితెరపై ఆవిష్కరించింది. తానాజీ మొఘల్ సామ్రాజ్యంపై సర్జికల్ స్ట్రైక్ జరిపాడంటూ ట్రైలర్లో ఆయన ఖ్యాతిని ఇనుమడింపజేశారు. ఈ ట్రైలర్లో కాజోల్ నిడివి తక్కువగానే ఉన్నప్పటికీ ఆమె నటన ఆకట్టుకుంది. ఇక బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు అదనపు ఆకర్షణగా ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. భయం అంటేనే తెలియని తానాజీ ప్రత్యర్థి (సైఫ్ అలీఖాన్)తో యుద్ధానికి సై అంటూ చెప్పే డైలాగులు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే ఫస్ట్‌లుక్‌లతో అంచనాలు పెంచేసిన ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
మరాఠా యోధుడి భార్యగా కాజోల్
చత్రపతి శివాజీ సైన్యాన్ని ముందుండి నడిపించిన మరాఠా వీరుడు తానాజీ మలుసరే జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘తాన్హాజీ: ది అన్సంగ్ వారియర్’. ఇందులో మరాఠా యోధుడిగా అజయ్ దేవ్గన్, ఆయన సతీమణి పాత్రలో కాజోల్ నటిస్తున్నారు. 2008లో ‘యు మీ ఔర్ హమ్’ తర్వాత వీళ్లిద్దరి కలయికలో వస్తున్న చిత్రమిది. ఓమ్రత్ దర్శకత్వం వహిస్తుండగా టీసీరిస్తో కలిసి అజయ్ దేవ్గన్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మరాఠా వీరుడి పత్ని సావిత్రిబాయి మలుసరేగా కాజోల్ ఫస్ట్‌లుక్‌ను సోమవారం విడుదల చేశారు. మరాఠా మహిళ పాత్రలో ఒదిగిపోయిన కాజోల్ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో ఉదయ్ సింగ్ రాథోడ్ పాత్రలో సైఫ్ అలీఖాన్ కనిపించనున్నారు. ఓంకార్ చిత్రం తర్వాత అజయ్ దేవ్గన్, సైఫ్ అలీఖాన్ కలిసి నటిస్తున్న చిత్రమిది. మొదట సినిమా పేరును తానాజీగా ప్రకటించిన చిత్రబృందం న్యూమరాలజీ ప్రకారం తాన్హాజీగా మార్చింది. ఈ చిత్ర ట్రైలర్‌ను రేపు(నవంబర్ 19న) రిలీజ్ చేయనున్నారు. కాగా తాన్హాజీ చిత్రంతో అజయ్ దేవ్గన్ సెంచరీ పూర్తి చేసుకోనున్నారు. ఈ చారిత్రాత్మక చిత్రం వచ్చే ఏడాది జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
అజేయంగా...
బాలీవుడ్లో సెంచరీ కొట్టారు అజయ్ దేవగన్. సుమారు 30 ఏళ్ల యాక్టింగ్ కెరీర్లో అజేయంగా 100వ సినిమా మైలురాయిని టచ్ చేశారు. ప్రస్తుతం నటిస్తున్న ‘తన్హాజీ’ అజయ్ దేవగన్ కెరీర్లో 100వ సినిమా. 1991లో ‘పూల్ అవుర్ కాంటే’ సినిమాతో హీరోగా పరిచయం అయ్యారు అజయ్. ‘‘30 ఏళ్లు.. వంద సినిమాలు. ఫూల్ అవుర్ కాంటే, గోల్మాల్, శివాయ్, ఇప్పుడు తన్హాజీ. ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నిన్ను చూస్తూనే ఉన్నాను. వందో సినిమాకు శుభాకాంక్షలు అజయ్’’ అని ట్వీటర్లో శుభాకాంక్షలు తెలిపారు నటి, అజయ్ దేవగన్ భార్య కాజోల్. వచ్చే ఏడాది జనవరిలో రిలీజ్ కానున్న ‘తన్హాజీ’ సినిమాకు అజయ్ దేవగన్ ఒక నిర్మాత. ఈ సినిమాలో కాజోల్ కూడా ఓ కీలక పాత్ర చేస్తున్నారు. -
మంత్రి ఇంటి ముందు వినూత్నంగా నిరసన
-
మంత్రి ఇంటి ముందు పీతలు వదిలారు..
సాక్షి, ముంబై: రత్నగిరి జిల్లాలో తివరే డ్యాం ఆనకట్ట తెగిపోవడానికి పీతలే ప్రధాన కారణమని వ్యాఖ్యలు చేసిన జలవనరుల శాఖ మంత్రి తానాజీ సావంత్‌కు ఎన్సీపీ కార్యకర్తలు వినూత్నంగా నిరసన తెలిపారు. మంగళవారం ఉదయం ఎన్సీపీ కార్యకర్తలు గుంపులుగా వచ్చి సావంత్ ఇంటి ప్రాంగణంలో గంపలో పీతలు తీసుకొచ్చి పోసి నిరసన తెలిపారు. తివరే డ్యాం ఆనకట్ట తెగిపోవడానికి ప్రధాన కారణం పీతలేనని ఇటీవల తానాజీ సావంత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆగ్రహానికి గురైన ఎన్సీపీ కార్యకర్తలు మంత్రి ఇంటి ముందు పీతలు పోశారు. మరోవైపు అక్కడకు చేరుకున్న పోలీసులు నిరసనకారులను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. కాగా ఇటీవల కురిసిన వర్షాలకు తివరే ఆనకట్టకు గండిపడి దిగువన ఉన్న గ్రామాలు కొట్టుకుపోయిన విషయం తెలిసిందే. ఈ సంఘటనలో 19మంది చనిపోగా, పలువురు గాయపడ్డారు. -
యుద్ధ వీరుడు
బాలీవుడ్లో సెట్స్‌పై ఉన్న పీరియాడికల్ మూవీస్ లిస్ట్‌లో ‘తానాజీ: ది అన్సంగ్ వారియర్’ అనే సినిమా ఒకటి. 1670 బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ఈ సినిమాలో అజయ్ దేవగన్ హీరోగా నటిస్తున్నారు. ఛత్రపతి శివాజీ సైన్యంలో మరాఠా చీఫ్ కమాండర్‌గా ఉన్న తానాజీ జీవితం ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రంలో మరో బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ విలన్‌గా కనిపిస్తారట. ఈ సినిమా తాజా లుక్‌ను రిలీజ్ చేశారు. ఓమ్ రౌత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఈ ఏడాదే రిలీజ్ కానుంది. మరోవైపు అజయ్ దేవగన్ హీరోగా నటించిన ‘దేదే ప్యార్ దే, టోటల్ ధమాల్’ చిత్రాల విడుదల కూడా ఈ ఏడాదే కావడం విశేషం. ‘తానాజీ’ కాకుండా ఫుట్‌బాల్ కోచ్ అబ్దుల్ రహీమ్ బయోపిక్‌లోనూ అజయ్ దేవగన్ నటించనున్నారు. -
బాలీవుడ్ సినిమాలో జగపతి బాబు లుక్
లెజెండ్ సినిమాతో విలన్‌గా టర్న్ అయిన టాలీవుడ్ సీనియర్ నటుడు జగపతి బాబు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ సీనియర్ స్టార్ బాలీవుడ్ ఎంట్రీకి రెడీ అవుతున్నారు. సెకండ్ ఇన్నింగ్స్‌లో ఫుల్ ఫాంలో దూసుకుపోతున్న జగ్గూభాయ్ తెలుగుతో పాటు తమిళ, మలయాళ, హిందీ భాషల్లో కలిపి 13 సినిమాలు చేస్తున్నారు. తాజాగా జగపతి బాబు నటిస్తున్న హిందీ సినిమాకు సంబంధించిన లుక్ లీకైంది. బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న మూవీ తానాజీ. ఈ సినిమాలో జగపతి బాబు కీలక పాత్రలో నటిస్తున్నారు. చారిత్రక కథాంశంతో తెరకెక్కుతున్న తానాజీ చిత్రానికి ఓం రావత్ దర్శకుడు. ఛత్రపతి శివాజీ కోసం పోరాడిన సుబేదార్ తానాజీ పాత్రలో అజయ్ దేవగన్ నటిస్తున్నారు. ఈ సినిమాలో జగపతి బాబు పాత్రకు సంబంధించిన లుక్ టెస్ట్‌ను ఇటీవల నిర్వహించారు. ఈ లుక్ టెస్ట్‌కు సంబంధించిన ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. -
డబుల్ ధమాకా
ప్రస్తుతం బాలీవుడ్ అంతా బయోపిక్‌ల హవా నడుస్తోంది. అజయ్ దేవగన్ కూడా బయోపిక్‌కి రెడీ అయ్యారు. ఒకటి కాదు ఏకంగా రెండు బయోపిక్‌లను లైన్లో పెట్టారు. మరాఠా సామ్రాజ్యంలోని ముఖ్య జనరల్ తానాజీ, పూలన్‌దేవిని చంపిన బందిపోటు షేర్ సింగ్ రానా పాత్రలను తెరమీదకు తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారట. బయోపిక్‌లో యాక్ట్ చేయడం అజయ్‌కి ఇది ఫస్ట్ టైమ్ ఏం కాదు. 2002లో ‘ది లెజెండ్ ఆఫ్ భగత్‌సింగ్’ చిత్రంలో భగత్‌సింగ్ పాత్రలో కనిపించారు. ఆల్రెడీ ‘తానాజీ : ది అన్సంగ్ హీరో’ చిత్రంలో తానాజీ పాత్ర కోసం ప్రిపరేషన్ మొదలుపెట్టేసిన అజయ్ దేవ్గన్.. షేర్ సింగ్ బయోపిక్‌ను వచ్చే ఏడాది చివర్లో మొదలుపెట్టనున్నారట. -
ధీర... ధీర... ధీర... మనసాగ లేదురా!
శివాజీ, తానాజీ అడవి దారిలో వెళ్తున్నారు. అకస్మాత్తుగా వాళ్ళపై మొఘలాయి సైన్యం దాడి చేసింది. కొంచెం దగ్గర్లోనే సింహ్‌గఢ్ కోట. అక్కడకు వెళ్లగలిగితే ఫిరంగులతో సైన్యాన్ని పేల్చిపారేయొచ్చు. అందుకే తానాజీ ఒంటరిగా సైన్యాన్ని ఎదుర్కొంటూ, శివాజీని కోటలోకి పంపించాడు. ఇక్కడ తానాజీ ‘ఒకటీ... రెండూ... మూడు’ అని లెక్కపెడుతూ, శత్రువుల్ని వరుసపెట్టి నరికేసి, తానూ చనిపోయాడు. అప్పుడు శివాజీ వచ్చి, ‘గఢ్ మిల్గయా, మగర్ సింహ్ చలాగయా’ అని కన్నీళ్లు పెట్టుకున్నాడు.ఇదో మరాఠీ సినిమా. చూసి థ్రిల్లయిపోయాడు విజయేంద్రప్రసాద్. తానాజీ పాత్ర ఆయనను చాలాకాలం వెంటాడుతూనే ఉంది. తానాజీ లాంటి వీరుడు మళ్లీ పుడితే? విజయేంద్ర ప్రసాద్ మైండ్‌లో కథ పురుడు పోసుకుంటోంది. సూపర్‌స్టార్ కృష్ణ హీరోగా సాగర్ దర్శకత్వంలో ‘జగదేకవీరుడు’ సినిమా. దీనికి విజయేంద్ర ప్రసాద్ కథ ఇవ్వాలి. కొడుకు రాజమౌళి స్టోరీ అసిస్టెంట్. ఈ కథ చేస్తుంటే అనుక్షణం తానాజీ గుర్తొస్తున్నాడు. ఓ రాజమాత. ఆమెను అనుక్షణం కంటికి రెప్పలా కాపాడే ఓ బాడీగార్డ్. రాజమాతపై ఓ వందమంది యోధులు ఎటాక్ చేస్తే, ఎదురొడ్డి పోరాడి, అసువులు బాశాడు బాడీగార్డ్. మళ్లీ 400 ఏళ్ల తర్వాత పుట్టాడు. రాజమాత కూడా మళ్లీ పుట్టింది. మేధా పాట్కర్ లాంటి సోషల్ వర్కర్లా ఎదిగిన ఆమె ముఖ్యమంత్రి కావడం కోసం బాడీగార్డ్ ఎంతో పోరాడి, ఆమె లక్ష్యాన్ని నెరవేరుస్తాడు.క్లుప్తంగా ఇదీ కథ. దర్శక నిర్మాతలకు నచ్చలేదు. దాంతో ఇంకో రైటర్ ఎంటర య్యాడు. ఇక్కడ రాజమౌళిని మాత్రం ఈ కథ హాంట్ చేస్తూనే ఉంది. చిరంజీవి ఇల్లు - అక్కడ్నుంచీ చూస్తే హైదరాబాద్ మొత్తం కనిపిస్తోంది. చిరంజీవి, అల్లు అరవింద్, రామ్‌చరణ్, రాజమౌళి... నలుగురే కూర్చుని ఉన్నారు. ‘‘సారీ సర్! చరణ్ లాంచింగ్ ప్రాజెక్ట్ చేయలేను. మీ అబ్బాయి ఫస్ట్ సినిమా అంటే ఎక్స్పెక్టేషన్స్ హై లెవెల్లో ఉంటాయి. నేను ఎంతవరకు నెరవేర్చ గలనో చెప్పలేను. సెకండ్ సినిమా అయితే ఓకే’’ అని చెప్పేశాడు రాజమౌళి. కట్ చేస్తే - రామ్ చరణ్ ఫస్ట్ సినిమా ‘చిరుత’ పూరి జగన్నాథ్ డెరైక్షన్‌లో తయారైంది. హండ్రడ్ డేస్ ఫిల్మ్. మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుష్. ఇప్పుడు చరణ్ సెకండ్ ఫిల్మ్ రాజమౌళి చేతిలో ఉంది. చిరంజీవి ఇల్లు... సేమ్ ఫోర్ మెంబర్స్. రాజమౌళి కాన్సెప్ట్ చెబుతున్నాడు. వందమంది యోధుల్ని ఓ మగధీరుడు ఎంత వీరోచితంగా తెగ నరుకుతున్నాడో కళ్లకు కట్టినట్టుగా చెబుతున్నాడు. చిరంజీవి అదిరిపోయాడు. ఈ సినిమాకు ప్రొడ్యూసర్ అల్లు అరవింద్. ఆయన రాజమౌళితో ఒకటే చెప్పారు. ‘‘చిరంజీవి నాకెన్నో హిట్స్ ఇచ్చారు. ఆయనకో అద్భుతమైన కానుక ఇవ్వాలి. అలాగే నా మేనల్లుడు... హిస్టరీలో నిలిచిపోవాలి. ఎంత ఖర్చయినా ఫర్లేదు. నీ ఇష్టం’’ రాజమౌళికి ఫుల్ ఫ్రీడమ్ గ్రాంటెడ్. రాజమౌళి ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూర్చున్నారు. ‘‘పదిహేనేళ్ల క్రితం కథ అది. నీకింకా గుర్తుందా?’’ ఆసక్తిగా అడిగారు విజయేంద్ర ప్రసాద్. ‘‘అవును నాన్నా! ఎప్పటికైనా ఆ బాడీగార్డ్ కథతో సినిమా చేద్దామని కాచుకుని కూర్చున్నా. ఇప్పుడు టైమ్ కుదిరింది. చరణ్ హార్స్ రైడింగ్ స్పెషలిస్టు. తనకు ఇలాంటి కథే కరెక్టు’’ చెప్పాడు రాజమౌళి.‘‘చిరంజీవిగారి ‘ఘరానా మొగుడు’లోని ‘బంగారు కోడిపెట్ట’ సాంగ్‌ని ఇందులో రీమిక్స్ చేద్దాం’’ కీరవాణిగారి భార్య శ్రీవల్లి ఐడియా ఇది. ఆ ఫ్యామిలీస్‌లో వల్లి మాటే వేదం. వదినగారి ఐడియాకు రాజమౌళి గ్రీన్ సిగ్నల్. కథ రెడీ అవుతోంది. కొంత జానపదం. కొంత సాంఘికం. పునర్జన్మల నేపథ్యం. రాజమాత కాస్తా రాజకుమారి అయిపోయింది. చరణ్ ఇమేజ్‌కి, బాడీ లాంగ్వేజ్‌కి తగ్గట్టుగా కథలో మలుపులు. ఓపెనింగ్ సీన్ నుంచే అటెన్షన్ డ్రా అవ్వాలి. రాజమౌళి తన రైటర్స్ టీమ్‌తో కూర్చుని వర్క్ చేస్తూనే ఉన్నాడు. ఆల్ఫ్రెడ్ హిచ్‌కాక్ తీసిన టీవీ సీరియల్స్ అన్నీ వాచ్ చేస్తున్నాడు రాజమౌళి. హిచ్‌కాక్ టేకింగ్ స్టయిల్ చాలా డిఫరెంట్. కాన్సెప్ట్ ఏంటో ఫస్ట్ సీన్లోనే చెప్పేస్తాడు. ఆ తర్వాత ఆసక్తికరంగా చిక్కుముళ్లు వేస్తూ, విప్పుతూ ఉంటాడు. ఈ నేరేటివ్ స్టయిల్ రాజమౌళికి విపరీతంగా నచ్చేసింది. అదే ఫాలో అయితే..? అంతే... ఓపెనింగ్ సీన్ విషయంలో క్లారిటీ వచ్చేసింది. హీరో హీరోయిన్లు ఫస్ట్ సీన్లోనే పర్వతాలపై నుంచి పడి చనిపోతారు. ఆ తర్వాతే అసలు కథ మొదలవుతుంది. ఫైనల్‌గా ‘మగధీర’ స్టోరీ రెడీ. రాజకుమారి మిత్రవింద. అదిరిపోయే అందం. అలాంటి హీరోయినే కావాలి. రాజమౌళి కళ్లు వెతుకుతున్నాయి. తమన్నా... ఇలా చాలామంది. ఎవ్వరూ కనెక్ట్ కావడం లేదు. ఆయన వ్యూ ఫైండర్లో కాజల్ అగర్వాల్ కనబడింది. ‘యమదొంగ’లో ఫస్ట్ కాజల్‌నే అడిగారు. డేట్లు కుదర్లేదు. ఇప్పుడామె రెడీ.షేర్‌ఖాన్ పాత్రకు స్క్రిప్టు దశలోనే శ్రీహరి పేరు లాక్ చేసేశాడు రాజమౌళి. విలన్ పాత్రకు మాత్రం కొత్తవారినే వెతుకుతున్నాడు. దేవ్‌గిల్. ‘కృష్ణార్జున’ సినిమాలో యాక్ట్ చేశాడు. పెద్ద పేరు లేదు. ఈ క్యారెక్టర్‌కి బానే ఉంటాడు కానీ, హార్స్ రైడింగ్ అంటే దడ, వణుకు. ఇది తనకు గోల్డెన్ చాన్స్ అని దేవ్గిల్కు తెలుసు. అందుకే వదులుకోకూడదు. రాత్రింబవళ్లు హార్స్ రైడింగ్ ప్రాక్టీస్ చేశాడు. రాజమౌళి ఇప్పటివరకూ చేసిన సినిమాలన్నీ ఒకెత్తు. ఇదొక ఎత్తు. అన్‌కాంప్రమైజింగ్ టీమ్ కావాలి. గ్రాఫిక్స్ అదిరిపోవాలంటే వీఎఫ్ఎక్స్ టీమ్ బ్రహ్మాండంగా కుదరాలి. రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా! రాజమౌళి తలుచుకుంటే టీమ్‌కు కొరతా! కెమెరామ్యాన్ సెంథిల్, ఆర్ట్ డెరైక్టర్ రవీందర్‌రెడ్డి, ఫైట్ మాస్టర్ పీటర్ హెయిన్, వీఎఫ్ఎక్స్ హెడ్ కమల్ కణ్ణన్, స్టయిలింగ్ రమా రాజమౌళి. వీళ్లందరికీ పెద్ద దిక్కు మ్యూజిక్ డెరైక్టర్ కీరవాణి. వర్క్ స్టార్ట్! షూటింగ్లో చాలాభాగం ఆర్ఎఫ్సీలోనే. కొన్ని రియల్ లొకేషన్స్, కొంత గ్రాఫిక్స్. ఉదయ్‌గఢ్ కోట కట్టాలి. ఇరాన్ నుంచి ఓ ఎక్స్పర్ట్ వచ్చాడు. గద్ద షేప్‌లో డిజైన్ ఇచ్చాడు. కొద్దిభాగం సెట్ వేయడానికే త్రీ మంత్స్ పట్టింది. మొత్తం కోట సెట్ వేయాలంటే ఆరు నెలల పైనే అవుతుంది. అంత టైమ్ వేస్టు. గ్రాఫిక్స్ వాళ్లకు అప్పగిస్తే వాళ్లే చూసుకుంటారు. పీటర్ హెయిన్ ఫుల్ డేట్స్ తీసేసుకున్నాడు రాజమౌళి. ఫైట్లు అలా ఇలా ఉండకూడదు. కళ్లు చెదిరిపోవాలి. ముఖ్యంగా వందమంది యోధులతో ఫైటింగ్ సీక్వెన్స్. దీనికైతే షూటింగ్‌కి ముందే బోలెడంత గ్రౌండ్ వర్క్. ప్రాక్టీస్ సెషన్స్. ఈ సినిమాలో బోలెడన్ని రిస్కీ షాట్స్. పీటర్ హెయిన్ ఎక్కడా తగ్గడం లేదు. బైక్‌ను గాల్లోకి లేపే సీన్ తీస్తున్నారు. చరణ్‌కు చేసి చూపిస్తున్నాడు పీటర్ హెయిన్. ఫస్ట్ టేక్ ఓకే. కానీ చిన్న చేంజ్. సెకండ్ టేక్ చేసి చూపిస్తున్నాడు పీటర్ హెయిన్. బైక్‌తో గాల్లోకి లేచాడు. 80-90 అడుగుల ఎత్తు. ఎక్కడో చిన్న మిస్టేక్. స్ల్పిట్ సెకండ్. అంత పైనుంచి ఫోర్స్‌గా ఢామ్మని కిందపడ్డాడు. ఎన్ని ఎముకలు విరిగిపోయాయో... అసలు బతికే చాన్సుందా..? ‘కిమ్స్’లో చేర్చారు. ప్రాణభయం లేదు. కానీ ఫోర్ మంత్స్ బెడ్ మీద నుంచి కాలు దించితే కష్టమన్నారు డాక్టర్లు. పీటర్ హెయిన్ మొండోడు. నెలకే తిరిగొచ్చాడు. అదే బైక్ షాట్ మళ్లీ తీశాడు. ‘కాలభైరవ’ పాత్ర కోసం చరణ్ ఫుల్ ప్రిపేర్డ్‌గా ఉన్నాడు. బాడీ పెంచాడు. లుక్‌లో రాజసం తీసుకొచ్చాడు. నిజంగా యోధానుయోధుడిలాగానే తయార య్యాడు. రాజమౌళి చెప్పింది తు.చ. తప్పకుండా చేస్తున్నాడు. ‘మగధీర’ను అతను ఫుల్‌గా ఓన్ చేసేసుకున్నాడు. రాజస్థాన్ ఎడారిలోని లొకేషన్స్ కోసం వెళ్లినప్పుడు తగిలింది బాదల్. సింహం లాంటి గుర్రం. కన్నుమూసి తెరిచేలోపు ఆమడ దూరం పరిగెడుతుంది. కానీ జగమొండి. అస్సలు మాట వినదు. చరణ్ ఆ గుర్రానికి ఫ్యాన్ అయి పోయాడు. ‘‘ఈ గుర్రం నాక్కావాలి’’ అన్నాడు. దాంతోనే షూటింగ్. వాటర్ ఫాల్స్ నుంచి జంప్ చేసే షాట్లో కొంచెం వైల్డ్‌గా రియాక్టయ్యింది. చరణ్ లిగ్మెంట్కు గాయమైంది. రెండు నెలలు బెడ్ రెస్ట్. రాజమౌళి ఓ తపస్సులా షూటింగ్ చేస్తున్నాడు. సినిమా బిగినింగ్‌లో హీరో హీరోయిన్లు పర్వతాల నుంచి పడిపోయే సీన్ కోసమైతే చాలా వర్క్ చేశాడు. షాట్ బై షాట్ రాసుకుని... రీ-రికార్డింగ్‌తో సహా స్టోరీ బోర్డ్ చేసి, గ్రాఫిక్స్ వాళ్లకు ఇచ్చాడు. షూటింగే ఓ యజ్ఞం అనుకుంటే, పోస్ట్ ప్రొడక్షన్ అంతకు మించిపోయింది. వీఎఫ్ఎక్స్ డిపార్ట్మెంట్కు సంబంధించి బోలెడంతమంది ఫ్రీ లాన్సర్స్ పనిచేస్తున్నారు. అందరికీ పీస్ వర్క్‌లు. మళ్లీ వాళ్లందర్నీ కో-ఆర్డినేట్ చేయడం. వర్క్ అంతా ఒకే చోట జరిగితే ఓకే కానీ, రకరకాల ప్లేసుల్లో... రకరకాల మనుషులతో చేయించుకోవడమంటే నిజంగా నరకం. కానీ రాజమౌళి భరిస్తున్నాడు. చివరిక్షణం వరకూ మంచి ఫలితం కోసం పోరాడుతూనే ఉన్నాడు. రిలీజ్‌కు రెండ్రోజుల ముందు కూడా కొన్ని షాట్స్ నచ్చక బెటర్ చేయించుకున్నాడు. రిలీజ్ ముందురోజు రాత్రే హైదరాబాద్ బంజారాహిల్స్ సినీమ్యాక్స్ లో ప్రివ్యూ వేశారు. పిన్‌డ్రాప్ సెలైన్స్. తుపాను ముందర ప్రశాంతత అంటే ఇదేనేమో! ఆ తర్వాత తుపాను ఆగలేదు. పాత రికార్డులన్నీ చెల్లాచెదురు. వంద రోజుల వరకూ హౌస్‌ఫుల్సే. 223 థియేటర్లలో హండ్రడ్ డేస్. కోట్లకు కోట్ల వసూల్. అమ్మో... అమ్మో... అమ్మో! తెలుగు సినిమాకు ఇంత డబ్బా!? నిజమే! అద్భుతాలు కొన్నిసార్లే జరుగుతాయి.