ఆ రికార్డుకు అడుగుదూరంలో తాన్హాజీ | Tanhaji: The Unsung Warrior Closer To Rs 250 Crores | Sakshi
Sakshi News home page

ఆ రికార్డుకు అడుగుదూరంలో తాన్హాజీ

Published Wed, Jan 29 2020 6:27 PM | Last Updated on Wed, Jan 29 2020 6:30 PM

Tanhaji: The Unsung Warrior Closer To Rs 250 Crores - Sakshi

బాలీవుడ్‌ స్టార్‌ హీరో అజయ్‌ దేవ్‌గన్‌ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘తాన్హాజీ: ది అన్‌సంగ్‌ వారియర్‌’. చారిత్రాత్మక ఇతివృత్తంతో వచ్చిన ఈ సినిమాకు జనాలు నీరాజనం పలికారు. కాగా మరాఠా యోధుడు తానాజీ మలుసరే జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఇందులో రియల్‌ లైఫ్‌ జంట అజయ్‌దేవ్‌గన్‌, కాజోల్‌ రీల్‌ లైఫ్‌లోనూ భార్యాభర్తలుగా నటించారు. జనవరి 10న విడుదలైన ఈ చిత్రం థియేటర్ల వద్ద ఏమాత్రం తడబడకుండా ఇప్పటికీ కలెక్షన్లు రాబడుతోంది. సినిమా రిలీజైన పదిరోజులకే దుకాణం బంద్‌ చేసుకుంటున్న ఈ రోజుల్లో తాన్హాజీ మూడో వారంలోనూ రూ.32.75 కోట్లు సాధించింది.

దీంతో మూడోవారంలోనూ అత్యధిక కలెక్షన్లను సాధిస్తున్న చిత్రంగా రికార్డులు సృష్టిస్తోంది. ఈ పాటికే రెండు సెంచరీలు దాటిన తాన్హాజీ రూ.250 కోట్ల మార్క్‌కు అతి చేరువలో ఉంది. కానీ తాజాగా విడుదలైన వరుణ్‌ ధావన్‌ ‘స్ట్రీట్‌ డ్యాన్సర్‌ 3’, కంగనా రనౌత్‌ ‘పంగా’ అజయ్‌ దేవ్‌గన్‌ సినిమాకు గట్టి పోటీనిస్తున్నాయి. ఈ క్రమంలో మరికొద్ది రోజులు థియేటర్‌ల వద్ద స్థిరంగా నిలబడితేనే తాన్హాజీ ఆ మైలు రాయిని చేరుకుంటుందని సినీవిశ్లేషకులు అంటున్నారు.

చదవండి: అభిమాని ఫోన్‌ లాక్కున్న సల్మాన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement