బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవ్‌గన్ మరాఠా యోధుడిగా నటించిన చిత్రం ‘తాన్హాజీ: ది అన్‌సంగ్ వారియర్’. ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నిజజీవితంలో భార్యాభర్తలైన అజయ్ దేవగన్, కాజోల్ రీల్ లైఫ్‌లో భార్యాభర్తలుగా నటించారు. ఈ సినిమా అందరినీ ఆశ్చర్యపరుస్తూ వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. ఇక జనవరి 10న విడుదలైన ఈ చిత్రం 11 రోజుల్లోనే రూ.175 కోట్లు కురిపించింది. అదే రోజు విడుదలైన ‘ఛపాక్’ ఆశించిన ఫలితాలను రాబట్టలేకపోయింది. ఎన్ని ప్రమోషన్లు చేసినప్పటికీ ఛపాక్.. తాన్హాజీ ధాటికి ఎదురునిలవలేకపోయింది.
ఇక తాన్హాజీ చిత్రానికి మహారాష్ట్ర ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ సినిమా రెండో వారంలోనూ ధీటుగా వసూళ్లు రాబడుతుండటంతో రూ.200 కోట్లను అందుకోవడం ఖాయమని ఆయన అభిమానులు తేల్చి చెప్తున్నారు. తాన్హాజీ రిలీజైన మూడు రోజులకే హాఫ్ సెంచరీ, ఆరు రోజులకే సెంచరీ కొట్టగా మరిన్ని రికార్డులు బద్ధలు చేసే దిశగా వసూళ్ల కొనసాగుతున్నాయి. ఇక ఈ చారితత్రాత్మక చిత్రం అజయ్ దేవ్‌గన్ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన రెండో చిత్రంగా నిలిచింది.
చదవండి:
Comments
Please login to add a commentAdd a comment