‘తానాజీ’ నుంచి మరో ట్రైలర్ విడుదల | Taanaji: The Unsung Warrior Second Trailer Out | Sakshi
Sakshi News home page

‘తానాజీ’ నుంచి మరో ట్రైలర్ విడుదల

Published Mon, Dec 16 2019 10:24 PM | Last Updated on Mon, Dec 16 2019 10:24 PM

Taanaji: The Unsung Warrior Second Trailer Out - Sakshi

మరాఠా యోథుడు ఛత్రపతి శివాజీ సేనకు సైన్యాధిపతి తానాజీ మలుసరే జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న బాలీవుడ్ చిత్రం తానాజీ: ది అన్ సంగ్ వారియర్’ నుంచి రెండో ట్రైలర్ ఈరోజు విడుదలైంది. తానాజీ పాత్రలో అజయ్ దేవగణ్, ఆయన భార్య సావిత్రి పాత్రలో కాజోల్ నటిస్తున్నారు. ‘మొఘల్ సామ్రాజ్యాన్ని వణికించిన మెరుపుదాడులు..’ అంటూ ప్రారంభమయ్యే ట్రైలర్ లో యుద్ధ సన్నివేశాలు, నటీనటుల డైలాగ్స్, సెంటిమెంటల్ సీన్స్ ఉన్నాయి. జనవరి 10న విడుదల కానున్న ఈ చిత్రానికి ఓం రావత్ దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ సినిమాలో టైటిల్ పాత్రధారి తానాజీగా  అజయ్ దేవ్‌గణ్ నటించాడు. ఆయన భార్య సావిత్రిబాయి మలుసరే పాత్రలే అజయ్  నిజ జీవిత భాగస్వామి కాజోల్ నటించడం విశేషం. సైఫ్ అలీ ఖాన్ ఉదయ్ భాన్ అనే ఔరంగజేబుకు నమ్మిన బంటుగా నటించాడు. ఇక ‘సర్ధార్ గబ్బర్ సింగ్’ చిత్రంలో విలన్‌గా నటించిన శరత్ కేల్కర్ ఈ చిత్రంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ పాత్రలో నటించాడు.  ఈ సినిమాలో జగపతిబాబు మరో ముఖ్యపాత్ర శెలార్ మామా పాత్రలో నటించాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement