ముంబై: బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవ్‌గన్ హీరోగా తెరకెక్కిన పిరియడ్ డ్రామ ‘తన్హాజీ : ది అన్‌సంగ్ వారియర్’. బాక్సాఫీస్ వద్ద అద్భుతంగా రాణిస్తోంది. గత శుక్రవారం విడుదలైన ఈ సినిమా మూడు రోజుల్లో ఏకంగా రూ. 61.7 కోట్లు వసూలు చేసింది. మరాఠా యోధుడి కథ కావడంతో మహారాష్ట్రలో అద్భుతంగా వసూళ్లు రాబడుతున్న ఈ మూవీ... ఇటు మెట్రో నగరాల్లోని మల్టిప్లెక్స్‌ల్లో, మాస్ థియేటర్లలో సత్తా చాటుతోంది. శుక్రవారం తొలిరోజు రూ. 15.10 కోట్లు, శనివారం రూ. 20.57 కోట్లు రాబట్టిన తన్హాజీ.. ఆదివారం మరింతగా పుంజుకొని రూ. 26.08 కోట్లు రాబట్టిందని, మొత్తంగా రూ. 61.75 కోట్లను ఈ సినిమా మూడోరోజుల్లో రాబట్టిందని ట్రెడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు.
ఓం రౌత్ దర్శకత్వంలో అజయ్ దేవ్‌గన్ ఫిల్మ్స్, టీ-సిరీస్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించాయి. ఛత్రపతి శివాజీ మహారాజ్ సైన్యాధ్యక్షుడైన తన్హాజీ మలుసరే జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. 1670లో జరిగిన సింహగఢ్ యుద్ధంలో కీలక పాత్ర పోషించిన ఈ మరాఠా యోధుడి పాత్రలో అజయ్ దేవగన్ నటిస్తుండగా, ఆయన భార్య సావిత్రిబాయి ములుసరేగా కాజోల్ నటించారు. విలన్ పాత్రలో సైఫ్ అలీఖాన్ నటించారు. 3డీ టెక్నాలజీలో భారీ బడ్జెట్‌తో ఈ చిత్రం తెరకెక్కింది.
Comments
Please login to add a commentAdd a comment