
అజయ్ దేవగన్
ప్రస్తుతం బాలీవుడ్ అంతా బయోపిక్‌ల హవా నడుస్తోంది. అజయ్ దేవగన్ కూడా బయోపిక్‌కి రెడీ అయ్యారు. ఒకటి కాదు ఏకంగా రెండు బయోపిక్‌లను లైన్‌లో పెట్టారు. మరాఠా సామ్రాజ్యంలోని ముఖ్య జనరల్ తానాజీ, పూలన్‌దేవిని చంపిన బందిపోటు షేర్ సింగ్ రానా పాత్రలను తెరమీదకు తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారట. బయోపిక్‌లో యాక్ట్ చేయడం అజయ్‌కి ఇది ఫస్ట్ టైమ్ ఏం కాదు. 2002లో ‘ది లెజెండ్ ఆఫ్ భగత్‌సింగ్’ చిత్రంలో భగత్‌సింగ్ పాత్రలో కనిపించారు. ఆల్రెడీ ‘తానాజీ : ది అన్‌సంగ్ హీరో’ చిత్రంలో తానాజీ పాత్ర కోసం ప్రిపరేషన్ మొదలుపెట్టేసిన అజయ్ దేవ్‌గన్.. షేర్ సింగ్ బయోపిక్‌ను వచ్చే ఏడాది చివర్లో మొదలుపెట్టనున్నారట.
Comments
Please login to add a commentAdd a comment