Pulan Devi
-
ఫూలన్‌దేవి హత్య 25 జూలై 2001
పార్లమెంటు సమావేశాలు జరుగుతుండగా మధ్యాహ్న భోజన విరామ సమయంలో అక్కడి సమీపంలోని తన నివాసానికి వెళ్లిన మీర్జాపూర్ లోక్‌సభ ఎంపీ పూలన్దేవిపై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. ముసుగులు ధరించి వచ్చిన ఆ ఆంగతకుల కాల్పుల్లో ఫూలన్‌దేవి అక్కడిక్కడే మరణించారు. 1981లో ఉత్తరప్రదేశ్‌లోని బెహ్మాయ్ గ్రామంలో 22 మంది ఠాకూర్లను ప్రతీకార దాడి చేసి చంపినందుకు ఫూలన్ దేవి హత్య జరిగి ఉండవచ్చునని భావించారు. ఫూలన్‌దేవికి ‘బందిపోటు రాణి’ అని పేరు. బాల్యం నుంచీ ఆమె అనేకసార్లు అన్యాయానికి, దౌర్జన్యానికి, అత్యాచారాలకు గురయ్యారు. పదకొండేళ్లకే ఆమెకు నిర్బంధ వివాహం జరిగింది. ఆ అనుభవాలు ఆమెను చంబల్‌లోయ బందిపోటుగా మార్చాయి. అగ్రవర్ణాల వారికి, పోలీసులకు ఆమె సింహస్వప్నం అయ్యారు. చివరికి ప్రభుత్వ మధ్యవర్తిత్వంతో చట్టానికి లొంగిపోయారు. 1998లో తన 34 ఏళ్ల వయసులో పూలన్ దేవి సమాజ్‌వాదీ పార్టీ ఎంపీగా ఎన్నికయ్యారు. ఇదే ఏడాది మరికొన్ని పరిణామాలు అధికారికంగా కోల్‌కతా అయిన కలకత్తా ఢిల్లీలోని అమెరికా దౌత్యకార్యాలయాన్ని పేల్చేయడానికి ఒసాబా బిన్ లాడెన్ పన్నిన పథకాన్ని భగ్నం చేసిన పోలీసులు. విమాన ప్రమాదంలో కాంగ్రెస్ నేత మాధవరావ్ సింధియా దుర్మరణం. గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోదీ. (చదవండి: సైనికులు కావలెను.. వేతనం : మృత్యువు, వెల : ఆత్మార్పణం) -
‘పూలన్‌దేవి’ కేస్ డైరీ మాయం
కాన్పూర్ దేహత్: బందిపోటు రాణి పూలన్ దేవి.. 1981 ఫిబ్రవరి 14వ తేదీన ఆ పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ దేహత్ జిల్లా బెహ్మాయి గ్రామానికి చెందిన ఠాకూర్ కులస్తులైన 20 మందిని పూలన్‌దేవి ముఠా ఊచకోత కోసింది. తనపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారనే ఆగ్రహంతో ఆమె ఈ రూపంలో తీవ్ర ప్రతీకారం తీర్చుకుంది. దాదాపు నలబై ఏళ్ల పాటు కోర్టులో వివిధ పరిణామాల మధ్య కొనసాగిన ఈ కేసు తుది దశకు రాగా, మరో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. బెహ్మాయి హత్యకాండగా పేరున్న ఈ ఘటనకు సంబంధించిన కీలకమైన కేసు డైరీ మాయమైంది. కోర్టు రికార్డుల్లో నుంచి బెహ్మాయి హత్యాకాండ కేసు డైరీ కనిపించకుండా పోయిందని సిబ్బంది చెప్పడంతో తీర్పును ప్రత్యేక కోర్టు (ఉత్తరప్రదేశ్‌లోని బందిపోటు ప్రభావిత ప్రాంత) జడ్జి సుధీర్ కుమార్ ఈనెల 24కు వాయిదా వేసినట్లు పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజీవ్ పోర్వాల్ తెలిపారు. దీని వెనుక ఎటువంటి కుట్ర లేదని ఆయన స్పష్టం చేశారు. నిందితుల తరఫు న్యాయవాది స్పందిస్తూ.. ఈ కేసు తుది తీర్పులో అలవిమాలిన జాప్యం, అనుమానాస్పదంగా కేసు డైరీ మాయంకావడాన్ని అలహాబాద్ హైకోర్టు దృష్టికి తీసుకెళతామని తెలిపారు. భారత బందిపోటు రాణి! రాజకీయాల్లోకి ప్రవేశించిన పూలన్‌దేవి సమాజ్‌వాదీ పార్టీ తరఫున 1996, 1999 ఎన్నికల్లో మిర్జాపూర్ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఆమెపై ఉన్న 55 కేసులను ‘ప్రజాభీష్టం మేరకు’అప్పటి యూపీ సీఎం ములాయం సింగ్ ఎత్తి వేస్తున్నట్లు ప్రకటించారు. అయితే, ఆ నిర్ణయాన్ని కాన్పూర్ కోర్టు పక్కనబెట్టింది. తనపై కేసులన్నిటినీ కొట్టేయాల్సిందిగా పూలన్‌దేవి సుప్రీంకోర్టులో 2001లో పిటిషన్ వేయగా.. ముందుగా కాన్పూర్ కోర్టులో లొంగిపోవాలని కోర్టు సూచించింది. అవేమీ జరగకుండానే, ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో ఉండగా పూలన్‌దేవిని అదే ఏడాది దుండగులు కాల్చి చంపారు. సంచలనాలమయమైన ఆమె జీవిత కథ ఆధారంగా శేఖర్ కపూర్ దర్శకత్వంలో తీసిన ‘ఇండియాస్ బాండిట్ క్వీన్: ది ట్రూ స్టోరీ ఆఫ్ పూలన్‌దేవి’ సినిమా హిట్టయ్యింది. పూలన్ దేవి పాత్రధారి సీమా బిశ్వాస్ ఉత్తమ నటిగా జాతీయ అవార్డు పొందారు. అత్యాచారానికి తీవ్ర ప్రతీకారం బందిపోటు రాణి పూలన్ దేవి ముఠా 1981 ఫిబ్రవరి 14వ తేదీన కాన్పూర్ దేహత్ జిల్లా బెహ్మాయి గ్రామానికి చెందిన ఠాకూర్ కులస్తులైన 20 మందిని ఊచకోత కోసింది. ఆ గ్రామంలోని ఠాకూర్ కులస్తులు లాలా రామ్, శ్రీరామ్ అనే వారు తనపై అత్యాచారానికి పాల్పడినందుకు ప్రతీకారంగానే ఆమె ఈ హత్యాకాండకు ఒడిగట్టిందని చెబుతారు. ఈ ఘటన అప్పట్లో యూపీ ప్రభుత్వాన్ని కుదిపేసింది. అప్పటి సీఎం వీపీ సింగ్ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేశారు. అనంతరం ఆయన ప్రధానమంత్రి అయిన విషయం తెలిసిందే. ఈ కేసులో పూలన్ దేవితోపాటు 35 మందిపై అభియోగాలు నమోదయ్యాయి. వీరిలో 8 మంది పోలీసుల ఎన్కౌంటర్లో మృతి చెందగా మరో ముగ్గురు జాడ తెలియకుండా పోయారు. రెండేళ్ల తర్వాత 1983లో పూలన్‌దేవి మధ్యప్రదేశ్ పోలీసుల ఎదుట లొంగిపోయింది. మధ్యప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన క్షమాభిక్ష పథకం కింద పూలన్‌దేవి ఆ రాష్ట్రంలో లొంగిపోయారు. దీంతో ఆమెను ఉత్తరప్రదేశ్ పోలీసులకు అప్పగించడానికి బదులుగా అప్పటి సీఎం అర్జున్ సింగ్ ఆమెను జైలుకు తరలించారు. యూపీ పోలీసులు, కాన్పూర్ కోర్టు ఎన్ని సమన్లు, నాన్‌బెయిలబుల్ వారెంట్లు పంపినా ప్రభుత్వం పూలన్‌దేవికి అందజేయకుండా వెనక్కి పంపింది. 11 ఏళ్లపాటు గ్వాలియర్, జబల్పూర్ జైళ్లలో గడిపిన ఆమె..ఎటువంటి విచారణ లేకుండానే 1994లో జైలు నుంచి విడుదలయ్యారు. హత్యాకాండకు సంబంధించి పూలన్‌దేవి ముఠాలోని పోషా జైలు జీవితం గడుపుతుండగా, బిఖా, విశ్వనాథ్, శ్యామ్‌బాబు అనే వారు బెయిల్‌పై బయట ఉన్నారు. మాన్సింగ్ సహా మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారు. ఈ కేసులో మిగిలిన నలుగురు నిందితులపై 2012లో నేరారోపణ జరిగింది. -
డబుల్ ధమాకా
ప్రస్తుతం బాలీవుడ్ అంతా బయోపిక్‌ల హవా నడుస్తోంది. అజయ్ దేవగన్ కూడా బయోపిక్‌కి రెడీ అయ్యారు. ఒకటి కాదు ఏకంగా రెండు బయోపిక్‌లను లైన్లో పెట్టారు. మరాఠా సామ్రాజ్యంలోని ముఖ్య జనరల్ తానాజీ, పూలన్‌దేవిని చంపిన బందిపోటు షేర్ సింగ్ రానా పాత్రలను తెరమీదకు తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారట. బయోపిక్‌లో యాక్ట్ చేయడం అజయ్‌కి ఇది ఫస్ట్ టైమ్ ఏం కాదు. 2002లో ‘ది లెజెండ్ ఆఫ్ భగత్‌సింగ్’ చిత్రంలో భగత్‌సింగ్ పాత్రలో కనిపించారు. ఆల్రెడీ ‘తానాజీ : ది అన్సంగ్ హీరో’ చిత్రంలో తానాజీ పాత్ర కోసం ప్రిపరేషన్ మొదలుపెట్టేసిన అజయ్ దేవ్గన్.. షేర్ సింగ్ బయోపిక్‌ను వచ్చే ఏడాది చివర్లో మొదలుపెట్టనున్నారట. -
పూలన్ హంతకుడు రాణానే!
షేర్‌సింగ్‌ను దోషిగా నిర్ధారించిన ఢిల్లీ కోర్టు మిగతా 10 మంది నిర్దోషులుగా విడుదల న్యూఢిల్లీ: సంచలనాత్మక పూలన్ దేవి హత్య కేసులో ప్రధాన నిందితుడు షేర్సింగ్ రాణా(38)ను దోషిగా కోర్టు నిర్ధారించింది. ఢిల్లీలోని అదనపు సెషన్స్ కోర్టు న్యాయమూర్తి భరత్ పరాష్కర్ గత పదమూడేళ్లుగా సాగుతున్న ఈ కేసుపై శుక్రవారం తీర్పునిచ్చారు. రాణాను దోషిగా నిర్ధారిస్తూ.. మిగిలిన 10 మంది నిందితులను సరైన సాక్ష్యాధారాలు లేవంటూ నిర్దోషులుగా విడుదల చేశారు. రాణాకు శిక్షను ఆగస్టు 12న ప్రకటించనున్నారు. తీర్పు సందర్భంగా ‘నన్ను ఒక్కడినే దోషిగా ఎందుకు నిర్ధారించారు? మిగతావారు కూడా నాతో ఉన్నారు కదా!’ అని రాణా జడ్జిని ప్రశ్నించగా.. ‘నా తీర్పుపై హైకోర్టుకు అపీల్‌కు వెళ్లొచ్చు’ అని న్యాయమూర్తి సమాధానమిచ్చారు. రాణాపై భారతీయ నేర శిక్షాస్మృతిలోని సెక్షన్ 302(హత్య), సెక్షన్ 307(హత్యాయత్నం) సహా పలు ఇతర సెక్షన్ల ప్రకారం విచారణ జరిపారు. సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ, మాజీ బందిపోటు అయిన పూలన్‌దేవి హత్య అనంతరం రాణా, ఆయన సోదరుడు విజయ్‌సింగ్ సహా 11 మందిపై ఢిల్లీ పోలీసులు చార్జిషీట్ దాఖలు చేశారు. ఠాకూర్ల నేతగా ఎదిగేందుకే రాణా ఈ హత్యకు పథకం పన్నాడని, ఈ హత్య వెనుక మరో కారణం కానీ, మరెవరి హస్తం కానీ లేదని తమ రహస్య దర్యాప్తులో తేలిందని కోర్టుకు సమర్పించిన చార్జిషీట్లో పోలీసులు వివరించారు. నేపథ్యం..: బందిపోటు రాణిగా ప్రఖ్యాతి గాంచిన పూలన్‌దేవి 1963లో ఉత్తరప్రదేశ్‌లో జన్మించారు. పరిస్థితుల కారణంగా బందిపోటుగా మారారు. బందిపోటు ముఠాలోని తగాదాల కారణంగా ఠాకూర్ల చేతిలో సామూహిక అత్యాచారానికి గురయ్యారు. ఆ తరువాత కొన్నాళ్లకు తనపై అత్యాచారం జరిపిన బెహమాయి గ్రామంలోకి తన బృందంతో వచ్చి అక్కడి ఠాకూర్లను వరుసగా నిల్చోబెట్టి తుపాకీ తూటాలకు బలిచేశారు. 1981లో జరిగిన ఆ ఘటన దేశవ్యాప్తంగా ‘బెహమాయి మారణకాండ’గా ప్రసిద్ధి గాంచింది. కొద్ది కాలం తరువాత పోలీసులకు లొంగిపోయి, దాదాపు 11 ఏళ్లపాటు జైలు జీవితం గడపారు. అనంతరం యూపీలోని సమాజ్‌వాదీ ప్రభుత్వం ఆమెపై కేసులను ఎత్తివేయడంతో రాజకీయ జీవితం ప్రారంభించారు. 1996లో, 1999లో ఎంపీగా గెలిచారు. చార్జిషీట్ ప్రకారం..: 2001 జూలై 25న పార్లమెంటు సమావేశాలకు హాజరై మధ్యాహ్న భోజనం కోసం తిరిగి వచ్చిన పూలన్‌దేవి(37)ని ఆమె నివాసం ముందు మాస్కులు ధరించి రాణా సహా ముగ్గురు దుండగులు అతి దగ్గర నుంచి కాల్చి చంపారు. అంతకుముందు ఠాకూర్ల వర్గానికి చెందిన రాణా రూర్కీలో ఆయుధాల దుకాణం ఉన్న తన మిత్రుడి వద్ద ఆయుధాలు సమకూర్చుకుని రెండు మారుతి కార్లలో విక్కీ, శేఖర్, రాజ్బీర్, ఉమా కాశ్యప్, ఆమె భర్త విజయ్ కాశ్యప్లతో కలిసి జూలై 25 ఉదయం ఢిల్లీ వచ్చాడు. జూలై 25న మధ్యాహ్నం పూలన్ ఇంటి వద్ద మాటువేసి ఆమె రాగానే బుల్లెట్ల వర్షం కురిపించారు.