Ajay Devgan
-
భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న హిస్టారికల్ మూవీ..
-
సినిమా ప్లాప్ అయితే రెమ్యునరేషన్ వద్దు: స్టార్ హీరోలు
బాలీవుడ్ స్టార్ హీరోలు అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్‌లు తమ రెమ్యునరేషన్ల గురించి ఓపెన్‌గానే మాట్లాడారు. తాజాగా జరిగిన హిందూస్థాన్ టైమ్స్ లీడర్షిప్ సమ్మిట్ 2024లో వారిద్దరూ పాల్గొన్నారు. ఈ క్రమంలో బాలీవుడ్లో ఉన్న ఐక్యత గురించి కూడా చర్చించారు. ఒక సినిమా కోసం వారు ఎలా రెమ్యునరేషన్ తీసుకుంటారో చెప్పుకొచ్చారు. ఈ విషయం తెలిసిన తర్వాత ఫ్యాన్స్ కూడా షాక్ అయ్యారు.లాభాలు వస్తేనే రెమ్యునరేషన్: అక్షయ్ కుమార్ఒక సినిమాకు రెమ్యునరేషన్ అనేది స్క్రిప్ట్, కథలో ప్రాధాన్యతను బట్టే రెమ్యునరేషన్ తీసుకోవాలని అక్షయ్ కుమార్ అభిప్రాయపడ్డారు. అయితే, ప్రస్తుతం చాలామంది హీరోలు సినిమాకు వచ్చే లాభాల నుంచి షేర్ తీసుకునేందుకు ఒప్పందం చేసుకుంటారని ఆయన అన్నారు. అందులో తాను కూడా ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ క్రమంలో సినిమా అనుకున్న ఫలితం ఇవ్వకపోతే నిర్మాతకు రికవరీ ఉండదు. దీంతో హీరోలు తమ పారితోషికాన్ని పూర్తిగా వదులుకున్న సందర్భాలు చాలా ఉన్నాయని ఆయన గుర్తు చేసుకున్నారు. ఇలా చేయడానికి ప్రధాన కారణం సినిమా పరిశ్రమపై ఉన్న మక్కువే అంటూ అక్షయ్ తెలిపారు. అయితే, సినిమా భారీ విజయం సాధిస్తే మాత్రం మంచి రెమ్యునరేషన్ వస్తుందని కూడా ఆయన అన్నారు. నిర్మాతకు వచ్చిన లాభంలో మాత్రమే తాము వాటా తీసుకుంటామని ఆయన తెలిపారు. ఇలా చేయడం వల్ల నిర్మాత సేఫ్‌గా ఉంటారని అన్నారు. అదే సినిమా ప్లాప్ అయితే మాత్రం నిర్మాతతో పాటు తమకు కూడా నష్టాలు తప్పవని అక్షయ్ పేర్కొన్నారు.సినిమా ప్లాప్ అయితే రెమ్యునరేషన్ తీసుకోను: అజయ్ దేవగణ్చిత్ర పరిశ్రమలో సినిమా బడ్జెట్ పెరుగుతుందని అజయ్ దేవగణ్ అభిప్రాయపడ్డారు. తాను నటించిన సినిమా విజయం సాధించకపోతే రెమ్యునరేషన్ తీసుకోనని ఆయన బహిరంగంగానే వెల్లడించారు. సినిమాకు వచ్చిన కలెక్షన్స్ ఆధారంగానే తాను పారితోషకం తీసుకుంటానని చెప్పుకొచ్చారు. దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమతో పోలిస్తే బాలీవుడ్లో అంతగా ఐక్యత లేదని ఆయన అన్నారు. సౌత్ సినీ ఇండస్ట్రీ తమ నటీనటులకు మద్దతుగా ఉంటుందని ఆయన గుర్తుచేశారు. అయితే, అక్షయ్ కుమారు, షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఆమీర్ ఖాన్లు మాత్రం మంచి స్నేహంగా ఉంటారని అజయ్ దేవగణ్ తెలిపారు. ఈ క్రమంలో ఒక కొత్త ప్రాజెక్ట్ కోసం తానే డైరెక్షన్ చేయబోతున్నట్లు అజయ్ దేవగణ్ తెలిపారు. ఇందులో అక్షయ్ కుమార్ ఒక ప్రధాన పాత్రలో కనిపిస్తారని రివీల్ చేశారు.#AkshayKumar and #AjayDevgn talks about their fees. They are right if Akki is producer and movies like padman and toilet did 300 cr+ worldwide definitely he will earn 100 cr plus per movie. And if he sign other producers movie like bmcm he might get nothing. Its proper business. pic.twitter.com/OVlpOj2FXe— axay patel🔥🔥 (@akki_dhoni) November 16, 2024 -
భారీ యాక్షన్ సీన్స్‌తో 'సింగం ఎగైన్' ట్రైలర్
బాలీవుడ్లో అజయ్ దేవగణ్, దీపిక పదుకొణె నటించిన 'సింగం అగైన్' విడుదలకు సిద్ధంగా ఉంది. భారీ యాక్షన్ ఎపిసోడ్స్‌తో ఉన్న ట్రైలర్‌ను తాజాగా మేకర్స్ విడుదల చేశారు. ఈ చిత్రంలో బాలీవుడ్‌కు చెందిన భారీ తారాగణమే ఉంది. ఇప్పటికే విడుదలైన 'సింగం' ఫ్రాంఛైజీలోని చిత్రాలను ప్రేక్షకులు భారీగానే ఆదరించారు.కాప్ యూనివర్స్ సినిమాగా రోహిత్ శెట్టి తెరకెక్కించారు. ఇందులో రణ్వీర్ సింగ్, జాకీ ష్రాఫ్, టైగర్ ష్రాఫ్, కరీనా కపూర్ వంటి స్టార్స్ నటించడంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. 4.58 నిమిషాల నిడివితో ఉన్న ట్రైలర్ మెప్పించేలా ఉంది. దీపావళి సందర్భంగా నవంబర్ 1న ఈ చిత్రం విడుదల కానుంది -
కుమారుడి బర్త్ డే.. బాలీవుడ్ స్టార్ కపుల్ స్పెషల్ విషెస్
బాలీవుడ్ మోస్ట్ ఫేమ్ జంటల్లో అజయ్ దేవగణ్, కాజోల్ ఒకరు. వీరిద్దరికీ ఓ కూతురు నైసా, కుమారుడు యుగ్ సంతానం ఉన్నారు. ఇవాళ కుమారుడు యుగ్ తన 14వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా అజయ్, కాజోల్ కుమారుడికి జన్మిదిన శుభాకాంక్షలు తెలిపారు. కొడుకుతో దిగన ఫోటోలను షేర్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా విషెస్ చెప్పారు. దీనికి సంబంధింటిన ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరలవుతున్నాయి.సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఫ్యామిలీతో కలిసి చిల్ అవుతుంటారు ఈ జంట. తమ పిల్లలతో కలిసి వెకేషన్స్‌కు వెళ్తుంటారు. ఇక సినిమాల విషయానికొస్తే అజయ్ దేవగణ్ ఈ ఏడాది ప్రారంభంలో మైదాన్ మూవీతో ప్రేక్షకులను మెప్పించారు. ప్రస్తుతం సింగం ఏగైన్, దే దే ప్యార్ దే-2 చిత్రాల్లో నటిస్తున్నారు. మరోవైపు కాజోల్ ప్రభుదేవా సరసన మహారాగ్ని అనే చిత్రంలో కనిపించనుంది. ఈ చిత్రాన్ని రాజీవ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. కాగా..కాజోల్, అజయ్ 1994లోనే డేటింగ్ ప్రారంభించారు. ఆ తర్వాత వీరిద్దరు 1999లో వివాహం చేసుకున్నారు. View this post on Instagram A post shared by Ajay Devgn (@ajaydevgn) View this post on Instagram A post shared by Kajol Devgan (@kajol) -
సినిమాల్లోకి రాకముందే ఆ హీరోతో పరిచయం: హీరోయిన్
బాలీవుడ్ భామ టబు తెలుగువారికి సుపరిచితమే. టాలీవుడ్లో మెగాస్టార్ అందరివాడు చిత్రంలో మెరిసింది. అంతకుముందే విక్టరీ వెంకటేశ్, నాగార్జున సరసన నటించింది. ప్రస్తుతం బాలీవుడ్లో బిజీగా ఉన్న ముద్దుగమ్మ ఇటీవల క్రూ సినిమాతో ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం అజయ్ దేవగన్‌తో కలిసి ఆరోన్ మే కహన్ దమ్ థా చిత్రంలో నటిస్తోంది. త్వరలోనే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ముద్దుగుమ్మ అజయ్ దేవగణ్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ గురించి మాట్లాడింది.టబు మాట్లాడుతూ..'అజయ్ దేవగన్‌ని తాను చాలా గౌరవిస్తా. నాకు ఏదైనా చిత్రనిర్మాతతో సమస్యలు వచ్చినప్పుడల్లా నా తరపున మాట్లాడడానికి అజయ్‌ను పిలుస్తాను. అతను నాతో పూర్తిగా స్వతంత్రంగా ఉంటాడు. అంతే కాదు నాతో పనిచేయడానకి కూడా ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు. అజయ్ నా నిర్ణయాలలో ఎలాంటి జోక్యం చేసుకోడు. ఒకరిని ప్రభావితం చేయడానికి ఎప్పుడూ ప్రయత్నించడు. ఎందుకంటే అతను ప్రతి ఒక్కరినీ గౌరవిస్తాడు' అని తెలిపింది.అంతే కాకుండా అజయ్ తన సోదరుడికి చిన్ననాటి స్నేహితుడని.. టీనేజ్ నుంచే తాము ఒకరికొకరు తెలుసని టబు తెలిపింది. మేమిద్దరం కలిసి పెరిగామని.. అతను సినిమాల ద్వారా నాకు పరిచయం కాలేదని పేర్కొంది. ఇతర సహనటుల కంటే.. ఆయనతో ఉన్న రిలేషన్ వేరని ఆమె అన్నారు. ఆయనకు పెళ్లయినప్పటికీ మా మధ్య రిలేషన్లో ఎలాంటి మార్పులేదని తెలిపింది. ఆయనకు సినిమా అంటే మక్కువ అని.. దర్శకుడు కావాలని కోరుకున్నట్లు ఆమె వివరించింది. -
అజయ్ దేవగన్ నివాసంలో అనంత్ అంబానీ - వీడియో
అనంత్ అంబానీ వచ్చే నెలలో రాధికా మర్చంట్‌ను వివాహం చేసుకోనున్నారు. వివాహ సన్నాహాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. తమ పెళ్ళికి ఆహ్వానించడానికి అనంత్ అంబానీ స్వయంగా అజయ్ దేవగన్, కాజోల్ నివాసానికి వెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో అనంత్ అంబానీ.. అజయ్ దేవగన్ ఇంటి నుంచి బయటకు వచ్చి తన రోల్స్ రాయిస్ కారులోకి వెళ్లడం చూడవచ్చు. ఆ తరువాత తన సెక్యూరిటీ సిబ్బందితో కలిసి అక్కడ నుంచి వెళ్లిపోయారు.ఇదిలా ఉండగా అనంత్ అంబానీ తల్లి నీతా అంబానీ కాశీ విశ్వనాథ్ ఆలయాన్ని సందర్శించారు. అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ల పెళ్లి కార్డును దేవుని చెంత ఉంచడానికి, దేవుని ఆశీర్వాదం పొందటానికి అక్కడకు వెళ్లినట్లు నీతా అంబానీ పేర్కొన్నారు. దీనికి సంబంధించిన చాలా వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.జూలై 12న పెళ్లి2024 జులై 12న వీరి పెళ్లి జరుగుతుందని ఇప్పటికే వారిరువురి కుటుంబాలు పేర్కొన్నాయి. అనంత్ & రాధికల పెళ్లి ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో మూడు రోజులు జరగనుంది. జులై 12న వివాహం, 13న శుభ్ ఆశీర్వాద్, 14న మంగళ ఉత్సవ్ లేదా రిసెప్షన్ ఉండనున్నట్లు తెలుస్తోంది. వీరి పెళ్ళికి ప్రపంచం నలుమూలల నుంచి ప్రముఖులు హాజరుకానున్నారు.ముకేశ్ & నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ.. రిలయన్స్ ఇండస్ట్రీస్, జియో ప్లాట్‌ఫారమ్‌లు, రిలయన్స్ రిటైల్ వెంచర్స్, రిలయన్స్ న్యూ ఎనర్జీ, రిలయన్స్ న్యూ సోలార్ ఎనర్జీతో సహా పలు రిలయన్స్ గ్రూప్ కంపెనీల బోర్డులలో డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. View this post on Instagram A post shared by Voompla (@voompla) -
ఓటీటీకి రూ.200 కోట్ల హారర్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
అజయ్ దేవ్‌గణ్, తమిళ స్టార్లు జ్యోతిక, మాధవన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం సైతాన్. ఇటీవల థియేటర్లలో రీలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. హారర్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. మార్చి 8న విడుదలై ఇప్పటి వరకు రూ.200 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది. దీంతో సైతాన్ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం ఆడియన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ మూవీ త్వరలోనే ఓటీటీ స్ట్రీమింగ్కు రానుందని టాక్ నడుస్తోంది. కాగా.. ఇప్పటికే ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. మే 3వ తేదీ నుంచి సైతాన్ మూవీ నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని లేటేస్ట్ టాక్. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఆ రోజు నుంచి స్ట్రీమింగ్ అయితే థియేటర్లలో రిలీజైన 8 వారాల తర్వాత ఓటీటీలో సందడి చేయడం ఖాయంగా కనిపిస్తోంది. కాగా.. వర్ష్ అనే గుజరాతీ సినిమాకు రీమేక్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ మూవీకి వికాస్ బహ్ల్ దర్శకత్వం వహించారు. ఈ మూవీని వికాస్ బహ్ల్, జ్యోతి దేశ్‌పాండే, అజయ్ దేవ్‌గణ్, అభిషేక్ పాఠక్, కుమార్ మంగత్ పాఠక్ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రంలో జానకీ బోడీవాలా, అంగద్ రాజ్ ప్రధాన పాత్రలు పోషించగా.. అమిత్ త్రివేదీ సంగీతం అందించారు. -
#Maidaan: రియల్ హీరో రహీం సాబ్.. స్కూల్ టీచర్ నుంచి కోచ్ దాకా!
స్పోర్ట్స్ డ్రామాతో తెరకెక్కిన సినిమాలు ప్రేక్షకులను ఎప్పుడూ నిరాశపరచవని ‘మైదాన్’ ద్వారా మరోసారి నిరూపితమైంది. అజయ్ దేవ్‌గణ్, ప్రియమణి ప్రధాన పాత్రల్లో అమిత్ రవీంద్రనాథ్ శర్మ రూపొందించిన ఈ చిత్రానికి మూలం సయ్యద్ అబ్దుల్ రహీం కథ. భారత ఫుట్‌బాల్ చరిత్రలో స్వర్ణాక్షరాలతో లిఖించదగ్గ పేరు ఆయనది. ఇంతకీ ఎవరాయన? ఆయన స్వస్థలం ఎక్కడ? భారత ఫుట్‌బాల్‌కు ఆయన అందించిన సేవలు ఏమిటి?.. సయ్యద్ అబ్దుల్ రహీం హైదరాబాద్ రాష్ట్రంలో 1909లో జన్మించారు. ఫుట్‌బాల్‌పై చిన్ననాటి నుంచే మక్కువ పెంచుకున్న ఆయన.. ఉపాధ్యాయుడిగా కెరీర్ ఆరంభించారు. ఆ తర్వాత ఆటకే పూర్తి సమయం కేటాయించారు. ముప్పై ఏళ్ల వయసులో కమార్ క్లబ్, యూరోపియన్ క్లబ్ తరఫున క్రీడాకారుడిగా రాణించారు. ఇక 1950లో హైదరాబాద్ సిటీ పోలీస్ క్లబ్కోచ్గా మారారు. రహీం సాబ్‌గా ప్రసిద్ధి చెందిన ఆయన మార్గదర్శనంలో హైదరాబాద్ క్లబ్ మూడు డ్యూరాండ్, ఐదు రోవర్స్ కప్‌లు గెలిచింది. ఈ క్రమంలో భారత జట్టు కోచ్‌గా రహీం బాధ్యతలు స్వీకరించిన తర్వాత పుష్కరకాలం పాటు జట్టును అత్యుత్తమ స్థాయిలో నిలిపారు. రహీం సాబ్ శిక్షణలో రాటు దేలిన టీమిండయా ప్రతిష్టాత్మక టోర్నీలో విజయాలు సాధించింది. స్వర్ణ యుగం 1951 ఆసియా క్రీడల ఫైనల్లో ఇరాన్‌ను ఓడించి స్వర్ణం కైవసం చేసుకుని గోల్డెన్ రన్ మొదలుపెట్టింది. ఇక 1956 మెల్బోర్న్ ఒలింపిక్స్‌లో సెమీ ఫైనల్ చేరి సరికొత్త చరిత్ర సృష్టించింది. అనూహ్య రీతిలో నాలుగో స్థానంలో నిలిచింది. ఇదంతా రహీం సాబ్ చలవే అనడంలో సందేహం లేదు. ఇక 1960 రోమ్ ఒలింపిక్స్‌లోనూ భారత జట్టుకు ఆయనే కోచ్‌గా వ్యవహరించారు. రహీం గైడెన్స్‌లోనే 1962 ఆసియా క్రీడల్లో భారత్ మరోసారి పసిడి పతకం సాధించింది. పీకే బెనర్జీ, చునీ గోస్వామి, పీటర్ తంగరాజ్ వంటి నైపుణ్యాలున్న ఆటగాళ్లను గుర్తించి వారిని మెరికల్లా తీర్చిదిద్దడంతో రహీం సాబ్ది కీలక పాత్ర. తన హయాంలో భారత ఫుట్‌బాల్ రూపురేఖలనే మార్చివేసిన రహీం.. ఇండియాను ‘బ్రెజిల్ ఆఫ్ ఆసియా’గా నీరాజనాలు అందుకునేలా చేశారు. బ్రిటిష్ మూస పద్ధతిలో కాకుండా.. చిన్న చిన్న పాస్‌లతో కొత్త టెక్నిక్‌ను అనుసరించేలా చేసి సత్ఫలితాలు సాధించారు. నిజానికి ఇదే శైలితో బ్రెజిల్ ఫుట్‌బాల్ జట్టు 1958, 1962 వరల్డ్‌కప్ టైటిల్స్ గెలిచింది. తనదైన శైలిలో స్ఫూర్తిదాయక ప్రసంగాలు చేసి జట్టులో సరికొత్త ఉత్సాహాన్ని నింపిన రహీం సాబ్ ఉన్నంతకాలం భారత్ ఫుట్‌బాల్ జట్టుకు ‘స్వర్ణ యుగం’లా సాగింది. అయితే, అనూహ్య పరిస్థితుల్లో కోచింగ్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్న రహీం సాబ్.. 1963లో కాన్సర్ బారిన పడ్డారు. ఇండియా ఫుట్‌బాల్‌ను కూడా సమాధిలోకి తీసుకుపోయారు అదే ఏడాది జూన్‌లో తుదిశ్వాస విడిచారు. 53 ఏళ్ల వయసులోనే అర్ధంతరంగా ఈ లోకాన్ని విడిచివెళ్లారు. ఆ తర్వాత మళ్లీ ఆ స్థాయిలో భారత్ ఫుట్‌బాల్ జట్టు విజయాలు సాధించిందే లేదు. దీనిని బట్టి చూస్తే.. ‘‘రహీమ్ సాబ్ తనతో పాటు ఇండియా ఫుట్‌బాల్‌ను కూడా సమాధిలోకి తీసుకుపోయారు’’ అంటూ సహచర ఆటగాడు ఆయనకు నివాళి అర్పిస్తూ అన్న మాటలు నూటికి నూరుపాళ్లు నిజం అనిపిస్తుంది. గుర్తింపు దక్కని యోధుడు భారత ఫుట్‌బాల్ జట్టుకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిన రహీం సాబ్‌కు మాత్రం వ్యక్తిగతంగా పెద్దగా మేలు చేకూర్చలేదు. ఆర్థికంగానూ ఆయన పొందిన ప్రయోజనాలు అంతంత మాత్రమే! ఎంతో మందిని మేటి ఫుట్బాలర్లుగా తీర్చిదిద్దిన ఈ గురువును ద్రోణాచార్య అవార్డుతోనైనా సత్కరించకపోయింది ప్రభుత్వం. ఇక రహీం సాబ్ కొడుకు సయ్యద్ షాహిద్ హకీం కూడా తండ్రి బాటలోనే నడిచారు. ఫుట్‌బాల్‌పై ఇష్టం పెంచుకున్న హకీం 1960 రోమ్ ఒలింపిక్స్‌లో భారత జట్టు సభ్యుడిగా ఉన్నారు. ఆ తర్వాత మళ్లీ ఇంకెప్పుడూ ఆయన ఒలింపిక్స్‌కు అర్హత సాధించలేదు. మైదాన్ సినిమాతో నేటి తరానికి తెలిసేలా సయ్యద్ అబ్దుల్ రహీం కథను ప్రపంచానికి పరిచయం చేయడంలో నోవీ కపాడియాది కీలక పాత్ర. అయితే, రహీం సాబ్తో పాటు ఆయన కుమారుడు హకీం, నోవీ కూడా ఇప్పుడు మన మధ్య లేకపోవడం విషాదకరం. అయితే, రియల్ హీరో అయిన రహీం మాత్రం అజరామరంగా అభిమానుల గుండెల్లో నిలిచిపోతారనడంలో సందేహం లేదు. -
బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ రేర్ పిక్స్..
-
ఓటీటీలపై అగ్రతారల కన్ను.. ఈ ఏడాది అత్యధిక పారితోషికం ఎవరికంటే?
సినీ ప్రేక్షకులు ఇప్పుడంతా ఎక్కువగా ఓటీటీలపై ఆసక్తి చూపిస్తున్నారు. కొత్త కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఎప్పటికప్పుడు ఓటీటీకి వచ్చేస్తున్నాయి. దీంతో ఓటీటీల్లో చూసేందుకే అభిమానులు మొగ్గు చూపుతున్నారు. దీంతో థియేటర్ ఆడియెన్స్‌తో పాటు నెటిజన్లను దృష్టిలో పెట్టుకుని సినిమాలను తెరకెక్కిస్తున్నారు. ఈ నేపథ్యంలో స్టార్ హీరోలు సైతం ఓటీటీ సినిమాలు, వెబ్ సిరీస్‌ల్లో నటించేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇటీవలే నాగచైతన్య సైతం దూత అనే వెబ్ సిరీస్‌లో ఎంట్రీ ఇచ్చేశారు. కాగా.. అజయ్ దేవగన్, సైఫ్ అలీ ఖాన్, తమన్నా, నవాజుద్దీన్ సిద్ధిఖీ, సోనాక్షి సిన్హా, సమంత, రాశీఖన్నా, విజయ్ సేతుపతి లాంటి స్టార్స్ సైతం ఓటీటీ వేదికలపై మెరిశారు. అయితే ఓటీటీల్లో నటించేందుకు అగ్రతారలు పారితోషికం గట్టిగానే అందుకున్నట్లు తెలుస్తోంది. ఏ పాత్రలోనైనా సరే నటించడానికి రెడీ అంటున్నారు. బాలీవుడ్ అగ్ర నటుడు అజయ్ దేవగన్ ఓటీటీలపై ఎక్కువగా ఫోకస్ పెట్టారు. 2022లో డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో ప్రసారమైన క్రైమ్ థ్రిల్లర్ షో 'రుద్ర: ది ఎడ్జ్ ఆఫ్ డార్క్నెస్'తో అజయ్ ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం ఓటీటీల్లో నటించిన స్టార్స్ పరంగా చూస్తే అత్యధిక పారితోషికం తీసుకునే నటుడు అజయ్ దేవగన్ అని లేటెస్ట్. 'రుద్ర: ది ఎడ్జ్ ఆఫ్ డార్క్నెస్' 7 ఎపిసోడ్ల కోసం దాదాపు రూ.125 కోట్లు పారితోషికం తీసుకున్నారని బాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. ఈ లెక్కన ఒక్క ఎపిసోడ్‌కు రూ. 18 కోట్లు తీసుకున్నట్లు సమాచారం. అలా ఓటీటీలో అత్యధిక పారితోషికాన్ని అందుకున్న భారతీయ నటుడిగా అజయ్ నిలిచారు. ఆ తర్వాత మరో నటుడు మనోజ్ భాజ్‌పేయి నిలిచారు. అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైన 'ది ఫ్యామిలీ మ్యాన్' క్రైమ్ థ్రిల్లర్ సిరీస్‌లో ఆయన నటించారు. ఈ సిరీస్ రెండవ సీజన్లో మనోజ్ ఏకంగా రూ. 10 కోట్ల వరకు తీసుకున్నారని టాక్. -
పొగాకు ఉత్పత్తుల ప్రకటనల్లో పాల్గొంటున్నందుకు..
లక్నో: పొగాకు కంపెనీల తరఫున ప్రకటనల్లో కన్పిస్తున్న బాలీవుడ్ నటులు షారూక్ ఖాన్, అక్షయ్‌కుమార్, అజయ్ దేవ్‌గణ్‌లకు కేంద్రం నోటీసులు పంపింది. ప్రజల ఆరోగ్యానికి చేటు తెస్తున్న పొగాకు ఉత్పత్తుల ప్రకటనల్లో సెలబ్రిటీలు, ముఖ్యంగా పద్మ అవార్డు గ్రహీతలు నటిస్తుండటంపై మోతీలాల్ యాదవ్ అనే న్యాయవాది గతంలో అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై చర్యలు తీసుకోవాలంటూ కేంద్రాన్ని కోర్టు ఆదేశించింది. కేంద్రం స్పందించడం లేదని, ఇది ధిక్కరణేనని పిటిషనర్ మరోసారి కోర్టుకు వెళ్లారు. ఈ పిటిషన్‌పై శుక్రవారం న్యాయస్థానం విచారణ చేపట్టింది. షారూక్, అక్షయ్, అజయ్‌లకు సెంట్రల్ కన్జూమర్ ప్రొటెక్షన్ అథారిటీ అక్టోబర్ 20వ తేదీనే నోటీసులిచ్చిందని కేంద్రం తరఫున డిప్యూటీ సొలిసిటర్ జనరల్ ఎస్బీ పాండే కోర్టుకు తెలిపారు. ఈ కేసు సుప్రీంకోర్టులో విచారణలో ఉన్నందున పిటిషన్‌ను కొట్టేయాలని కోరారు. విచారణ 2024 మే 9కి వాయిదా పడింది. -
కోట్ల బడ్జెట్.. రిలీజ్‌కు నోచుకొని స్టార్ హీరో సినిమా!
సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో చిన్న సినిమాల రిలీజ్‌కు చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. షూటింగ్ అంతా పూర్తి చేసుకొని రిలీజ్‌కు రెడీ అయితే... కావాల్సినన్ని థియేటర్స్ లభించవు. సినిమా కొనడానికి ఎవరూ ముందుకు రారు..వచ్చినా తక్కువకే అడుగుతుంటారు. ఇలా చిన్న సినిమాల కష్టాలు చాలా ఉంటాయి. కొన్ని సినిమాలు అయితే అసలు రిలీజ్‌కే నోచుకోవు. కానీ పెద్ద సినిమాలకు అలాంటి కష్టాలు ఉండవని అంటారు. ఎప్పుడు అంటే అప్పుడు రిలీజ్ చేసుకోవచ్చు. ముందస్తు వ్యాపారం కూడా బాగానే జరుగుతుంది. రిలీజ్ తర్వాత అట్టర్ ఫ్లాప్ టాక్ వస్తే తప్ప.. బడా సినిమాల మేకర్స్‌కు పెద్ద కష్టాలేమి ఉండవని అనుకుంటారు. కానీ వందల కోట్ల రూపాయలు పెట్టి తెరకెక్కించిన చిత్రాలు కూడా అప్పుడప్పుడు విడుదలకు నోచుకోవు. దానికి ‘మైదానం’ చిత్రమే అతి పెద్ద ఉదాహారణ అని చెప్పొచ్చు. మూడేళ్ల క్రితమే షూటింగ్ పూర్తి.. ఆర్ఆర్ఆర్తో పోటీ బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగణ్ హీరోగా, బోనికపూర్ నిర్మించిన చిత్రమే ఈ ‘మైదానం’. భారత జాతీయ ఫుట్‌బాల్ జట్టు కోచ్, మేనేజర్ (1950 –1963 సమయంలో) సయ్యద్ అబ్దుల్ రహీమ్ జీవితంలో చోటు చేసుకున్న పలు ఆసక్తికర సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు అమిత్ రవీంద్రనాథ్. కరోనా కంటే ముందే అంటే 2019లో ఈ చిత్రాన్ని ప్రకటించారు. 2020లో ఈ చిత్రం విడుదల కావాల్సింది. కానీ కరోనా మహమ్మారి కారణంగా ఆగిపోయింది. 2021లో రిలీజ్‌కు ప్లాన్ చేశారు కానీ కుదరలేదు. ఇక 2022లో ఆర్ఆర్ఆర్తో పోటీగా బరిలోకి దిగబోతున్నామని ప్రకటించారు. పోస్టర్లు కూడా విడుదల చేశారు కానీ మళ్లీ అనూహ్యంగా వాయిదా వేసుకున్నారు. రిలీజ్ కష్టమేనా బోనీ కపూర్ భారీ బడ్జెట్‌తో మైదాన్ చిత్రాన్ని నిర్మించాడు. కరోనా కారణంగా ముందుగా అనుకున్న బడ్జెట్ కంటే చాలా ఎక్కువగా ఈ చిత్రానికి ఖర్చు చేశారట. ఈ చిత్రం కోసం ఒక పెద్ద గ్రౌండ్ ని అద్దెకు తీసుకుని దాంట్లో నిజమైన గడ్డిని పెంచేలా జాగ్రత్తలు తీసుకున్నారట. రోజుకు దాదాపు 500 మందితో షూటింగ్ చేశారట. గ్యాలరీలు, స్టాండ్లు అప్పటి వాతావరణాన్ని ప్రతిబింబించేలా సెట్స్ వేశారు. అయితే లాక్‌డౌన్‌తో పాటు 2021లో వచ్చి తుపాను కారణంగా దాదాపు రూ.30 కోట్లతో నిర్మించిన సెట్స్ పూర్తిగా ధ్వంసం అయ్యాయట. ఇన్సురెన్స్ సొమ్ము కూడా రాకపోవడంతో నిర్మాతలకు పెద్ద ఎత్తున నష్టం జరిగింది. ఇప్పటికే సినిమాకు కోట్ల ఖర్చు పెట్టారు. రెండేళ్ల క్రితమే రిలీజ్ అయితే భారీగా నష్టాలు వచ్చే కావు. కానీ ఇప్పుడు రిలీజ్ చేయడానికి నిర్మాత కూడా ఇష్టపడడం లేదు. ఈ చిత్రం గురించి బోనీ కపూర్ ఇటీవల ఓ మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘జీవితంలో మొదటిసారి పరిస్థితి చేయి దాటిపోయింది. ఒక సినిమా విషయంలో ఇంతగా ఎదురు దెబ్బ తింటానని ఊహించలేదు’అని అన్నారు. దీన్ని బట్టి ‘మైదానం’ సినిమా థియేటర్స్‌లోకి రావడం కష్టమే. -
లగ్జరీ కారు కొనుగోలు చేసిన స్టార్ హీరో.. ఎన్ని కోట్లంటే?
బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ బీటౌన్‌తో పాటు దక్షిణాదిలోనూ పరిచయం అక్కర్లేని పేరు. ఇటీవలే దృశ్యం-2 సినిమాతో ప్రేక్షకులను అలరించాడు. శ్రియా శరణ్, అజయ్ దేవగణ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ సొంతం చేసుకుంది. మలయాళంలో సూపర్ హిట్ అయినా చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కించారు. బాలీవుడ్ సెలబ్రిటీలు కార్లపై ఎక్కువగా మక్కువ చూపుతుంటారు. మార్కెట్లో రిలీజైన కొత్త కార్లను కొనేందుకు ఇంట్రెస్ట్ చూపుతుంటారు. (ఇది చదవండి: హీరోలు చితకబాదేవారు, నాపై నాకే అసహ్యం వేసేది: నటుడు) తాజాగా ఈ బాలీవుడ్ హీరో ఓ ఖరీదైన కారును కొనుగోలు చేశారు. కారు విలువ దాదాపు రూ.2 కోట్ల వరకు ఉన్నట్లు తెలుస్తోంది. అజయ్ దేవగణ్ బీఎండబ్ల్యూ ఐ7 ఈవీ కారును జర్మన్ కంపెనీ తయారు చేసింది. ఇండియన్ మార్కెట్లో రంగుల్లో ఈ కారు అందుబాటులో ఉంది. అజయ్ కొనుగోలు చేసిన ఎలక్ట్రిక్ కారులో ఆధునాతన సదుపాయాలు ఉన్నాయి. (ఇది చదవండి: దుమ్ములేపుతున్న 2018 మూవీ.. రెండు రోజుల కలెక్షన్స్ ఎంతంటే..) -
సింగం సిరీస్ లో..సూర్య,అజయ్ దేవగన్
-
అజయ్ నా లవ్ ఎట్ ఫస్ట్ సైట్ కాదు.. కాజోల్ షాకింగ్ కామెంట్స్
కాజోల్.. అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసే స్టార్ హీరోయిన్లలో ఒకరు. ఎలాంటి కష్టతరమైన పాత్రలోకి అవలీలగా పరకాయ ప్రవేశం చేసి తన నటనా పటిమను చాటుకున్న బ్యూటీఫుల్ హీరోయిన్ ఆమె. 17 ఏళ్ల వయసులో 1992లో విడుదలైన 'బేఖుడి' చిత్రంతో సినీ రంగానికి పరిచయమైంది బ్యూటీఫుల్ కాజోల్. కుచ్ కుచ్ హోతా హై, దిల్వాలే దుల్హానియే లేజాయింగే, ఫనా, బాజీగర్, దుష్మన్, త్రిభంగ, కరణ్ అర్జున్, మెరుపు కలలు, వీఐపీ 2 వంటి తదిర సినిమాలతో ఎంతో పేరు తెచ్చుకుంది. కాగా.. 1999లో ఆ తర్వాత బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్‌ను ప్రేమ వివాహం చేసుకుంది. వారిద్దరికి నైసా, యుగ్ అని ఇద్దరు పిల్లలు ఉన్నారు. అజయ్, కాజోల్ కలిసి నటించిన 'తానాజీ' సినిమా 68వ జాతీయ చలన చిత్ర అవార్డులలో మూడు బహుమతులను గెలుపొందింది. అయితే గతంలో ఓ ఈవెంట్లో మాట్లాడిన కాజోల్ వారి ప్రేమ గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. అజయ్‌ను మొదటిసారి చూసినప్పుడు తనకు ఎలాంటి ఫీలింగ్ కలగలేదని కాజోల్ తెలిపింది. కాజోల్ మాట్లాడూతూ..'నేను అతన్ని హల్ చల్ మూవీ సెట్స్‌లో కలిశాను. అది మా షూటింగ్లో మొదటి రోజు. నిర్మాత నా దగ్గరకు వచ్చి అక్కడున్న వ్యక్తి హీరో అని చెప్పాడు. అతను ఒక మూలకు కుర్చీలో కూర్చున్నాడు. నేను అతన్ని చూసి 'నిజమా? అతనేనా హీరో? అని ఆశ్చర్యం వ్యక్తం చేశా. అప్పుడు నా వయసు 19 ఏళ్లు. అజయ్ ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు మాత్రమే మాట్లాడే వ్యక్తి అని గ్రహించా. ఆ తర్వాత మేం ఫ్రెండ్స్ అయ్యాం' అని అన్నారు. కాగా.. వీరిద్దరు నటించిన హల్చల్ 1995లో థియేటర్లలో విడుదలైంది. కాగా.. అజయ్ దేవగన్ ప్రస్తుతం తన తాజా చిత్రం భోలా బాక్సాఫీస్ విజయంతో దూసుకుపోతున్నాడు. లోకేష్ కనగరాజ్ చిత్రం తమిళ హిట్ మూవీని కైతిని హిందీ రీమేక్ చేయనున్నారు. ఈ చిత్రానికి అజయ్ దర్శకత్వం, నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇందులో అజయ్‌తో పాటు టబు, గజరాజ్ రావు, దీపక్ డోబ్రియాల్ కూడా ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. -
అదిరిపోయే లుక్‌తో కాజోల్.. నెటిజన్స్ దారుణమైన ట్రోల్స్
బాలీవుడ్ నటి కాజోల్ పరిచయం అక్కర్లేని పేరు. తన అందం, అభినయంతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇండస్ట్రీలో మూడు దశాబ్దాలుగా తనదైన నటనతో అలరించింది. ఆమె అందానికి దాసోహం కానివారు ఎవరూ లేరంటే అతిశయోక్తి కాదు. కానీ గత కొన్ని రోజులుగా ఆమెపై కొంతమంది నెటిజన్స్ ట్రోలింగ్ చేస్తున్నారు. కాజోల్ తాజాగా ముంబయిలో తన భర్త నటించిన చిత్రం 'భోలా' ప్రీమియర్ షోకు హాజరైంది. (ఇది చదవండి: కాజోల్ అందంపై ట్రోలింగ్.. అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన హీరోయిన్) ప్రీమియర్ షో చూసేందుకు వచ్చిన కాజోల్ తెల్లటి కోటుతో పాటు డిఫరెంట్ లుక్‌లో కనిపించింది. ఆమె వెంట కొడుకు యుగ్, తల్లి తనూజ, భర్త అజయ్ దేవగన్ కూడా ఉన్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్స్ కాజోల్ డ్రెస్‌పై కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియో చూసిన కొందరైతే కాజోల్ మరింత అందంగా కనిపిస్తోందంటూ ట్రోల్స్ చేస్తున్నారు. చాలామంది ఆమె లుక్, నడకపై ట్రోల్స్ చేశారు. ఆమె దుస్తులతో పాటు నడక మరింత విచిత్రంగా ఉందంటూ పోస్టులు పెడుతున్నారు. కొందరు ఫ్యాన్స్ అయితే ఏకంగా కాజోల్ ప్రస్తుతం గర్భవతినా? అంటూ కామెంట్స్ చేశారు. అయితే గతంలోనూ కాజోల్ ముఖానికి సర్జరీ చేయించుకున్నారని ట్రోలింగ్స్ ఎదురయ్యాయి. #Kajol ♥️#jdreturnz pic.twitter.com/2vzI0SzcX8 — JDReturnz (@JdReturnz) March 30, 2023 -
రెండేళ్ల తర్వాత విడుదల కాబోతున్న అజయ్ దేవగన్ మూవీ!
ఎట్టకేలకు అజయ్ దేవగన్, ప్రియమణి చిత్రం ‘మైదాన్’ విడుదలకు సిద్ధమైంది. రెండేళ్ల క్రితమే విడుదల కావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా పులుమార్లు వాయిదా పడుతూ వస్తోంది. ఈ క్రమంలో తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్‌ను చిత్ర బృందం ప్రకటించింది. జూన్ 23న విడుదల చేయనున్నట్లు మంగళవారం చిత్ర యూనిట్ వెల్లడిస్తూ కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేసింది. కాగా స్పోర్ట్స్ డ్రామాగా రాబోతున్న ఈ మూవీ ఫుట్‌బాల్ కోజ్ సయ్యద్ అబ్దుల్ రహీమ్ జీవితం ఆధారంగా రూపొందింది. ఇందులో అజయ్ దేవగన్ ఫుట్‌బాల్ కోజ్గా కనిపించనున్నాడు. నటి ప్రియమణి కీలక పాత్ర పోషించిన ఈ మూవీకి అమిత్ రవీంద్రనాథ్ దర్శకత్వం వహించాడు. జీ స్టూడియోస్, బోనీ కపూర్, ఆకాష్ చావ్లా, అరుణవ జోయ్ గుప్తా నిర్మించిన చిత్రం ఇది. భారత జాతీయ ఫుట్‌బాల్ జట్టు కోచ్, మేనేజర్ (1950 –1963 సమయంలో) సయ్యద్ అబ్దుల్ రహీమ్ జీవితంలో చోటు చేసుకున్న పలు ఆసక్తికర సంఘటనలను మైదాన్‌లో చూపించనున్నాడు దర్శకుడు. View this post on Instagram A post shared by Ajay Devgn (@ajaydevgn) -
నాటు నాటుకు ఆస్కార్ నా వల్లే వచ్చింది: అజయ్ దేవగన్
ఆర్ఆర్ఆర్ సినిమాకు తన వల్లే ఆస్కార్ వచ్చిందని బాలీవుడ్ హీరో అజయ్ దేవ్గన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన తాజాగా నటించిన భోళా విడుదలకు సిద్ధమైంది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఆయన కపిల్ శర్మ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హోస్ట్ కపిల్ శర్మ నాటు నాటు ఆస్కార్ గెలవడంతో అజయ్‌కి శభాకాంక్షలు తెలిపారు. అనంతరం మీరు నటించిన ఆర్ఆర్ఆర్ మూవీకి ఆస్కార్ రావడం ఎలా అనిపించిందని కపిల్ శర్మ ప్రశ్నించాడు. చదవండి: అప్పట్లోనే సొంత హెలికాప్టర్, వేల కోట్ల ఆస్తులు.. నటి విజయ ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా? దీనికి అజయ్ దేవగన్ స్పందిస్తూ నిజానికి నాటు నాటుకు ఆస్కార్ నా వల్లే వచ్చిందంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. అదేలా? అని హోస్ట్ అడగ్గా.. ‘అదే నేను నాటు నాటుకు డాన్స్ చేసి ఉంటే ఎలా ఉండేది. నా డాన్స్ చూసి అకాడెమీ జ్యూరీ మెంబర్స్ ఆస్కార్ ఇచ్చేవారే కాదు’ అంటూ చమత్కిరించాడు. అజయ్ సమాధానం విని అంతా ఒక్కసారిగా పగలబడి నవ్వారు. చదవండి: నాని ‘దసరా’కు షాకిచ్చిన సెన్సార్ బోర్డు, భారీగా కట్స్.. దీంతో అజయ్ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీనిపై నెటిజన్లు రకరకాలు స్పందిస్తున్నారు. షారుఖ్ ఖాన్ తర్వాత అంతటి సెన్స్ ఆఫ్ హ్యుమర్ అజయ్ దేవగన్లోనే ఉంది’, ‘ఒకవేళ అదే పాటకు సన్నీ డియోల్ డాన్స్ చేసి ఉంటే ఎలా ఉండేది.. ఊహించుకోండి’ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కాగా ఆర్ఆర్ఆర్లో అజయ్ దేవగన్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. రామ్ చరణ్ తండ్రిగా అజయ్ కనిపించారు. To ye Raaz hai #NaatuNaatuSong ko Oscar milne ka 😯 pic.twitter.com/P9GXv4sy7K — Pooran Marwadi (@Pooran_marwadi) March 24, 2023 -
ఆ హీరో మేనల్లుడితో స్టార్ హీరోయిన్ కుమార్తె ఎంట్రీ..!
రవీనా టాండన్ బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్లలో ఒకరు. 1990ల్లో అభిమానుల్లో సుస్థిర స్థానం సంపాదించకున్న నటి ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది. కన్నడ స్టార్ యశ్ నటించిన కేజీఎఫ్ చిత్రంతో దక్షిణాది ప్రేక్షకులను అలరించింది రవీనా టాండన్. తాజాగా ఆమె కూతురు రాషా తడాని సైతం బాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమైంది. (ఇది చదవండి: అందరి కళ్లు దీపికా పదుకొణె వైపే.. ఆ శారీ అన్ని లక్షలా?) అజయ్ దేవగణ్ మేనల్లుడు అమన్ దేవగణ్‌కు జంటగా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టనుంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అభిషేక్ కపూర్ నిర్మిస్తున్నారు. ఈ వేసవిలో సెట్స్‌పైకి వెళ్లనున్న చిత్రానికి రాషా ఇప్పటికే సంతకం చేశారు. ఈ చిత్రంలో అజయ్ దేవ్‌గణ్ మునుపెన్నడూ కనిపించని పాత్రలో నటిస్తున్నారు. అయితే బాలీవుడ్లో ఇప్పుడు అందరి దృష్టి రాషా పైనే ఉంది. రవీనా టాండన్ కూతురిగా సినిమాల్లో ఎలా రాణిస్తుందనే దానిపై చర్చ నడుస్తోంది. నిర్మాత అభిషేక్ కపూర్ గురించి ఓ వ్యక్తి మాట్లాడుతూ.. 'గత 15 ఏళ్లుగా భారతీయ సినిమాకి అభిషేక్ అందించిన సహకారం ప్రశంసనీయం. అతను సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, ఫర్హాన్ అక్తర్, రాజ్‌కుమార్ రావు, సారా అలీ ఖాన్ లాంటి కొత్త వ్యక్తులను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ప్రతి సినిమాలో వారి పాత్రలను అందించాడు. ఆ సినిమాలు మనతో ఎప్పటికీ నిలిచిపోతాయి. ఆ పాత్రలు ఈ నటీనటుల జీవితాల్లో అద్భుతాలుగా నిలిచాయి. భారతీయ సినిమాకు, ఆయన ప్రగతిశీల ఆలోచనకు ఇది సంకేతం.' అని అన్నారు. -
తప్పతాగిన స్టార్ హీరో కూతురు.. నెటిజన్ల దారుణ ట్రోల్స్
బాలీవుడ్ సెలబ్రిటీలు వారాంతం వచ్చిందంటే ఎంజాయ్ చేయడం మామూలే. పబ్‌లు, నైట్ పార్టీలకు కొదవే లేదు. అయితే ఇటీవల బాలీవుడ్ స్టార్ నటుల పిల్లలు ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. బాలీవుడ్ కల్చర్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. ఇటీవల సుహానా ఖాన్, ఖుషి కపూర్ ఓ పార్టీలో సందడి చేసిన సంగతి తెలిసిందే. తాజాగా అజయ్ దేవగణ్ కూతురు నైసా దేవగణ్ తన ఫ్రెండ్ ఓర్హాన్ అవత్రమణితో ముంబైలో పార్టీకి వెళ్లిన ఓ వీడియో తెగ వైరలవుతోంది. ఎందుకంటే వారిద్దరూ వీడియోలో తప్పతాగి కనిపించారు. ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేశారు. ఇబ్రహీం అలీ ఖాన్, ఖుషీ కపూర్, మహికా రాంపాల్, ఇతర స్టార్కిడ్లు కూడా పార్టీలో కనిపించారు. నైసా దేవగణ్, ఓర్రీ చేతులు ఒకరి చేతులు ఒకరు పట్టుకుని నడుస్తున్న వీడియో ఇంటర్నెట్లో వైరల్‌గా మారింది. ఇది చూసిన ఫ్యాన్స్ వారిద్దరూ తప్ప తాగి ఉన్నారంటూ నెటిజన్స్ ట్రోల్స్ చేశారు. ఓ నెటిజన్ తల్లిదండ్రులు కష్టపడి పేరు సంపాదిస్తే.. వారి పిల్లలు వాటిని నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. మరో నెటిజన్ నైసా దేవగణ్ ఫుల్‌గా తాగి ఉందంటూ పేర్కొన్నాడు. దుస్తులు, మేకప్, ఓపెన్ హెయిర్, బోల్డ్ మేకప్‌తో ఆమె తన రూపాన్ని మార్చేసిందని కామెంట్స్ చేశారు .నైసా దేవగణ్.. అజయ్, కాజోల్‌లకు మొదటి సంతానం. ఈ దంపతులకు తొమ్మిదేళ్ల కుమారుడు యుగ్ కూడా ఉన్నాడు. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
అఫీషియల్: సింగమ్-3లో హీరోయిన్గా దీపికా పదుకొణె..
బాలీవుడ్లో పోలీస్ బ్యాక్‌డ్రాప్ చిత్రాలకు రోహిత్ శెట్టి పెట్టింది పేరు. ఇప్పటికే ఆయన దర్శకత్వంలో అజయ్ దేవగన్ హీరోగా ‘సింగమ్’ (2001), ‘సింగమ్ రిటర్న్స్’ (2014)), ‘సింబ’ (2018),‘సూర్యవన్షీ’(2021) వంటి పోలీస్ బ్యాక్‌డ్రాప్ చిత్రాలు వచ్చాయి. ఇక అజయ్ దేవగన్తోనే రోహిత్ శెట్టి ‘సింగమ్ ఎగైన్’ అనే సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు. ఇందులో లేడీ పోలీసాఫీసర్ పాత్రకు దీపికా పదుకోన్‌ను తీసుకున్నట్లు గురువారం ప్రకటించారు రోహిత్. ‘‘సింగమ్ ఎగైన్’లో దీపిక లేడీ సింగమ్’’ అని ‘సర్కస్’ సాంగ్ లాంచ్ ఈవెంట్లో పేర్కొన్నారు రోహిత్ శెట్టి. రణ్ వీర్ సింగ్ హీరోగా రోహిత్ శెట్టి దర్శకత్వంలో రూపొందిన ‘సర్కస్’ ఈ నెల 23న రిలీజ్ కానుంది. ఇందులో ప్రత్యేక పాటకు భర్త రణ్వీర్తో కలిసి స్టెప్స్ వేశారు దీపిక. ఈ పాట విడుదల వేదికపై సింగమ్ సిరీస్‌లో అజయ్ దేవగన్ ఎలా నడిచేవారో అనుకరిస్తూ దీపికా నడిచి, అలరించారు. -
అజయ్ దేవ్‌గణ్ 'దృశ్యం 2'.. టైటిల్ సాంగ్ చూశారా?
అజయ్ దేవగణ్, శ్రియా శరన్, టబు ప్రధాన పాత్రల్లో హిందీలో తెరకెక్కుతున్న చిత్రం 'దృశ్యం-2'. మలయాళంలో సూపర్ హిట్ మూవీ దృశ్యానికి సీక్వెల్‌గా వస్తోంది. ఇప్పటికే తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదలై ఘనవిజయం సాధించింది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ సాంగ్‌ను చిత్ర నిర్మాతలు రిలీజ్ చేశారు. అజయ్ దేవ్‌గణ్, శ్రియ కాంబినేషన్లో ఇప్పటికే రిలీజైన దృశ్యం భారీ వసూళ్లు రాబట్టింది. ఈ చిత్రానికి అభిషేక్ పాఠక్ దర్శకత్వం వహిస్తున్నారు. (చదవండి: దృశ్యం 2 ట్రైలర్ రిలీజ్.. ఆసక్తి పెంచుతున్న సీన్స్) ఇప్పటికే విడుదలైన సినిమా టీజర్, ట్రైలర్‌కు విశేష స్పందన వచ్చింది. తాజాగా విడుదలైన ఈ సినిమా టైటిల్ సాంగ్ అభిమానులను విపరీతంగా ఆకర్షిస్తోంది. ఈ పాటకు దేవి శ్రీ ప్రసాద్ స్వరాలు సమకూర్చారు. ఉతుప్, విజయ్ ప్రకాష్ ఈ పాటను ఆలపించగా.. అమితాబ్ భట్టాచార్య ఈ సాంగ్‌ను రచించారు. ఈ చిత్రాన్ని భూషణ్ కుమార్, కుమార్ మంగత్ పాఠక్, అభిషేక్ పాఠక్, క్రిషన్ కుమార్ నిర్మించారు. ఈ సినిమా నవంబర్ 18న థియేటర్లలో సందడి చేయనుంది. -
దృశ్యం-2 మూవీ ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)
-
దృశ్యం 2 ట్రైలర్ రిలీజ్.. ఆసక్తి పెంచుతున్న సీన్స్
అజయ్ దేవగణ్, శ్రియ, టబు ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం దృశ్యం-2. మలయాళంలో సూపర్ హిట్ సినిమా దృశ్యానికి సీక్వెల్‌గా వస్తోంది. ఇప్పటికే తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదలై ఘనవిజయం సాధించింది. తాజాగా హిందీలో రాబోతున్నదృశ్యం 2 ట్రైలర్ వచ్చేసింది. ఈ విషయాన్ని ఇన్‌స్టా వేదికగా పంచుకున్నారు. అజయ్ దేవ్‌గణ్, శ్రియ కాంబినేషన్లో ఇప్పటికే రిలీజైన దృశ్యం భారీ వసూళ్లు రాబట్టింది. ఈ చిత్రానికి అభిషేక్ పాఠక్ దర్శకత్వం వహిస్తున్నారు. (చదవండి: దృశ్యం 2 క్రేజీ అప్డేట్.. టీజర్ డేట్ ఫిక్స్) ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్‌కు విశేష స్పందన వస్తోంది. ఇవాళ విడుదలైన ట్రైలర్‌ను చూస్తే ఆద్యంతం ఉత్కంఠ కలిగిస్తోంది. అజయ్ దేవగణ్ మృతదేహాన్ని పాతిపెట్టే ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలతో ట్రైలర్ ప్రారంభమైంది. ఈ ట్రైలర్లో అజయ్ దేవ్‌గణ్, శ్రియ నటన ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఈ మూవీ నవంబర్ 18 థియేటర్లలో సందడి చేయనుంది. అక్షయ్ ఖన్నా, రజత్ కపూర్, ఇషితా దత్తా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. మలయాళంలో 2015లో వచ్చిన మోహన్ లాల్ చిత్రానికి రిమేక్‌గా వస్తోంది. -
జక్కన్న బర్త్‌డే.. జూనియర్ ఎన్టీఆర్ స్పెషల్ విషెస్
టాలీవుడ్ సంచలన దర్శకుడు ఎవరైనా ఉన్నారా అంటే వినిపించేది మొదటి పేరు ఆయనదే. తెలుగు చలనచిత్ర స్థాయిని ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి ఆయనే. స్టూడెంట్ నం.1 నుంచి ఆర్ఆర్ఆర్ వరకు టాలీవుడ్లో సంచలనాలు సృష్టించిన రాజమౌళి బర్త్‌డే ఈరోజు. ఈ సందర్భంగా దర్శకధీరుడికి పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా జక్కన్నకు విషెస్ చెబుతున్నారు. (చదవండి: నయనతార కవలల పేర్లు తెలుసా.. వాటి అర్థాలు ఇవే..!) యంగ్ టైగర్ ఎన్టీఆర్ ట్వీట్ చేస్తూ జక్కన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. హ్యాపీ బర్త్‌డే జక్కన్న.. మీరు ఎల్లప్పుడు గొప్పగానే ఉండాలి' అంటూ ఇద్దరు కలిసి ఉన్న ఫోటోను షేర్ చేశారు. 'హ్యాపీ బర్త్ డే రాజమౌళి గారు.. మీరే నా ఫెవరేట్' అంటూ రామ్ చరణ్ తన ఇన్‌స్టాలో ఫోటోను పంచుకున్నారు. భారతీయ సినిమా గతిని మార్చిన వ్యక్తికి జన్మదిన శుభాకాంక్షలు అంటూ యంగ్ హీరో సుధీర్ బాబు ట్వీట్ చేశారు. మీరు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు. భారతీయ సినిమాకు టార్చ్ బేరర్‌గా నిలిచిన రాజమౌళికి పుట్టిన రోజు శుభాకాంక్షలు అంటూ యంగ్ హీరో సాయిధరమ్ తేజ్ ట్వీట్ చేశారు. బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్‌గణ్ జక్కన్నకు విషెస్ తెలిపారు. మీ సినిమాలు, విజన్ మాకు చాలా ఇష్టం. భారతదేశం గర్వపడేలా చేసిన రాజమౌళికి పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు. మీ సినిమాలతో మాకు ఎల్లప్పుడు స్పూర్తినిస్తూ ఉండండి' అంటూ స్టార్ హీరో మహేశ్ బాబు విషెస్ తెలిపారు. అలాగే నటుడు సత్యదేవ్, డైరెక్టర్ గోపిచంద్ మలినేని సోషల్ మీడియా వేదికగా రాజమౌళికి విషెస్ చెప్పారు. Happy Birthday Jakkanna @ssrajamouli !! Wishing you the best as always. pic.twitter.com/WSq7Zon3KP — Jr NTR (@tarak9999) October 10, 2022 View this post on Instagram A post shared by Rhyme (@alwaysrhyme) Wishing you a happy birthday @ssrajamouli sir... Keep inspiring us with your cinematic brilliance! Happiness & success always! — Mahesh Babu (@urstrulyMahesh) October 10, 2022 To the man who changed the course of Indian cinema.. Wishing @ssrajamouli sir a very happy birthday! Health and happiness to you always 🙏 pic.twitter.com/NedBUhxlMh — Sudheer Babu (@isudheerbabu) October 10, 2022 Wishing the Pride and Torch bearer of Indian Cinema, @ssrajamouli garu a very Happy Birthday. May you keep achieving all the glory and love that you deserve.#HBDSSRajaMouli garu pic.twitter.com/d2kZem5s87 — Sai Dharam Tej (@IamSaiDharamTej) October 10, 2022 Happy birthday dear Rajamouli Sir. Have a fabulous one. I love your vision & all of us love your cinema. Keep making 🇮🇳 proud Sir. Most importantly, today is your day @ssrajamouli pic.twitter.com/q5qCVDJLsV — Ajay Devgn (@ajaydevgn) October 10, 2022 -
ఆ సినిమా టికెట్లపై భారీ తగ్గింపు.. అయితే ఆ ఒక్కరోజు మాత్రమే..!
అజయ్ దేవగణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం దృశ్యం- 2. మలయాళంలో సూపర్ హిట్ సినిమా దృశ్యానికి సీక్వెల్‌గా వస్తోంది. హిందీలో దృశ్యం- 2 విడుదలకు సిద్దమైంది. అయితే తాజాగా ప్రేక్షకుల కోసం సరికొత్త బంపర్ ఆఫర్ ప్రకటించింది చిత్రబృందం. సినిమా రీలీజ్ రోజున అడ్వాన్స్ బుకింగ్ టికెట్లపై 50 శాతం భారీ తగ్గింపు ఇస్తున్నట్లు తెలిపింది. అక్టోబర్ 2 తేదీన బుకింగ్ చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ఈ ఆఫర్ అభిమానులకు అందించేందుకు బహుళస్థాయి సంస్థలతో ఒప్పందం చేసుకున్నట్లు చిత్రబృందం వివరించింది. అభిషేక్ పాఠక్ దర్శకత్వం వహించిన ఈ సినిమా నవంబర్ 18న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రంలో టబు, ఇషితా దత్తా, అక్షయ్ ఖన్నా, రజత్ కపూర్, శ్రియా శరణ్ కూడా ప్రధాన పాత్రల్లో నటించారు. ఇదే పేరుతో 2021లో వచ్చిన మోహన్ లాల్ మలయాళ చిత్రానికి రీమేక్‌గా వస్తోంది ఈ సినిమా. 2015లో విడుదలైన దృశ్యం సూపర్ హిట్‌గా నిలిచింది. Vijay Salgaonkar and family are back to continue the narrative of 2nd October! Advance bookings open on 2nd October and you can block your tickets on the PVR app for JUST Rs. 50 and get 50% OFF on first day shows of Drishyam 2. #Drishyam2 in cinemas on 18th November, 2022. pic.twitter.com/EIEIV1ijvG — P V R C i n e m a s (@_PVRCinemas) October 1, 2022 -
దృశ్యం 2 క్రేజీ అప్డేట్.. టీజర్ డేట్ ఫిక్స్
అజయ్ దేవగణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం దృశ్యం-2. మలయాళంలో సూపర్ హిట్ సినిమా దృశ్యానికి సీక్వెల్‌గా వస్తోంది. ఇప్పటికే తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదలై ఘనవిజయం సాధించింది. తాజాగా హిందీలో రాబోతున్నదృశ్యం 2 నుంచి క్రేజీ అప్డేట్ వచ్చేసింది. అజయ్ దేవ్గన్, శ్రియ కాంబినేషన్లో ఇప్పటికే రిలీజైన దృశ్యం భారీ వసూళ్లు రాబట్టింది. ఈ చిత్రానికి అభిషేక్ పాఠక్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్నుగురువారం విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా పంచుకున్నారు మేకర్స్. ఈ మూవీ నవంబర్ 18 థియేటర్లలో సందడి చేయనుంది. అక్షయ్ ఖన్నా, టబు, రజత్ కపూర్, ఇషితా దత్తా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. మలయాళంలో 2015లో వచ్చిన మోహన్ లాల్ చిత్రానికి రిమేక్. 2 aur 3 October ko kya hua tha yaad hai na? Vijay Salgaonkar is back with his family. Recall Teaser Out Tomorrow! #Drishyam2 #Tabu #AkshayeKhanna @shriya1109 #RajatKapoor @ishidutta #MrunalJadhav @AbhishekPathakk pic.twitter.com/RgUxGQZPVo — Ajay Devgn (@ajaydevgn) September 28, 2022 -
'థ్యాంక్ గాడ్' సాంగ్ రిలీజ్.. నోరా అందానికి నోరెళ్లబెట్టాల్సిందే..!
సిద్ధార్థ్ మల్హోత్రా, అజయ్ దేవగణ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం'థ్యాంక్ గాడ్'. ఇంద్ర కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్. ఫాంటసీ కామెడీగా తెరకెక్కుతున్న ఈ చిత్రం అక్టోబర్ 25న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రం నుంచి మొదటి పాటను విడుదల చేశారు మేకర్స్. ఈ సాంగ్‌లో బాలీవుడ్ నటి నోరా ఫతేహీ, సిద్ధార్థ్ మల్హోత్రా మధ్య కెమిస్ట్రీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. శ్రీలంక సింగర్ యోహాని పాడిన 'మనికే మాగే హితే' సాంగ్‌ను హిందీలో రీమేక్ చేశారు. అయితే ఈ పాటలోనూ యోహానీ తనదైన వాయిస్‌తో అలరించింది. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్లు, ట్రైలర్ ప్రేక్షకుల్లో భారీ హైప్ క్రియేట్ చేశాయి. ఈ సినిమా చిత్రగుప్తగా అజయ్ దేవగణ్ కనిపించనుండగా.. రకుల్ ప్రీత్ సింగ్ పోలీస్ అధికారి పాత్రలో నటించనుంది. అయితే ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ కాగా ఓ మతం మనోభావాలు దెబ్బతీసేలా ఉందంటూ యూపీలోని జాన్పూర్ కోర్టులో కేసు నమోదైంది. (చదవండి: చిక్కులు తెచ్చిన ట్రైలర్.. నటులపై కేసు నమోదు) -
చిక్కుల్లో 'థ్యాంక్ గాడ్'.. కేసు నమోదు.. ట్రైలర్లో ఏముంది?
బాలీవుడ్ నటులు అజయ్ దేవ్‌గణ్, సిద్ధార్థ మల్హోత్రా నటించిన చిత్రం 'థ్యాంగ్ గాడ్' చిక్కుల్లో పడింది. ఇటీవల ఈ చిత్రం ట్రైలర్ విడుదల కాగా.. అదే ఇప్పుడు సమస్యను తెచ్చిపెట్టింది. దర్శకుడు ఇంద్ర కుమార్ తెరకెక్కిస్తున్న ‘థ్యాంక్ గాడ్’ సినిమాపై న్యాయవాది హిమాన్షు శ్రీవాస్తవ యూపీలోని జాన్పూర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా కేసు నమోదైంది. నవంబర్ 18న పిటిషనర్ వాంగ్మూలాన్ని నమోదు చేయనున్నట్లు కోర్టు తెలిపింది. (చదవండి: అజయ్‌తో నేను చేసిన తొమ్మిదో చిత్రం ఇది: టబు) ఇటీవల విడుదలైన 'థ్యాంక్ గాడ్' ట్రైలర్ ఓ మతం మనోభావాలను దెబ్బతీసేలా ఉందని పిటిషనర్ హిమాన్షు శ్రీవాస్తవ కోర్టుకు వివరించారు. ఓ సన్నివేశంలో అజయ్ దేవగణ్ సూటు ధరించి చిత్రగుప్తుని పాత్రలో జోకులు పేల్చడం, అభ్యంతరకరమైన పదజాలం కనిపించిందని శ్రీవాస్తవ తన పిటిషన్లో పేర్కొన్నారు. చిత్రగుప్తుడు మంచి, చెడులను లెక్కిస్తాడు. దేవుళ్లను ఇలా వర్ణించడం వల్ల ఓ మతం మనోభావాలను దెబ్బతీస్తుందని న్యాయవాది పిటిషన్లో వివరించారు. దీంతో అజయ్ దేవ్‌గణ్, సిద్ధార్థ్ మల్హోత్ర, దర్శకుడు ఇంద్ర కుమార్‌పై కేసు నమోదైంది. ఈ చిత్రం అక్టోబర్ 24న విడుదల కానుంది. -
అజయ్‌తో నేను చేసిన తొమ్మిదో చిత్రం ఇది: టబు
బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న తాజా హిందీ చిత్రం భోళ. ఈ చిత్రంలో పోలీసాఫీసర్‌గా టబు ఓ కీలక పాత్ర చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. భోళ షూటింగ్‌ను పూర్తిచేశాం. అజయ్‌తో నేను చేసిన తొమ్మిదో చిత్రం ఇది అంటూ లొకేషన్లోని ఫోటోని షేర్ చేశారు టబు. ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చి 30న విడుదల కానుంది. కాగా తమిళంలో హిట్ సాధించిన 'ఖైది' చిత్రానికి హిందీ రీమేక్‌గా భోళ తెరకెక్కింది. View this post on Instagram A post shared by Tabu (@tabutiful) -
సీనియర్ హీరోయిన్ టబుకు తీవ్రగాయాలు.. షూటింగ్‌కి బ్రేక్
సీనియర్ హీరోయిన్ టబు షూటింగ్లో తీవ్రంగా గాయపడింది.బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న భోలా సినిమా షూటింగ్లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ట్రక్కును బైక్స్‌తో ఛేజ్ చేసే సీన్ షూట్ చేస్తున్న సమయంలో ప్రమాదం జరిగింది. ట్రక్కు అద్దాలు పగిలి టబు కన్ను, నుదుటికి గుచ్చుకున్నట్లు తెలుస్తోంది. దీంతో యూనిట్ సభ్యులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రమాదం జరగడంతో హీరో అజయ్ దేవగన్ షూటింగ్‌కు చిన్న విరామం ప్రకటించారు. రెప్ప పాటులో ఆమె కంటికి పెను ప్రమాదం తప్పిందని సమాచారం. దీంతో మూవీ యూనిట్ ఊపిరి పీల్చుకుంది. ఈ సినిమాలో ఆమె పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనుంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. కాగా మరో సినిమా షూటింగ్ సెట్లో హీరోయిన్ శిల్పాశెట్టి గాయపడింది. యాక్షన్ సన్నివేశాలు చేస్తుండగా ప్రమాదవశాత్తు కింద పడటంతో ఆమె కాలు విరిగింది. ఒకే రోజు ఇద్దరు సీనియర్ హీరోయిన్స్ గాయపడటం గమనార్హం. -
మధ్యలో తప్పుకున్న దర్శకులు.. మెగా ఫోన్ పట్టిన స్టార్ హీరోలు
ఇండస్ట్రీలో క్రియేటివ్ కథలు ఉన్నట్లే, అప్పుడప్పుడూ ‘క్రియేటివ్ డిఫరెన్సెస్’ కూడా ఉంటాయి. అభిప్రాయ భేదాల వల్ల కొన్నిసార్లు హీరోయే దర్శకుడిగా మారాల్సి వస్తుంది. డేట్స్ అడ్జస్ట్ చేయలేక పోవడంవల్ల కూడా ఒప్పుకున్న సినిమా నుంచి దర్శకుడు తప్పుకోవచ్చు. అలా ఈ మధ్య కొందరు దర్శకులు తప్పుకుంటే వారి స్థానంలో హీరోయే డైరెక్టర్‌గా మారారు. అలా డైరెక్షన్ మారింది. ఆ విశేషాలు తెలుసుకుందాం. విశాల్ కెరీర్లో ఉన్న విజయవంతమైన చిత్రాల్లో ‘తుప్పరివాలన్’ (2017) (తెలుగులో ‘డిటెక్టివ్’) ఒకటి. మిస్కిన్ దర్శకత్వంలో విశాల్ చేసిన ఈ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్‌కు ఆడియన్స్ ఫిదా అయ్యారు. ఎంతలా అంటే ‘తుప్పరివాలన్’ సీక్వెల్ కోసం ఎదురు చూసేంత. ప్రేక్షకుల ఆసక్తిని గమనించిన విశాల్, మిస్కిన్ ‘తుప్పరివాలన్ 2’ను ప్రకటించారు. వీలైనంత త్వరగా రిలీజ్ చేయాలని వెంటనే షూటింగ్ కూడా ఆరంభించారు. కానీ అనుకోకుండా ఈ సీక్వెల్‌కు బ్రేక్‌లు పడ్డాయి. షూటింగ్ లొకేషన్స్, బడ్జెట్, కథ అంశాల్లో విశాల్, మిస్కిన్‌ల మధ్య అభిప్రాయభేదాల వల్లే ఈ బ్రేక్ అనే వార్తలు వచ్చాయి. ఈ వార్త నిజమే అన్నట్లుగా ‘తుప్పరివాలన్ 2’కు తానే దర్శకత్వం వహిస్తున్నట్లుగా ఓ సందర్భంలో ప్రకటించారు విశాల్. అలా హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటివరకు అయితే ‘తుప్పరివాలన్ 2’కు విశాలే దర్శకుడు. చర్చలు సఫలమై మిస్కిన్ మళ్లీ టేకప్ చేస్తారనే టాక్ కూడా ఉంది. (చదవండి: బాలీవుడ్లో సమంత భారీ సినిమా.. హీరోగా ఎవరంటే?) మరోవైపు యశ్ ‘కేజీఎఫ్’ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ ఆడియన్స్‌ను బాగా థ్రిల్ చేశాయి. ఈ చిత్రం హీరో యశ్, దర్శకుడు ప్రశాంత్ నీల్లకు ఎంత పేరు వచ్చిందో ‘కేజీఎఫ్’ స్టంట్ కొరియోగ్రాఫర్స్ అన్బు, అరివులకు అంతే పేరు వచ్చింది. ఈ ఇద్దరూ దర్శకులుగా మారాలనుకున్నారు. కొరియోగ్రాఫర్, నటుడు, దర్శక–నిర్మాత రాఘవా లారెన్స్ వీరికి ఆ చాన్స్ ఇచ్చారు. అన్బు, అరివుల దర్శకత్వంలో రాఘవా లారెన్స్ హీరోగా ‘దుర్గ’ అనే సినిమా షూటింగ్ ఆరంభమైంది కూడా. కానీ వివిధ కారణాల వల్ల ‘దుర్గ’ సినిమా దర్శకత్వ బాధ్యతల నుంచి అన్బు, అరివులు తప్పుకున్నారు. ఇప్పుడు ‘దుర్గ’ సినిమాకు రాఘవా లారెన్స్‌నే దర్శకత్వం వహిస్తున్నారని కోలీవుడ్ సమాచారం. సేమ్ సీన్ బాలీవుడ్‌లోనూ రిపీట్ అయ్యింది. అజయ్ దేవగన్ హీరోగా‘బోళ’ అనే సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. తమిళంలో కార్తీ నటించిన ‘ఖైదీ’ సినిమాకు ‘బోళ’ హిందీ రీమేక్. ఈ చిత్రానికి ముందు దర్శకుడిగా ధర్మేంద్ర శర్మ బాధ్యతలు తీసుకున్నారు. కారణం బయటకు రాలేదు కానీ ఇప్పుడు ‘బోళ’ సినిమాకు అజయ్ దేవగన్నే దర్శకత్వం వహిస్తున్నారు. ఇలా దర్శకుడు మారడం తెలుగులోనూ జరిగింది. హీరో విశ్వక్ సేన్, దర్శకుడు నరేశ్ కుప్పిలి కాంబినేషన్లో ‘పాగల్’ సినిమా వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత విశ్వక్, నరేశ్ కలిసి ‘దాస్ కా దమ్కీ’ అనే సినిమాను ఆరంభించారు. కానీ ఇప్పుడు ఈ సినిమాకు నరేశ్ దర్శకుడు కాదు. విశ్వక్ సేన్ ఆ బాధ్యతలను స్వీకరించారు. ఇలా హీరోయే దర్శకుడిగా మారిన మరికొన్ని చిత్రాలు కూడా ఉన్నాయి. -
లండన్‌లో ‘పుష్ప’ సింగర్ వెడ్డింగ్ రిసెప్షన్, స్టార్ హీరో కూతురు సందడి
బాలీవుడ్ సింగర్ కనికా కపూర్ ఇటీవల పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ‘ఊ బోలెగా యా.. ఉఊ బోలేగా’(పుష్ప సినిమాలోని ఊ అంటావా..ఊ ఊ అంటావా హిందీ వెర్షన్) అంటూ తన గాత్రంతో బాలీవుడ్ ఆడియన్స్‌ని ఉర్రూతలూగించిన కనికా లండన్‌కు చెందిన వ్యాపారవేత్త గౌతమ్ హతిరమనిని రెండో పెళ్లి చేసుకుంది. లండన్‌లోని ఓ ఫైవ్‌స్టార్ హోటల్లో జరిగిన ఈ వివాహ వేడుకలో మెగా కోడలు, రామ్ చరణ్ భార్య ఉసాసన కామినేని హజరైంది. కనికా స్నేహితురాలైన ఉపాసన ఈ పెళ్లిలో సందడి చేసింది. ఇదిలా ఉంటే వీరి వెడ్డింగ్ రిసెప్షన్ విక్టోరియా అండ్ అల్బర్ట్ మ్యూజియంలో గ్రాండ్ నిర్వహించారు. ఈ రిసెప్షన్లో బాలీవుడ్ స్టార్ కిడ్ సందడి చేసింది. బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్, హీరోయిన్ కాజోల్ ముద్దుల తనయ నైసా దేవగన్ ఈ వెడ్డింగ్ రిసెప్షన్‌కు హాజరైంది. చదవండి: 'డెడ్' అని సమంత పోస్ట్.. ఆ వెంటనే డిలీట్ తన స్నేహితులతో కలిసి ఈ ఫంక్షన్లో పాల్గొన్న నైసా స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. బాడీకాన్ పింగ్ డ్రెస్‌లో లైట్ జ్యువెల్లరిలో మెరిసిన నైసా ఈ ఫంక్షన్లో సందడి చేసింది. కనికా, తన స్నేహితులతో పాటు ఫొటోలకు ఫోజులు ఇచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా ముంబైలో జరిగే సెలబ్రెటీలకు సంబంధించిన ఏ వేడుకకైన నైసా తన తల్లి కాజోల్, తండ్రి అజయ్ దేవగన్‌లతో కలిసి హజరవుతుంది. అయితే తొలిసారి ఆమె ఒంటరిగా ఈ కార్యక్రమంలో కనిపించడం ఆసక్తిని సంతరించుకుంది. కాగా ఇటీవల 19 ఏళ్లు నిండిన నైసా ప్రస్తుతం సింగపూర్‌లో డిగ్రీ చదువుతోంది. View this post on Instagram A post shared by Orhan Awatramani (@orry1) -
అక్షయ్, అజయ్‌పై కంగనా రనౌత్ షాకింగ్ కామెంట్స్..
Kangana Ranaut Shocking Comments On Akshay Kumar Ajay Devgn: బాలీవుడ్ కాంట్రవర్సీ క్వీన్ కంగనా రనౌత్ తాజాగా నటించిన చిత్రం 'ధాకడ్'. స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీ మే 20న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో బాలీవుడ్ స్టార్ హీరోలు అక్షయ్ కుమార్, అజయ్ దేవగణ్‌లపై సంచలన వ్యాఖ్యలు చేసింది. అలాగే బాలీవుడ్‌పై తనకున్న అసంతృప్తిని వ్యక్తం చేసింది. బాలీవుడ్ తనకు సపోర్ట్ చేయదని ఎప్పటినుంచో చెప్పుకొస్తుంది కాంట్రవర్సీ బ్యూటీ కంగనా రనౌత్. తాజాగా 'అజయ్ దేవగణ్ నా సినిమాను ఎప్పటికీ ప్రమోట్ చేయడు. కానీ ఇతర చిత్రాలను ప్రమోట్ చేస్తాడు. ఇక అక్షయ్ కుమార్ నాకు కాల్ చేసి తలైవి సినిమా బాగుందని చెబుతాడు. కానీ ఆ మూవీ ట్రైలర్‌ను షేర్ చేయడం, ట్వీట్ చేయడం మాత్రం చేయడు. కాబట్టి వారి గురించి నేను ఏం మాట్లాడలేను. అలాగే అమితాబ్ బచ్చన్ నా సాంగ్ టీజరన్ను ట్వీట్ చేసి వెంటనే దాన్ని తొలగించారు. ఆ విషయం గురించి కూడా నేను మాట్లాడను. అజయ్ దేవగణ్ ఇతరులు చేసిన మహిళా ప్రాధాన్యత చిత్రాల్లో నటిస్తారు. కానీ చిత్రాల్లో నటించరు. ఎందుకంటే నా సినిమాల్లో నాకే ఎక్కువ పేరు వస్తుందని. ఇప్పుడు నా సినిమాకు సపోర్ట్ చేసిన అర్జున్ రాంపాల్‌పై ఎలా కృతజ్ఞతతో ఉంటానో, నా సినిమాలో అజయ్ దేవగణ్ నటించిన అలాగే గొప్పగా ఫీల్ అవుతా.' అని తెలిపింది కంగనా రనౌత్. ఇతరుల సినిమాలను ప్రమోట్ చేయడంపై కంగనా రనౌత్ మాట్లాడుతూ 'నేను ఇతరుల సినిమాలను సపోర్ట్ చేసినట్లుగానే నా సినిమాలు ఇతరులు సపోర్ట్ చేయాలని కోరుకుంటాను. ది కశ్మీర్ ఫైల్స్, షేర్షా వంటి చిత్రాలను అభినందించడానికి, ప్రమోట్ చేసేందుకు నేను ఎప్పుడు ముందుంటాను. నేను సిద్ధార్థ మల్హోత్రా గురించి, కరణ్ జోహార్ చిత్రాలను కూడా మెచ్చుకున్నాను. నేను ప్రశంసించాలనుకుంటే బహిరంగానే చేస్తాను. ఎవరికీ తెలియకుండా కాల్ చేసి చెప్పను. ఈ పరిస్థితి మారి నాలాగే వారు కూడా భవిష్యత్తులో నా సినిమాలపై స్పందిస్తారని అనుకుంటున్నా.' అని తెలిపింది. -
దేశంలో హిందీ ఎంతమంది మాట్లాడతారు ?
హిందీ జాతీయ భాషపై వివాదం అంతకంతకూ పెద్దదవుతోంది. వివిధ రాష్ట్రాలకు చెందినవారంతా కలిస్తే ఇంగ్లిష్ బదులుగా హిందీలో మాట్లాడాలంటూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన ప్రతిపాదనలు అగ్గి రాజేస్తే, తాజాగా బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్‌గణ్ హిందీయే మన జాతీయ భాష అంటూ చేసిన ట్వీట్‌తో వివాదం భగ్గుమంది. భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా నిలిచే భారత్‌లో బీజేపీ ‘ఒకే దేశం ఒకే భాష’ తీసుకువస్తుందన్న అనుమానంతో దక్షిణాది రాష్ట్రాలు ఎదురుదాడికి దిగాయి. చరిత్రలోకి తొంగి చూస్తే.. హిందీ భాషను ఇతర ప్రాంతాలపై రుద్దడానికి జరుగుతున్న ప్రయత్నాలు కొత్తేం కాదు. స్వాతంత్య్రానికి ముందే 1937 సంవత్సరంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మద్రాస్ ప్రెసిడెన్సీలో హిందీ భాషను బోధించడానికి ప్రయత్నిస్తే దానిని వ్యతిరేకిస్తూ మూడేళ్ల పాటు ఉధృతంగా ఉద్యమం జరిగింది. 1946లో మొదటిసారిగా సమావేశమైన రాజ్యాంగ పరిషత్ పార్లమెంటులో చర్చలు హిందీ, ఇంగ్లిష్‌లో కొనసాగించాలని నిర్ణయించింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత జాతీయ భాషగా ఏది ఉండాలన్న దానిపై ఆనాటి కాంగ్రెస్ నాయకులు కేఎం మున్షీ, గోపాలస్వామి అయ్యంగార్ హిందీ అనుకూల, వ్యతిరేక వర్గాలను కలుసుకొని అభిప్రాయాలను సేకరించారు. చివరికి హిందీ, ఇంగ్లిషులను కేంద్రం అధికార భాషలుగా గుర్తించింది. పదిహేనేళ్ల పాటు ఆ విధానం కొనసాగాక దానిని సమీక్షించాలని నిర్ణయించింది. పదిహేనేళ్ల గడువు ముగిశాక జాతీయ భాషగా హిందీని చేయాలని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ప్రయత్నాలకు వ్యతిరేకంగా తమిళనాడు భగ్గుమంది. చివరికి కేంద్ర ప్రభుత్వం 1963లో అధికార భాషా చట్టంలో హిందీతోపాటు ఇంగ్లిష్‌ని చేర్చింది. భాషా ప్రాతిపదికన రాష్ట్రాలు ఏర్పడినప్పుడు రాష్ట్రాలకు తమ అధికార భాషను గుర్తించే అధికారం, అందులోనే ఉత్తరప్రత్యుత్తరాలు చేసుకునే అవకాశం కల్పించింది. హిందీ ఎంతమంది మాట్లాడతారు ? 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో 121 మాతృభాషలున్నాయి. వీటిలో 22 భాషల్ని రాజ్యాంగం గుర్తించి రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్లో చేర్చింది. ఆనాటి లెక్కల ప్రకారం 43.6% మందికి మాతృభాష హిందీయే. ఆ తర్వాత స్థానంలో 8 శాతంతో బెంగాలీ నిలిచింది. 6.86% మంది ప్రజలు మాట్లాడే మరాఠీ మూడో స్థానంలో నిలిస్తే, 6.70% మందితో మన తెలుగు భాష నాలుగో స్థానంలో నిలిచింది. ఈ మధ్య కాలంలో తెలుగు, కన్నడ సినిమాలు బాలీవుడ్లో బంపర్ హిట్ కొడుతూ ఉండడంతో హిందీ చిత్ర పరిశ్రమలో కొందరు అసూయతో రగిలిపోతున్నారు. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా ప్రభంజనం మొదలైంది. ఇటీవల తెలుగు సినిమాలైన పుష్ప, ఆర్ఆర్ఆర్ వసూళ్లలో సునామీ సృష్టిస్తే, కన్నడ సినిమా కేజీఎఫ్–2 సూపర్ సక్సెస్ సాధించింది. దీంతో హిందీ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఈ స్థాయిలో ఎందుకు విజయం సాధించడం లేదన్న చర్చ జరుగుతోంది. ఈ సమయంలోనే బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ హిందీ ఎప్పటికీ మన జాతీయ భాషేనంటూ ట్వీట్ రాజకీయ రంగు పులుముకుంది. మూడు భాషల ఫార్ములా ప్రస్తుతం నెలకొన్న పోటీ ప్రపంచంలో ఇంగ్లీషు నేర్చుకోవడం తప్పనిసరి. ఇంగ్లిష్ భాషలో మాట్లాడడం, రాయడం రాకపోతే అంతర్జాతీయ సమాజంలో నెగ్గుకువచ్చే పరిస్థితి లేదు. అందుకే ఇంగ్లిష్ సెకండ్ లాంగ్వేజీగా ఎక్కువ మంది తీసుకుంటున్నారు. పలు రాష్ట్రాల్లో హిందీ కంటే ఇంగ్లిష్‌కే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త విద్యా విధానం (ఎన్ఈపీ) మూడు భాషల ఫార్ములాను తీసుకువచ్చింది. 8వ తరగతి వరకు హిందీని నేర్చుకోవడం తప్పనిసరి చేసింది. ‘సరైన విధానంలో బోధించేవరకు మూడు భాషల ఫార్ములా మంచిదే. ఎన్ని భాషలు వస్తే అంత మంచిది. కానీ హిందీని జాతీయ భాషగా రుద్దకూడదు. ఆ భాష వస్తే ఒక అదనపు భాష వచ్చినట్టే. కానీ జాతీయ భాష అంటూ కిరీటాలు తగిలించకూడదు’ అని భాషావేత్త మాయా లీలా చెప్పారు. – నేషనల్ డెస్క్, సాక్షి స్థానిక భాషే సుప్రీం కేజీఎఫ్–2 సినిమా బాలీవుడ్ బాక్సాఫీస్‌ని షేక్ చేసిన నేపథ్యంలో కన్నడ సినీ నటుడు, ఈగ ఫేమ్ సుదీప్, బాలీవుడ్ నటుడు అజయ్‌దేవగణ్ మధ్య ట్వీట్ల ద్వారా నడిచిన చర్చ రాజకీయ రచ్చకి దారితీసింది. హిందీ ఇక జాతీయ భాష కాదంటూ సుదీప్ చేసిన వ్యాఖ్యలపై బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్‌గణ్ స్పందిస్తూ అలాంటప్పుడు మీ సినిమాలు హిందీలోకి ఎందుకు డబ్ చేస్తున్నారని ప్రశ్నించారు. హిందీయే ఎప్పటికీ మన జాతీయ భాష అంటూ ట్వీట్ చేశారు. ఆ తర్వాత ఇద్దరి మధ్య ట్వీట్లు స్నేహపూర్వకంగా నడిచినప్పటికీ దానిపై రాజకీయ దుమారం లేచింది. కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, మాజీ ముఖ్యమంత్రులు సిద్ధరామయ్య, హెచ్డీ కుమారస్వామిలు గురువారం నటుడు సుదీప్‌కు సంపూర్ణంగా మద్దతు తెలిపారు. దేశంలో హిందీ కూడా ఇతర ప్రాంతీయ భాషల మాదిరిగా ఒక భాషే తప్ప జాతీయ భాష కాదని కుండబద్దలు కొట్టారు. భాషా ప్రాతిపదికన రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత ఆయా రాష్ట్రాల్లో భాషకి ఎనలేని ప్రాధాన్యం ఏర్పడిందని, ఎక్కడికక్కడ స్థానిక భాషే సుప్రీం అని ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై హుబ్లీలో చెప్పారు. ప్రతి ఒక్కరూ వారి మాతృభాషని గౌరవించాలని, ఈ విషయాన్ని అందరూ అంగీకరించాలని అన్నారు. మన దేశంలో విశిష్టమైన భాషా వైవిధ్యాన్ని ప్రతీ పౌరుడు గౌరవించాలని, మాతృభాష వినిపిస్తే ఎవరైనా గర్వంతో ఉప్పొంగిపోవాల్సిందేనని కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య ట్వీట్ చేశారు. హిందీ జాతీయ భాష కాదని సుదీప్ చేసిన ట్వీట్ నూటికి నూరు శాతం నిజమని, ఎక్కువ మంది మాట్లాడినంత మాత్రాన హిందీ జాతీయ భాష అవదని జేడీ(ఎస్) నాయకుడు కుమారస్వామి ట్వీట్లు చేశారు. మరోవైపు బొమ్మై కేబినెట్ మంత్రి డాక్టర్ సిఎన్ అశ్వంత్ నారాయణ్ కమ్యూనికేషన్ కోసం జాతీయ స్థాయిలో హిందీ భాషను మాట్లాడితే తప్పులేదని వ్యాఖ్యానించడం విశేషం. -
కిచ్చా సుదీప్ చెప్పింది కరెక్ట్.. కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై
కన్నడ స్టార్ కిచ్చా సుదీప్, బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ మధ్య తలెత్తిన హిందీ భాషా వివాదం ప్రస్తుతం కర్ణాటక ముఖ్యమంత్రి వరకు చేరింది. కన్నడ సూపర్‌స్టార్ సుదీప్‌కు మద్దతుగా సీఎం బసవరాజ్ బొమ్మై నిలిచారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భాషా ప్రాతిపదికన రాష్ట్రాలు ఏర్పడ్డాయని, కాబట్టి ప్రాంతీయ భాషలు చాలా ముఖ్యమైనవని పేర్కొన్నారు. సుదీప్ మాటలు సరైనవేనని, దానిని అందరూ అర్థం చేసుకొని గౌరవించాలని సీఎం బొమ్మై సూచించారు. కాగా ఇప్పటికే కర్ణాటక మాజీ సీఎం సిద్ధ రామయ్య, కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ కిచ్చ సుదీప్‌కు అండగా నిలిచారు. బాలీవుడ్, కన్నడ సూపర్ స్టార్ల మధ్య హిందీ వార్ నడుస్తున్న విషయం తెలిసిందే. ముందుగా ఓ సినిమా ఈవెంట్లో పాల్గొన్న సుదీప్.. దక్షిణాది సినిమాలు బాక్సాఫిస్ వద్ద రికార్డులు బద్దలు కొడుతున్నాయని, హిందీలోకి డబ్ అయి బాలీవుడ్ సినిమాల కంటే ఎక్కువ వసూళ్లు రాబడుతున్నాయని అన్నారు. అలాగే ఇకపై హిందీ జాతీయ భాషగా ఉండబోదని చెప్పారు. దీంతో సుదీప్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దూమారం రేపాయి. .@KicchaSudeep मेरे भाई, आपके अनुसार अगर हिंदी हमारी राष्ट्रीय भाषा नहीं है तो आप अपनी मातृभाषा की फ़िल्मों को हिंदी में डब करके क्यूँ रिलीज़ करते हैं? हिंदी हमारी मातृभाषा और राष्ट्रीय भाषा थी, है और हमेशा रहेगी। जन गण मन । — Ajay Devgn (@ajaydevgn) April 27, 2022 సుదీప్ వ్యాఖ్యలపై బాలీవుడ్ సూపర్ స్టార్ అజయ్ దేవగణ్ వ్యంగ్యంగా స్పందించారు. బ్రదర్ కిచ్చా సుదీప్... మీ అభిప్రాయం ప్రకారం హిందీ జాతీయ భాష కానప్పుడు... మీ మాతృభాష సినిమాలను హిందీలోకి ఎందుకు డబ్ చేస్తున్నారని ప్రశ్నించారు. హిందీ ఇంతకమందు, ఇప్పుడు, ఎప్పటికీ మన జాతీయ భాషే. జన గణ మన' అని ట్వీట్ చేశారు. మరోవైపు వీరిద్దరి మాటల యుద్ధంపై పలువురు తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. చదవండి👉 Kichcha Sudeep Vs Ajay Devgan: చిచ్చు పెట్టిన హిందీ భాష, స్టార్ హీరోల మధ్య ట్వీట్ల వార్ And sir @ajaydevgn ,, I did understand the txt you sent in hindi. Tats only coz we all have respected,loved and learnt hindi. No offense sir,,,but was wondering what'd the situation be if my response was typed in kannada.!! Don't we too belong to India sir. 🥂 — Kichcha Sudeepa (@KicchaSudeep) April 27, 2022 మరోవైపు తాను మాట్లాడిన మాటలు ట్రాన్స్లేషన్ పొరపాటు వలన తప్పుగా అర్థం చేసుకున్నారనీ సుదీప్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ‘అజయ్ సార్.. మీరు హిందీలో చేసిన ట్వీట్ నాకు అర్థం అయ్యింది. అందరం హిందీని గౌరవిస్తాము. కాబట్టి హిందీని ప్రేమించాము, నేర్చుకున్నాను. గౌరవించాము. మనమందరం నేను హిందీ భాషను గౌరవిస్తాను, ప్రేమిస్తాను, కేవలం ట్రాన్స్లేషన్ వల్ల పొరపాటు జరిగింది. కానీ నేను ఇప్పుడు కన్నడలో రిప్లై ఇస్తే పరిస్థితి ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నా. మనమంతా కూడ భారతదేశానికి చెందిన వాళ్లమే కదా సార్’ అంటూ రీట్వీట్ చేశారు. Hello @ajaydevgn sir.. the context to why i said tat line is entirely different to the way I guess it has reached you. Probably wil emphasis on why the statement was made when I see you in person. It wasn't to hurt,Provoke or to start any debate. Why would I sir 😁 https://t.co/w1jIugFid6 — Kichcha Sudeepa (@KicchaSudeep) April 27, 2022 అలాగే ‘ మన దేశంలోని ప్రతి భాషను నేను ప్రేమిస్తాను సార్. నేను ఆ మాటలను పూర్తిగా భిన్నమైన సందర్భంలో చెప్పాను. అది మీ దగ్గరకు వేరే రకంగా చేరింది. త్వరలో మిమ్మల్ని కలుస్తానని ఆశిస్తున్నాను. అప్పుడు అసలేం జరిగిందో మీకు వివరిస్తాను. ఇది ఎవరినీ బాధపెట్టడానికి, రెచ్చగొట్టడానికి లేదా ఇలాంటి చర్చను ప్రారంభించడానికి కాదు. ఇక ఈ అంశం ఇక్కడితో ముగిసిపోవాలని ఆశిస్తున్నాను. అనువాదం, వివరణలు, దృక్కోణాలు అసలు మేటర్ సర్… పూర్తి విషయం తెలియకుండా స్పందించకపోవడానికి కారణం అదే దీనికి నేను మిమ్మల్ని నిందించను. ఒక సృజనాత్మక కారణంతో నేను మీ నుంచి ట్వీట్‌ను స్వీకరించి ఉంటే బహుశా అది సంతోషకరమైన క్షణం అయ్యేది” అంటూ సుదీర్ఘ వివరణ ఇచ్చాడు. -
హిందీ భాషపై సంచలన వ్యాఖ్యలు, అజయ్, సుదీప్ మధ్య ట్వీట్ల వార్
హిందీ భాషపై కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దూమారం రేపుతున్నాయి. హిందీ జాతీయ భాష కాదంటూ సుదీప్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీశాయి. దీంతో ఆయనకు ఓ వర్గం నెటిజన్ల నుంచి వ్యతిరేకత వస్తోంది. కాగా ఆయన తాజా చిత్రం విక్రాంత్ రోణ ప్రమోషన్లో భాగంగా సుదీప్ కేజీయఫ్ 2పై ప్రశంసలు కురిపిస్తూ బాలీవుడ్ ఇండస్ట్రీపై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి విధితమే. ఈ క్రమంలో ఆయన హిందీ భాషపై కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. చదవండి: పునీత్ పేరును పచ్చబొట్టు వేయించుకున్న నటి నమ్రత దీంతో సుదీప్ వ్యాఖ్యలపై స్పందించిన స్టార్ హీరో అజయ్ దేవగన్ ఆయనకు కౌంటర్ ఇచ్చాడు. సుదీప్‌ను ట్యాగ్ చేస్తూ ‘హిందీ జాతీయ భాష కాకపోతే మీ సినిమాలను హిందీలో డబ్ చేసి ఎందుకు విడుదల చేస్తున్నారు. హిందీ ఇప్పటికీ, ఎప్పటికీ మన మాతృ భాషే, జాతీయ భాషే, జనగణమన’ అంటూ సుదీప్‌ను ప్రశ్నించాడు. దీంతో అజయ్ దేవగన్ ట్వీట్‌కు సుదీప్ స్పందిస్తూ.. ‘హలో అజయ్ సార్. నా వ్యాఖ్యలకు అర్థం అది కాదు. మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. మిమ్మల్ని వ్యక్తిగతం కలిసినప్పుడు దీనికి మీకు వివరణ ఇస్తాను’ అని చెప్పుకొచ్చాడు. .@KicchaSudeep मेरे भाई, आपके अनुसार अगर हिंदी हमारी राष्ट्रीय भाषा नहीं है तो आप अपनी मातृभाषा की फ़िल्मों को हिंदी में डब करके क्यूँ रिलीज़ करते हैं? हिंदी हमारी मातृभाषा और राष्ट्रीय भाषा थी, है और हमेशा रहेगी। जन गण मन । — Ajay Devgn (@ajaydevgn) April 27, 2022 అలాగే మరో ట్వీట్లో భారతదేశంలోని అన్ని భాషలపై తనకు గౌరవం ఉందని, ఇక్కడితే ఈ టాపిక్‌ను వదిలేయాలనుకుంటున్నాను అంటూ సుదీప్ వరస ట్వీట్స్ చేశాడు. ‘ఎలాంటి అపార్థాలు చోటు చేసుకోకుండా దీనికి స్పష్టత ఇచ్చినందుకు ధన్యవాదాలు మై ఫ్రెండ్. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ అంతా ఒక కుటుంబం అని నా అభిప్రాయం. మనమంత దేశంలోని అన్ని భాషలను గౌరవించాలి’ అంటూ అంటూ సుదీప్ ట్వీట్‌కు అజయ్ రిప్లై ఇచ్చాడు. ఇలా ఇద్దరి మధ్య ట్వీట్ వార్ నెలకొంది. I love and respect every language of our country sir. I would want this topic to rest,,, as I said the line in a totally different context. Mch luv and wshs to you always. Hoping to seeing you soon. 🥳🥂🤜🏻🤛🏻 — Kichcha Sudeepa (@KicchaSudeep) April 27, 2022 కాగా సుదీప్.. 'ఒక కన్నడ సినిమాను పాన్ ఇండియాగా తెరకెక్కించారని ఎవరో అంటున్నారు. ఒక చిన్న కరెక్షన్ చేయాలనుకుంటున్నా. హిందీ ఇక నుంచి ఏమాత్రం జాతీయ భాష కాదు. నేడు బాలీవుడ్ ఎన్నో పాన్ ఇండియా సినిమాలను నిర్మిస్తోంది. తెలుగు, తమిళంలో డబ్ చేసేందుకు ఎంతో కష్టపడుతున్నారు. కానీ అవి అంతగా విజయం సాధించలేకపోతున్నాయి. కానీ ఈరోజు మనం తీస్తున్న సినిమాలను ప్రపంచం మొత్తం చూస్తున్నాయి.' అని కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. -
హానికరం అయితే ఎందుకు అమ్ముతున్నారు: అజయ్ దేవగణ్
Ajay Devgn Reaction Controversy Pan Masala Ad: బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ పాన్ మాసాల ప్రకటన నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. స్టార్ హీరోలైన అజయ్ దేవగన్, షారుక్ ఖాన్‌తో కలిసి అక్షయ్ ఈ ప్రకటనలో నటించాడు. తాజాగా అక్షయ్ ఈ యాడ్ ఎండార్స్మెంట్ వివాదంపై అజయ్ దేవగన్ స్పందించాడు. ఆయన తాజాగా నటించిన ‘రన్‌వే 34’ మూవీ ఏప్రిల్ 29న విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్ భాగంగా అజయ్ ఓ ఇంటర్య్వూలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా పాన్ మాసాల ఎండార్స్మెంట్ వివాదంపై, అక్షయ్ దీని నుంచి తప్పుకోవడంపై ఆయనకు ప్రశ్న ఎదురైంది. చదవండి: కన్నడ ప్రేక్షకులకు సారీ చెప్పిన నాని, అసలేం జరిగిందంటే.. దీనిపై అజయ్ దేవగన్ స్పందిస్తూ.. ‘నేను దీనిపై పెద్ద మాట్లాడాలనుకోవడం లేదు. దాని గురించి చర్చించడం కూడా నాకు ఇష్టం లేదు. ఎందుకంటే ప్రకటనల ఎంపిక అనేది వారి వ్యక్తిగత విషయం. ప్రతి ఒక్కరికి తమకు తాముగా నిర్ణయం తీసుకునే అధికారం ఉంది. అయితే అదే సమయంలో అది హానికరమా? కాదా? అనేది కూడా చూసుకోవాలి. ఎందుకంటే అందులో కొన్ని హానికరమైనవి ఉండోచ్చు.. మరికొన్ని ఉండకపోవచ్చు’ అని పేర్కొన్నాడు. అలాగే ‘ఇది మాత్రమే కాకుండా హాని కలిగించే ఉత్పత్తులు ఇంకా ఉన్నాయి. ఇప్పుడు వాటి పేర్లు చెప్పడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే ఈ విధంగా కూడా వాటిని నేను ప్రమోట్ చేయాలనుకోవడం లేదు. అయితే నేను చేసింది ఎలైచి బ్రాండ్ యాడ్ మాత్రమే’ అని సమాధానం ఇచ్చాడు. చదవండి: ఆర్ఆర్ఆర్లో ఎన్టీఆర్ ఎలివేషన్ సీన్‌ను డిలీట్ చేశారు: బయటపెట్టిన నటుడు అనంతరం ఇదంతా పక్కన పెడితే ఈ ప్రకటనలు అనేవి పెద్ద విషయం కాదనేది తన అభిప్రాయమని, మరి అవి అంతటి హానికరమైన ఉత్పత్తులు అయితే.. వాటిని విక్రయించకూడదని అజయ్ అభిప్రాయ పడ్డాడు. అవి హానికరం అయితే ఎందుకు అమ్ముతున్నారని ప్రశ్నించారు. కాగా అజయ్ దేవగన్ ఎంతో కాలంగా ఇదే బ్రాండ్‌కు అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే అక్షయ్ కుమార్ ఈ యాడ్‌లో నటించడంపై ఆయన ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు. ఆరోగ్యానికి హాని కలిగించే ఇలాంటి ఉత్పత్తులను తమ అభిమాన నటుడు ప్రమోట్ చేయడాన్ని వారు జీర్ణించుకోలేకపోయారు. దీంతో అక్షయ్‌ని ట్రోల్ చేయడం ప్రారంభించారు. అవి చూసిన అక్షయ్ ఫ్యాన్స్‌కు క్షమాపణలు చెప్పి ఈ ప్రకటన నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించాడు. అయితే కాంట్రాక్ట్ నిబంధనల ప్రకారం కొంతకాలం వరకు ఆ ప్రకటన ప్రసారమవుతూనే ఉంటుందని అక్షయ్ స్పష్టం చేశాడు -
ఆమె.. అజయ్ దేవగణ్ బలహీనత.. ఎవరంటే ?
Unknown Facts About Ajay Devgn: బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ ఇటీవల విడుదలైన దర్శక ధీరుడు తెరకెక్కించిన 'ఆర్ఆర్ఆర్'లో కీలక పాత్ర పోషించాడు. ఈ సినిమాలో తనదైన శైలిలో నటించి ప్రేక్షకులను మెప్పించాడు. ప్రస్తుతం అమితాబ్ బచ్చన్, రకుల్ ప్రీత్ సింగ్‌తో కలిసి రన్‌వే 34 సినిమాలో అలరించనున్నాడు. ఈ సినిమా ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే అజయ్ దేవగణ్ మరో సంవత్సరం పెద్దవాడయ్యాడు. 1969, ఏప్రిల్ 2న జన్మించిన అజయ్ దేవగణ్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయనకు బాలీవుడ్ సినీ తారలు బర్త్‌డే విషెస్ తెలియజేస్తున్నారు. అయితే 53వ పడిలోకి అడుగు పెడుతున్న ఈ బాలీవుడ్ హీరో 5 రహస్యాలు ఏంటో తెలుసుకుందామా ! 1. ట్రావెలర్ అజయ్ దేవగణ్ మంచి నటుడే కాకుండా ట్రావెల్ లవర్ కూడా. అతని కుటుంబంతో ప్రయాణించడం కంటే ఆయనకు ఏది గొప్ప ఆనందాన్ని ఇవ్వదట. అజయ్ తన తల్లిదండ్రులు, భార్యా పిల్లలు, ఇద్దరు సోదరీమణులు, వారి భర్తలు, పిల్లలతో కలిసి దూర ప్రయాణాలు చేస్తుంటాడని సమాచారం. సెలవుల్లో 25 మంది కుటుంబ సభ్యుల బృందం కలిసి టూర్‌కు వెళ్తాడట. ఇందుకోసం బిజినెస్ క్లాస్ లేదా ఫస్ట్ క్లాస్‌లో ప్రయాణించి స్టే చేసేందుకు సాధ్యమైతే ఏకంగా ఒక ఐలాండ్నే బుక్ చేస్తాడని సమాచారం. 2. శివ భక్తుడు అజయ్ దేవగణ్ గొప్ప శివ భక్తుడు. ఎంత గొప్ప భక్తుడు అంటే అతని ఛాతిపై శివుడి పచ్చబొట్టు కూడా వేయించుకున్నాడు. అంతేకాకుండా ఆయన డైరెక్ట్ చేసిన 'శివాయ్' మూవీని శివుడికి అంకితం ఇచ్చాడు. 3. టాలెంటెడ్ కుక్ అద్భుతంగా వండటంలోనూ అజయ్ దేవగణ్ సిద్ధహస్తుడు. భారతీయ, కాంటినెంటల్ డిషెస్‌ను సూపర్‌గా చేయగలడని టాక్. 4. కుటుంబమంటే అమితమైన ప్రేమ యాక్షన్ సీక్వెన్స్‌లో అదరగొట్టే అజయ్ దేవగణ్ మంచి ఫ్యామిలీ మ్యాన్ కూడా. ఆయనకు మొదటగా పుట్టిన కూతురు నైసా.. అజయ్ దేవగణ్ బలహీనత. కనీసం రోజులో కొన్నిసార్లు అయినా ఆమెతో మాట్లాడలేకపోతే అజయ్‌కు రోజు గడవదట. అలాగే కుమారుడు యుగ్ అన్న అజయ్‌కి అమితమైన ప్రేమ. 5. పోలో గ్రీన్ కొలోన్ అంటే ఇష్టం అజయ్ దేవగణ్ గత మూడు దశాబ్దాలుగా రాల్ఫ్ లారెన్ తయారు చేసిన పోలో గ్రీన్ అనే కొలోన్నే ధరిస్తున్నాడని సినీ వర్గాల నుంచి సమాచారం. -
ఆ రెండింటి మధ్య నిజం ఉంటుంది.. థ్రిల్లింగ్‌గా 'రన్‌వే 34' ట్రైలర్
Runway 34 Movie Trailer: Amitabh Bachchan Ajay Devgn Promising Acting: బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, అజయ్ దేవగన్, రకుల్ ప్రీత్ సింగ్, ఆకాంక్ష సింగ్ నటిస్తున్న చిత్రం 'రన్‌వే 34'. నిజ జీవితపు సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రానికి అజయ్ దేవగన్ దర్శకత్వం వహించారు. ఇంతకుముందు 2008లో వచ్చిన 'యూ మే ఔర్ హమ్', 2016లో వచ్చిన 'శివాయ్' చిత్రాల తర్వాత అజయ్ మళ్లీ దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. ఇదివరకు ఈ సినిమా నుంచి వచ్చిన యాక్టర్స్ ఫస్ట్‌లుక్‌లు ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. సోషల్ మీడియా వేదికగా 'ప్రతీ సెకండ్ కౌంట్స్.. రన్ వే 34 ట్రైలర్‌ను విడదల చేస్తున్నందుకు గర్వంగా ఉంది. టేకాఫ్ అవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం' అంటూ ట్రైలర్‌ను షేర్ చేశాడు అజయ్ దేవగన్. ట్రైలర్ ప్రారంభంలో అజయ్ దేవగన్ నో స్మోకింగ్ జోన్లో సిగరెట్ పట్టుకుని కనిపిస్తాడు. ఇందులో అజయ్ దేవగన్ పైలట్‌గా, రకుల్ కోపైలట్‌గా కనువిందు చేయనున్నారు. ఒక భయంకరమైన సంఘటన నుంచి ప్రయాణీకులను ఆ విమాన పైలట్లు ఎలా కాపాడరన్నదే కథాంశంగా ట్రైలర్ ఉంది. ఇందులో క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ ఆఫిసర్‌గా అమితాబ్ బచ్చన్ ఆకట్టుకున్నారు. 'చేసిన తప్పు ఒప్పుకోవడంలోనే మనిషి క్యారెక్టర్ తెలుస్తుంది', 'అసలేం జరిగింది.. ఎలా జరిగింది అనే విషయాల మధ్య ఒక సన్నని గీత ఉంటుంది. అదే నిజం' వంటి డైలాగ్‌లు ఆకట్టుకున్నాయి. ట్రైలర్ చూస్తుంటే ఒక ప్రమాదపు సంఘటన కథాంశంతో సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. 'అజయ్ దేవగన్ ఎఫ్‌ఫిల్మ్స్' సమర్పణలో అజయ్ దేవగన్ నిర్మిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
ఆర్ఆర్ఆర్ స్టార్స్ రెమ్యునరేషన్
-
గంగూభాయ్ కతియావాడి: అలియా భట్‌కు ఓ రేంజ్లో రెమ్యునరేషన్!
ఇటీవల విడుదలై విమర్శకుల ప్రశంసలందుకుంటున్న ‘గంగూభాయ్ కతియావాడి’ మూవీకి సంబంధించిన ఓ విషయం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఇప్పటికే పలు విజయవంతమైన సినిమాల్లో తన నటనతో అలరించిన స్టార్ హీరోయిన్ అలియా భట్ తాజా సినిమాతో మరో మెట్టు ఎక్కిందని విశ్లేషకులు చెప్తున్నారు. టాప్ హీరో అజయ్ దేవ్గన్ కీలక పాత్రలో నటించిన ఈ సినిమాలో అలియా కళ్లు చెదిరే పారితోషికం తీసుకుందని సమాచారం. ఇండియా టుడే వార్త సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం.. గంగూభాయ్ సినిమాకు అలియా ఏకంగా రూ.20 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంది. దేవ్గన్ రూ.11 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నాడు. సీనియర్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో రూపొందిన ఈ బయోగ్రాఫికల్ క్రైం డ్రామా సినిమా బడ్జెట్ రూ.100 కోట్లుగా ప్రచారం జరుగుతోంది. ప్రముఖ రచయిత హుస్సేన్ జైదీ ‘మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబై’ పుస్తకం ఆధారంగా గంగూభాయ్ తెరకెక్కింది. (చదవండి: ఎనర్జిటిక్ హీరోకు సరైనోడు విలన్.. ఆది రోల్ రివీల్) 1960 కాలంలో ముంబైలోని కామాఠీపుర రెడ్‌లైట్ ఏరియా ప్రధానంగా కథ సాగుతుంది. ఇక స్టార్ కిడ్ అయిన అలియా.. భన్సాలీ దర్శకత్వంలో నటించాలని తొమ్మిదేళ్ల ప్రాయం నుంచి అనుకున్నట్టు చెప్పుకొచ్చింది. గతంలో భన్సాలీ దర్శకత్వంలో వచ్చిన ‘బ్లాక్’ సినిమా ఆడిషన్స్‌కు వెళ్లానని, అయితే ఆ సినిమాలో అవకాశం రాలేదని ఆమె గుర్తు చేసుకుంది. ఇక దేశవ్యాప్తంగా గంగూభాయ్ సినిమా ఫిబ్రవరి 25న థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే. (చదవండి: రాధేశ్యామ్ ట్రైలర్ రిలీజ్‌కు డేట్ ఫిక్స్) -
అజయ్ దేవ్‌గన్‌కి కోపం వచ్చింది.. నేను ఊరొదిలి పారిపోతా!
సోషల్ మీడియా వేదికగా సామాజిక అంశాలపై స్పందించడమే కాదు తమ కంపెనీ ప్రొడక్టులను ప్రమోట్ చేసుకుంటారు ఆనంద్ మహీంద్రా. ఈ క్రమంలో మోర్ అటెన్షన్ సాధించేందుకు ఫన్నీగా ఆయన కామెంట్టు కూడా పెడుతుంటారు. అవి నెట్టింట వైరల్‌గా మారుతుంటాయి. తాజాగా ఓ యాడ్ షూటింగ్ వీడియోను ట్విట్టర్లో షేర్ చేశారు. మమీంద్రా ట్రక్‌బస్ కోసం చేపట్టిన షూట్లో.. పదే పదే స్ట్రిప్ట్‌లో మార్పులు ఎందుకు చేస్తున్నారంటూ అసహనంగా అడుగుతాడు అజయ్ దేవ్గన్.. పదే పదే మార్పులు చేయడం లేదు సార్ ఓ సాలుగైదు సార్లు అంతే అంటూ ఓ గొంతు వినిపిస్తుంది. వెంటనే కెమెరావైపు ఓ సీరియస్ లుక్ ఇస్తాడు అజయ్ దేవ్గన్. I was informed that @ajaydevgn lost his cool on a @MahindraTrukBus film shoot. I better leave town before he comes after me in one our trucks… pic.twitter.com/roXY7hIfRN — anand mahindra (@anandmahindra) February 14, 2022 ఈ వీడియోకు ఆనంద్ మహీంద్రా కామెంట్ రాస్తూ.. మహీంద్రాట్రక్బస్ షూటింగ్లో అజయ్ దేవగన్‌కి కోపం వచ్చినట్టు నాకు తెలిసింది. మా ట్రక్ బస్ వేసుకుని ఆయన నా కోసం వచ్చేలోగా.. ఊరొదిలి పారిపోతానంటూ చమత్కరించారు ఆనంద్ మహీంద్రా. -
అజయ్ దేవగన్ 30 ఇయర్స్ ఇండస్ట్రీ.. ఎమోషనల్ అయిన సింగం
Ajay Devagn Completing 30 Years In Bollywood Industry: ముప్పై ఏళ్ల క్రితం ఒక సన్నగా ఉండే వ్యక్తి 'అగర్ తేరే పాస్ జాగీర్ హై, తో మేరే పాస్ జిగర్ హై' అని డైలాగ్ చెప్పి ప్రేక్షకుల మన్ననలను పొందాడు. ఆ వ్యక్తే బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్. ఆయన తొలిచిత్రం 'ఫూల్ ఔర్ కాంటే'లోని ఈ డైలాగ్ అజయ్‌కు స్టార్డమ్ తీసుకొచ్చిన వాటిలో ఒకటి. నవంబర్ 22న అజయ్ దేవగన్ తన 30 సంవత్సరాల సినీ జీవితాన్ని పూర్తి చేసుకున్నారు. ఈ ప్రయాణంలో 'జఖ్మ్, ఇష్క్, దిల్జాలే, హమ్ దిల్ దే చుకే సనమ్, ది లెజెండ్ ఆఫ్ భగత్ సింగ్, యువ, ఓంకార, సింగం, బోల్ బచ్చన్' వంటి చిత్రాల్లో అత్యత్తమైన నటనకౌశాలన్ని ప్రదర్శించారు. సమయం గడిచినా.. స్నేహం అలాగే ఉంటుంది: అక్షయ్ ఈ సందర్భంగా బీ టౌన్ సూపర్ స్టార్లు అమితాబ్ బచ్చన్, అక్షయ్ కుమార్ ట్విటర్లో అజయ్ దేవగన్‌కు శుభాకాంక్షలు తెలపుతూ ప్రత్యేక పోస్ట్‌లు పెట్టారు. 'అజయ్ దేవగన్ తన మొదటి చిత్రం 'ఫూల్ ఔర్ కాంటే' నవంబర్ 22న విడుదలవడంతో చలన చిత్ర పరిశ్రమలో 30 వసంతాలు పూర్తి చేసుకుంది. అజయ్ మృదుస్వభావి. అనవసర విషయాల్లో జోక్యం చేసుకోరు. ఇంకా సినిమా పట్ల మంచి అభిరుచి కలిగి ఉన్నారు. నా అభినందనలు అజయ్. మీరు మరో 70 ఏళ్ల పాటు కొనసాగాలని కోరుకుంటున్నా.' అంటూ బిగ్ బీ అమితాబ్ రాసుకొచ్చారు. మరోవైపు అక్షయ్ కుమార్ ఇలా 'మనం కొత్తవారిగా ఉన్నప్పుడు నాకు గుర్తుంది. నేను నువ్వు జుహు బీచ్‌లో మార్షల్ ఆర్ట్స్ సాధన చేసేవాళ్లం. మీ నాన్న మనకు శిక్షణ ఇచ్చేవారు. ఎంత మంచి రోజులవి. అలాగే నీ మొదటి చిత్రం 'ఫూల్ ఔర్ కాంటే ' వచ్చి 30 ఏళ్లు అవుతుంది. సమయం గడిచిపోతుంది. కానీ స్నేహం అలాగే ఉంటుంది.' ట్వీట్ చేశారు. Sir, Thank you for your blessings. ❤️ Ajay https://t.co/v9zGOxoVQF — Ajay Devgn (@ajaydevgn) November 22, 2021 Thanks Akki, we’ve shared a long innings. And, I’m happy & grateful for your presence alongside❤️ https://t.co/MPp9udjamE — Ajay Devgn (@ajaydevgn) November 22, 2021 ఎమోషనల్ అవుతున్నా: అజయ్ 'ఈ చిత్రం అజయ్‌ను చిత్రసీమకు పరిచయం చేయడమే కాకుండా రెండు బైక్‌లపై అతను ఇచ్చిన ఎంట్రీ సీన్ అప్పట్లో సంచలనంగా మారింది. 'ఫూల్ ఔర్ కాంటే' 30 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం చాలా ప్రత్యేకమైనది. ఈ చిత్రం భారతీయ చలనచిత్ర పరిశ్రమలో నా అరంగ్రేటం. ఆస్ట్రైడ్లో రెండు బైక్‌లపై ఎంట్రీ ఇవ్వడం నా కెరీర్లో చాలా ముఖ్యమైన ఘట్టం. ఆ కదిలై బైక్‌లపై స్టంట్ చేసినప్పుడు అనుభవించిన థ్రిల్ నాకు ఇప్పటికీ గుర్తుంది. అప్పటి నుంచి హిందీ సినిమా దాని పరిధులను విస్తృతం చేసుకుంటూ, అభివృద్ధి చెందుతోంది. ఈ పరిశ్రమలో భాగం కావడం నా అదృష్టం. 30 ఏళ్ల తర్వాత 'ఫూల్ ఔర్ కాంటే'ను మళ్లీ వీక్షించడం భావోద్వేగంగా అనిపిస్తుంది.' అని అజయ్ దేవగన్ తన అనుభవాలను పంచుకున్నారు. అజయ్ దేవగన్ బాలీవుడ్ ఇండస్ట్రీలో 30 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన తెరంగ్రేటం చేసిన 'ఫూల్ ఔర్ కాంటే' 'జీ బాలీవుడ్' ఛానెల్లో ఇవాళ సాయంత్రం 5.45 గంటలకు ప్రసారం కానుంది. ఈ చిత్రానికి 'వీరూ దేవగన్' దర్శకత్వం వహించారు. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న 'ఆర్ఆర్ఆర్' సినిమాలో అజయ్ దేవగన్ నటిస్తున్న సంగతి తెలిసిందే. చదవండి: కళ్లు చెదిరే రేటుకు అజయ్ కొత్త బంగ్లా! -
వీడియోలో అడ్డంగా దొరికిపోయిన అక్షయ్.. అయినా వదలని కత్రీనా
బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్, కత్రీనా కైఫ్ జంట నటిస్తున్న తాజా చిత్రం ‘సూర్యవంశీ’. రోహిత్ శెట్టి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో అజయ్‌దేవ్‌గణ్, రణ్వీర్ సింగ్ కూడా ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నవంబర్ 5న థియేటర్స్‌లో విడుదల కానుంది. తాజాగా ఈ మూవీ ప్రమోషన్స్ పారంభించింది ఈ చిత్రబృందం. ఆ సమయంలో తీసిన ఓ ఫన్నీ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసింది క్యాట్. మా బోయ్స్ ఎంత ఉత్సాహంగా ఉన్నారో చూడండంటూ అక్షయ్, రోహిత్‌ను చూపించింది ఈ బ్యూటీ. అందులో అక్షయ్ కళ్లు మూసుకొని, రోహిత్ కాళ్లపై తలపెట్టి పడుకొని ఉన్నాడు. కత్రీనా వీడియో తీయడం చూసిన రోహిత్, అక్షయ్ రికార్డు చేయొద్దు అంటూ పరుగు లంకించుకున్నారు. ‘ఇప్పుడు మేము అంతా బాగా కనిపించడం లేదు. మాకు ఫేమ్ ఉంది. రికార్డు చేయొద్దు’ అంటు పరిగెత్తుతున్న అక్షయ్ కిందపడ్డాడు. అది చూసిన పట్టువదలని ఈ భామ గొల్లున నవ్వుతూనే వీడియో రికార్డు చేసి సోషల్ మీడియాలో షేర్ చేసింది. అందులో మూవీ ప్రమోషన్స్ గురించి వారు ఎంత ఎక్సయిట్మెంట్తో ఉన్నారో చూడండి అంటూ వెటకారమాడింది ఈ బ్యూటీ. దీంతో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: OMG 2: శివుడిగా అక్షయ్ కుమార్.. లుక్ అదిరిందిగా! View this post on Instagram A post shared by Katrina Kaif (@katrinakaif) -
భుజ్ ది ప్రైడ్ ఆఫ్ ఇండియా: మేమున్నాం!!
డిసెంబర్ 8, 1971 ఇండియా-పాక్ యుద్ధకాలం..బాంబుల భయంతో వణుకుతున్న ఊరు. బాంబులు కురిసినా సరే దేశం కోసం చనిపోయినా పరవాలేదనే సాహసోపేత నిర్ణయం. ‘మేమున్నాం’ అంటూ ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 300 మంది వీర నారీమణుల తెగువ. 72 గంటల వ్యవధిలో ఎయిర్‌ఫోర్స్ బేస్ పునరుద్ధరణ. ప్రాణాలకు తెగించి మరీ దేశభక్తిని చాటుకున్న వైనం! అంతేనా.. ప్రభుత్వ అవార్డు సొమ్మును దానం చేసిన దాతృత్వం.. జయహో.. వీరమహిళలు!! చలి పులిలా విజృంభిస్తుంది. కాని ఆ ఊరు చలితో కాదు ‘బాంబుల భయం’తో వణికిపోతుంది. అందరూ ఆకాశం వైపు భయం భయంగా చూస్తున్నారు. పాకిస్థాన్ జెట్స్ భుజ్ (కచ్ జిల్లా, గుజరాత్)లోని ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ బేస్‌పై బాంబులు వేశాయి. ఈ నేపథ్యంలో ఎయిర్‌బేస్‌ను పునరుద్ధరించడానికి భారత వైమానిక దళం బీఎస్ఎఫ్ జవాన్ల సహాయం కోరింది. పునరుద్ధరణ తక్కువ సమయంలో జరగాలంటే ఎక్కువమంది శ్రామికులు కావాలి. వారిని వెదికిపట్టి తీసుకురావడానికి సమయం లేదు. దగ్గరి గ్రామాల్లోని వారి సహాయం కోరాలి.ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఎవరి ఇంట్లో వాళ్లు ఉన్న ఆ సమయంలో ఎవరు బయటకు వస్తారు? వచ్చినా సహాయపడతారా?రకరకాల సందేహాలను పటాపంచలుచేస్తూ... ఒక్కరు కాదు ఇద్దరు కాదు మాదపూర్ గ్రామానికి చెందిన 300 మంది స్త్రీలు ‘మేమున్నాం’ అంటూ ముందుకువచ్చారు. పునరుద్ధరణ పనుల్లో చురుగ్గా పాలుపంచుకున్నారు. డిసెంబర్ 8, 1971 ఇండియా-పాక్ యుద్ధకాలం నాటి దృశ్యం ఇది. ఆనాటి భుజ్ ఎయిర్ బేస్‌ను పునర్నిర్మించిన 300 మంది మహిళలను సగౌరవంగా గుర్తు తెచ్చుకుంటుంది ‘భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా’ చిత్రం. (అజయ్ దేవ్‌గణ్, సంజయ్‌దత్, సోనాక్షిసిన్హా ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా వోటీటీలో విడుదలైంది) ఈ నేపథ్యంలో ఆనాటి జ్ఞాపకాలు ఆసక్తికరంగా మారాయి. ‘చనిపోయినా సరే, దేశం కోసం చనిపోయాను అనే తృప్తి మిగులుతుంది...అని ఒకరికొకరం ధైర్యం చెప్పుకొని పనిలోకి దిగాము’ అని ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటుంది సెఘాని అనే మహిళా యోధురాలు. ఆ 300 మంది మహిళలలో ఒకరైన హిరూ బుదియాలో మొదట ఒక సందేహం...‘వెళుతున్నాను సరే, కూలిపని తప్ప నాకు ఏది తెలియదు. నేను చేయగలనా?’ఆ తరువాత భయం... ‘పనిలో ఉండగా పై నుంచి బాంబులు పడితే... ఇంకేమైనా ఉందా!’తనలోని ధైర్యానికి, సందేహాలతో కూడిన భయానికి మధ్య ఆ సమయంలో పెద్ద యుద్ధమే జరిగింది. కాని చివరికి ధైర్యమే గెలిచింది. దేశభక్తి గొప్పతనం అదే కదా! (చదవండి : Mirabai Chanu: ట్రెడిషనల్ ఔట్ఫిట్, ట్వీట్ వైరల్) ‘చిన్నచిన్న విషయాలకే భయపడే నాకు అంతధైర్యం ఎలా వచ్చిందో తెలియదు. ఏదో శక్తి ఆవహించినట్లు అనిపించింది’ అని ఆరోజును గుర్తు తెచ్చుకుంటుంది వీరు లఖాని. 72 గంటల వ్యవధిలో ఎయిర్‌ఫోర్స్ బేస్‌ను పునరుద్ధరించే పని పూర్తయింది.యుద్ధం పూర్తయిన తరువాత గ్రూప్ అవార్డ్‌గారూ. 50,000 ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. అయితే ఈ మొత్తాన్ని గ్రామ పంచాయతీ కమ్యూనిటీ హాల్ కోసం ఇచ్చి తమ దాతృత్వాన్ని చాటుకున్నారు వీరమహిళలు. -
నాంది రీమేక్‌లో బాలీవుడ్ స్టార్ హీరో
తెలుగు హిట్ ‘నాంది’ (2021) హిందీలో రీమేక్ కానుంది. హిందీ నటుడు, దర్శక–నిర్మాత అజయ్ దేవగణ్‌తో కలిసి ఈ రీమేక్‌ను ‘దిల్’ రాజు నిర్మించనున్నారు. ‘‘చాలా ముఖ్యమైన ఓ కథను షేర్ చేసుకోవాల్సిన సమయం ఇది. అజయ్ దేవగణ్ ఫిలింస్, ‘దిల్’ రాజు ప్రొడక్షన్స్ కలిసి తెలుగు హిట్ ‘నాంది’ సినిమాను హిందీలో రీమేక్ చేయడానికి అన్ని పనులు పూర్తయ్యాయని చెప్పడానికి సంతోషిస్తున్నాను’’ అని ట్వీట్ చేశారు అజయ్ దేవగణ్. మరి.. ‘నాంది’ హిందీ రీమేక్‌కు ఎవరు దర్శకత్వం వహిస్తారు? నటీనటులు ఎవరు? అనే విషయాలను స్పష్టం చేయలేదు. ఇక ‘నాంది’ కథ విష యానికి వస్తే.. హాయిగా జీవిస్తున్న ఓ మధ్యతరగతి సాఫ్ట్వేర్ ఉద్యోగి అనూహ్యంగా హత్యారోపణలతో జైలుపాలవుతాడు. న్యాయం కోసం పోరాడే ఆ వ్యక్తి కథే ‘నాంది’ చిత్రం. కొంత గ్యాప్ తర్వాత అల్లరి నరేశ్ కెరీర్‌ని హిట్ ట్రాక్ ఎక్కించిన ఈ చిత్రానికి విజయ్ కనకమేడల దర్శకుడు. చదవండి : ఆర్టిస్ట్‌లు లోకల్ కాదు.. యూనివర్సల్ మరో తెలుగు సినిమాకు సైన్ చేసిన హీరో ధనుష్ -
అజయ్ దేవగణ్ భార్యగా కాజల్..
హిందీ హీరో అజయ్ దేవగణ్‌తో కాజల్ అగర్వాల్ రెండోసారి జోడీగా నటించనున్నారా? అంటే అవుననే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. హిందీ ‘సింగం’ చిత్రంలో అజయ్‌తో తొలిసారి నటించారు కాజల్. రోహిత్ శెట్టి దర్శకత్వం వహించిన ఈ సినిమా 2011లో విడుదలై ఘనవిజయం సాధించింది. ఈ చిత్రంతో మంచి జోడీ అనిపించుకున్న అజయ్–కాజల్ దాదాపు పదేళ్ల తర్వాత మరోసారి కలసి నటించనున్నట్లు వార్తలొస్తున్నాయి. కార్తీ హీరోగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన తమిళ ‘ఖైదీ’ హిందీ రీమేక్‌లోనే ఈ ఇద్దరూ జంటగా నటించనున్నారని టాక్. అయితే తమిళ వెర్షన్లో హీరోయిన్ పాత్రకు స్థానం లేదు. కానీ బాలీవుడ్‌కి తగ్గట్టు కథను మార్చిన నేపథ్యంలో కథానాయిక పాత్రకు అవకాశం ఉందని సమాచారం. హీరో పాత్రకు ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్‌ను జోడించారట. ఆ ఫ్లాష్‌బ్యాక్‌లో అజయ్ భార్యగా కాజల్ అగర్వాల్ కనిపించనున్నారని ఓ వార్త హల్చల్ చేస్తోంది. -
రూ. 30 కోట్ల భారీ సెట్ ధ్వంసమైంది.. బోని కపూర్ ఆవేదన
ఒకవైపు కరోనా మహమ్మారితో దేశ ప్రజలు అల్లాడుతుంటే.. మూలిగే నక్క మీద తాటిపండు పడడం అన్నట్లుగా తౌటే తుఫాన్ వచ్చి దేశంలో కల్లోలం సృష్టించింది. దేశంలోని పలు ప్రాంతాల్లో జనజీవనం అస్తవ్యస్తమైంది. ముంబైలోని పలు ప్రాంతాలు తీవ్రంగా నష్టపోయాయి. ఈ తుఫాన్ ప్రభావం చిత్ర పరిశ్రమపై కూడా భారీగానే పడింది. బాలీవుడ్‌కు చెందిన చాలా సినిమాల సెట్టింగులు దెబ్బ తిన్నాయి. వందల కోట్ల నష్టం వాటిల్లింది. కేవలం మైదాన్ అనే సినిమాకు సంబంధించి తుపాను కారణంగా రూ.30 కోట్ల నష్టం వాటిల్లిందట. ఈ విషయాన్ని స్వయంగా నిర్మాత బోని కపూర్ మీడియాకు వెల్లడించారు. అజయ్ దేవగణ్ హీరోగా బోనికపూర్ నిర్మిస్తున్న మైదాన్ చిత్రం కోసం భారీ సెట్‌ను ముంబైలో వేశారు. అయితే తౌటే తుఫాన్ దాటికి ఆ సెట్ పూర్తిగా ధ్వంసమైంది. ఈ నేపథ్యంలో మీడియాతో బోనికపూర్ మాట్లాడుతూ..‘గతేడాది లాక్డౌన్ సమయంలో మైదాన్ కోసం వేసిన సెట్‌ను తొలిసారి కూలగొట్టాం. ఆ తర్వాత మళ్లీ రెండోసారి సెట్ వేసి చిత్రీకరించాం. ఆ తర్వాత లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత మరోసారి సెట్ నిర్మించాం. అయితే ప్రస్తుత తౌటే తుఫాన్ ధాటికి మళ్లీ సెట్ అంతా కూలిపోయింది. దాదాపు రూ.30 కోట్ల నష్టం వాటిల్లింది ’అని బోనికపూర్ ఆవేదన వ్యక్తం చేశారు. -
ఆర్ఆర్ఆర్ : పవర్ఫుల్ లుక్‌లో అజయ్ దేవగన్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం రౌధ్రం రణం రుధిరం (ఆర్ఆర్ఆర్). ఈ సినిమాలో అజయ్ దేవగన్ జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ల గురువుగా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. అదికూడా ఫ్లాష్‌బాక్ సీన్లలో కనిపించనున్నట్లు సమాచారం. అతనికి జంటగా శ్రియ శరణ్ నటించనుంది శుక్రవారం (ఏప్రిల్2)న ఆయన పుట్టినరోజు కావడంతో ఆర్ఆర్ఆర్లో అజయ్ దేవగన్ ఫస్ట్‌లుక్ మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇప్పటికే ఎన్టీఆర్,రామ్‌చరణ్, ఒలివియా, ఆలియాభట్ ఫస్ట్‌లుక్‌లను చిత్రబృందం విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్లు, రామ్ చరణ్ ‘భీం ఫర్ రామరాజు', ఎన్టీఆర్ ‘రామరాజు ఫర్ భీం' వీడియోలు రికార్డులు క్రియేట్ చేయడంతో పాటు సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. 'బాహుబలి' తర్వాత రాజమౌళి నుంచి వస్తున్న తొలి సినిమా కావడం, స్వాతంత్ర్య సమరవీరుల పాత్రల్లో ఇద్దరు స్టార్ హీరోలు నటిస్తుండటంతో ఆర్ఆర్ఆర్ పై అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి. దసరా కానుకగా అక్టోబర్ 13న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం. Empowering his people is his defining characteristic. His strength lies in his emotion. Presenting the poweRRRful avatar of @ajaydevgn in #RRRMovie.https://t.co/2cwcGGl7BF#HappyBirthdayAjayDevgn#AjayDevgn #RRR @ssrajamouli @tarak9999 @AlwaysRamCharan @aliaa08 @DVVMovies — RRR Movie (@RRRMovie) April 2, 2021 చదవండి : రాజమౌళి నిర్ణయంతో వకీల్‌సాబ్ నిర్మాత అప్సెట్! ఆర్ఆర్ఆర్ : రామ్‌చరణ్ ఫ్యాన్స్‌కి గిఫ్టిచ్చిన రాజమౌళి -
గంగుబాయి.. నేటికి ఆమె ఫోటో వేశ్యాగృహాల్లో..
గంగుబాయి కథ ఒక సినిమాకు తక్కువ కాదు. అందుకే అది ఇప్పుడు సినిమా అయ్యింది. గుంగుబాయి కతియావాడి ముంబై కామాటిపురాకు మకుటం లేని మహారాణి. కరీం లాలా అనే మాఫియా డాన్‌కు రాఖీ కట్టడంతో అతని అండ దొరికి కామాటిపురాను ఏలింది. అయితే ఆమె జీవితాంతం వేశ్యలకు సాయం చేయడానికే చూసింది. అందుకే నేటికీ ఆమె విగ్రహం కామాటిపురాలో ఉంది. ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ జూలై 30న రిలీజవుతుందని టాక్. ఆలియా భట్ హీరోయిన్గా నటించిన గంగుబాయి బయోపిక్ కూడా అదే డేట్‌కు రిలీజ్ కానుంది. ఆ కలెక్షన్ల క్లాష్ కంటే గుంగుబాయి చరిత్రే ఎక్కువ ఆసక్తికరం. చరిత్ర నిక్షిప్తం చేసుకున్న కథలు ఎన్నో. మనల్ని ఆశ్చర్యపరిచేవి, సంతోషపెట్టేవి, బాధ పెట్టేవి, గర్వపడేలా చేసేవి, సామాజిక పరిణామాలను తెలియ చేసేవి... ఒకప్పుడు సినిమాలంటే కల్పిత కథలు. నేడు చరిత్ర నుంచి ఏరుతున్న పుటలు. దర్శకుడు సంజయ్ లీలాబన్సాలీ అలాంటి మరొక పుటను వెతికి పట్టుకున్నాడు. దాని పేరు ‘గుంగుబాయి కతియావాడీ’. 1960లలో ముంబై రెడ్‌లైట్ ఏరియా అయిన కామాటిపురాలో చక్రం తిప్పిన మేడమ్ గంగుబాయి కతియావాడీ. ఇప్పుడు ఆమె బయోపిక్ దాదాపుగా పూర్తి కావచ్చింది. గుంగుబాయిగా ఆలియాభట్ నటించింది. ఇంటి నుంచి పారిపోయి గుంగుబాయి కథ ఆసక్తికరమైనది. ఆమెది గుజరాత్‌లోని కతియావాడీ. వాళ్లది లాయర్ల కుటుంబం అని చెబుతారు. గంగుబాయి చిన్న వయసులో సినిమాల పిచ్చిలో పడింది. అంతే కాదు వాళ్ల నాన్న దగ్గర క్లర్క్‌గా పని చేసే కుర్రాడి ప్రేమలో కూడా పడింది. ఇద్దరూ కలిసి ముంబై పారిపోయారు. వాళ్లిద్దరూ కొన్నాళ్లు కాపురం చేశారని అంటారు. కాని ముంబైలాంటి మహా నగరిలో ఆ కుర్రాడు బెంబేలెత్తాడు. గుంగుబాయిని కామాటిపురాలోని ఒక వేశ్యాగృహంలో 500 రూపాయలకు అమ్మేసి పారిపోయాడు. అక్కడి నుంచే గంగుబాయి జీవితం అనూహ్యమవుతూ వచ్చింది. ప్రతిఘటన... లొంగుబాటు వేశ్యావాటికలో గంగుబాయి వారాల తరబడి ఏడ్చింది. కాని తుదకు వృత్తిని అంగీకరించక తప్పలేదు. అయితే ఆమె రూపం, కొద్దో గొప్పో ఉన్న చదువు ఆమెను హైక్లాస్ క్లయింట్ల దగ్గరకు వెళ్లే వేశ్యను చేయగలిగాయి. వారి రాకపోకలు ఆమె కోసం సాగేవి. కాని సహజంగా నేరగాళ్లు కూడా చాలామంది వచ్చి పోతూ ఉండేవారు. అలా ఆమెకు ముంబై అండర్‌వరల్డ్ తెలిసింది. ఆ సమయంలోనే నాటి పెద్ద డాన్ అయిన కరీం లాలాకు చెందిన ఒక వ్యక్తి ఆమెపై అత్యాచారం చేశాడు. ఇది ఆమెను చాలారోజుల పాటు అచేతనం చేసిందని అంటారు. తన మీద దాడి ఆమె సహించలేకపోయింది. అయితే మెల్లగా కోలుకుని తనకు న్యాయం జరగాలని ఆశించి శుక్రవారం నమాజు ముగించుకుని వస్తున్న కరీం లాలాను కలిసింది. తనకు జరిగిన అన్యాయం, తాను అనుభవిస్తున్న వేదన చెప్పుకుంది. కరీం లాలా వెంటనే ఆమెకు ఊరడింపు ఇచ్చాడు. ఆమె రాఖీ కడితే కట్టించుకుని రక్ష ఇచ్చాడు. అంతే కాదు ‘కామాటిపురాలో గుంగుబాయికి ఎటువంటి కష్టం ఎవరు కలిగించినా వారి పని చూస్తా’ అని హెచ్చరించాడు. ఇది గంగుబాయికి పెద్ద వరం అయ్యింది. ఆమె కామాటిపురాలో తానే వేశ్యాగృహాల యజమానిగా ఎదగడం మొదలెట్టింది. మహా ప్రాభవం కామాటిపురాలో గంగుబాయికి అనేక వేశ్యాగృహాలు సొంతమయ్యాయి. ఆమె కట్టే ఖరీదైన చీరలు నాడు విశేషమయ్యాయి. నిజం బంగారు అంచు ఉండే చీరలు, నిజం బంగారు గుండీలు ఉండే జాకెట్లు ఆమె కట్టుకునేది. ఆమెకు ఆరోజుల్లోనే బెంట్లి కారు ఉండేది. అండర్ వరల్డ్ కూడా ఆమె గుప్పిట్లో ఉండేది. అయితే ఆమె బలవంతపు వ్యభిచారాన్ని ప్రోత్సహించలేదు. దీనిని వృత్తిగా స్వీకరించడానికి ఇష్టపడేవాళ్లే ఉండాలని భావించింది. ఎవరైనా ఈ కూపం నుంచి బయటపడాలనుకుంటే వారిని వెళ్లనిచ్చేది. అంతే కాదు వేశ్యల బాగోగులతోబాటు, వారికి పుట్టిన బిడ్డల బాగోగులు కూడా ఆమె చూసేది. అందువల్లే ఆమె విగ్రహం కామాటిపురాలో ఉంది. ఆమె ఫొటోలు నేటికి కామాటిపురాలోని వేశ్యాగృహాల్లో కనిపిస్తాయి. సినిమాలో కథ ఈ సినిమా కథను సంజయ్ లీలా బన్సాలీ పకడ్బందీగా తీస్తున్నాడని వినికిడి. ఆలియా భట్ ఈ క్యారెక్టర్‌ను చాలెంజింగ్‌గా తీసుకుని చేస్తోంది. అజయ్ దేవ్‌గణ్ ‘కరీం లాలా’ పాత్రను పోషిస్తున్నాడు. ఎన్నిసార్లు విన్నా వేశ్యల జీవితంలో విషాదమే ఉంటుంది. దీని గురించి ఎంతో సాహిత్యం వచ్చింది. సినిమాలూ వచ్చాయి. కాని గుంగుబాయి లాంటి వ్యక్తి గురించి వస్తుండటం వల్ల దీని గురించి కుతూహలం ఏర్పడింది. సినిమా విడుదల గురించి వస్తున్న వార్తలను బట్టి జూలై 30న దీనిని విడుదల చేయనున్నారు. ప్రభాస్ ‘రాధేశ్యామ్’ కూడా అదే రోజు కావచ్చని అంచనా. కనుక రెండు సినిమాలు కలెక్షన్ల పోటీని ఎదుర్కోవాలి. – సాక్షి ఫ్యామిలీ -
పెళ్ళిలో అజయ్ దేవ్‌గణ్ డబ్బులు ఆఫర్ చేశాడు!
పెళ్ళి అనేది అందరి జీవితంలో ఒక తియ్యని అనుభూతి. బాలీవుడ్లో కొన్ని జంటలను చూస్తే ఒకరి కోసమే మరొకరు పుట్టారా! అనిపిస్తుంది. బీ టౌన్ జంట కాజోల్, అజయ్‌దేవ్‌గణ్ ఈ కోవలోకే వస్తుంది. వీరి పెళ్ళి జరిగి నేటితో 22 ఏళ్ళు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా కాజోల్ తమ పెళ్ళి ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫోటోలో నారింజ రంగు డ్రెస్సులో ఉన్న కాజోల్, తెల్లటి దుస్తుల్లో మెరిసిపోతున్న అజయ్ దేవ్గన్ ఒకరినొకరు చూసుకుంటున్నారు. ఇప్పుడా ఫొటోలు సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తున్నాయి. ఈ క్రమంలో కాజోల్ తమ పెళ్ళినాటి మధుర క్షణాలను గుర్తుచేసుకున్నారు. పెళ్లయి ఇన్నేళ్లవుతున్నా ఏరోజు కూడా ఒంటరిగా ఫీలవ్వలేదని చెప్పుకొచ్చారు. అయితే పెళ్లి నాడు అజయ్ దేవ్గన్ ఫెరాస్(అగ్ని చుట్టూ తిరగడం) విషయంలో తొందర పెట్టాడని, వీలైనంత త్వరగా పెళ్ళితంతు ముగించడానికి పురొహితుడికి డబ్బులు కూడా ఇవ్వడానికి సిద్దపడ్డాడని సరదాగా గుర్తుచేసుకున్నారు. కాగా 1995 సంవత్సరంలో 'హల్చల్' సినిమాలో ఈ జంట తొలిసారిగా కలిసి నటించారు. ఆ సమయంలోనే వీరి మధ్య స్నేహం చిగురించింది. ఇద్దరి అభిప్రాయాలు కలవడంతో పెళ్లి బంధంతో ఒక్కటవ్వాలనుకున్నారు. పెద్దల అంగీకారంతో 1999లో సరిగ్గా ఇదే రోజు పంజాబీ, మహారాష్ట్ర సాంప్రదాయాల ప్రకారం వైభవంగా పెళ్లి చేసుకున్నారు. వీరికి కూతురు న్యాసా, కొడుకు యుగ్ ఉన్నారు. వీరిద్దరు కలిసి గుండరాజ్, ఇష్క్, దిల్క్యాకరే, రాజుచాచా, ప్యార్థోహోనాహిథా సినిమాల్లోనూ కలిసి నటించారు. ఈ మధ్యే వచ్చిన 'తానాజీ: ది అన్సంగ్ వారియర్'లోనూ భార్యాభర్తలుగా కనిపించారు. చదవండి: మంచుకొండల్లో కల తీర్చుకుంటున్న బాలీవుడ్ క్వీన్ -
రాజమౌళి నిర్ణయంతో వకీల్‌సాబ్ నిర్మాత అప్సెట్!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన మల్టీస్టారర్ సినిమా ఆర్ఆర్ఆర్. రెండేళ్లుగా ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అందరి ఆశలను ఎట్టకేలకు నిన్న ఈ మూవీ రిలీజ్ డేట్‌ను డైరెక్టర్ రాజమౌళి అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. దసరా సందర్భంగా అక్టోబర్ 13న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు తీసుకున్నట్లు వెల్లడించారు. దీంతో జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ ఇద్దరూ రాజమౌళి నిర్ణయంతో సంతోషంగా ఉన్నప్పటికీ బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ మాత్రం నిరాశ చెందినట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఆర్ఆర్ఆర్ విడుదల తేదినే బోనీ కపూర్ ప్రొడక్షన్లో వస్తున్న మైదాన్ సినిమా విడుదల కానున్నట్లు నిర్మాత ఆరు నెలల క్రితమే ప్రకటించాడు. ఈ రెండు సినిమాల్లోనూ అజయ్ దేవగణ్ నటిస్తుండటం విశేషం. అయితే ఆర్ఆర్ఆర్ విడుదల తేదీకి ముందే బోనీ కపూర్‌తో మాట్లాడాలని అజయ్ రాజమౌళిని కోరాడట. చదవండి: సింగర్ సునీత వెడ్డింగ్.. సుమ డాన్స్ అదరహో అజయ్ నటిస్తున్న మైదాన్ చిత్రం ఫుట్‌బాల్ లెజండరీ ఆటగాడు సయ్యద్ అబ్దుల్ రహిత్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కింది. అందుకే ప్రత్యేకంగా రాజమౌళితో ఆర్ఆర్ఆర్ విడుదల తేదీని ప్రకటించే ముందు బోనీ కపూర్‌ను సంప్రదించాలని అజయ్ దేవగణ్ చెప్పినట్లు సమాచారం. అయితే బోనీ కపూర్‌ను కలవకుండానే రాజమౌళి ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్‌ను ప్రకటించాడు. దీంతో ఈ బాలీవుడ్ నిర్మాత అప్సెట్ అయినట్లు తెలుస్తోంది. ‘తప్పకుండా నేను నిరాశ చెందుతున్నాను! ఇది చాలా సరైనది కాదు. మైదాన్ విడుదల తేదీని నేను ఆరు నెలల క్రితం ప్రకటించాను. సినీ పరిశ్రమను కాపాడటానికి మనమందరం కలిసి రావాల్సిన సమయంలో, అతను (రాజమౌళి) ఇలా చేశాడు’ అని బోనీ కోపంగా ఉన్నట్లు టాక్. చదవండి: ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ వచ్చేసింది ఇదిలా ఉండగా కోవిడ్ అనంతరం ప్రతి సినిమాకు చెందిన యూనిట్, నిర్మాతలు తమ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. మరి ఈ క్రమంలో బాక్సాఫీస్ వద్ద ఫైట్‌ను నివారించేందుకు 'ఆర్ఆర్ఆర్' కోసం బోనీ కపూర్ తన చిత్రాన్ని వాయిదా వేస్తారా లేదా అనేది చూడాల్సి ఉంది. మరోవైపు బాలీవుడ్లో విజయం సాధించిన పింక్ రీమెక్ వకీల్ సాబ్‌ను బోనీ కపూర్, దిల్ రాజ్ కలిసి నిర్మిస్తున్నారు. పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది చివరి నాటికి విడుదలయ్యే అవకాశం ఉంది. -
ప్రేమ పెళ్లి అంత వీజీ కాదు
కాజోల్ తాజా సినిమా ‘త్రిభంగ’ ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతోంది. ఫ్యామిలీ అనుబంధాలలోని సవాళ్లను ఈ సినిమా చర్చిస్తూ విమర్శకుల ప్రశంసలు పొందుతోంది. ‘త్రిభంగ’ అనేది ఒడిస్సీ నృత్యంలో ఒక భంగమ. దానిని కచ్చితంగా ఎవరూ పెట్టలేరు.. అయినా ఒక అందం ఉంటుంది. ఈ సందర్భంగా జరుగుతున్న ఫ్రమోషన్లో కాజోల్ మాట్లాడుతూ ప్రతి కుటుంబంలో అనుబంధాలన్నీ అందరి ఇష్టాల కచ్చితత్వంతో ఉండవని అంది. ‘1999లో అజయ్ దేవగన్‌ను నేను పెళ్లి చేసుకుందామనుకున్నప్పుడు మా నాన్న షోము ముఖర్జీ అందుకు సముఖంగా లేరు. అప్పుడు నా వయసు 23 ఏళ్లు. ఇంకా కొన్నాళ్లు పెళ్లిని వాయిదా వేసి కెరీర్ మీద దృష్టి పెట్టాలని ఆయన ప్రతిపాదన. నాకేమో పెళ్లి చేసుకోవాలని. మరోవైపు అజయ్ తల్లిదండ్రులు మా పెళ్లికి సిద్ధంగా ఉన్నారు. మా నాన్న మాత్రం నాతో నాలుగురోజులు మాట్లాడలేదు కూడ. అప్పుడు మా అమ్మ (తనూజ) నాకు సపోర్ట్‌గా నిలిచింది. నీ మనసుకు నచ్చినట్టు చెయ్ అని చెప్పింది. మా అమ్మ నా ప్రతి కష్టకాలంలో నాకు తోడు ఉంది. ఆమె అన్నీ నాకు వివరించి చెప్పేది. మా నాన్నంటే మాకు ఎంత ఇష్టమైనా ఆమె వివరించిన దానిని బట్టి వారి విడాకులను పిల్లలం మేము అర్థం చేసుకున్నాం. కుటుంబంలో సవాళ్లు వస్తూనే ఉంటాయి. వాటిని జాగ్రత్తగా నిర్వహించుకోవాలి’ అంది కాజోల్. అజయ్–కాజోల్‌ల జంట బాలీవుడ్లో సక్సెస్ఫుల్ వివాహిత జంటగా గుర్తింపు పొందింది. వారికి ఇద్దరు పిల్లలు. అజయ్, కాజోల్ నటనను కొనసాగిస్తున్నారు.. సినిమాలు కూడా నిర్మిస్తున్నారు. -
ఆ వార్త వినగానే.. అభిషేక్‌ని గట్టిగా తిట్టేశా: అజయ్ దేవ్‌గణ్
కోవిడ్ మొదలయ్యి భయభ్రాంతం చేస్తున్న రోజుల్లో అమితాబ్ దాని బారిన పడి హాస్పిటల్లో తీవ్రంగా పోరాడాల్సి రావడం అందరికీ తెలిసిందే. అదే సమయంలో అభిషేక్ కూడా కరోనా బారిన పడ్డాడు. తండ్రీ కొడుకులు ఇద్దరూ ఒకే హాస్పిటల్లో ఉన్నారు. ఆ సంఘటనతో దేశం అంతా అలెర్ట్ అయ్యింది. అమితాబ్కే వచ్చినప్పుడు మనక్కూడా రావచ్చని జాగ్రత్తలు పాటించింది. రెండు రోజుల క్రితం సోనీలో వచ్చిన ‘కామెడీ విత్ కపిల్’షోలో అభిషేక్ బచ్చన్, అజయ్ దేవ్‌గణ్ పాల్గొని ఆ ఘటనను గుర్తు చేసుకున్నారు. ‘కోవిడ్ వార్త వెలువడగానే నేను అభిషేక్‌కు ఫోన్ చేశాను. గట్టిగా తిట్టేశాను.. జాగ్రత్తగా ఉండాలి కదా అని. ఎవరి వల్ల వచ్చింది అనంటే అభిషేక్ కంగారుగా నాన్న వల్లే వచ్చి ఉంటుందని అన్నాడు. అమితాబ్ గారు ఇల్లు కదలకుండా ఉంటే ఆయన వల్ల అంటావు మళ్లీ. నువ్వు బయట తిరుగుతున్నావు. నీ వల్లే ఆయన కు వచ్చి ఉంటుంది’ అని బాగా తిట్టాను అని అజయ్ దేవ్‌గణ్ అన్నాడు. అజయ్ దేవ్‌గణ్ అమితాబ్ కుటుంబానికి బాగా దగ్గర. అభిషేక్‌ను పెట్టి హర్షద్ మెహతా బయోపిక్ ‘బిగ్ బుల్’ తాజాగా నిర్మించాడు. దాని ప్రమోషన్లో భాగంగా ఈ షోలో పాల్గొని కోవిడ్ ఉదంతాన్ని పంచుకున్నారు ఇద్దరూ. అభిషేక్ చదువు మానేసి స్విట్జర్లాండ్ నుంచి తిరిగి వచ్చి అజయ్ హీరోగా నటించిన ‘మేజర్ సాబ్’ యూనిట్లో స్పాట్బాయ్గా పని చేశాడు. ‘అప్పటి నుంచి అజయ్ నాకు అన్నగా మారాడు’ అని చెప్పాడు అభిషేక్. -
ఏప్రిల్‌లో మే డే
బిగ్ బి అమితాబ్ బచ్చన్–అజయ్ దేవగణ్ కాంబినేషన్లో రూపొందనున్న ‘మే డే’ చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ సినిమాలో అమితాబ్ ప్రధాన పాత్రలో నటించనుండగా కీలక పాత్ర పోషిస్తూ, స్వీయ దర్శకత్వంలో అజయ్ దేవగణ్ నిర్మిస్తుండడం ఓ విశేషం. రకుల్ ప్రీత్‌సింగ్, అంగీరా ధార్ కథానాయికలు. తొలి సన్నివేశానికి అజయ్ దేవగణ్ స్నేహితుడు, తెలుగు జోతిష్యులు బాలు మున్నంగి క్లాప్ ఇచ్చారు. ఈ సందర్భంగా అజయ్ దేవగణ్ మాట్లాడుతూ– ‘‘మే డే’ చిత్రం రెగ్యులర్ షూటింగ్‌ను శుక్రవారమే మొదలుపెట్టాం. సినిమా పూర్తయ్యేవరకూ నాన్ స్టాప్‌గా షూటింగ్ చేస్తాం. అమితాబ్ గారిని తొలిసారి దర్శకత్వం వహిస్తుండటం ఎగ్జయిటింగ్‌గా ఉంది. 2022 ఏప్రిల్ 29న చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: అసీమ్ బజాజ్, సహ నిర్మాతలు: కుమార్ మంగత్, విక్రాంత్ శర్మ, హస్నైన్ హుస్సేనీ, జయ్ కనూజియా, సందీప్ కెవ్లానీ, తార్లోక్ సింగ్. -
మైదానంలోకి వస్తున్నారు
అజయ్ దేవగన్ హీరోగా అమిత్ శర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పోర్ట్స్ డ్రామా ‘మైదాన్’. ఫుట్‌బాల్ కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీమ్ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఆయన పాత్రలో అజయ్ కనిపిస్తారు. ప్రియమణి కథానాయిక. బోనీ కపూర్ నిర్మిస్తున్నారు. కోవిడ్ వల్ల ఈ సినిమా చిత్రీకరణ ఆగిపోయింది. ఈ సినిమా కోసం వేసిన ఫుట్‌బాల్ స్టేడియం సెట్‌ని లాక్ డౌన్ టైమ్‌లో తొలగించారు. తాజాగా ఈ సినిమా చిత్రీకరణను మళ్లీ ప్రారంభించాలనుకుంటున్నారు. ఇంతకు ముందు తీసేసిన సెట్‌నే మళ్లీ కొత్తగా వేస్తున్నారు. జనవరిలో ఈ చిత్రీకరణలో పాల్గొంటారు అజయ్. ప్రస్తుతం అజయ్, ఈ సినిమాలో నటించేవాళ్లందరూ ఫుట్‌బాల్‌లో శిక్షణ తీసుకుంటున్నారు. -
ఆమె అన్ని పాత్రలకి సూ‘టబు’ల్..
సౌత్ నుంచి బాలీవుడ్‌కు వెళ్లి స్టార్స్ అయిన వారిలో చాలా మంది ఉన్నారు. తెలుగు ఇండస్ట్రీ నుంచి ముంబైలో జెండా పాతినవారిలో శ్రీదేవి, జయప్రద మొదటి వరుసలో వస్తారు. కాని అంతే స్టార్‌డమ్‌ను, రెస్పెక్ట్ను సృష్టించుకున్న ఇంకో హీరోయిన్ను మన సౌత్ ఖాతాలో ఎవరూ వేయరు. ఆమె టబూ.. అసలు సిసలు తెలుగు అమ్మాయి. అందులోనూ హైదరాబాదీ అమ్మాయి. టబు బాలీవుడ్లో తన టాలెంట్‌ను చూపారు. ఇటు సౌత్‌లో అటు నార్త్‌లో ఒక వర్సటైల్ ఆర్టిస్ట్‌గా ప్రూవ్ చేసుకున్నారు. ఇవాళ తన బర్త్‌డే. ఈ సందర్భంగా ఆమె గురించి కొన్ని విశేషాలు.. అసలు పేరు తబస్సుమ్... టబు అని అందరూ పిలుస్తారు గాని ఆమె అసలు పేరు తబస్సుమ్. పిలిస్తే తబు అని పిలవాలి. కాని టబు అని అలవాటైంది. ఆమె మదర్, ప్రసిద్ధ బాలీవుడ్ నటి షబానా ఆజ్మీ మదర్ దగ్గరి బంధువులు. షబానా ఆజ్మీకి టబూ మేనకోడలి వరుస. టెన్త్ వరకూ హైదరాబాద్‌లో చదువుకున్న టబు ఇంటర్ నుంచి చదువు కోసం ముంబై వెళ్లింది. షబానా ఆజ్మీ వల్ల సినిమా వాతావరణం ఉండటంతో ముందు టబు అక్క పర్హా ఖాన్ హీరోయిన్ అయ్యారు. ఆ తర్వాత టబు కూడా సినిమా రంగ ప్రవేశం చేసింది. షబానా ఇంట్లో టబును చూసిన ప్రసిద్ధ నటుడు దేవ్ ఆనంద్ ఆమెకు హమ్ నౌజవాన్ అనే సినిమాలో అవకాశం ఇచ్చారు. కాని కొత్త హీరోయిన్లను ఇంట్రడ్యూస్ చేయడానికి రెడీగా ఉండే మన నిర్మాత రామానాయుడు టబును కూలీ నంబర్ ఒన్ సినిమాతో తెలుగులోకి తీసుకు వచ్చారు. ఆ సినిమా సూపర్‌హిట్. టబు కూడా సూపర్ హిట్. బాలీవుడ్లో కూడా విజయపథమే.. కూలీ నంబర్ ఒన్ తర్వాత టబు రేంజ్ పెరిగిపోయింది. అందరు హీరోలకు అందుబాటులో లేనంత స్థాయికి వెళ్లింది. ఆ టైమ్‌లోనే హిందీలో అజయ్ దేవ్‌గణ్‌తో చేసిన విజయ్‌పథ్ కూడా సూపర్ హిట్ అయ్యింది. అజయ్ దేవగణ్ ముంబైకు వచ్చినప్పటి నుంచి టబుకు క్లోజ్ ఫ్రెండ్. వాళ్లు ముంబైలో ఇరుగు పొరుగు ఉండేవారు. ఆ పరిచయం వల్లే విజయపథ్లో కలిసి నటించారు. హిట్ కొట్టారు. (చదవండి: మళ్లీ జంటగా...) టబు-నాగ్ల స్నేహానికి నాంది.. ఈ లోపు తెలుగులో మాస్టర్ అఖిల్ హీరోగా సిసింద్రీ మొదలయ్యింది. నాగార్జున సొంత సినిమా కావడం వల్ల ఇందులో స్పెషల్ సాంగ్‌లో నటించింది టబు. నాగార్జున టబుల సుదీర్ఘ స్నేహానికి ఈ సినిమా మొదటి మెట్టుగా నిలిచింది. పండు అలియాస్ మహాలక్ష్మి.. కాని అసలు సిసలు మాయాజాలం, టబూజాలం తెలియజేసిన సినిమా నిన్నే పెళ్లాడుతా. హిందీలో కొత్త ఫ్యామిలీ స్టోరీ ట్రెండ్‌ను తీసుకొచ్చిన హమ్ ఆప్ కే హై కౌన్ స్ఫూర్తితో రాసుకున్న ఈ కథలో మహాలక్ష్మి అలియాస్ పండుగా టబు ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది. నాగార్జునను గ్రీకువీరుడిగా మోహించే అందాలరాశిగా ఆకర్షించారు. (చదవండి: ముచ్చటగా మూడోసారి) ప్రేమదేశంతో సౌత్‌లో టాప్ కాని అదే సమయంలో దర్శకుడు కదిర్ తమిళంలో తీసిన కాదల్ దేశం టబును మొత్తం సౌత్‌కు పరిచయం చేసింది. ఆ సినిమా తెలుగులో ప్రేమదేశం పేరుతో విడుదలయ్యి సంచలన విజయం సాధించింది. టబులోని గ్రేస్ ఈ సినిమాలో కుర్రకారు వెర్రెత్తి చూశారు. మేచిస్, అస్తిత్వతో మరో మెట్టు పైకి.. కాని టబు అంటే ఇలాంటి కేరెక్టర్లేనా? ఆమెలో నటిగా టాలెంట్ లేదా? ఉంది అని కనిపెట్టినవాడు దర్శకుడు గుల్జార్. అతడు తీసిన హిందీ సినిమా మేచిస్ టబులోని కొత్త నటిని లోకానికి వెల్లడి చేశారు. ఆమెను దృష్టిలో పెట్టుకుని మంచి కథలు రాయవచ్చని ఆ సినిమా రుజువు చేసింది. ఉగ్రవాదం నేపథ్యంలో నలిగే ఒక అమ్మాయి పాత్రలో టబు అద్భుత నటన ప్రదర్శించి ఎన్నో అవార్డులు ఎన్నో గెలుచుకున్నారు. ఆ తర్వాత నటుడు, దర్శకుడు సంజయ్ మంజ్రేకర్ తీసిన అస్తిత్వ సినిమా టబును నటనను మరో స్థాయికి తీసుకెళ్లారు. భర్త ఉండగా మరో పురుషుడితో సంబంధంలోకి వెళ్లే గృహిణి పాత్రలో టబు ఈ సినిమాలో నటించారు. స్త్రీల మానసిక ప్రపంచం గురించి భావోద్వేగాల గురించి ఈ సినిమాలో టబు చేసిన స్టేట్మెంట్ ఆ సమయంలో గొప్ప ఫెమినిస్టిక్ స్టేట్మెంట్గా విమర్శకులు వ్యాఖ్యానించారు. ఉత్తమ నటిగా నిలబెట్టిన చాందిని బార్ ఆ తర్వాత ఫైనల్ టచ్‌గా మధుర్ భండార్కర్ తీసిన చాందిని బార్ టబును జాతీయ ఉత్తమ నటిగా నిలబెట్టింది. ముంబైలో పని చేసే బార్ డాన్సర్ల నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా అటు ప్రేక్షకుల ఇటు విమర్శకుల ప్రశంసలు పొందింది. ఆ తర్వాత టబు గొప్ప కథలకు ఒక ముఖ్యమైన ఎంపికగా నిలిచింది. హిందీలో సీరియస్ సినిమాలు చేస్తూనే తెలుగులో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున పక్కన సినిమాలలో నటించింది టబు. చిరంజీవితో అందరివాడులో ఆమె చేసిన పాట ఎవరు మర్చిపోతారు. (చదవండి: హార్ట్ బీట్‌ని ఆపగలరు!) అంధాదున్కి క్రిటిక్స్ కితాబు.. టబు ఇటీవల బాలీవుడ్లో అంధాధున్ సినిమాలో కీలకమైన పాత్ర చేసి బాలీవుడ్‌ను మరోసారి సర్ప్రైజ్ చేశారు. ఆమె చేయడం వల్లే ఆ క్యారెక్టర్ చాలా బాగా వచ్చిందని క్రిటిక్స్ కితాబు. మొన్నటి అల వైకుంఠపురములో టబు తాజా తెలుగు సినిమా. ఇక టబు పర్సనల్ లైఫ్‌లోకి వస్తే తను సింగిల్ ఉమన్‌గా ఉన్నారు. ఇంకా వివాహ బంధంలోకి వెళ్లలేదు. ఖాళీ దొరికితే సోలో ట్రావెలర్‌గా దేశాలు తిరగడం ఆమెకు ఇష్టం. గొప్ప నటిగా గొప్ప సినిమాలు మరెన్ని చేస్తూ తను హ్యాపీగా ఉంటూ మనల్ని హ్యాపీగా ఉంచాలని కోరుకుందాం. హ్యాపీ బర్త్ డే టుయూ వన్స్ అగైన్ టబు. -
మళ్లీ జంటగా...
కార్తీ హీరోగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన తమిళ, తెలుగు చిత్రం ‘ఖైదీ’. రెండు భాషల్లోనూ ఘనవిజయం సాధించింది ఈ చిత్రం. హీరోయిన్ లేకుండా ఈ సినిమాను తెరకెక్కించారు. ఇప్పుడు ‘ఖైదీ’ చిత్రం హిందీలో రీమేక్ కాబోతోంది. కార్తీ చేసిన పాత్రను అజయ్ దేవగన్ చేయనున్నారు. అయితే ఈ రీమేక్‌లో ఓ పెద్ద మార్పు చేయబోతున్నారని తెలిసింది. హిందీ రీమేక్‌లో హీరోయిన్ పాత్రను కూడా చేర్చనున్నారట. ఈ పాత్ర కోసం కాజోల్‌ను సంప్రదించారని సమాచారం. గతంలో ‘హల్చల్, దిల్ క్యా కరే, యు మీ ఔర్ తుమ్’ వంటి సినిమాల్లో జంటగా నటించారు ఈ ఇద్దరూ. ‘ఖైదీ’లో నటిస్తే ఈ రియల్ లైఫ్ కపుల్‌ని మరోసారి జంటగా తెర మీద చూడొచ్చు. ఈ ఏడాది చివర్లో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ రీమేక్‌ను ఎవరు డైరెక్ట్ చేస్తారనేది ఇంకా ప్రకటించలేదు. -
శివుడి పాత్రలో..?
ప్రభాస్ హీరోగా నటించనున్న మరో ప్యాన్ ఇండియా చిత్రం ‘ఆది పురుష్’. ఓం రౌత్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. టీ సిరీస్ ఫిల్మ్స్ సమర్పణలో భూషణ్ కుమార్, ఓం రౌత్, కిషన్ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్ నిర్మించనున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్ రాముడి పాత్ర చేయనుండగా బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ రావణుడి పాత్రలో కనిపించనున్నారు. మరో కీలకమైన శివుడి పాత్రలో బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ నటించనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ‘ఆది పురుష్’లో తొలుత రావణుడి పాత్ర కోసం అజయ్‌ని సంప్రదించగా డేట్ల సమస్యతో తిరస్కరించారట. దీంతో ఆ పాత్రకు సైఫ్‌ని తీసుకున్నారు. అయితే శివుడి పాత్రకు అజయ్ సరిగ్గా సరిపోతారని ఓం రౌత్ భావిస్తున్నారట. ఎలాగైనా డేట్స్ సర్దుబాటు చేయమని అజయ్‌ను అడగాలనుకుంటున్నారని సమాచారం. -
అజయ్ దేవగన్ సోదరుడు మృతి
బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ సోదరుడు అనిల్ దేవగన్(51) కన్నుమూశారు. గుండెపోటుతో సోమవారం రాత్రి ముంబైలో తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని అజయ్ దేవగన్ సోషల్ మీడియాలో వెల్లడించారు. అనిల్ ఫోటోను ట్విటర్లో పోస్ట్ చేస్తూ.. గత రాత్రి నా సోదరుడు అనిల్ దేవగన్ మరణించాడు. అతని అకాల మరణం మా కుటుంబాన్ని తీవ్రంగా కలిచి వేసింది. అతనిని ఎంతో కోల్పోతాను. అనిల్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. కోవిడ్ కారణంగా ఎలాంటి వ్యక్తిగత ప్రార్థన సమావేశం ఉండదు. అని ట్వీట్ చేశారు. చదవండి : అతనితో జాగ్రత్తగా ఉండమన్నారు: కాజోల్ I lost my brother Anil Devgan last night. His untimely demise has left our family heartbroken. ADFF & I will miss his presence dearly. Pray for his soul. Due to the pandemic, we will not have a personal prayer meet🙏 pic.twitter.com/9tti0GX25S — Ajay Devgn (@ajaydevgn) October 6, 2020 అనిల్‌కు భార్య, ఓ కుమారుడు ఉన్నారు. కాగా అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్‌ను ప్రారంభించిన అనిల్ ఆ తరువాత రాజు చాచా, బ్లాక్మెయిల్, హాల్-ఈ-దిల్ వంటి సినిమాలను తెరకెక్కించారు. దర్శకత్వంతో పాటు అజయ్ దేవగన్ నటించిన సన్ ఆఫ్ సర్దార్ సినిమాకు క్రియేటివ్ డైరెక్టర్‌గా అనిల్ దేవగన్ పనిచేశారు. అదే విధంగా గత ఏడాది (2019 మే 27) అజయ్ దేవగన్ తండ్రి వీరూ దేవగన్ కూ డా మరణించారు. -
గంగూభాయ్ బిజీబిజీ
సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గ్యాంగ్‌స్టర్ డ్రామా చిత్రం ‘గంగూభాయ్ కతియావాడీ’. ఆలియా భట్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో వివిధ వయసుల్లో ఉన్న పాత్రల్లో ఆలియా కనిపిస్తారు. కోవిడ్ బ్రేక్ తర్వాత ఈ సినిమా చిత్రీకరణను ఇటీవలే ప్రారంభించారు. ముంబైలో నిర్మించిన ప్రత్యేక సెట్స్‌లో చిత్రీకరణ జరుపుతున్నారు. లాక్డౌన్ ముందు సుమారు 250 మంది యూనిట్‌తో చిత్రీకరణ జరిపారు. తాజాగా వంద కంటే తక్కువ మందితో షూటింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం ముంబైలో ఏకధాటిగా రాత్రి పగలు చిత్రీకరణలో గంగూభాయ్ టీమ్ బిజీబిజీగా ఉంది. ఈ సినిమాలో అజయ్ దేవగన్ కీలక పాత్ర చేస్తున్నారు. వచ్చే ఏడాదిలో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. -
వెరైటీ లుక్
భారతదేశ ఆర్థిక వ్యవస్థలో నేరాలకు పాల్పడిన ఓ వ్యక్తికి సంబంధించిన కథాంశంతో రూపొందిన క్రైమ్ డ్రామా ‘ది బిగ్ బుల్’. అభిషేక్ బచ్చన్, ఇలియానా జంటగా కూకీ గులాటి దర్శకత్వం వహించారు. అజయ్ దేవ్గన్, ఆనంద్ పండిట్ నిర్మించిన ఈ సినిమాకి సంబంధించిన ఇలియానా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. కళ్ల జోడు, టైట్‌గా ముడివేసిన జుట్టుతో ఇలియానా లుక్ వెరైటీగా ఉంది. ఈ చిత్రం త్వరలో డిస్నీ హాట్ స్టార్‌లో విడుదల కానుంది. ‘‘ఈ సినిమాలో భాగం అయినందుకు చాలా సంతోషంగా ఉంది’’ అన్నారు ఇలియానా. 1980, 1990లలో ముంబైలో జరిగిన వాస్తవ కథ ఆధారంగా ఈ చిత్రం రూపొందిందని, పలు ఆర్థిక నేరాలకు పాల్పడిన ఓ స్టాక్ బ్రోకర్‌కు సంబంధించి కథ ఇదని సమాచారం -
స్టార్ హీరోయిన్ కాజోల్ బర్త్‌డే స్పెషల్ ఫోటోలు
-
ఆర్ఆర్ఆర్లో అజయ్‌దేవగన్ పాత్ర అదే!
సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఆర్ఆర్ఆర్(రౌద్రం రణం రుధిరం) సినిమాలో అజయ్ దేవగన్ జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ల గురువుగా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. అదికూడా ఫ్లాష్ బ్యాక్‌లో ఫ్లాష్‌బాక్ సీన్లలో కనిపించనున్నట్లు సమాచారం. అతనికి జంటగా శ్రియ శరణ్ నటించనుంది. ఇక 1920 ల కాలం నాటి కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు దర్శకుడు రాజమౌళి తెలిపారు. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీం గా నటిస్తుండగా, హీరో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నారు. (‘ఆర్ఆర్ఆర్’ ట్రయిల్ షూట్ రద్దు.. అందుకేనా!) ఈ సినిమాలో తెలంగాణ గొండు వీరుడు కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్‌చరణ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్‌కి జోడీగా ఒలివియా మోరిస్, రామ్ చరణ్‌కి జోడీగా ఆలియా భట్ నటిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్, హాలీవుడ్ స్టార్స్ రే స్టీవెన్ సన్స్ , అలిసన్ డూడీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. డీవీవీ ఎంటర్టైన్ మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. (అజయ్ దేవగన్‌కి జోడీగా శ్రియ) -
సుశాంత్ మరణం: షాక్‌లో సినీ ఇండస్ట్రీ
‘ఎంఎస్ ధోని’ బయోపిక్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకున్నారన్న వార్త బాలీవుడ్ ఇండస్ట్రీని షాక్‌కు గురిచేసింది. ఆదివారం ముంబై బాంద్రాలోని తన నివాసంలో ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. సుశాంత్ హఠాన్మరణ వార్త విన్న అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ యువహీరో ఇక లేరనే చేదు వార్తను బాలీవుడ్ ఇండస్ట్రీ దింగమింగుకోలేకపోతోంది. సుశాంత్ ఆత్మకు శాంతి చేకూరాలని సెలబ్రెటీలు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు. సుశాంత్ మరణ వార్త నిజం కాకుండా ఉంటే ఎంతో బావుంటుందంటూ వారు ట్వీట్లు చేస్తున్నారు. అతని కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు. ‘అద్భుత ప్రతిభ గల యువ నటుడు సుశాంత్ త్వరగా ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. టెలివిజన్, సినిమాల్లో ఆయన నటన అద్భుతం. కెరీర్ పరంగా అయన ఎదిగిన తీరు అందరికీ స్పూర్థిదాయకం. మరిచిపోలేని ఎన్నో అనుభూతులను మనకు మిగిల్చి ఆయన వెళ్లిపోయారు. సుశాంత్ మరణించారన్న వార్త విని షాకయ్యా. ఆయన కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. ఓంశాంతి’- ప్రధాని నరేంద్రమోదీ ‘సుశాంత్ మృతి చెందాడన్న వార్త విని ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాను. ఇటీవలే సుశాంత్ నటించిన చిచోరే సినిమా చూశాను. ఆ సినిమా చూసి చాలా ఎంజాయ్ చేశాను. తాను కూడా ఆ సినిమాలో భాగస్వామ్యం అయి ఉంటే బాగుండేది అనుకున్నాను. నిజంగా సుశాంత్ చాలా టాలెంటెడ్ హీరో’ - అక్షయ్ కుమార్ ‘సుశాంత్ మరణ వార్తతో షాక్‌కు గురయ్యాను. నా దగ్గర మాటల్లేవు. నా గుండె పగిలింది. ఈ వార్త నిజం కాకుండా ఉంటే బాగుండు’. - సోనూసూద్ ‘ఈ వార్త వినడం నిజంగా బాధాకరం. అతని కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి... సుశాంత్ ఆత్మకు శాంతి కలగాలి’ - అజయ్ దేవగన్ ‘సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ లేరనే వార్త నన్ను ఎంతగానో బాధించింది. ప్రతిభావవంతుడైన యవ నటుడు అతడు. అతడి కుటుంబానికి, స్నేహితులకు నా ప్రగాఢ సానుభూతి తెలయజేస్తున్నా. సుశాంత్ ఆత్మకు శాంతి చేకూరాలి’ - సచిన్ టెండూల్కర్ ‘సుశాంత్ సింగ్ విషాదకరమైన మరణవార్తను విని షాక్ అయ్యాను. ప్రతిభ, అవకాశాలతో కూడిన జీవితం అకస్మాత్తుగా ముగిసింది. అతడి కుటుంబానికి, అభిమానులకు నా సానుభూతి’ - టీమిండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రి ‘ఆ మాటలు నన్ను షాక్‌కు గురిచేశాయి. హృదయం ముక్కలైంది. నిజంగా విషాదకరమైన వార్త. మాటలు రావడం లేదు. చాలా త్వరగా వెళ్లిపోయాడు’ - తరణ్ ఆదర్శ్ ‘జేమ్స్ డీన్, హీత్ లెడ్జర్ మరణించిన తర్వాత నన్ను షాక్‌కు గురిచేసింది సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం. కరోనా వైరసే కాకుండా ఆ దేవుడు కూడా బాలీవుడ్‌పై పగబట్టినట్లు ఉన్నాడు’ - రామ్‌గోపాల్ వర్మ ‘సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అకాల మరణం అనే మాటలు విని షాక్ అయ్యాను. ప్రతిభావంతుడైన యువకుడు. అతని ఆత్మ శాంతి చేకూరాలని దేవుడుని ప్రార్థిస్తున్నాను. సుశాంత్ కుటుంబానికి నా సానుభూతి తెలియజేస్తున్నాను’ - మహేశ్ బాబు. చదవండి: బాలీవుడ్ హీరో సుశాంత్ ఆత్మహత్య బాలీవుడ్ హీరో మాజీ మేనేజర్ ఆత్మహత్య -
మైదానం తొలగిస్తున్నారు
అజయ్ దేవగన్ హీరోగా హిందీలో తెరకెక్కుతున్న చిత్రం ‘మైదాన్’. ఫుట్‌బాల్ క్రీడాకారుడు సయ్యద్ అబ్దుల్ రహిమ్ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. అమిత్ శర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను బోనీ కపూర్ నిర్మిస్తున్నారు. ప్రియమణి కథానాయిక. 1950లలో ఈ చిత్రకథ జరుగుతుంది. పీరియాడికల్ చిత్రం కాబట్టి ఈ సినిమా చిత్రీకరణ కోసం ముంబైలో 16 ఎకరాల్లో సెట్స్ వేశారు. ఇందులో ఫుట్‌బాల్ స్టేడియం సెట్ కూడా ఒకటని సమాచారం. అయితే ఈ సెట్స్‌ను ఇప్పుడు తొలగిస్తున్నారు. కరోనా వల్ల షూటింగ్స్ అన్నీ ఆగిపోయాయి. మళ్లీ ఎప్పుడు మొదలవుతాయో ఇంకా స్పష్టత రాలేదు. జూన్ నెలలో వర్షాలు మొదలవుతాయి. దాంతో సెట్స్ పాడవుతాయనే ఉద్దేశంతో తొలగించాలనుకున్నారు. ఆల్రెడీ తొలగించే పనులు కూడా ప్రారంభమయ్యాయి. ‘‘ఈ సెట్స్ మళ్లీ నిర్మించాలంటే సుమారు రెండు నెలల సమయం పడుతుంది. షూటింగ్స్ మళ్లీ ప్రారంభం అయితే సెట్స్ మళ్లీ వేసి చిత్రీకరణ ప్రారంభించేసరికి నవంబర్ అవుతుంది’’ అని నిర్మాత బోనీ కపూర్ తెలిపారు. -
సలామ్ రహీమ్ సాబ్...
1964లో భారత ఫుట్‌బాల్ కోచ్‌గా ఉన్న ఆల్బర్టో ఫెర్నాండో ఆ సమయంలో శిక్షణకు సంబంధించి బ్రెజిల్లో నిర్వహించిన ప్రత్యేక వర్క్‌షాప్‌కు హాజరయ్యారు. తిరిగొచ్చిన తర్వాత ఆయన ఒకే ఒక మాట అన్నారు. ‘ఏముంది అక్కడ కొత్తగా నేర్చుకోవడానికి. 1956లో రహీమ్ సర్ మాకు నేర్పించిందే ఇప్పుడు అక్కడ చెబుతున్నారు. ఆయన నిజంగా ఫుట్‌బాల్ ప్రవక్త’... ఈ మాటలు చాలు కోచ్‌గా సయ్యద్ అబ్దుల్ రహీమ్ చూపించిన ప్రభావం ఏమిటో చెప్పడానికి. నాటి తరంలోనే కొత్త తరహా టెక్నిక్‌లతో భారత ఫుట్‌బాల్‌ను పరుగెత్తించిన మన హైదరాబాదీ రహీమ్ సర్‌కు ఫుట్‌బాల్ ప్రపంచంలో స్థానం ప్రత్యేకం. భారత్ ఫుట్‌బాల్‌ను ఇప్పుడు చూస్తున్న వారికి పాతతరంలో మన జట్టు అద్భుత ప్రదర్శన కనబర్చిందని, పలు చిరస్మరణీయ విజయాలు సాధించిందని చెబితే ఆశ్చర్యంగా ఉండవచ్చు. కానీ 1950, 1960లలో మన ఫుట్‌బాల్ టీమ్ ఉచ్చ దశలో నిలిచింది. నాడు ఆటగాళ్లతోపాటు వారిలో ఒకడిగా ఈ విజయాలలో కీలకపాత్ర పోషించిన వ్యక్తి సయ్యద్ అబ్దుల్ (ఎస్ఏ) రహీమ్. హైదరాబాద్‌కు చెందిన రహీమ్ శిక్షకుడిగా వేసిన ముద్ర ఏమిటో నాటితరం ఆటగాళ్లంతా గొప్పగా చెప్పుకుంటారు. సరిగ్గా చెప్పాలంటే రహీమ్ సాబ్ కోచ్‌గా పని చేసిన కాలాన్ని భారత ఫుట్‌బాల్ స్వర్ణ యుగం అనడం అతిశయోక్తి కాదు. సుదీర్ఘ కాలం పాటు... 1909 ఆగస్టు 17న హైదరాబాద్‌లో జన్మించిన రహీమ్ కొన్నాళ్లు టీచర్‌గా పనిచేశారు. ఫుట్‌బాల్‌పై ప్రేమతో టీచర్ ఉద్యోగాన్ని వదులుకొని హైదరాబాద్ సిటీ పోలీస్ జట్టుకు కోచ్‌గా వచ్చారు. రహీమ్ శిక్షణలో హైదరాబాద్ సిటీ పోలీస్ జట్టు జాతీయ స్థాయిలో ఎన్నో గొప్ప విజయాలు సాధించింది. సిటీ పోలీస్ జట్టును అత్యుత్తమ జట్టుగా నిలిపిన రహీమ్ ఆ తర్వాత 1950 నుంచి ఏకంగా 13 ఏళ్ల పాటు భారత టీమ్ కోచ్‌గా తన స్థాయిని ప్రదర్శించారు. ఆయన శిక్షకుడిగా ఉన్న సమయంలోనే భారత్ 1951 ఢిల్లీ, 1962 జకార్తా ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకాలు సాధించింది. 1952 హెల్సింకి, 1956 మెల్బోర్న్, 1960 రోమ్ ఒలింపిక్స్ క్రీడల్లోనూ భారత జట్టుకు రహీమ్ కోచ్‌గా వ్యవహరించారు. మెల్బోర్న్ ఒలింపిక్స్‌లో భారత్ నాలుగో స్థానంలో నిలవడం విశేషం. ముఖ్యంగా 1962 జకార్తా ఆసియా క్రీడల్లో సుమారు లక్ష మంది ప్రేక్షకుల సమక్షం లో జరిగిన ఫైనల్లో కొరియా జట్టుపై భారత జట్టు సాధించిన విజయాన్ని ఏ ఫుట్‌బాల్ అభిమానీ మరచిపోలేడు. ఇదే కోచ్‌గా రహీమ్ సాబ్ కెరీర్లో మరపురాని క్షణం. కొత్త తరహా శైలితో... కోచ్‌గా రహీమ్ గొప్పతనం ఆయన దూరదృష్టిలోనే కనిపిస్తుంది. ఎంతో ముందుచూపుతో ఆలోచించి ఇచ్చే శిక్షణ, వ్యూహాలు జట్టుకు మంచి ఫలితాలు ఇచ్చాయి. అప్పటి వరకు భారత జట్టు ఆడుతూ వచ్చిన బ్రిటిష్ శైలి తరహా ఆట మనకు కుదరదంటూ చిన్న చిన్న పాస్‌లతో కొత్త టెక్నిక్‌ను ఆయన మన ఆటలో జోడించారు. మైదానంలో 4–2–4 వ్యూహాన్ని రహీమ్ చాలా ముందుగా అనుసరించారు. అదే శైలితో బ్రెజిల్ 1958, 1962 ప్రపంచకప్‌లలో ఆడి టైటిల్ గెలవడం విశేషం. ఫార్వర్డ్లు లేకుండా ఆరుగురు మిడ్ఫీల్డర్లతో ఆడించడం కూడా అప్పట్లో ఒక కొత్త వ్యూహం. మోటివేషన్ స్పీకర్ తరహాలో ఆయన ఇచ్చే స్ఫూర్తిదాయక ప్రసంగాలు తమలో విజయకాంక్షను నింపేవని ఆటగాళ్లు చెబుతారు. క్రమశిక్షణకు మారుపేరులా కనిపించే రహీమ్ సాబ్ స్ఫూర్తిగానే తర్వాతి తరంలో ఎంతో మంది కోచ్‌లు తయారయ్యారు. వీరిలో అమల్ దత్తా, పీకే బెనర్జీ, నయూముద్దీన్ తదితరులు ఉన్నారు. పురస్కారాల మాటే లేదు... 1962లో జకార్తా ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం సాధించిన తర్వాతి ఏడాదే జూన్ 11న, 1963లో హైదరాబాద్‌లో రహీమ్ ఊపిరితిత్తుల క్యాన్సర్ కారణంగా కన్నుమూశారు. ఆయన సహచర ఆటగాడు ఫ్రాంకో ఫార్చునాటో... ‘రహీమ్ సాబ్ తనతో పాటు భారత ఫుట్‌బాల్‌ను కూడా సమాధిలోకి తీసుకుపోయారు’ అని వ్యాఖ్యానించడం ఆయన చేసిన సేవలను చూపిస్తోంది. నిజంగా అదే జరిగింది. ఆ తర్వాత అంతకంతకూ దిగజారుతూ వచ్చిన భారత ఫుట్‌బాల్ ప్రమాణాలు ఇక కోలుకోలేని విధంగా మరింత పతనావస్థకు చేరిపోయాయి. గొప్పవాళ్ల ఘనతలను గుర్తించి వారిని తగిన విధంగా గౌరవించుకోవడంలో మన అధికారులు ఎప్పుడూ వెనుక వరుసలోనే ఉంటారు. కోచ్‌గా అజరామర కీర్తిప్రతిష్టలు దక్కినా రహీమ్ సాబ్‌కు ప్రభుత్వం మాత్రం పెద్దగా పట్టించుకోలేదు. తన జీవితకాలంతో ఆయన ఆర్థికంగా పెద్దగా పొందింది ఏమీ లేదు. చనిపోయిన తర్వాత కూడా ఎలాంటి పురస్కారాలు దక్కలేదు. ఆటగాళ్ల వ్యక్తిగత కష్టాన్ని కూడా తమ ఖాతాలో వేసుకొని ‘ద్రోణాచార్య’ అవార్డులు సొంతం చేసుకునే కోచ్‌లున్న ఈ కాలంలో అసలైన గురువుకు అలాంటి అవార్డు ఏమీ లభించలేదు. ఏదో అభిమానం ఉన్నవారు అప్పుడప్పుడు తలచుకోవడం మినహా అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) కూడా వేర్వేరు రాజకీయ కారణాలతో రహీమ్‌ను గుర్తు చేసుకునే కార్యక్రమాలు, టోర్నీలు కూడా నిర్వహించలేదు. రహీమ్ కుమారుడు సయ్యద్ షాహిద్ హకీమ్ కూడా అంతర్జాతీయ ఫుట్‌బాల్ క్రీడాకారుడే. హకీమ్ 1960 రోమ్ ఒలింపిక్స్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించారు. 1960 రోమ్ ఒలింపిక్స్ తర్వాత భారత ఫుట్‌బాల్ జట్టు మళ్లీ ఒలింపిక్స్‌కు అర్హత సాధించకపోవడం గమనార్హం. అజయ్ దేవ్గన్ నటనతో... ఇన్నేళ్ల తర్వాత కోచ్ రహీమ్ జీవితం సినిమా కథకు పనికొస్తుందని బాలీవుడ్ గుర్తించింది. రహీమ్ పాత్రలో స్టార్ హీరో అజయ్ దేవ్గన్ నటిస్తూ ‘మైదాన్’ పేరుతో ఈ సినిమా రూపొందుతోంది. ‘ద గోల్డెన్ ఎరా ఆఫ్ ఇండియన్ ఫుట్‌బాల్, 1952–1962’ ట్యాగ్‌లైన్‌తో ఉన్న సినిమా రహీమ్ కోచ్‌గా భారత్ సాధించిన విజయాలను ప్రేక్షకుల ముందు ఉంచనుంది. అమిత్ రవీంద్రనాథ్ శర్మ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. ఒక మంచి కథను చెప్పేందుకు మన దేశంలో సినిమా మాధ్యమానికి మించినది ఏముంది. ఈ సినిమా తర్వాతైనా రహీమ్ గొప్పతనం ప్రపంచానికి తెలుస్తుందని ఆశించవచ్చేమో. -
ఇంటిపేరు అల్లూరి.. సాకింది గోదారి
ఏడాది నుంచి ‘ఆర్ఆర్ఆర్’ (రౌద్రం రణం రుధిరం) షూటింగ్ చేస్తున్నారు రాజమౌళి. సినిమాకు సంబంధించిన ఏ విషయాన్నీ బయటకు రానీయకుండా ఆడియన్స్‌ని ఊరిస్తున్నారాయన. శుక్రవారం ఓ ఊర మాస్ టీజర్‌తో ఎన్టీఆర్, రామ్‌చరణ్ అభిమానులకు ఊరట కలిగించారు. శుక్రవారం రామ్‌చరణ్ బర్త్‌డే. ఎన్టీఆర్ వాయిస్‌తో చరణ్ పాత్రకు సంబంధించిన టీజర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. ‘‘ఆడు కనవడితే నిప్పు కణం నిలవడినట్టుంటది. కలవడితే ఏగుసుక్క ఎగవడినట్టుంటది. ఎదురువడితే చావుకైనా చమట ధార కడతది. బాణమైనా బందూకైనా వానికి బాంచనైతది. ఇంటిపేరు అల్లూరి.. సాకింది గోదారి. నా అన్న మన్నెం దొర అల్లూరి సీతారామరాజు’’ అంటూ టీజర్లో రామ్‌చర ణ్ కసరత్తులు చేస్తుంటే ఎన్టీఆర్ పవర్ఫుల్ సంభాషణలు పలికారు. తమిళ, హిందీ, కన్నడ భాషల్లోని టీజర్స్‌కి ఎన్టీఆరే స్వయంగా డబ్బింగ్ చెప్పారు. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరమ్ భీమ్‌గా, చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నారు. ఆలియా భట్, అజయ్ దేవగన్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 8న ఈ చిత్రం విడుదల కానుంది. ‘‘అందరూ ఇంట్లో ఉండటమే తనకి ఇచ్చే బెస్ట్ బర్త్‌డే గిఫ్ట్’’ అని చరణ్ ట్వీట్ చేశారు. అలాగే ఉపాసన తయారు చేసిన కేక్‌ని కట్ చేసి ఇంట్లోనే బర్త్‌డేని జరుపుకున్నారు చరణ్. ఆ ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు ఉపాసన. -
మ్యాచ్ వాయిదా
‘మైదాన్’ సినిమా కోసం బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ ఫుట్‌బాల్ కోచ్‌గా మారారు. ఆయన కోచింగ్‌లో తయారైన టీమ్ ఆడాల్సిన మ్యాచ్ వాయిదా పడిందని తెలిసింది. అమిత్ రవీంద్రనాథ్ శర్మ దర్శకత్వంలో అజయ్ దేవగన్ నటిస్తున్న చిత్రం ‘మైదాన్’. ఈ సినిమాలో ఇండియా ఫుట్‌బాల్ కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీమ్ పాత్రను పోషిస్తున్నారు అజయ్. తొలుత ఈ సినిమాను నవంబర్ 27న రిలీజ్ చేయాలనుకున్నారు. ఇప్పుడు డిసెంబర్ 11న విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది చిత్రబృందం. ఇందులో అజయ్ భార్యగా ప్రియమణి నటిస్తున్నారు. -
బాక్సాఫీస్‌పై తాన్హాజీ దండయాత్ర
ముంబై : బాలీవుడ్ సూపర్‌స్టార్ అజయ్ దేవగన్ తాజా బ్లాక్‌బస్టర్‌తో జోష్‌లో ఉన్నారు. ఆయన నటించిన తాన్హాజీ బాక్సాఫీస్ వద్ద దూకుడు కొనసాగిస్తూ ఇప్పటికే రూ 250 కోట్ల వసూళ్లతో అదరగొడుతోంది. తాన్హాజీ ప్రదర్శిస్తున్న థియేటర్లు ఇంకా హౌస్‌ఫుల్ బోర్డులతో దర్శనమిస్తుండటంతో ఈ మూవీ లైఫ్‌టైమ్ వసూళ్లు రికార్డు స్ధాయిలో ఉంటాయని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇతర సినిమాల నుంచి పోటీ ఎదురైన తాన్హాజీ బాక్సాఫీస్ దూకుడు కొనసాగుతోందని, నాలుగో వారంలో రూ 275 కోట్ల మార్క్ దాటుతుందని ప్రముఖ సినీ విశ్లేషకులు తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. 2020లో రూ 250 కోట్ల క్లబ్లో చేరిన తొలి బాలీవుడ్ మూవీ తాన్హాజీ కావడం గమనార్హం. చదవండి : ఆ రికార్డుకు అడుగుదూరంలో తాన్హాజీ -
నవంబరులో మైదాన్
అజయ్ దేవగన్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘మైదాన్’. ఇందులో ప్రియమణి కథానాయిక. ‘బదాయి హో’ ఫేమ్ అమిత్ రవీంద్రనాథ్ శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలోని అజయ్ లుక్స్‌ను గురువారం విడుదల చేశారు. ఇండియన్ ఫుట్‌బాల్ కోచ్ కమ్ మేనేజర్ (1950–1963) సయ్యద్ అబ్దుల్ రహీమ్ జీవితం ఆధారంగా ‘మైదాన్’ చిత్రం రూపొందుతోంది. ఏప్రిల్‌కి చిత్రీకరణను పూర్తి చేయాలనుకుంటున్నారు. జీ స్టూడియోస్‌తో కలిసి బోనీ కపూర్, ఆకాష్ చావ్లా, అరునవ జాయ్ సేన్ గుప్తా నిర్మిస్తున్నారు. హిందీ, తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో నవంబరు 27న ఈ చిత్రం విడుదల కానుంది. -
‘ఆర్ఆర్ఆర్’లో శ్రియ!
ఇండస్ట్రీకి వచ్చి పదిహేనేళ్లు దాటిపోయింది. అయినప్పటికీ చెక్కుచెదరని అందంతో కుర్రకారుల మతులు పోగొడుతోంది హీరోయిన్ శ్రియ. దక్షిణాదిలో వరుస సినిమాలు చేస్తున్న ఈ హీరోయిన్ టాలీవుడ్లో కాస్త వెనకబడింది. అయితే శ్రియకు ఓ బంపరాఫర్ తగిలినట్లు సమాచారం. తెలుగులో భారీ బడ్జెట్‌తో, పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో నటించే చాన్స్ కొట్టేసిందంటూ కొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ చిత్రంలో విలన్‌గా నటిస్తున్న బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవ్‌గన్‌కు జోడీగా చిత్రబృందం శ్రియను ఎంచుకున్నారు. దీంతో ఆమె షూటింగ్ కోసం గతవారం వికారాబాద్ అడవులకు పయనమైంది. అక్కడ అజయ్, శ్రియ జోడీపై కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారని ఆ వార్తల సారాంశం. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రాంచరణ్ ప్రధానపాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఇందులో ఎన్టీఆర్ సరసన ఒలీవియా మోరిస్, రాంచరణ్‌తో ఆలియా భట్ జోడీ కట్టనున్నారు. బాహుబలి వంటి అంతర్జాతీయ సినిమాలను తెరకెక్కించిన జక్కన్న ఆర్ఆర్ఆర్కు దర్శకత్వం వహించడంతో ఈ చిత్రంపై అసాధారణ అంచనాలు నెలకొన్నాయి. సినిమాకు సంబంధించిన వివరాలను ఎంతో గోప్యంగా ఉంచడానికి చిత్రబృందం ఎంతగానో ప్రయత్నించినప్పటికీ హీరోల ఫొటోలు, సినిమా వివరాలు లీక్ అవుతూనే వచ్చాయి. దీంతో రాజమౌళి షూటింగ్ సెట్లో మొబైల్ ఫోన్లను నిషేధించినట్టు వినికిడి. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని 10 భాషల్లో విడుదల చేయనున్నారు. చదవండి: ఆర్ఆర్ఆర్ సినిమాపై క్లారిటీ ఇచ్చిన సుదీప్ ‘ఆర్ఆర్ఆర్’ అభిమానులకు బ్యాడ్ న్యూస్! -
అజయ్ ఆగయా
ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఇందులో ఎన్టీఆర్ సరసన ఒలీవియా మోరిస్, రామచరణ్‌కు జోడీగా ఆలియా భట్ నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిరి్మస్తున్నారు. అజయ్ దేవగన్, రే స్టీవెన్సన్, అలిసన్ డూడీ, సముద్రఖని కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. మంగళవారం నుంచి ఈ సినిమా చిత్రీకరణలో పాల్గొనడానికి అజయ్ ఆగయా (వచ్చారు). ‘‘రాజమౌళిగారిని వివిధ సందర్భాల్లో కలుసుకున్నప్పుడు ఆసక్తికర విషయాలు మాట్లాడుకున్నాం. ఇప్పుడు ‘ఆర్ఆర్ఆర్’లో రాజమౌళిగారితో కలిసి పని చేయడాన్ని గౌరవంగా భావిస్తున్నాను’’ అన్నారు అజయ్ దేవగన్. ఈ షెడ్యూల్ చిత్రీకరణ ఇంకా 25 రోజుల పాటు సాగుతుందని తెలిసింది. 1920 నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ 70 శాతానికి పైగా పూర్తయింది. ఈ సినిమాను పది భాషల్లో ఈ ఏడాది జూలై 30న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం గతంలో ప్రకటించింది. అయితే విడుదల తేదీ మారుతుందనే ప్రచారం జరుగుతోంది. -
తరచూ గర్భస్రావం.. వేదనకు గురయ్యాం: నటి
ముంబై: పదేళ్ల తర్వాత మరోసారి వెండితెరపై భర్యాభర్తలుగా కనిపించబోతున్నారు బాలీవుడ్ జంట కాజోల్- అజయ్ దేవ్‌గణ్. ‘తాన్హాజీ: ది అన్సంగ్ వారియర్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. మరాఠా అధినేత ఛత్రపతి శివాజీ సామ్రాజ్యంలో సుబేదార్‌గా పనిచేసిన మరాఠా యోధుడు తానాజీ జీవితకథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా.. శుక్రవారం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్లలో బిజీగా ఉన్న కాజోల్.. సోషల్ మీడియా బ్లాగ్ హ్యూమన్స్ ఆఫ్ బాంబేతో తన ప్రేమకథ, పెళ్లి గురించి చెప్పుకొచ్చారు. తానూ, అజయ్ నాలుగేళ్ల పాటు ప్రేమలో మునిగితేలామని.. ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాత పెద్దల అనుమతితో ఒక్కటమయ్యామని తెలిపారు. చాలా రోజులపాటు హనీమూన్ ఎంజాయ్ చేద్దామనుకుంటే.. అజయ్ అనారోగ్యం బారిన పడటంతో ఇంటికి తిరిగి రావాల్సి వచ్చిందంటూ చిలిపి సంఘటనలను గుర్తుచేసుకున్నారు. అలా మొదలైంది.. ‘25 ఏళ్ల క్రితం హల్చల్ సినిమా సెట్లో మేం కలుసుకున్నాం. షాట్ రెడీ అనగానే.. నా హీరో ఎక్కడ ఉన్నాడు అడిగాను. అక్కడున్న వాళ్లు అజయ్ వైపు చూపించారు. ఓ మూలన గంభీరంగా కూర్చుని ఏదో ఆలోచిస్తున్న హీరోను అప్పుడే చూశాను. తర్వాత మాటలు కలిపాం. మంచి స్నేహితులమయ్యాం. నిజానికి నేను అప్పుడు వేరే అబ్బాయితో డేటింగ్లో ఉన్నాను. అతడి గురించి అజయ్‌కు అప్పుడప్పుడు చాడీలు చెప్పేదాన్ని. కొన్నాళ్ల తర్వాత బ్రేకప్ అయ్యింది. ఒకరి గురించి ఒకరం పూర్తిగా తెలుసుకున్న తర్వాతే నేను అజయ్ చేతిని పట్టుకున్నాను. చిత్రమేమిటంటే మేం ఎప్పుడూ ఒకరికొకరం ప్రపోజ్ చేసుకోలేదు. కార్లలోనే ఎక్కువ జీవితం గడిపాం! మా ప్రేమ ప్రయాణంలో ఎక్కువ జీవితం కార్లలోనే గడిపాం. తరచుగా డిన్నర్లు, లాంగ్‌డ్రైవ్‌లకు వెళ్లేవాళ్లం. నేనేమో దక్షిణ బాంబేలో.. తను జుహులో. తనతో కలిసి వెళ్తున్న ప్రతీసారీ నా స్నేహితులు నన్ను హెచ్చరించేవారు. కానీ తను నాతో ఎంతో మర్యాదగా ప్రవర్తించేవాడు. సరదాగా ఉండేవాడు. అలా నాలుగేళ్లు ప్రేమించుకున్నాం. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న తర్వాత మా పెద్దలకు చెప్పాం. అజయ్ తల్లిదండ్రులు వెంటనే సరే అన్నారు గానీ.. మా నాన్న మాత్రం ముందు కెరీర్ మీద దృష్టి పెట్టమని సూచించారు. అయితే నేను మాత్రం పట్టు వదలకపోవడంతో ఆయన కూడా అంగీకరించారు. పూజారికి లంచం ఇవ్వబోయాడు.. మేము ఎంతగానో ఎదురుచూసిన పెళ్లిరోజు రానే వచ్చింది. పంజాబీ, మరాఠీ సంప్రదాయాల్లో మా వివాహం జరిగింది. అగ్నిహోత్రం చుట్టూ తిరిగేటప్పుడు అజయ్.. పూజారిని వేగిరపెట్టాడు. తంతు తొందరగా పూర్తి చేయాలంటూ లంచం ఇవ్వడానికి ప్రయత్నించాడు. అలా పెళ్లి జరిగిపోయింది. తర్వాత హనీమూన్ ట్రిప్‌లో భాగంగా సిడ్నీ, హవాయి, లాస్ ఏంజెల్స్ చుట్టివచ్చాం. ఇంకో ఐదు వారాల పాటు ట్రిప్ కొనసాగాల్సింది. ఈజిప్టు కూడా వెళ్లాలనుకున్నాం. కానీ అజయ్ ఆరోగ్యం పాడవడంతో..‘ బేబీ.. నాకు తర్వాతి ఫ్లైట్ బుక్ చెయ్యి.. వెళ్లిపోతా’ అని ముఖం పెట్టాడు. అంతే వెంటనే తిరిగి వచ్చేశాం అంటూ కాజోల్ తమ మధురు ఙ్ఞాపకాల గురించి చెప్పుకొచ్చారు.(తాన్హాజీ ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) తరచూ గర్భస్రావాలు.. వేదనకు గురయ్యాం పెళ్లైన వెంటనే తాము పిల్లల కోసం ప్లాన్ చేసుకున్నామని... అయితే వరుసగా గర్భస్రావాలు కావడంతో తీవ్ర వేదనకు గురయ్యామని కాజోల్ పేర్కొన్నారు. కొన్నాళ్ల తర్వాత నైసా జన్మించిందని.. ఆ తర్వాత యుగ్ కూడా రావడంతో తమ కుటుంబం పరిపూర్ణమైందని హర్షం వ్యక్తం చేశారు. తర్వాత అజయ్ సినిమా నిర్మాణ రంగంలో అడుగుపెట్టాడని.. తను ఇప్పుడు ‘సెంచరీ’ కొట్టబోతున్నాడని(వందో సినిమాలో నటిస్తున్నాడని) చెప్పుకొచ్చారు. తనతో జీవితం తృప్తిగా ఉందని.. హనీమూన్‌లో అజయ్ తనకు ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు... తనను తొందరగా ఈజిప్టు ట్రిప్‌నకు వెళ్లమని పోరు పెడుతున్నానని సరదాగా వ్యాఖ్యానించారు. కాగా హల్చల్ సినిమా తర్వాత గూండారాజ్, ఇష్క్, దిల్ క్యా కరే, రాజూ చాచా, ప్యార్ తో హోనా హై థా వంటి సినిమాల్లో వీరిద్దరు కలిసి నటించారు. 1999లో పెళ్లి చేసుకున్న ఈ జంటకు కూతురు నైసా, కుమారుడు యుగ్ సంతానం. View this post on Instagram “We met 25 years ago, on the sets of Hulchul–I was ready for the shot & asked, ‘Where’s my hero?’ Someone pointed him out–he was broodily sitting in a corner. So 10 minutes before I met him, I bitched about him! We began talking on set & became friends. I was dating someone at the time & so was he–I’ve even complained about my then boyfriend to him! Soon, we both broke up with our significant others. Neither of us proposed–it was understood that we were to be together. It went from hand-holding to a lot more before we knew it! We used to go for dinners & so many drives–he lived in Juhu & I, in South Bombay, so half our relationship was in the car! My friends warned me about him–he had quite a reputation. But he was different with me–that’s all I knew. We’d been dating for 4 years, when we decided to get married. His parents were on board, but my dad didn’t talk to me for 4 days. He wanted me to focus on my career, but I was firm & he eventually came around. Again, there was no proposal–we just knew we wanted to spend our lives together. We got married at home & gave the media the wrong venue–we wanted it to be our day. We had a Punjabi ceremony & a Marathi one! I remember, during the pheras Ajay was desperately trying to get the pandit to hurry up & even tried to bribe him! I wanted a long honeymoon–so we travelled to Sydney, Hawaii, Los Angeles… But 5 weeks into it, he fell sick & said, ‘Baby, book me on the next flight home!’ We were supposed to do Egypt, but we cut it short. Over time, we began planning to have kids. I was pregnant during K3G, but had a miscarriage. I was in the hospital that day–the film had done so well, but it wasn’t a happy time. I had another miscarriage after that–it was tough. But eventually it worked out–we had Nysa & Yug & our family’s complete. We’ve been through so much–we’ve formed our own company, Ajay’s on his 100th film & every day we’re building something new. Life with him is content–we’re not too romantic or anything–we care for each other. If I’m thinking idiotic things, it’ll come out of my mouth without a filter & vice versa. Like right now I’m thinking that he owes me a trip to Egypt!” A post shared by Humans of Bombay (@officialhumansofbombay) on Jan 8, 2020 at 4:25am PST -
పరిణీతి అవుట్ నోరా ఇన్
హిందీ చిత్రం ‘భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా’ నుంచి కథానాయిక పరిణీతీ చోప్రా తప్పుకున్నారని బాలీవుడ్ సమాచారం. అభిషేక్ దుధియా దర్శకత్వంలో అజయ్ దేవగన్, సంజయ్ దత్, సోనాక్షీ సిన్హా, రానా, ప్రణీత ప్రధాన తారాగణంగా తెరకెక్కుతోన్న చిత్రం ‘భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా’. ఇందులో గూఢచారిగా పరిణీతి చోప్రా నటించాల్సింది. కానీ, ఇప్పుడు ఆమె స్థానంలోకి నోరా ఫతేహీ వచ్చారని టాక్. ఈ నెల 12 తర్వాత జరిగే ఈ సినిమా షూట్లో జాయిన్ అవుతారట నోరా. ఎన్టీఆర్ ‘టెంపర్’లో ‘ఇట్టాగే రెచ్చిపోదాం’, ‘బాహుబలి’లో ‘మనోహరీ..’ వంటి స్పెషల్ సాంగ్స్‌తో ఎక్కువ పాపులారిటీ సంపాదించుకున్నారు నోరా. ఇంకా కిక్ 2, లోఫర్ చిత్రాల్లోనూ ప్రత్యేక పాటలకు కాలు కదిపారు. హిందీలోనూ స్పెషల్ సాంగ్స్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న నోరా ఇటీవల కొన్ని హిందీ చిత్రాల్లో కీలక పాత్రలకు సై అంటున్నారు. తాజాగా ‘భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా’ చిత్రంలో గూఢచారిగా నటించడానికి సిద్ధమయ్యారామె. ఈ చిత్రం ఆగస్టు14న విడుదల కానుంది. ఇక ఈ సినిమా నుంచి పరిణీతీ ఎందుకు తప్పుకున్నారంటే ‘సైనా’ చిత్రంతో బిజీగా ఉండటం వల్లే అని బాలీవుడ్ టాక్. ‘సైనా’ చిత్రం నుంచి శ్రద్ధా కపూర్ తప్పుకున్నాక ఆమె స్థానంలోకి పరిణీతి వచ్చిన సంగతి గుర్తుండే ఉంటుంది. -
డబుల్ ఎంట్రీ
ఈ మధ్యే తొలి బాలీవుడ్ సినిమా చేయడానికి అంగీకరించారు ప్రణీతా సుభాష్. అజయ్ దేవగణ్, సంజయ్ దత్, రానా ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ‘భూజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా’ ద్వారా హిందీ తెరకు పరిచయం కానున్నారామె. ఈ సినిమా పూర్తికాకముందే మరో హిందీ సినిమా అంగీకరించారు ప్రణీత. మలయాళ దర్శకుడు ప్రియదర్శన్ ఏడేళ్ల గ్యాప్ తర్వాత చేస్తున్న హిందీ చిత్రం ‘హంగామా 2’లో ఓ హీరోయిన్గా నటిస్తున్నారు ఈ బ్యూటీ. ఈ చిత్రం గురించి ప్రణీత మాట్లాడుతూ – ‘‘నేను ఇప్పటివరకూ పూర్తి స్థాయి కామెడీ చిత్రం చేయలేదు. ఎక్కువ శాతం పక్కింటి అమ్మాయి తరహా పాత్రలో లేదా హీరోని బాగా ప్రేమించే అమ్మాయిలానే కనిపించాను. వాటికి భిన్నంగా ఉంటే ‘హంగామా 2’ నాకో కొత్త అనుభవంలా ఉండబోతోంది’’ అన్నారు. విశేషం ఏంటంటే ఈ రెండు చిత్రాలు ఒకే రోజున (వచ్చే ఏడాది ఆగస్ట్ 14 రిలీజ్ కాబోతున్నాయి. ఆ విధంగా హిందీ స్క్రీన్‌పై ఒకేసారి డబుల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు ప్రణీత. -
మళ్లీ రైడ్
గత ఏడాది హీరో అజయ్ దేవగన్ బాలీవుడ్ వెండితెరపై చేసిన ‘రైడ్’ బాక్సాఫీస్ వద్ద వంద కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. దీంతో మళ్లీ ‘రైడ్’ చేయడానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు అజయ్. తొలి రైడ్‌లో అజయ్ సరసన హీరోయిన్గా నటించిన ఇలియానాయే మలి రైడ్‌లోనూ నటించబోతున్నారని బాలీవుడ్ సమాచారం. 1980 నేపథ్యంలో అప్పటి వాస్తవ సంఘటనల ఆధారంగా రాజ్‌కుమార్ గుప్తా దర్శకత్వంలో ‘రైడ్’ చిత్రం తెరకెక్కింది. తాజాగా మరో భారీ ఐటీ రైడ్ నేపథ్యంలో ‘రైడ్’కు సీక్వెల్ తీయాలనే ఆలోచనలో ఉన్నారట అజయ్ దేవగన్. ఇందుకు తగిన కథాచర్చలు కూడా జరుగుతున్నాయని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. మరి.. రెండో ‘రైడ్’కు కూడా రాజ్‌కుమార్ గుప్తాయే దర్శకత్వం వహిస్తారా? అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. -
తాన్హాజీ: యుద్ధానికి భయపడేదే లేదు
చలనచిత్ర పరిశ్రమలో గతకొంతకాలంగా బయోపిక్‌ల హవా నడుస్తోంది. టాలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా బయోపిక్ సినిమాలు ప్రేక్షకుల మెప్పును సంపాదించుకుంటున్నాయి. ముఖ్యంగా బాలీవుడ్లో వస్తున్న బయోపిక్ చిత్రాలకు లెక్కే లేదు. ఈ క్రమంలో మరాఠా అధినేత చత్రపతి శివాజీ సామ్రాజ్యంలో సుబేదార్‌గా పనిచేసిన మరాఠా యోధుడు తానాజీ జీవితకథ ఆధారంగా తెరకెక్కుతోన్న తాజా చిత్రం ‘తాన్హాజీ: ది అన్సంగ్ వారియర్’. ఈ సినిమాలో అజయ్ దేవ్గన్, కాజోల్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ నేడు రిలీజైంది. యుద్ధ సన్నివేశాలతో కూడిన ఈ ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంటోంది. తానాజీ యుద్ధ సన్నివేశాలు భీకరంగా ఉండేట్టు కనిపిస్తోంది. 1670 వ శతాబ్దంలో మరాఠా సామ్రాజ్యంలో లిఖించబడిన చరిత్రను చిత్రబృందం వెండితెరపై ఆవిష్కరించింది. తానాజీ మొఘల్ సామ్రాజ్యంపై సర్జికల్ స్ట్రైక్ జరిపాడంటూ ట్రైలర్లో ఆయన ఖ్యాతిని ఇనుమడింపజేశారు. ఈ ట్రైలర్లో కాజోల్ నిడివి తక్కువగానే ఉన్నప్పటికీ ఆమె నటన ఆకట్టుకుంది. ఇక బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు అదనపు ఆకర్షణగా ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. భయం అంటేనే తెలియని తానాజీ ప్రత్యర్థి (సైఫ్ అలీఖాన్)తో యుద్ధానికి సై అంటూ చెప్పే డైలాగులు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే ఫస్ట్‌లుక్‌లతో అంచనాలు పెంచేసిన ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
మరాఠా యోధుడి భార్యగా కాజోల్
చత్రపతి శివాజీ సైన్యాన్ని ముందుండి నడిపించిన మరాఠా వీరుడు తానాజీ మలుసరే జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘తాన్హాజీ: ది అన్సంగ్ వారియర్’. ఇందులో మరాఠా యోధుడిగా అజయ్ దేవ్గన్, ఆయన సతీమణి పాత్రలో కాజోల్ నటిస్తున్నారు. 2008లో ‘యు మీ ఔర్ హమ్’ తర్వాత వీళ్లిద్దరి కలయికలో వస్తున్న చిత్రమిది. ఓమ్రత్ దర్శకత్వం వహిస్తుండగా టీసీరిస్తో కలిసి అజయ్ దేవ్గన్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మరాఠా వీరుడి పత్ని సావిత్రిబాయి మలుసరేగా కాజోల్ ఫస్ట్‌లుక్‌ను సోమవారం విడుదల చేశారు. మరాఠా మహిళ పాత్రలో ఒదిగిపోయిన కాజోల్ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో ఉదయ్ సింగ్ రాథోడ్ పాత్రలో సైఫ్ అలీఖాన్ కనిపించనున్నారు. ఓంకార్ చిత్రం తర్వాత అజయ్ దేవ్గన్, సైఫ్ అలీఖాన్ కలిసి నటిస్తున్న చిత్రమిది. మొదట సినిమా పేరును తానాజీగా ప్రకటించిన చిత్రబృందం న్యూమరాలజీ ప్రకారం తాన్హాజీగా మార్చింది. ఈ చిత్ర ట్రైలర్‌ను రేపు(నవంబర్ 19న) రిలీజ్ చేయనున్నారు. కాగా తాన్హాజీ చిత్రంతో అజయ్ దేవ్గన్ సెంచరీ పూర్తి చేసుకోనున్నారు. ఈ చారిత్రాత్మక చిత్రం వచ్చే ఏడాది జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.