
కీర్తీ సురేశ్
‘మహానటి’ సినిమాలో సావిత్రి పాత్రలో వివిధ ఏజ్ గ్రూప్స్‌లో కనిపించారు కీర్తీ సురేశ్. ఇప్పుడు మరోసారి డిఫరెంట్ లుక్స్‌లో కనిపించడానికి సిద్ధమయ్యారట. ఇండియన్ ఫుట్‌బాల్ కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీమ్ జీవితం ఆధారంగా హిందీలో ఓ చిత్రం తెరకెక్కనుంది. అజయ్ దేవగన్ కథానాయకుడు. ఈ చిత్రం ద్వారా కీర్తీ సురేశ్ బాలీవుడ్‌కు పరిచయం కాబోతున్నారు. అజయ్ దేవగన్ భార్య పాత్రలో కీర్తీ కనిపించనున్నారు. ఈ సినిమాలో రెండు లుక్స్‌లో కీర్తీ పాత్ర ఉంటుందట.
ఒకటి యుక్త వయసులో ఉన్న అమ్మాయి కాగా, మరోటి పెద్ద వయసున్న స్త్రీలా కనిపిస్తారట. ఇందులో చేయబోయే ఓల్డ్ లుక్ కోసం ప్రోస్థటిక్ మేకప్ కూడా ఉపయోగించకుండా, న్యాచురల్‌గా ట్రై చేయాలనుకుంటున్నారట కీర్తీ. గత ఏడాది సూపర్‌హిట్‌గా నిలిచిన ‘బదాయి హో’ చిత్రాన్ని రూపొందించిన అమిత్ శర్మ ఈ చిత్రానికి దర్శకుడు. త్వరలోనే ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ ప్రాజెక్ట్ కాకుండా తెలుగులో నూతన దర్శకుడు నరేంద్రనాథ్ దర్శకత్వంలో ఓ లేడీ ఓరియంటెడ్ సినిమా చేస్తున్నారు కీర్తీ.
Comments
Please login to add a commentAdd a comment