Abdul Rahim
-
మైదానంలోకి వస్తున్నారు
అజయ్ దేవగన్ హీరోగా అమిత్ శర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పోర్ట్స్ డ్రామా ‘మైదాన్’. ఫుట్‌బాల్ కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీమ్ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఆయన పాత్రలో అజయ్ కనిపిస్తారు. ప్రియమణి కథానాయిక. బోనీ కపూర్ నిర్మిస్తున్నారు. కోవిడ్ వల్ల ఈ సినిమా చిత్రీకరణ ఆగిపోయింది. ఈ సినిమా కోసం వేసిన ఫుట్‌బాల్ స్టేడియం సెట్‌ని లాక్ డౌన్ టైమ్‌లో తొలగించారు. తాజాగా ఈ సినిమా చిత్రీకరణను మళ్లీ ప్రారంభించాలనుకుంటున్నారు. ఇంతకు ముందు తీసేసిన సెట్‌నే మళ్లీ కొత్తగా వేస్తున్నారు. జనవరిలో ఈ చిత్రీకరణలో పాల్గొంటారు అజయ్. ప్రస్తుతం అజయ్, ఈ సినిమాలో నటించేవాళ్లందరూ ఫుట్‌బాల్‌లో శిక్షణ తీసుకుంటున్నారు. -
ప్రతి భారతీయుడు గర్వపడతాడు
‘‘ఆధునిక భారతీయ ఫుట్‌బాల్‌కి ఆద్యుడు సయ్యద్ అబ్దుల్ రహీం గొప్పతనం గురించి మా ‘మైదాన్’ సినిమాలో చూపించబోతున్నాం. ఫుట్‌బాల్ కోచ్‌గా 1950లో ఆయన ప్రస్థానం ప్రారంభమయింది. అప్పటినుండి 1963లో చనిపోయేంత వరకు ఆయన ఫుట్‌బాల్ కోచ్‌గా వ్యవహరించారు’’ అన్నారు అజయ్ దేవగన్. సయ్యద్ అబ్దుల్ రహీం జీవితం ఆధారంగా రూపొందిన ‘మైదాన్’లో అజయ్ దేవగన్ సయ్యద్ పాత్రను పోషిస్తున్నారు. ఈ సినిమా గురించి అజయ్ దేవగన్ మాట్లాడుతూ– ‘‘వచ్చే ఏడాది ఇండిపెండెన్స్ వారాన్ని గుర్తు పెట్టుకోండి. ఒక రియల్ హీరో స్టోరీని భారతీయులందరూ గర్వపడేలా తీస్తున్నాం. ఆగస్టు 13న ‘మైదాన్’ను విడుదల చేస్తాం’’ అన్నారు. వాస్తవానికి ఈ సినిమా ఈ ఏడాది డిసెంబర్లో విడుదల కావాలి. ఈ స్పోర్ట్స్ డ్రామాను తెరకెక్కించటానికి 16 ఎకరాల విస్తీర్ణంలో ఓ సెట్‌ను మేలో నిర్మించారు. కరోనా కారణంగా షూటింగ్‌కి అంతరాయం ఏర్పడింది. ఆ తర్వాత వర్షాలకి ఈ సెట్ పాడయిపోయింది. మళ్లీ ఆ సెట్‌ను నిర్మించాలంటే రెండు నెలలు పడుతుంది. ఆ సెట్ పూర్తి చేసి, సెప్టెంబర్ మొదటి వారంలో షూటింగ్ ప్రారంభించాలనుకుంటున్నారు. ఈ చిత్రానికి ‘బదాయి హో’ ఫేం రవీంద్రనా«థ్ శర్మ దర్శకుడు. ఫ్రెష్‌లైమ్ ఫిల్మ్ సహకారంతో బోనీ కపూర్, ఆకాశ్ చావ్లా, అరునవ్ సేన్ గుప్తా నిర్మిస్తున్న ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లోనూ విడుదల కానుంది. -
మైదానం తొలగిస్తున్నారు
అజయ్ దేవగన్ హీరోగా హిందీలో తెరకెక్కుతున్న చిత్రం ‘మైదాన్’. ఫుట్‌బాల్ క్రీడాకారుడు సయ్యద్ అబ్దుల్ రహిమ్ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. అమిత్ శర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను బోనీ కపూర్ నిర్మిస్తున్నారు. ప్రియమణి కథానాయిక. 1950లలో ఈ చిత్రకథ జరుగుతుంది. పీరియాడికల్ చిత్రం కాబట్టి ఈ సినిమా చిత్రీకరణ కోసం ముంబైలో 16 ఎకరాల్లో సెట్స్ వేశారు. ఇందులో ఫుట్‌బాల్ స్టేడియం సెట్ కూడా ఒకటని సమాచారం. అయితే ఈ సెట్స్‌ను ఇప్పుడు తొలగిస్తున్నారు. కరోనా వల్ల షూటింగ్స్ అన్నీ ఆగిపోయాయి. మళ్లీ ఎప్పుడు మొదలవుతాయో ఇంకా స్పష్టత రాలేదు. జూన్ నెలలో వర్షాలు మొదలవుతాయి. దాంతో సెట్స్ పాడవుతాయనే ఉద్దేశంతో తొలగించాలనుకున్నారు. ఆల్రెడీ తొలగించే పనులు కూడా ప్రారంభమయ్యాయి. ‘‘ఈ సెట్స్ మళ్లీ నిర్మించాలంటే సుమారు రెండు నెలల సమయం పడుతుంది. షూటింగ్స్ మళ్లీ ప్రారంభం అయితే సెట్స్ మళ్లీ వేసి చిత్రీకరణ ప్రారంభించేసరికి నవంబర్ అవుతుంది’’ అని నిర్మాత బోనీ కపూర్ తెలిపారు. -
ముంబై టు కోల్‌కతా
ముంబై మైదానంలో మ్యాచ్‌ని ముగించారు అజయ్ దేవగన్. కోల్‌కతాలో జరగనున్న తర్వాతి మ్యాచ్ కోసం రెడీ అవుతున్నారు. ఇండియన్ ఫుట్‌బాల్ కోచ్ కమ్ మేనేజర్ సయ్యద్ అబ్దుల్ రహీమ్ జీవితం ఆధారంగా బాలీవుడ్లో ‘మైదాన్’ అనే చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో కీర్తీ సురేష్ కథానాయికగా నటిస్తున్నారు. జీ స్టూడియోస్‌తో కలిసి బోనీ కపూర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ‘బదాయి హో’ ఫేమ్ అమిత్ శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. అబ్దుల్ రహీమ్ పాత్రలో అజయ్ దేవగన్ నటిస్తున్నారు. ఈ చిత్రం తాజా షెడ్యూల్ ముంబైలో ముగిసింది. అజయ్ దేవగన్, కీర్తీ సురేష్‌లపై కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ సినిమా తర్వాతి షెడ్యూల్ కోల్‌కతాలో నవంబరు 3న ప్రారంభం కానుందని బాలీవుడ్ సమాచారం. ఈ సినిమాను వచ్చే ఏడాది విడుదల చేయాలనుకుంటున్నారు. -
మైదానంలో దిగారు
ఫుట్‌బాల్ కోచ్‌గా మైదానంలో దిగారు అజయ్ దేవగన్. తన నైపుణ్యంతో మైదానంలో మాణిక్యాలను తయారు చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇదంతా ప్రస్తుతం చేస్తున్న ‘మైదాన్’ కోసమే. ఇండియన్ ఫుట్‌బాల్ కోచ్, మేనేజర్ సయ్యద్ అబ్దుల్ రహీమ్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘మైదాన్’. 1950 నుంచి 1963 వరకూ ఇండియన్ ఫుట్‌బాల్ కోచ్‌గా వ్యవహరించారు సయ్యద్. ఆయన పాత్రను అజయ్ దేవగన్ పోషిస్తున్నారు. అజయ్ భార్యగా కీర్తీ సురేశ్ నటిస్తున్నారు. ఈ సినిమాతోనే బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు కీర్తీ. సౌత్‌లో మహానటి అనిపించుకున్న కీర్తీ బాలీవుడ్ ప్రేక్షకుల దగ్గర కూడా మెప్పు పొందుతారని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ చిత్రానికి ‘బదాయిహో’ ఫేమ్ అమిత్ రవీంద్రనాథ్ శర్మ దర్శకుడు. బోనీ కపూర్, ఆకాశ్ చావ్లా, అరునవ జోయ్ గుప్తా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ సోమవారం ప్రారంభం అయింది. -
రహీం జాడేదీ.?
బంజారాహిల్స్: అదృశ్యమైన ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు షేక్ అబ్దుల్ రహీం ఆచూకీ రెండు వారాలు గడుస్తున్నా లభించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అనుమానాస్పద స్థితిలో అతను అదృశ్యం కావడం, సెల్‌ఫోన్ కూడా స్విచ్ఛాఫ్‌లో ఉండటం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. వివరాల్లోకి వెళితే.. ఫిలింనగర్ రౌండ్‌టేబుల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఇన్ఛార్జ్ హెడ్మాస్టర్ షేక్ అబ్దుల్ రహీం ఈ నెల 1న అనుమానాస్పద స్థితిలో అదృశ్యమయ్యాడు. ఈ మేరకు అతడి భార్య ముబీన్‌ఫాతిమా బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఓవైసీ కాలనీలో ఉంటున్న రహీం నాలుగేళ్లుగా ఫిలింనగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల హెడ్మాస్టర్గా పని చేస్తున్నారు. ఈ నెల 1న స్కూల్‌కు వెళ్లిన అతడికి భార్య ఫాతిమా ఫోన్ చేసి మధ్యాహ్నం భోజనానికి వస్తున్నారా అని అడగ్గా పని పూర్తయ్యాక వస్తానని చెప్పాడు. సాయంత్రం మరోసారి ఫోన్ చేయగా స్విచ్చాఫ్ చేసి ఉండటంతో బంధుమిత్రులను వాకాబు చేసింది. మలక్‌పేట్‌లో ఉంటున్న అతడి కుటుంబ సభ్యులను ప్రశ్నించినా ఫలితం లేకుండా పోవడంతో ఈనెల 8న పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలింపు చేపట్టారు. ఆయనకు ఎవరైనా శత్రువులు ఉన్నారా? అనే కోణంలో దర్యాప్తు చేపట్టగా ఎవరితోనూ శత్రుత్వం లేదని పోలీసులు తెలిపారు. చివరి ఫోన్‌కాల్ ఎవరికి చేశారన్న దానిపై కాల్‌డేటా సేకరిస్తున్నారు. ఆచూకీ తెలిసిన వారు 7901106909 నంబర్లో సంప్రదించాలని దర్యాప్తు అధికారి ఏఎస్ఐ ప్రేమ్‌కుమార్ తెలిపారు. -
యంగ్ అండ్ ఓల్డ్
‘మహానటి’ సినిమాలో సావిత్రి పాత్రలో వివిధ ఏజ్ గ్రూప్స్‌లో కనిపించారు కీర్తీ సురేశ్. ఇప్పుడు మరోసారి డిఫరెంట్ లుక్స్‌లో కనిపించడానికి సిద్ధమయ్యారట. ఇండియన్ ఫుట్‌బాల్ కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీమ్ జీవితం ఆధారంగా హిందీలో ఓ చిత్రం తెరకెక్కనుంది. అజయ్ దేవగన్ కథానాయకుడు. ఈ చిత్రం ద్వారా కీర్తీ సురేశ్ బాలీవుడ్‌కు పరిచయం కాబోతున్నారు. అజయ్ దేవగన్ భార్య పాత్రలో కీర్తీ కనిపించనున్నారు. ఈ సినిమాలో రెండు లుక్స్‌లో కీర్తీ పాత్ర ఉంటుందట. ఒకటి యుక్త వయసులో ఉన్న అమ్మాయి కాగా, మరోటి పెద్ద వయసున్న స్త్రీలా కనిపిస్తారట. ఇందులో చేయబోయే ఓల్డ్ లుక్ కోసం ప్రోస్థటిక్ మేకప్ కూడా ఉపయోగించకుండా, న్యాచురల్‌గా ట్రై చేయాలనుకుంటున్నారట కీర్తీ. గత ఏడాది సూపర్‌హిట్‌గా నిలిచిన ‘బదాయి హో’ చిత్రాన్ని రూపొందించిన అమిత్ శర్మ ఈ చిత్రానికి దర్శకుడు. త్వరలోనే ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ ప్రాజెక్ట్ కాకుండా తెలుగులో నూతన దర్శకుడు నరేంద్రనాథ్ దర్శకత్వంలో ఓ లేడీ ఓరియంటెడ్ సినిమా చేస్తున్నారు కీర్తీ. -
సౌత్ టు నార్త్ ఫుల్ బిజీ
కీర్తీసురేశ్ బాలీవుడ్లో ఎంట్రీ ఇస్తున్నారని గత కొన్ని రోజులుగా వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఇండియన్ ఫుట్‌బాల్ కెప్టెన్, మేనేజర్ సయ్యద్ అబ్దుల్ రహీమ్ జీవితం ఆధారంగా ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. అజయ్ దేవగన్ హీరోగా ‘బదాయి హో’ ఫేమ్ అమిత్ శర్మ దర్శకత్వంలో తెరకెక్కనుంది. ఇందులో అజయ్ భార్యగా కీర్తి నటించనున్నారు. ఈ ప్రాజెక్ట్ కాకుండా ఆమె మరో బాలీవుడ్ ప్రాజెక్ట్ కూడా ఓకే చేశారట. నగేష్ కుకునూర్ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారట. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళంలో కూడా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారని టాక్. తెలుగులో నూతన దర్శకుడు నరేంద్ర దర్శకత్వంలో ఓ లేడీ ఓరియంటెడ్ ప్రాజెక్ట్‌లో నటిస్తున్నారు కీర్తి. ఇలా.. సౌత్ టు నార్త్ కీర్తి డైరీ ఫుల్ బిజీ. -
ఫుట్‌బాల్ దిగ్గజం రహీమ్‌పై సినిమా
ముంబై: భారత ఫుట్‌బాల్ చరిత్రలో సయ్యద్ అబ్దుల్ రహీమ్‌కు విశిష్ట స్థానం ఉంది. దేశం గర్వించదగ్గ కోచ్‌గా నిలిచిన మన హైదరాబాదీ రహీమ్ శిక్షణలోనే భారత జట్టు 1951, 1962 ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకాలు గెలుచుకోవడమే కాకుండా 1956 మెల్బోర్న్ ఒలింపిక్స్‌లో సెమీఫైనల్ చేరింది. ఆనాడే కొత్త తరం టెక్నిక్‌లతో మన ఆటగాళ్లను తీర్చిదిద్ది ‘రహీమ్ సాబ్’గా అందరి మన్ననలు అందుకున్న ఆయన 54 ఏళ్ల వయసులో 1963లో కన్ను మూశారు. ఇప్పుడు ఆయనపై బయోపిక్ రూపొందించేందుకు రంగం సిద్ధమైంది. ఎస్ఏ రహీమ్ పాత్రలో బాలీవుడ్ స్టార్ అజయ్ దేవ్‌గణ్ నటించనున్నట్లు అధికారిక ప్రకటన వెలువడింది. రహీమ్ సాబ్ కోచ్‌గా వ్యవహరించిన, భారత ఫుట్‌బాల్‌కు స్వర్ణయుగంగా భావించే 1951–1962 మధ్య కాలం నేపథ్యంలో సినిమా నడుస్తుంది. అమిత్ శర్మ దీనికి దర్శకత్వం వహించనుండగా... జీ స్టూడియోస్, బోనీ కపూర్, ఆకాశ్ చావ్లా, జోయ్ సేన్‌గుప్తా సంయుక్తంగా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రముఖ ఫుట్‌బాల్ పరిశోధకులు నోవీ కపాడియా దీని కోసం తగిన సమాచారం అందిస్తుండగా, సైవిన్ ఖాద్రస్–రిటేశ్ షా ద్వయం కలిసి సినిమా స్క్రిప్ట్‌ను రూపొందిస్తున్నారు. వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో ఈ చిత్రం విడుదలవుతుంది. -
కారు బోల్తా: దంపతులకు గాయాలు
గుత్తి రూరల్ : మండలంలోని ఊబిచెర్ల శివార్లలోని 44వ నంబర్ జాతీయ రహదారిపై ఆదివారం ఓ కారు అదుపు తప్పి బోల్తా పడింది. ఘటనలో అనంతపురం ప్రశాంత్‌నగర్‌కు చెందిన ప్రొఫెసర్ అబ్దుల్ రహీం, ఆయన భార్య మెహజాన్బీ గాయపడ్డారు. అనంతపురం నుంచి వారు హైదరాబాద్‌కు వెళ్తుండగా మార్గమధ్యంలోని ఊబిచెర్ల వద్దకు రాగానే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. వెంటనే వారిని గుత్తి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోస వారిని కర్నూలు పెద్దాస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది. -
ఆగస్టు మిస్టరీలు!
నేటికీ పెండింగ్‌లో 13 సంచలనం రేపిన కేసులు బందోబస్తులు, సదస్సులతో పోలీసులు బిజీగా ఉండటమే కారణం సాక్షి, సిటీబ్యూరో: గతనెలలో జంట పోలీసు కమిషనరేట్లలో సంచలనం రేపిన పలు కేసులు నేటికీపెండింగ్లోనే ఉన్నాయి. నిందితుల ఆచూకీ కనిపెట్టకపోవడంతో బాధితులు ఆందోళన చెందుతున్నారు. స్వాత ంత్ర దినోత్సవ వేడుకలు, గణేష్ ఉత్సవాల హడావుడి, సీసీ కెమెరాలపై అవగాహన సదస్సులు, శాంతి కమిటీల సమావేశాల్లో పోలీసులు తలమునకలై ఉండటంతో ఈ కేసుల దర్యాప్తుపై దృష్టి పెట్టలేకపోయారు. గతనెలలో జరిగిన 13 ముఖ్య ఘటనల్లో నిందితులు నేటికీ దొరకలేదు. ఇందులో హత్య, దోపిడీ, స్నాచింగ్, దృష్టిమరల్చి, చోరీ తదితర ఘటనలున్నాయి. ఈ కేసుల మిస్టరీ వీడేదెన్నడో.. ఆగస్టు 5: నార్సింగి పరిధిలో అబ్దుల్ రహీం బ్యాంక్ నుంచి రూ.3.50 లక్షలు డ్రా చేసుకుని వెళ్తుండగా దుండగులు అతడి దృష్టి మరల్చి నగదు ఎత్తుకెళ్లారు. 15: శంషాబాద్ చారినగర్‌కు చెందిన రాములును ఎవరో హత్య చేసి గుర్తు పెట్టకుండా శవాన్ని కాల్చేశారు. కుషాయిగూడ ద్వారకాపురిలో ఒంటరిగా ఉండే లక్ష్మమ్మ (70)పై ఇద్దరు దుండగులు దాడి చేసి బీరువాలో ఉన్న 12 తులాల బంగారు నగలు దోచుకెళ్లారు. 18: కంచన్‌బాగ్ హఫీజ్‌బాబానగర్‌కు చెందిన బాలిక (15)పై కొందరు గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారు. 20: చంచల్గూడలోని సెంట్రల్ ప్రిజన్స్ బంక్ నుంచి రిమాండ్ ఖైదీ సాజిద్ (26) రూ.68,500 తీసుకుని పరారయ్యాడు. ముషీరాబాద్ పఠాన్‌బస్తీలో ఉండే అనీఫా బేగం (50) ఇంట్లోకి ప్రవేశించిన ఇద్దరు దుండగులు ఆమె కళ్లల్లో కారం చల్లి, నోట్లో వస్త్రాలు కుక్కి ఐదు తులాల బంగారు నగలు, రూ.50 వేలు దోచుకెళ్లారు. 21: బేగంబజార్‌లో ఆటోలో వెళ్తున్న గోల్డ్‌స్మిత్ అలీ (45)పై దుండగులు దాడి చేసి 2 కిలోల బంగారు నగలు దోపిడీ చేశారు. చైతన్యపురి ఎస్బీఐలో గురుశంకర్ అనే వ్యక్తి రూ.9 లక్షలు డ్రా చేసి వెళ్తుండగా ఓ వ్యక్తి అడ్రస్ అడిగినట్టు నటించి స్కూటర్ డిక్కీలోని డబ్బు పట్టుకుపోయాడు. 23: రూ.40 లక్షలు బ్యాంకులో వేసేందుకు బైక్‌పై వెళ్తున్న బావ బావవురుదులు శ్యాంసుందర్, దిలీప్‌కుమార్‌పై పల్సర్‌పై వచ్చిన నలుగురు కత్తితో దాడి చేసి డబ్బు దోపిడీ చేశారు. 26: నాచారం ఎస్వీనగర్‌కు చెందిన సబిత (35) ఇంట్లోకి ప్రవేశించిన అగంతకులు ఆమె కాళ్లుచేతులు కట్టేసి, గొంతు నులిమి చంపేశారు. 28: నల్లకుంట పరిధిలో రాజేందర్ అనే వ్యక్తి తన యజమానికి చెందిన రూ.2.77 లక్షలు బ్యాంక్‌లో వేసేందుకు తీసుకెళ్తుండగా బైక్‌పై వచ్చిన నలుగురు కళ్లల్లో కారం చల్లి డబ్బు దోచుకెళ్లారు. నారాయణగూడ పరిధిలో ఫార్మాస్యూటికల్స్ వ్యాపారి ఆర్బీ జ్యోషి ఇంట్లో దొంగలు పడి కిలో బంగారు నగలు ఎత్తుకెళ్లారు. 30: ఛాదర్‌ఘాట్ కాలాడేరాకు చెందిన రహీమ్‌ఖాన్ తన కుటుంబ సభ్యులతో కలిసి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వెళ్లగా... బీరువాలోని 60 తులాల బంగారు నగలు, రూ.లక్షలను దొంగలు ఎత్తుకెళ్లారు.