
అజయ్ దేవగన్, కీర్తీ సురేష్
ముంబై మైదానంలో మ్యాచ్‌ని ముగించారు అజయ్ దేవగన్. కోల్‌కతాలో జరగనున్న తర్వాతి మ్యాచ్ కోసం రెడీ అవుతున్నారు. ఇండియన్ ఫుట్‌బాల్ కోచ్ కమ్ మేనేజర్ సయ్యద్ అబ్దుల్ రహీమ్ జీవితం ఆధారంగా బాలీవుడ్‌లో ‘మైదాన్’ అనే చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో కీర్తీ సురేష్ కథానాయికగా నటిస్తున్నారు. జీ స్టూడియోస్‌తో కలిసి బోనీ కపూర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ‘బదాయి హో’ ఫేమ్ అమిత్ శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. అబ్దుల్ రహీమ్ పాత్రలో అజయ్ దేవగన్ నటిస్తున్నారు. ఈ చిత్రం తాజా షెడ్యూల్ ముంబైలో ముగిసింది. అజయ్ దేవగన్, కీర్తీ సురేష్‌లపై కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ సినిమా తర్వాతి షెడ్యూల్ కోల్‌కతాలో నవంబరు 3న ప్రారంభం కానుందని బాలీవుడ్ సమాచారం. ఈ సినిమాను వచ్చే ఏడాది విడుదల చేయాలనుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment