మైదానంలో దిగారు | Ajay Devgn kicks off film on football coach Syed Abdul Rahim | Sakshi
Sakshi News home page

మైదానంలో దిగారు

Aug 20 2019 12:26 AM | Updated on Aug 20 2019 12:26 AM

Ajay Devgn kicks off film on football coach Syed Abdul Rahim - Sakshi

అజయ్‌ దేవగన్‌, కీర్తీ సురేశ్‌

ఫుట్‌బాల్‌ కోచ్‌గా మైదానంలో దిగారు అజయ్‌ దేవగన్‌. తన నైపుణ్యంతో మైదానంలో మాణిక్యాలను తయారు చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇదంతా ప్రస్తుతం చేస్తున్న ‘మైదాన్‌’ కోసమే. ఇండియన్‌ ఫుట్‌బాల్‌ కోచ్, మేనేజర్‌ సయ్యద్‌ అబ్దుల్‌ రహీమ్‌ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘మైదాన్‌’. 1950 నుంచి 1963 వరకూ ఇండియన్‌ ఫుట్‌బాల్‌ కోచ్‌గా వ్యవహరించారు సయ్యద్‌.

ఆయన పాత్రను అజయ్‌ దేవగన్‌ పోషిస్తున్నారు. అజయ్‌ భార్యగా  కీర్తీ సురేశ్‌ నటిస్తున్నారు. ఈ సినిమాతోనే బాలీవుడ్‌ ఎంట్రీ ఇస్తున్నారు కీర్తీ.  సౌత్‌లో మహానటి అనిపించుకున్న కీర్తీ బాలీవుడ్‌ ప్రేక్షకుల దగ్గర కూడా మెప్పు పొందుతారని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ చిత్రానికి ‘బదాయిహో’ ఫేమ్‌ అమిత్‌ రవీంద్రనాథ్‌ శర్మ దర్శకుడు. బోనీ కపూర్, ఆకాశ్‌ చావ్లా, అరునవ జోయ్‌ గుప్తా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్‌ సోమవారం ప్రారంభం అయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement