సీనియర్‌ హీరోతో రొమాన్స్‌కు సై | Rakul paired with Ajay Devagan Next | Sakshi
Sakshi News home page

Published Tue, Jan 16 2018 9:30 AM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM

Rakul paired with Ajay Devagan Next - Sakshi

సాక్షి, సినిమా : గతేడాది పెద్దగా సక్సెస్‌లు పలకరించకపోయినా స్టార్‌ హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ కెరీర్‌ ప్రస్తుతం నిలకడగానే ఉంది. సెలక్టివ్‌ కథలను ఎంచుకుంటూ ఈ ఏడాది మంచి చిత్రాలతోనే ప్రేక్షకులను పలకరించబోతోంది. ముందుగా బాలీవుడ్‌లో ‘అయ్యారీ’ ద్వారా రీ ఎంట్రీతో అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. ఇదిలా ఉంటే బాలీవుడ్‌లో మరో చిత్రానికి ఆమె గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు సమాచారం. 

నటుడు అజయ్‌ దేవగన్‌ తర్వాతి చిత్రంలో రకుల్‌ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. అకివ్‌ అలీ దర్శకత్వం వహించబోతున్న ఈ చిత్రంలో సీనియర్‌ నటి టబు కూడా ఓ కీలకపాత్ర పోషించబోతున్నారు. ఈ విషయాలను నిర్మాత భూషణ్‌ కుమార్‌ తెలిపారు. గతంలో రకుల్‌ను యారియాన్‌ ద్వారా బాలీవుడ్‌కు పరిచయం చేసింది భూషణ్‌ కుమార్‌ కావటం విశేషం. రచయిత లవ్‌ రంజన్‌(ప్యార్‌ కా పంచ్‌నామా ఫేమ్‌) మరో నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. 

రొమాంటిక్‌ కామెడీ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కబోతుందని నిర్మాతలు వెల్లడించారు. దసరాకు ఈ చిత్రం విడుదలయ్యే అవకాశం ఉంది. మరోవైపు నీరజ్‌ పాండే డైరెక్షన్‌లో సిద్ధార్ధ్‌ మల్హోత్రా-రకుల్‌ జంటగా నటించిన అయ్యారీ ఫిబ్రవరి 9న విడుదల కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement