
హెడ్డింగ్‌లో ఉన్న ఫార్ములానే ఫాలో అయ్యారు హీరోయిన్ రకుల్‌ప్రీత్ సింగ్. ఎందుకు అంటే హిందీ చిత్రం ‘దే దే ప్యార్ దే’ కోసం. అజయ్ దేవగన్, టబు, రకుల్‌ప్రీత్ సింగ్ ముఖ్య తారలుగా అకివ్ అలీ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘దే దే ప్యార్ దే’. ఈ సినిమాలో అయేషా అనే పాత్ర చేశారు రకుల్. ఈ పాత్ర కోసం ఆమె పాతిక రోజుల్లో పది కేజీల బరువు తగ్గాల్సి వచ్చింది. ఇంత తక్కువ టైమ్‌లోనే రోజుకు నాలుగు గంటలు శ్రమించి, కఠినమైన డైట్‌ని ఫాలో అయ్యి అనుకున్నది సాధించారు రకుల్.
‘‘ఈ సినిమాలోని నా పాత్ర కోసం పాతిక రోజుల్లో పది కిలోల బరువు తగ్గాల్సి వచ్చింది. నా జీవితంలో ఫిట్‌నెస్ పరంగా చాలా కష్డపడ్డ సమయం అది. స్క్రిప్ట్ నచ్చితే పాత్ర కోసం ఎందాకైనా, ఎంతైనా కష్టపడటం నాకు ఇష్టం’’ అని పేర్కొన్నారు రకుల్. ఇంతకుముందు ‘యారియాన్’ (2014), ‘అయ్యారే’ (2018) చిత్రాల్లో నటించారు రకుల్. కానీ హిందీలో ఆమెకు ఆశించిన ఫలితం దక్కలేదనే చెప్పాలి. ఇప్పుడు చేసిన ‘దే దే ప్యార్ దే’ చిత్రం వచ్చే నెలలో రిలీజ్‌కు రెడీగా ఉంది. ఈ సినిమా కాకుండా రకుల్ చేతిలో ‘మర్జావాన్’ చిత్రం ఉంది. మరి.. ‘దే దే ప్యార్ దే, మర్జావాన్’ చిత్రాల రిలీజ్ తర్వాత బాలీవుడ్‌లో రకుల్ కెరీర్ స్పీడ్ అందుకుంటుందేమో చూడాలి. సౌత్‌లో మాత్రం మంచి స్పీడ్ మీదే ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment