.నో ఫ్లయిట్స్‌.. నో ట్రావెల్‌ | Rakul Preet Singh is striking the right balance | Sakshi
Sakshi News home page

.నో ఫ్లయిట్స్‌.. నో ట్రావెల్‌

Published Fri, Jul 6 2018 12:18 AM | Last Updated on Tue, Jul 23 2019 11:50 AM

Rakul Preet Singh is striking the right balance - Sakshi

రకుల్‌ప్రీత్‌ సింగ్‌

రీసెంట్‌ టైమ్స్‌లో చెన్నై, ముంబై, హైదరాబాద్‌ నగరాల మధ్య తెగ చెక్కర్లు కొట్టారు హీరోయిన్‌ రకుల్‌ప్రీత్‌ సింగ్‌. ఆమె తమిళంలో మూడు (సూర్యతో ‘ఎన్‌జీకే’, కారీత్తో ‘దేవ్‌’, శివకార్తీకేయన్‌తో ఓ సైన్స్‌ ఫిక్షన్‌ చిత్రం), హిందీలో (అజయ్‌ దేవగణ్‌) ఒక సినిమా చేస్తుండటమే ఇందుకు కారణం. అయితే ఇప్పుడు దాదాపు నెల రోజుల పాటు ఒకే చోట కుదురుగా ఉండనున్నారట రకుల్‌.

అకివ్‌ ఆలీ దర్శకత్వంలో అజయ్‌ దేవగణ్‌ హీరోగా ఓ రొమాంటిక్‌ కామెడీ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో టబు, రకుల్‌ప్రీత్‌ సింగ్‌ నటిస్తున్నారు. ‘‘హిందీలో నేను నటిస్తున్న సినిమా కోసం లండన్‌ వెళ్లాను. ఈ షెడ్యూల్‌ కోసం ఇక్కడే నెల రోజులు ఉంటాను. నో ఫ్లయిట్స్‌.. నో ట్రావెల్‌’ అని పేర్కొన్నారు రకుల్‌ప్రీత్‌ సింగ్‌. మరోవైపు తమిళం, హిందీ చిత్రాలతో బిజీగా ఉన్న రకుల్‌ ఇంతవరకు తెలుగు సినిమాకు ఓకే చెప్పలేదు. కానీ ఈ నెలలో ఆమె నటించబోయే తెలుగు సినిమా గురించి అధికారిక ప్రకటన రానుందని టాక్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement