Romantic comedy
-
జాన్వీ కొత్త మూవీ బవాల్ స్క్రీనింగ్‌లో మెరిసిన తారలు (ఫొటోలు)
-
నవ్విస్తాం.. ఏడిపిస్తాం...
విద్యాబాలన్–ఇలియానా–ప్రతీక్ గాంధీ–సెంథిల్ రామమూర్తి... ఈ నలుగురూ కలసి నవ్వించడానికి... ఏడిపించడానికి రెడీ అయ్యారు. వీరి కాంబినేషన్లో రూపొందనున్న సినిమా అధికారిక ప్రకటన గురువారం వెల్లడైంది. దర్శకురాలు శీర్షా గుహ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఈ సినిమా గురించి విద్యాబాలన్ మాట్లాడుతూ – ‘‘ఆధునిక మానవ సంబంధాల చుట్టూ ఈ సినిమా ఉంటుంది. ఇది మీ కథలా అనిపించొచ్చు.. లేకపోతే మీ ప్రెండ్ కథలానూ అనిపించొచ్చు. మొత్తం మీద మనలో ఒకరి కథ. సినిమా ఎంత నవ్విస్తుందో అంతే సమానంగా ఏడిపిస్తుంది కూడా’’ అన్నారు. ‘‘ఈ కథలో నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే... ఇది అందరి కథ. ప్రపంచం మొత్తానికి చెందిన కథ. ఎలాంటి యాక్టర్లతో సినిమా చేయాలని కల కన్నానో వాళ్లతోనే ఈ సినిమా చేస్తున్నాను’’ అని శీర్షా అన్నారు. త్వరలో ఈ సినిమా టైటిల్ ప్రకటించనున్నారు. వచ్చే ఏడాది చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. -
.నో ఫ్లయిట్స్.. నో ట్రావెల్
రీసెంట్ టైమ్స్‌లో చెన్నై, ముంబై, హైదరాబాద్ నగరాల మధ్య తెగ చెక్కర్లు కొట్టారు హీరోయిన్ రకుల్‌ప్రీత్ సింగ్. ఆమె తమిళంలో మూడు (సూర్యతో ‘ఎన్జీకే’, కారీత్తో ‘దేవ్’, శివకార్తీకేయన్‌తో ఓ సైన్స్ ఫిక్షన్ చిత్రం), హిందీలో (అజయ్ దేవగణ్) ఒక సినిమా చేస్తుండటమే ఇందుకు కారణం. అయితే ఇప్పుడు దాదాపు నెల రోజుల పాటు ఒకే చోట కుదురుగా ఉండనున్నారట రకుల్. అకివ్ ఆలీ దర్శకత్వంలో అజయ్ దేవగణ్ హీరోగా ఓ రొమాంటిక్ కామెడీ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో టబు, రకుల్‌ప్రీత్ సింగ్ నటిస్తున్నారు. ‘‘హిందీలో నేను నటిస్తున్న సినిమా కోసం లండన్ వెళ్లాను. ఈ షెడ్యూల్ కోసం ఇక్కడే నెల రోజులు ఉంటాను. నో ఫ్లయిట్స్.. నో ట్రావెల్’ అని పేర్కొన్నారు రకుల్‌ప్రీత్ సింగ్. మరోవైపు తమిళం, హిందీ చిత్రాలతో బిజీగా ఉన్న రకుల్ ఇంతవరకు తెలుగు సినిమాకు ఓకే చెప్పలేదు. కానీ ఈ నెలలో ఆమె నటించబోయే తెలుగు సినిమా గురించి అధికారిక ప్రకటన రానుందని టాక్. -
నీకు కావాల్సింది ఇదేనా!?
తెలుగులో రొమాంటిక్ కామెడీ జానర్‌కు ఒక కొత్త దారిని చూపించిన సినిమాలోని సన్నివేశాలివి. ఇందులో హీరోగా నటించిన నటుడు ఇప్పుడు పెద్ద స్టార్. ఈ సినిమాతోనే దర్శకురాలిగా పరిచయమైన వ్యక్తి మొదటి సినిమాతోనే సూపర్ క్రేజ్ తెచ్చుకున్నారు. ఈ సినిమా పేరేంటో చెప్పుకోండి చూద్దాం? గౌతమ్ జీవితంలో ఎవ్వరూ లేరప్పుడు. అంతా శూన్యం. అమ్మ చనిపోయి రోజులు గడుస్తున్నాయి. అక్కా, బావా వాళ్లింటికి వాళ్లు వెళ్లిపోయారు. ఇంట్లో అతనొక్కడే. రోజులెలా గడిచిపోతున్నాయో అతడికే అర్థం కావట్లేదు. ఇంట్లో ఏ మూలన చూసినా అమ్మ ఉన్నట్లే ఉంది. అమ్మ మాటలే వినిపిస్తున్నాయి. ‘‘సోల్‌మేట్ అనేది ఎవరో ఒక్కరే! ఆ తర్వాత ఎవ్వరొచ్చినా అడ్జస్ట్మెంటే!’’ ‘‘నీకు కావాల్సింది ఇదేనా!?’’ అమ్మ మాటలే అవి. గౌతమ్‌కి మళ్లీ మళ్లీ వినిపిస్తున్నాయి. నిత్య గుర్తొచ్చింది. నిత్యతో ఉన్న రోజులు గుర్తొచ్చాయి. నిత్య.. గౌతమ్ ప్రేమించిన అమ్మాయి. ఒక్కసారిగా మళ్లీ ఒంటరైపోయాడు. ఎవ్వరూ లేనంత ఒంటరి అయిపోయాడు. పేపర్లో ఒక ప్రకటన చూడగానే అందులో ఉన్న ఫొటోను చూస్తూ ఆగిపోయింది నిత్య. గౌతమ్ వాళ్ల అమ్మ ఫొటో అది. ఆమె చనిపోయిన విషయం, దశదినకర్మ వివరాలు ఉన్నాయా ప్రకటనలో!లేచి బట్టలు సర్దుకుంది నిత్య. ‘‘ఎక్కడికి?’’ అని అడిగింది వాళ్లమ్మ. అమ్మకు ఏం చెప్పకుండా బ్యాగ్ సర్దుకుంటోంది నిత్య. నాన్న ఏం అడగకుండా వచ్చి పక్కన్నే నిలబడ్డాడు. ‘‘ఎక్కడికి అని అడుగుతుంటే చెప్పవే!’’ అమ్మ కసురుకుంది. ‘‘పప్పా! నేను హైద్రాబాద్ వెళ్తున్నా’’ నాన్నను చూడకుండానే, ఈ మాట చెప్తూ బయల్దేరింది నిత్య. బెంగళూరు నుంచి హైద్రాబాద్‌కి వెళ్లాలి నిత్య. గౌతమ్ ఒక్కడే ఉండి ఉంటాడు అక్కడ. ∙∙ గౌతమ్ ఇల్లు. కాలింగ్ బెల్ మోగింది. గౌతమ్ వచ్చి తలుపు తీశాడు. ఎదురుగా కావ్య. గౌతమ్.. తన జీవితం నుంచి నిత్య వెళ్లిపోయాక కావ్యను ప్రేమించాడు. కావ్యతోనూ అతడి ప్రేమ ఎక్కువ రోజులు నిలవలేదు. కావ్య పెళ్లి చేసుకొని వెళ్లిపోయింది. మళ్లీ ఇదే.. కావ్య గౌతమ్‌కు కనిపించడం. కావ్యను చూడ్డమే ఒకింత ఆశ్చర్యంతో నిలబడిపోయాడు గౌతమ్. కావ్య ఇంట్లోకి వచ్చి కూర్చుంది. కొద్దిసేపు ఇద్దరూ ఏం మాట్లాడుకోలేదు. ‘‘నేను ఇవ్వాళే హైద్రాబాద్ వచ్చాను. ఆంటీ గురించి తెలిసింది.’’ కావ్య గొంతు చిన్నగా పలికింది. గౌతమ్ నీరసంగా నవ్వాడు. ‘‘నువ్వెలా ఉన్నావ్!?’’ అని అడిగాడు. ‘‘నేను బాగున్నాను. నువ్వు?’’ అడిగింది కావ్య. గౌతమ్ ఏం మాట్లాడకుండానే బాగున్నా అంటూ చెయ్యి ఆడిస్తూ సమాధానం చెప్పాడు. కావ్య గౌతమ్‌ను బాధగా చూసింది. ఇద్దరి మధ్యా మళ్లీ నిశ్శబ్దం. ‘‘నేను బయలుదేరతాను.’’ అంటూ లేచి నిలబడింది కావ్య. ‘సరే’ అన్నట్టు గౌతమ్ కూడా లేచి నిలబడ్డాడు. ‘‘గౌతమ్! చాలా రోజుల్నుంచి నీతో.. మాట్లాడుదామనే అనుకున్నా. నా పెళ్లయ్యాక చెన్నై వెళ్లిపోయాను. నీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను. బట్ ఐ డోంట్ నో! సమ్ హౌ..’’ కావ్య మాట్లాడుతూ పోతోంది. గౌతమ్ ఆమె మాటలను మధ్యలోనే ఆపేస్తూ.. ‘‘ఇప్పుడదంతా ఎందుకు?’’ అన్నాడు.‘‘మమ్మీ, డాడీకి మన విషయం మొదట్నుంచీ నచ్చేది కాదు. ఆ రోజు జరిగిన గొడవలో వాళ్లకో వంక దొరికింది.’’ కావ్య ఇంకా బాధగానే ఉంది. గౌతమ్ ఆమెను శాంతపరచడానికి, ‘‘నువ్వు హ్యాపీయే కదా!’’ అన్నాడు.‘‘అది కాదు గౌతమ్..’’‘‘నువ్వు హ్యాపీయా కాదా?’’ అడిగాడు గౌతమ్.కావ్య నవ్వింది. గౌతమ్ నవ్వాడు. ‘‘ఫస్ట్ మనం ఫ్రెండ్స్‌గా ఉన్నాం. ఆ ఫ్రెండ్షిప్ ఎప్పటికీ మారకూడదు.’’ కావ్య ఆరోజు మొదటిసారి నవ్వింది. ‘‘మారదు.’’ గౌతమ్ నవ్వుతూ సమాధానం ఇచ్చాడు. ‘‘కాఫీ?’’ ఆఫర్ ఇచ్చాడు గౌతమ్. ‘‘నువ్వు కాఫీ పెడతావా? నేను పెడతాను నువ్ తాగు చాలు..’’ నవ్వుతూ అంది కావ్య. కిచెన్‌కు దారి చూపించాడు గౌతమ్. గౌతమ్ స్నానానికి వెళ్లిపోయాడు. కాలింగ్ బెల్ మోగింది. కావ్య కిచెన్ నుంచి వచ్చి తలుపు తీసి, ‘‘యస్!’’ అంది. ఇవతల ఉన్న వ్యక్తి నిత్య. గౌతమ్‌ని కలవడానికి వచ్చింది. కానీ, కావ్యను చూసి కాసేపు అలాగే నిలబడిపోయింది. ‘‘సారీ! రాంగ్ అడ్రస్..’’ అని చెప్పి అక్కణ్నుంచి వెళ్లిపోయింది నిత్య. గౌతమ్‌కి పెళ్లి అయిపోయి ఉండొచ్చు అనుకుంది. ‘‘ఇట్స్ ఓకే!’’ అని చెప్పి తలుపు వేసేసింది కావ్య.నిత్యకు తెలీదు.. తాను ఊహించింది అబద్ధం అని. ఆ అబద్ధాన్నే నమ్మి హైద్రాబాద్ వదిలి వెళ్లిపోయింది. గౌతమ్‌కీ తెలీదు.. నిత్య తన కోసం హైద్రాబాద్ వచ్చిందని. -
ఒక బస్తా ఎక్కువే పండిస్తా!
రొమాంటిక్ కామెడీ జానర్లో వచ్చిన ఓ సూపర్‌హిట్ సినిమాలోని సన్నివేశాలివి. ఇండియన్ సినిమాలో టాప్ కొరియోగ్రాఫర్‌గా పేరున్న స్టార్.. దర్శకుడిగా మారి చేసిన మొదటి సినిమా ఇది. ఈ సినిమా పేరేంటో చెప్పుకోండి చూద్దాం. మీ చెల్లెలిని ప్రేమించింది నేనే!’’ భయపడుతూనే, ఒక్కో మాటా కూడబలుక్కొని అసలు విషయాన్ని శివరామకృష్ణ ముందు చెప్పేశాడు సంతోష్.శివరామకృష్ణ కోపంగా చూస్తూ నిలబడ్డాడు. నా పేరు సంతోష్..అంటూ ఏదో చెప్పబోతున్న సంతోష్‌ను మధ్యలోనే ఆపేస్తూ, కోపంగా చూసి అక్కణ్నుంచి ముందుకు కదిలాడు శివరామకృష్ణ. సర్.. అసలేం జరిగింది అంటే..శివరామకృష్ణ ఏమీ మాట్లాడకుడా ఇంటివైపుకు నడుస్తూనే ఉన్నాడు. సర్.. మీ చెల్లెలు మంచి అమ్మాయి అండీ.. చాలా మంచమ్మాయి. తనని మీరు చాలా బాగా పెంచారు సార్! మగాళ్ల వైపు కన్నెత్తి కూడా చూడదు.. రియల్లీ..శివరామకృష్ణ అలా నడుస్తూనే ఉన్నాడు. సర్.. నాకే టైమ్ పట్టింది సార్ పడేయడానికి..అంటూ సంతోష్ నోటినుంచి వచ్చిన మాటకు సమాధానంగా, కోపంగా ఒక్క చూపు చూశాడు శివరామకృష్ణ. దే ఇంగ్లిష్‌లో అయితే ఇంకా చాలా బాగా చెప్పేవాణ్ని సర్.. కానీ మీకు ఇంగ్లిష్ రాదుగా.. మా వాళ్లు చేసిన తప్పుకు నేను సారీ చెప్తున్నా సార్’’ సంతోష్ మాట్లాడటం ఆపలేదు. అయ్యిందా? ఇంకేమన్నా ఉందా?వరామకృష్ణ నోరువిప్పాడు. సరిగ్గా చెప్పానో లేదో కానీ, మ్యాటర్ మాత్రం ఇదేనండీ! సరే పదా! అంటూ సంతోష్‌ను ఇంట్లోకి తీసుకెళ్లాడు శివరామకృష్ణ. కొన్ని నిమిషాల్లో గాల్లో ఎగురుతూ వచ్చి బయటపడ్డాడు సంతోష్. శివరామకృష్ణ దెబ్బ గట్టిగా తగిలింది అతడికి.య్ నరసింహా! వీణ్ని తీసుకెళ్లి ఊరి బయట పడేయండ్రా!’’ అన్నాడు గట్టిగా, తన అనుచరుడికి చెబుతూ. సంతోష్ ప్లేబాయ్ టైప్. రిచ్ కిడ్. అమ్మా, నాన్నలకు ఒక్కగానొక్క కొడుకు. జాలీగా తిరగడం, ఇష్టమొచ్చినట్లు ఖర్చు పెట్టడం, లైఫ్‌ని ఎంజాయ్ చేయడం.. ఇదే అతడి డైలీ రొటీన్. లండన్‌లో పుట్టి పెరిగిన సంతోష్, కజిన్ పెళ్లి కోసమని వచ్చి సిరి ప్రేమలో పడిపోయాడు. సిరి శివరామకృష్ణకు చెల్లెలు. ఆ అన్నకు ఈ చెల్లే ప్రాణం. ఈ చెల్లెకు ఆ అన్న మాటే వేదం. సిరికి సంతోష్ కొత్తగా కనిపించాడు. సంతోష్‌కూ సిరి కొత్తగా కనిపించింది. ఇద్దరివీ వేర్వేరు ప్రపంచాలు. కానీ ప్రేమ ఆ రెండు ప్రపంచాలను కలిపేసింది. సిరి ప్రేమను గెలుచుకోవడంతో సంతోష్ కథ అయిపోలేదు. శివరామకృష్ణను కలవాలి. ఆయనను మెప్పించాలి. కానీ పలకరింపుకే ఆయన తన్ని తరిమేశాడు. సంతోష్ తిరిగొచ్చాడు. శివరామకృష్ణ కోపంతో అతడి మీదకు కత్తి తీశాడు. ఆ ఇంటి మంచి కోరే పెద్ద మనిషి వద్దని వారించాడు. అయినా శివరామకృష్ణ ఆగలేదు. సంతోష్ మీదకు వెళ్లి, చొక్కా పట్టుకొని చంపేసేంత కోపంగా చూస్తున్నాడు. ప్లీజ్ సార్! మమ్మల్ని విడదీయొద్దు సార్! మీ చెల్లెలంటే మీకెంత ప్రేమ ఉందో నాకు అంతకంటే ఎక్కువే ఉంది. తనకోసం అమ్మని, నాన్నను అన్నీ వదిలేసుకొని వచ్చా. నా ప్రేమను నిరూపించుకోవడానికి నేనేం చేయాలో చెప్పండి! శివరామకృష్ణను వేడుకున్నాడు సంతోష్. ష్టారూ! వీడ్ని వెళ్లిపొమ్మని చెప్పండి.శివరామకృష్ణ సంతోష్ వైపు చూడకుండా పెద్ద మనిషిని చూస్తూ గట్టిగా అరిచాడు. ఉరి తీసేవాణ్ని కూడా ఆఖరి కోరిక ఏంటని అడుగుతారు. మీరేంటి సార్! సంతోష్ దీనంగా అడిగాడు. శివరామకృష్ణ మరింత కోపంతో రగిలిపోయాడు. చెయ్యెత్తి కొట్టేలోపు పెద్ద మనిషి పక్కకు లాగాడు. మీ చెల్లెల్ని చూస్తుంటే మీ అమ్మ గుర్తొచ్చింది అన్నావ్! వీణ్ని చూస్తుంటే నువ్వు గుర్తొస్తున్నావ్రా నాకు.. ఇదే పొలంలో ఇలాగే.. ఇలాగే అడిగావ్‌రా ఒక అవకాశం ఇమ్మని. ఆ అవకాశం నీకు రాబట్టే కదరా నువ్వు నిరూపించుకున్నావ్! నీకో న్యాయం.. అతనికో న్యాయమా?పెద్దమనిషి శివరామకృష్ణ మీద కోపంతో అరిచాడు. శివరామకృష్ణ సంతోష్‌ను, సిరిని కాసేపు మౌనంగా చూస్తూ నిలబడ్డాడు. మెల్లిగా సిరికి దగ్గరగా వెళ్లి, ఏమ్మా! నీకు కాబోయే భర్త నీకు నచ్చితే చాలా? నాకూ నచ్చాలా? అనడిగాడు. మీకూ నచ్చాలన్నయ్యా’’ అంది సిరి ఏడుస్తూనే! సంతోష్ వాళ్లిద్దరికి దగ్గరగా వెళ్లి, వరామకృష్ణకు ఎదురుగా నిలబడి, ‘‘మీకు నచ్చాలంటే నేనేం చెయ్యాలో చెప్పండి?’’ అనడిగాడు. ఏం చెప్పినా చేస్తావా? చేస్తా సార్! వ్యవసాయం చెయ్యాలి. నాకున్న పొలంలో ఒక ఎకరం పొలమిస్తా. నేను పండించినన్ని బస్తాలు పండించాలి. పండిస్తావా? పాలు పితకాలి. బర్రెల్ని, గొర్రెల్ని, కోళ్లని పెంచాలి. పెంచుతావా?శివరామకృష్ణ గట్టిగా అరుస్తూ సంతోష్‌కు సవాల్ విసిరాడు. అమ్మా, నాన్నలను వదిలిపెట్టి రావడం కాదు. ఈ ఇంటి పిల్లను చేసుకోవాలంటే, వాళ్లమ్మ చులకన చేసి మాట్లాడిన ఆ రైతు బతుకే ఇతనూ బతకాలి. గెలవాలి. గెలుస్తావా?’’ శివరామకృష్ణ చాలెంజ్ విసురుతూనే ఉన్నాడు. సిరి సంతోష్‌ను చూస్తూ బాధతో వద్దన్నట్టు చూసింది. సంతోష్ కాసేపు మౌనంగా ఉండిపోయాడు. చుట్టూ అంతా నిశ్శబ్దం. ‘‘గెలుస్తాను సార్! మీరు చెప్పినవన్నీ చేస్తాను. మీకంటే ఒక బస్తా ఎక్కువే పండిస్తాను. అప్పుడే కదా.. సిరి మీద మీ ప్రేమ కంటే నా ప్రేమ గొప్పదని తెలుస్తుంది.’’ నిశ్శబ్దాన్ని బద్దలు కొడుతూ సంతోష్ మాట్లాడటం మొదలుపెట్టాడు. -
'ఏంజెల్' మూవీ వర్కింగ్ స్టిల్స్
-
ప్రేమకు టూ వీక్స్ నోటీస్...
హాలీవుడ్/రొమాంటిక్ కామెడీ ప్రేమకథల్లో అలకలు, దాగుడుమూతలు, విరహాలు, వేదనలు ఎప్పుడూ బాగుంటాయి. అందులోనూ ఆ ప్రేమికులకు ఆత్మాభిమానం కాస్త ఎక్కువ ఉంటే ఇక చెప్పనక్కర్లేదు. ఆనాటి యద్దనపూడి సులోచనారాణి నవలల నుంచి మొన్నటి ‘ఖుషి’ వరకూ ఇది సక్సెస్ఫుల్ ఫార్ములా. ఈ ఫార్ములాని హాలీవుడ్ కూడా వదిలిపెట్టలేదు. వందలాది కోట్ల రూపాయల వ్యయంతో భారీ యాక్షన్, ఫాంటసీ చిత్రాలు తీస్తూనే ఉన్నా... రొమాంటిక్ కామెడీలను ఎప్పటికప్పుడూ తీస్తూనే ఉంటుంది. బాక్సాఫీస్‌ను కొల్లగొడుతూనే ఉంటుంది. 2015లో ‘పీపుల్స్’ అనే పాపులర్ పత్రిక శాండ్రా బుల్లక్‌ని ప్రపంచ సౌందర్యరాశుల్లో ఒకరిగా పేర్కొంది. హాలీవుడ్లో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్ కూడా శాండ్రా బుల్లక్కే. శాండ్రా బుల్లక్కి, దర్శకుడు మార్క్ లారెన్స్‌కి మధ్య చక్కటి ప్రొఫెషనల్ రిలేషన్షిప్ ఉంది. 1999లో వచ్చిన ‘ఫోర్సెస్ ఆఫ్ నేచర్’కు వారిద్దరూ కలిసి పనిచేశారు. ఆ సినిమా హిట్. దాంతో శాండ్రా బుల్లక్ నిర్మాతగా మారి 2000లో ‘మిస్ కన్జీనియాలిటీ’ సినిమా నిర్మించింది. ఆ సినిమా సక్సెస్ అయి, దాని సీక్వెల్ కూడా వచ్చింది. మార్క్ లారెన్స్ ఓ బాస్‌కి, సెక్రటరీకి మధ్య రొమాంటిక్ కామెడీ కథ రాశాడు. సహజంగానే హీరోయిన్‌కి ప్రాధాన్యత ఉన్న ఆ కథ శాండ్రా బుల్లక్కి తెగ నచ్చేసింది. ఆ కథని తనే నిర్మించడానికి ముందుకొచ్చింది. అలాగే హీరో హ్యూగ్రాంట్కి - దర్శకుడు మార్క్ లారెన్స్‌కి మధ్య నుంచి సక్సెస్ఫుల్ రిలేషన్ ఉంది ‘టూ వీక్స్ నోటీస్’తో ప్రారంభమైన వాళ్ల కాంబినేషన్ ఆ తర్వాత నాలుగు సక్సెస్ఫుల్ సినిమాలు అందించింది. అలాగే యాక్షన్ చిత్రాల దర్శకుడు క్వెంటీన్ టొరంటినోకి మార్క్ లారెన్స్ అంటే చాలా అభిమానం. టొరంటినోకి విపరీతంగా నచ్చిన సినిమాల్లో ‘టూ వీక్స్ నోటీస్’ ఒకటి. 60 మిలియన్ డాలర్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా 199 మిలియన్ డాలర్ల పైన వసూలు చేసింది. ఇక కథ విషయానికొస్తే... లూసీ కెల్సన్ (శాండ్రా బుల్లక్) ఓ లాయర్. న్యూయార్క్‌లో పర్యావరణ సమతుల్యతని కాపాడటం కోసం పోరాడుతుంటుంది. కోటీశ్వరుడు అయిన జార్జి వేడ్ (హ్యూగ్రాంట్) మహా పొగరుబోతు. తనకి తెలిసిందే లోకం, తను చెప్పిందే ధర్మం అనుకుంటూ ఉంటాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో విపరీతంగా సంపాదిస్తుంటాడు. లూసీ బాల్యం ‘కోనీ ఐలాండ్ కమ్యూనిటీ సెంటర్’లో నడుస్తుంది. ఇప్పుడా కమ్యూనిటీ సెంటర్‌ని కూల్చేసి, ఆ స్థానంలో వేరే వెంచర్ ప్రారంభిద్దామనుకుంటాడు జార్జి. ఆ కమ్యూనిటీ సెంటర్‌ని కాపాడుకునే ప్రయత్నంలో జార్జిని కలిసి, రిక్వెస్ట్ చేస్తుంది లూసీ. తన సలహాదారు స్థానంలో పనిచేస్తే కమ్యూనిటీ సెంటర్ జోలికి రానంటాడు జార్జి. అతను జల్సారాయుడని, అమ్మాయిలతో ప్రేమ వ్యవహారాలు నడుపుతుంటాడని తెలిసి కూడా లూసీ జార్జి దగ్గర చేరుతుంది. జార్జికి ఏమీ తెలియదని, బిజినెస్ వ్యవహారాల్లోనే కాదు.. వ్యక్తిగత అలంకరణ, అలవాట్లలో కూడా అతనికి గెడైన్స్ అవసరమని చేరిన కొద్దిరోజులకే లూసీకి తెలుస్తుంది. ఇద్దరి మధ్య తెలియకుండానే ఓ సాన్నిహిత్యం ఏర్పడుతుంది. మనసులో ఉన్న ప్రేమ బయటికి చెప్పుకోలేని పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో లూసీ ఓ ఫ్రెండ్ పెళ్లికి వెళ్తుంది. జార్జి దగ్గర నుంచి అర్జెంట్‌గా రమ్మని మెసేజ్ వస్తుంది. ఏమిటా అని హడావుడిగా పరుగులు తీసి వెళ్లేటప్పటికి తీరా.. ఏ సూట్ వేసుకోవాలో తెలియక సలహా కోసం పిలిపిస్తాడు జార్జి. ఇలా ప్రతి చిన్న విషయానికి, అడ్డమైన విషయానికి తనమీద ఆధారపడటం లూసీకి చిర్రెత్తుకొస్తుంది. ఉద్యోగం మానెయ్యాలని నిర్ణయించుకుని రెండు వారాల నోటీస్ ఇస్తుంది. జాబ్ మానెయ్యవద్దని జార్జి బతిమిలాడతాడు. వేరే చోట లూసీకి ఉద్యోగం రానివ్వకుండా ప్రయత్నాలు చేస్తాడు. చివరికి లూసీ ఉద్యోగం మానెయ్యాలంటే, ఆమె స్థానంలో మరొకరిని నియమించమంటాడు జార్జి. జునె కర్వర్ (అల్సియా విట్)ని తన ప్లేస్‌లో పెడుతుంది లూసీ. జునె అందంగా ఉండటమే కాదు, జార్జిని కవ్విస్తుంటుంది. జునె ప్రవర్తన లూసీలో చిన్నపాటి అసూయని, కలవరాన్ని రేకెత్తిస్తుంది. లూసీ తన దారిన తాను వెళ్లిపోతుంది. ఆమె దూరమయ్యాకే ఆమె విలువ తెలుసుకుంటాడు జార్జి. మరోవైపు లూసీ పరిస్థితి అదే! జార్జినే అనుక్షణం తల్చుకుంటుంది. ఉద్యోగానికి రెండు వారాల నోటీస్ ఇవ్వవచ్చు కాని ప్రేమకి నోటీస్ ఇవ్వలేరు కదా! చివరికి అలకలు, విరహాన్ని దాటుకుని ఇద్దరు ప్రేమికులు కలుస్తారు. పక్కా తెలుగు సినిమా కథలా ఉండటం వల్ల ఏమో ఈ ‘టూ వీక్స్ నోటీస్’ ‘బాస్’ సినిమాకి స్ఫూర్తి అయింది. నాగార్జున, నయనతార నటించిన ‘బాస్’ సినిమాలో ‘టూ వీక్స్ నోటీస్’ ప్రభావం బాగా కనబడుతుంటుంది. - తోట ప్రసాద్