ఒక బస్తా ఎక్కువే పండిస్తా! | Romantic comedy genre | Sakshi
Sakshi News home page

ఒక బస్తా ఎక్కువే పండిస్తా!

Published Sun, Nov 12 2017 8:12 AM | Last Updated on Sun, Nov 12 2017 8:12 AM

Romantic comedy genre - Sakshi

రొమాంటిక్‌ కామెడీ జానర్లో వచ్చిన ఓ సూపర్‌హిట్‌ సినిమాలోని సన్నివేశాలివి. ఇండియన్‌ సినిమాలో టాప్‌ కొరియోగ్రాఫర్‌గా పేరున్న స్టార్‌.. దర్శకుడిగా మారి చేసిన మొదటి సినిమా ఇది. ఈ సినిమా పేరేంటో చెప్పుకోండి చూద్దాం. మీ చెల్లెలిని ప్రేమించింది నేనే!’’ భయపడుతూనే, ఒక్కో మాటా కూడబలుక్కొని అసలు విషయాన్ని శివరామకృష్ణ ముందు చెప్పేశాడు సంతోష్‌.శివరామకృష్ణ కోపంగా చూస్తూ నిలబడ్డాడు. నా పేరు సంతోష్‌..అంటూ ఏదో చెప్పబోతున్న సంతోష్‌ను మధ్యలోనే ఆపేస్తూ, కోపంగా చూసి అక్కణ్నుంచి ముందుకు కదిలాడు శివరామకృష్ణ. సర్‌.. అసలేం జరిగింది అంటే..శివరామకృష్ణ ఏమీ మాట్లాడకుడా ఇంటివైపుకు నడుస్తూనే ఉన్నాడు. సర్‌.. మీ చెల్లెలు మంచి అమ్మాయి అండీ.. చాలా మంచమ్మాయి. తనని మీరు చాలా బాగా పెంచారు సార్‌! మగాళ్ల వైపు కన్నెత్తి కూడా చూడదు.. రియల్లీ..శివరామకృష్ణ అలా నడుస్తూనే ఉన్నాడు. సర్‌.. నాకే టైమ్‌ పట్టింది సార్‌ పడేయడానికి..అంటూ సంతోష్‌ నోటినుంచి వచ్చిన మాటకు సమాధానంగా, కోపంగా ఒక్క చూపు చూశాడు శివరామకృష్ణ. 

దే ఇంగ్లిష్‌లో అయితే ఇంకా చాలా బాగా చెప్పేవాణ్ని సర్‌.. కానీ మీకు ఇంగ్లిష్‌ రాదుగా.. మా వాళ్లు చేసిన తప్పుకు నేను సారీ చెప్తున్నా సార్‌’’ సంతోష్‌ మాట్లాడటం ఆపలేదు. అయ్యిందా? ఇంకేమన్నా ఉందా?వరామకృష్ణ నోరువిప్పాడు. సరిగ్గా చెప్పానో లేదో కానీ, మ్యాటర్‌ మాత్రం ఇదేనండీ! సరే పదా! అంటూ సంతోష్‌ను ఇంట్లోకి తీసుకెళ్లాడు శివరామకృష్ణ. కొన్ని నిమిషాల్లో గాల్లో ఎగురుతూ వచ్చి బయటపడ్డాడు సంతోష్‌. శివరామకృష్ణ దెబ్బ గట్టిగా తగిలింది అతడికి.య్‌ నరసింహా! వీణ్ని తీసుకెళ్లి ఊరి బయట పడేయండ్రా!’’ అన్నాడు గట్టిగా, తన అనుచరుడికి చెబుతూ. 

సంతోష్‌ ప్లేబాయ్‌ టైప్‌. రిచ్‌ కిడ్‌. అమ్మా, నాన్నలకు ఒక్కగానొక్క కొడుకు. జాలీగా తిరగడం, ఇష్టమొచ్చినట్లు ఖర్చు పెట్టడం, లైఫ్‌ని ఎంజాయ్‌ చేయడం.. ఇదే అతడి డైలీ రొటీన్‌. లండన్‌లో పుట్టి పెరిగిన సంతోష్, కజిన్‌ పెళ్లి కోసమని వచ్చి సిరి ప్రేమలో పడిపోయాడు. సిరి శివరామకృష్ణకు చెల్లెలు. ఆ అన్నకు ఈ చెల్లే ప్రాణం. ఈ చెల్లెకు ఆ అన్న మాటే వేదం. సిరికి సంతోష్‌ కొత్తగా కనిపించాడు. సంతోష్‌కూ సిరి కొత్తగా కనిపించింది. ఇద్దరివీ వేర్వేరు ప్రపంచాలు. కానీ ప్రేమ ఆ రెండు ప్రపంచాలను కలిపేసింది. సిరి ప్రేమను గెలుచుకోవడంతో సంతోష్‌ కథ అయిపోలేదు. శివరామకృష్ణను కలవాలి. ఆయనను మెప్పించాలి. కానీ పలకరింపుకే ఆయన తన్ని తరిమేశాడు. 

సంతోష్‌ తిరిగొచ్చాడు. శివరామకృష్ణ కోపంతో అతడి మీదకు కత్తి తీశాడు. ఆ ఇంటి మంచి కోరే పెద్ద మనిషి వద్దని వారించాడు. అయినా శివరామకృష్ణ ఆగలేదు. సంతోష్‌ మీదకు వెళ్లి, చొక్కా పట్టుకొని చంపేసేంత కోపంగా చూస్తున్నాడు. ప్లీజ్‌ సార్‌! మమ్మల్ని విడదీయొద్దు సార్‌! మీ చెల్లెలంటే మీకెంత ప్రేమ ఉందో నాకు అంతకంటే ఎక్కువే ఉంది. తనకోసం అమ్మని, నాన్నను అన్నీ వదిలేసుకొని వచ్చా. నా ప్రేమను నిరూపించుకోవడానికి నేనేం చేయాలో చెప్పండి! శివరామకృష్ణను వేడుకున్నాడు సంతోష్‌. 

ష్టారూ! వీడ్ని వెళ్లిపొమ్మని చెప్పండి.శివరామకృష్ణ సంతోష్‌ వైపు చూడకుండా పెద్ద మనిషిని చూస్తూ గట్టిగా అరిచాడు. ఉరి తీసేవాణ్ని కూడా ఆఖరి కోరిక ఏంటని అడుగుతారు. మీరేంటి సార్‌! సంతోష్‌ దీనంగా అడిగాడు. శివరామకృష్ణ మరింత కోపంతో రగిలిపోయాడు. చెయ్యెత్తి కొట్టేలోపు పెద్ద మనిషి పక్కకు లాగాడు. మీ చెల్లెల్ని చూస్తుంటే మీ అమ్మ గుర్తొచ్చింది అన్నావ్‌! వీణ్ని చూస్తుంటే నువ్వు గుర్తొస్తున్నావ్‌రా నాకు.. ఇదే పొలంలో ఇలాగే.. ఇలాగే అడిగావ్‌రా ఒక అవకాశం ఇమ్మని. ఆ అవకాశం నీకు రాబట్టే కదరా నువ్వు నిరూపించుకున్నావ్‌! నీకో న్యాయం.. అతనికో న్యాయమా?పెద్దమనిషి శివరామకృష్ణ మీద కోపంతో అరిచాడు. 

శివరామకృష్ణ సంతోష్‌ను, సిరిని కాసేపు మౌనంగా చూస్తూ నిలబడ్డాడు. మెల్లిగా సిరికి దగ్గరగా వెళ్లి, ఏమ్మా! నీకు కాబోయే భర్త నీకు నచ్చితే చాలా? నాకూ నచ్చాలా? అనడిగాడు. మీకూ నచ్చాలన్నయ్యా’’ అంది సిరి ఏడుస్తూనే! సంతోష్‌ వాళ్లిద్దరికి దగ్గరగా వెళ్లి, వరామకృష్ణకు ఎదురుగా నిలబడి, ‘‘మీకు నచ్చాలంటే నేనేం చెయ్యాలో చెప్పండి?’’ అనడిగాడు. ఏం చెప్పినా చేస్తావా? చేస్తా సార్‌! వ్యవసాయం చెయ్యాలి. నాకున్న పొలంలో ఒక ఎకరం పొలమిస్తా. నేను పండించినన్ని బస్తాలు పండించాలి. పండిస్తావా? పాలు పితకాలి. బర్రెల్ని, గొర్రెల్ని, కోళ్లని పెంచాలి. పెంచుతావా?శివరామకృష్ణ గట్టిగా అరుస్తూ సంతోష్‌కు సవాల్‌ విసిరాడు.

అమ్మా, నాన్నలను వదిలిపెట్టి రావడం కాదు. ఈ ఇంటి పిల్లను చేసుకోవాలంటే, వాళ్లమ్మ చులకన చేసి మాట్లాడిన ఆ రైతు బతుకే ఇతనూ బతకాలి. గెలవాలి. గెలుస్తావా?’’ శివరామకృష్ణ చాలెంజ్‌ విసురుతూనే ఉన్నాడు. సిరి సంతోష్‌ను చూస్తూ బాధతో వద్దన్నట్టు చూసింది. సంతోష్‌ కాసేపు మౌనంగా ఉండిపోయాడు. చుట్టూ అంతా నిశ్శబ్దం. ‘‘గెలుస్తాను సార్‌! మీరు చెప్పినవన్నీ చేస్తాను. మీకంటే ఒక బస్తా ఎక్కువే పండిస్తాను. అప్పుడే కదా.. సిరి మీద మీ ప్రేమ కంటే నా ప్రేమ గొప్పదని తెలుస్తుంది.’’ నిశ్శబ్దాన్ని బద్దలు కొడుతూ సంతోష్‌ మాట్లాడటం మొదలుపెట్టాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement