shivarama krishnan
-
ఒక బస్తా ఎక్కువే పండిస్తా!
రొమాంటిక్ కామెడీ జానర్లో వచ్చిన ఓ సూపర్‌హిట్ సినిమాలోని సన్నివేశాలివి. ఇండియన్ సినిమాలో టాప్ కొరియోగ్రాఫర్‌గా పేరున్న స్టార్.. దర్శకుడిగా మారి చేసిన మొదటి సినిమా ఇది. ఈ సినిమా పేరేంటో చెప్పుకోండి చూద్దాం. మీ చెల్లెలిని ప్రేమించింది నేనే!’’ భయపడుతూనే, ఒక్కో మాటా కూడబలుక్కొని అసలు విషయాన్ని శివరామకృష్ణ ముందు చెప్పేశాడు సంతోష్.శివరామకృష్ణ కోపంగా చూస్తూ నిలబడ్డాడు. నా పేరు సంతోష్..అంటూ ఏదో చెప్పబోతున్న సంతోష్‌ను మధ్యలోనే ఆపేస్తూ, కోపంగా చూసి అక్కణ్నుంచి ముందుకు కదిలాడు శివరామకృష్ణ. సర్.. అసలేం జరిగింది అంటే..శివరామకృష్ణ ఏమీ మాట్లాడకుడా ఇంటివైపుకు నడుస్తూనే ఉన్నాడు. సర్.. మీ చెల్లెలు మంచి అమ్మాయి అండీ.. చాలా మంచమ్మాయి. తనని మీరు చాలా బాగా పెంచారు సార్! మగాళ్ల వైపు కన్నెత్తి కూడా చూడదు.. రియల్లీ..శివరామకృష్ణ అలా నడుస్తూనే ఉన్నాడు. సర్.. నాకే టైమ్ పట్టింది సార్ పడేయడానికి..అంటూ సంతోష్ నోటినుంచి వచ్చిన మాటకు సమాధానంగా, కోపంగా ఒక్క చూపు చూశాడు శివరామకృష్ణ. దే ఇంగ్లిష్‌లో అయితే ఇంకా చాలా బాగా చెప్పేవాణ్ని సర్.. కానీ మీకు ఇంగ్లిష్ రాదుగా.. మా వాళ్లు చేసిన తప్పుకు నేను సారీ చెప్తున్నా సార్’’ సంతోష్ మాట్లాడటం ఆపలేదు. అయ్యిందా? ఇంకేమన్నా ఉందా?వరామకృష్ణ నోరువిప్పాడు. సరిగ్గా చెప్పానో లేదో కానీ, మ్యాటర్ మాత్రం ఇదేనండీ! సరే పదా! అంటూ సంతోష్‌ను ఇంట్లోకి తీసుకెళ్లాడు శివరామకృష్ణ. కొన్ని నిమిషాల్లో గాల్లో ఎగురుతూ వచ్చి బయటపడ్డాడు సంతోష్. శివరామకృష్ణ దెబ్బ గట్టిగా తగిలింది అతడికి.య్ నరసింహా! వీణ్ని తీసుకెళ్లి ఊరి బయట పడేయండ్రా!’’ అన్నాడు గట్టిగా, తన అనుచరుడికి చెబుతూ. సంతోష్ ప్లేబాయ్ టైప్. రిచ్ కిడ్. అమ్మా, నాన్నలకు ఒక్కగానొక్క కొడుకు. జాలీగా తిరగడం, ఇష్టమొచ్చినట్లు ఖర్చు పెట్టడం, లైఫ్‌ని ఎంజాయ్ చేయడం.. ఇదే అతడి డైలీ రొటీన్. లండన్‌లో పుట్టి పెరిగిన సంతోష్, కజిన్ పెళ్లి కోసమని వచ్చి సిరి ప్రేమలో పడిపోయాడు. సిరి శివరామకృష్ణకు చెల్లెలు. ఆ అన్నకు ఈ చెల్లే ప్రాణం. ఈ చెల్లెకు ఆ అన్న మాటే వేదం. సిరికి సంతోష్ కొత్తగా కనిపించాడు. సంతోష్‌కూ సిరి కొత్తగా కనిపించింది. ఇద్దరివీ వేర్వేరు ప్రపంచాలు. కానీ ప్రేమ ఆ రెండు ప్రపంచాలను కలిపేసింది. సిరి ప్రేమను గెలుచుకోవడంతో సంతోష్ కథ అయిపోలేదు. శివరామకృష్ణను కలవాలి. ఆయనను మెప్పించాలి. కానీ పలకరింపుకే ఆయన తన్ని తరిమేశాడు. సంతోష్ తిరిగొచ్చాడు. శివరామకృష్ణ కోపంతో అతడి మీదకు కత్తి తీశాడు. ఆ ఇంటి మంచి కోరే పెద్ద మనిషి వద్దని వారించాడు. అయినా శివరామకృష్ణ ఆగలేదు. సంతోష్ మీదకు వెళ్లి, చొక్కా పట్టుకొని చంపేసేంత కోపంగా చూస్తున్నాడు. ప్లీజ్ సార్! మమ్మల్ని విడదీయొద్దు సార్! మీ చెల్లెలంటే మీకెంత ప్రేమ ఉందో నాకు అంతకంటే ఎక్కువే ఉంది. తనకోసం అమ్మని, నాన్నను అన్నీ వదిలేసుకొని వచ్చా. నా ప్రేమను నిరూపించుకోవడానికి నేనేం చేయాలో చెప్పండి! శివరామకృష్ణను వేడుకున్నాడు సంతోష్. ష్టారూ! వీడ్ని వెళ్లిపొమ్మని చెప్పండి.శివరామకృష్ణ సంతోష్ వైపు చూడకుండా పెద్ద మనిషిని చూస్తూ గట్టిగా అరిచాడు. ఉరి తీసేవాణ్ని కూడా ఆఖరి కోరిక ఏంటని అడుగుతారు. మీరేంటి సార్! సంతోష్ దీనంగా అడిగాడు. శివరామకృష్ణ మరింత కోపంతో రగిలిపోయాడు. చెయ్యెత్తి కొట్టేలోపు పెద్ద మనిషి పక్కకు లాగాడు. మీ చెల్లెల్ని చూస్తుంటే మీ అమ్మ గుర్తొచ్చింది అన్నావ్! వీణ్ని చూస్తుంటే నువ్వు గుర్తొస్తున్నావ్రా నాకు.. ఇదే పొలంలో ఇలాగే.. ఇలాగే అడిగావ్‌రా ఒక అవకాశం ఇమ్మని. ఆ అవకాశం నీకు రాబట్టే కదరా నువ్వు నిరూపించుకున్నావ్! నీకో న్యాయం.. అతనికో న్యాయమా?పెద్దమనిషి శివరామకృష్ణ మీద కోపంతో అరిచాడు. శివరామకృష్ణ సంతోష్‌ను, సిరిని కాసేపు మౌనంగా చూస్తూ నిలబడ్డాడు. మెల్లిగా సిరికి దగ్గరగా వెళ్లి, ఏమ్మా! నీకు కాబోయే భర్త నీకు నచ్చితే చాలా? నాకూ నచ్చాలా? అనడిగాడు. మీకూ నచ్చాలన్నయ్యా’’ అంది సిరి ఏడుస్తూనే! సంతోష్ వాళ్లిద్దరికి దగ్గరగా వెళ్లి, వరామకృష్ణకు ఎదురుగా నిలబడి, ‘‘మీకు నచ్చాలంటే నేనేం చెయ్యాలో చెప్పండి?’’ అనడిగాడు. ఏం చెప్పినా చేస్తావా? చేస్తా సార్! వ్యవసాయం చెయ్యాలి. నాకున్న పొలంలో ఒక ఎకరం పొలమిస్తా. నేను పండించినన్ని బస్తాలు పండించాలి. పండిస్తావా? పాలు పితకాలి. బర్రెల్ని, గొర్రెల్ని, కోళ్లని పెంచాలి. పెంచుతావా?శివరామకృష్ణ గట్టిగా అరుస్తూ సంతోష్‌కు సవాల్ విసిరాడు. అమ్మా, నాన్నలను వదిలిపెట్టి రావడం కాదు. ఈ ఇంటి పిల్లను చేసుకోవాలంటే, వాళ్లమ్మ చులకన చేసి మాట్లాడిన ఆ రైతు బతుకే ఇతనూ బతకాలి. గెలవాలి. గెలుస్తావా?’’ శివరామకృష్ణ చాలెంజ్ విసురుతూనే ఉన్నాడు. సిరి సంతోష్‌ను చూస్తూ బాధతో వద్దన్నట్టు చూసింది. సంతోష్ కాసేపు మౌనంగా ఉండిపోయాడు. చుట్టూ అంతా నిశ్శబ్దం. ‘‘గెలుస్తాను సార్! మీరు చెప్పినవన్నీ చేస్తాను. మీకంటే ఒక బస్తా ఎక్కువే పండిస్తాను. అప్పుడే కదా.. సిరి మీద మీ ప్రేమ కంటే నా ప్రేమ గొప్పదని తెలుస్తుంది.’’ నిశ్శబ్దాన్ని బద్దలు కొడుతూ సంతోష్ మాట్లాడటం మొదలుపెట్టాడు. -
ధాన్యాగారాన్ని ధ్వంసం చేస్తారా?
రాజధాని’లో చంద్రబాబు కూరుకుపోయారు నిపుణుల కమిటీ చైర్మన్ శివరామకృష్ణన్ విమర్శ వీజీటీఎం ప్రాంతం ఆంధ్రప్రదేశ్ ధాన్యాగారం.. దేశంలోనే ముఖ్యమైన ధాన్యాగారాల్లో ఒకటి సారవంతమైన పంట భూముల జోలికి వెళ్లరాదని రాజధానిపై నిపుణుల కమిటీ స్పష్టంచేసింది రెండు, మూడు పంటలు పండే 30 వేల ఎకరాలను రాజధాని కోసం తీసుకోవటం దురదృష్టకరం కొత్త రాజధాని నగరంలో ఐదేళ్లలోనే నగరాన్ని, సదుపాయాలను నిర్మిస్తామనటం అతిశయోక్తి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏపీ మొత్తం సమతుల అభివృద్ధిపై చంద్రబాబు దృష్టి పెట్టాల్సి ఉంది ఇప్పటికైనా బాబు పునరాలోచించుకోవాలి:‘ద హిందూ’లో రాజధానిపై నిపుణుల కమిటీ చైర్మన్ వ్యాసం సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌కు ధాన్యాగారంగా పరిగణించే ప్రాంతంలో వేల ఎకరాల భూములను రాజధాని నిర్మాణం కోసం రైతుల నుంచి తీసేసుకోవడం.. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హ్రస్వదృష్టికి నిదర్శనమని.. ఏపీ రాజధానిపై నిపుణుల కమిటీకి నేతృత్వం వహించిన కె.సి.శివరామకృష్ణన్ తప్పుపట్టారు. విభజన తర్వాత కొత్త రాష్ట్రం ఎదుర్కొంటున్న అనేక విస్తృత సవాళ్లపై దృష్టిసారించాల్సి ఉండగా.. చంద్రబాబు కేవలం రాజధాని నిర్మాణం అంశంలోనే కూరుకుపోతున్నారని ఆయన విమర్శించారు. సాధ్యమైనంత వరకూ సారవంతమైన, పంట భూముల జోలికి వెళ్లరాదని రాజధానిపై నిపుణుల కమిటీ తన నివేదికలో విస్పష్టంగా పేర్కొన్నప్పటికీ.. చంద్రబాబు దానిని విస్మరించి ఏడాదికి రెండు, మూడు పంటలు పండే వేలాది ఎకరాలను రాజధాని కోసం సేకరించబూనటం దురదృష్టకరమని అభివర్ణించారు. శివరామకృష్ణన్ జాతీయ ఆంగ్ల దినపత్రిక ‘ద హిందు’లో సోమవారం రాసిన ఒక వ్యాసంలో ఈ విమర్శలు చేశారు. వ్యాసంలోని ముఖ్యాంశాలివీ... విజయవాడ - గుంటూరు - తెనాలి - మంగళగిరి (వీజీటీఎం) ప్రాంతం ఆంధ్రప్రదేశ్‌కు ధాన్యాగారం. మొత్తం భారతదేశంలోనే అతి ముఖ్యమైన ధాన్యాగారాల్లో ఒకటి. తుళ్లూరు, తాడేపల్లి, మంగళగిరి మండలాల్లో ఏటా రెండు పంటలు, మూడు పంటలు పండే 30,000 ఎకరాలకు పైగా పంట భూములను రాజధాని కోసం తీసేసుకోవటం.. హ్రస్వ దృష్టికి నిదర్శనం. ఈ చర్య ఫలితంగా తాత్కాలిక ఆర్థిక లబ్ధి కోసం రైతులు భూనిర్వాసితులవుతారు. భూగర్భ నీటిమట్టం అధికంగా గల ప్రాంతంలో నేలను గట్టిపరచటం, రహదారులు, మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయటానికి, నిర్మించటానికి చాలా సమయం పడుతుంది. స్వాతంత్య్రం తర్వాత దేశంలో నిర్మించిన గాంధీనగర్, చండీగడ్, భువనేశ్వర్, ఉక్కునగరాలైన బొకారో దుర్గాపూర్, రూర్కెలా తదితర దాదాపు 100 కొత్త పట్టణాలకు.. కనీస మౌలిక సదుపాయాల నిర్మాణానికే ఏడెనిమిదేళ్లు పట్టింది. ఏపీలో ఇవన్నీ ఐదేళ్ల కాల వ్యవధిలో చేయవచ్చన్నది పూర్తి అతిశయోక్తి. ఆంధ్రప్రదేశ్ రాజధాని మాస్టర్ ప్లాన్‌పై పనిచేస్తున్న సింగపూర్ కంపెనీలు.. రాజధాని ప్రాంతానికి వెలుపల, వీజీటీఎం ప్రాంతం లోపల 3,000 ఎకరాల భూమి కావాలని అడుగుతున్నట్లు చెప్తున్నారు. అదే జరిగితే సింగపూర్ కోటాలోకి వెళ్లే భూమి వ్యవసాయ భూమి. రాష్ట్ర రాజధాని, మౌలిక సదుపాయాల నిర్మాణానికి అవసరమైన పెట్టుబడులను అంతర్జాతీయంగా సమీకరించుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే.. ఈ విషయంలో ఏపీకి తాము అందించగల సాయంపై పరిమితులను కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే సూచనప్రాయంగా తెలిపింది. చిత్తూరు, తిరుపతిల్లో ప్రధానంగా ప్రయివేటు రంగ సంస్థల సాయంతో కొన్ని వైద్య, విద్యా సంస్థల ఏర్పాటు మొదలవుతుండటం ఆహ్వానించదగ్గ విషయం. అయితే.. రాయలసీమ సామర్థ్యానికి సంబంధించిన ప్రస్తావన లేకపోవటం దురదృష్టకరం. ఆర్థిక రాజధాని కూడా వీజీటీఎం ప్రాంతానికి బదిలీ అవుతుందన్న విషయం తెలుస్తోంది. దీనిపై నిరసనలు వెల్లువెత్తుతాయనేది ఖచ్చితం. ఏపీ సీఎంగా సమతుల్యమైన అభివృద్ధిపై దృష్టిసారించాల్సి ఉందని, కేవలం వీజీటీఎం ప్రాంతం అభివృద్ధి గురించి మాత్రమే కాదని నిపుణుల కమిటీ పదేపదే చెప్పింది. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా పంచుకోవటానికి పదేళ్ల సమయం ఇచ్చింది. చంద్రబాబు పునరాలోచించుకోవటానికి ఇంకా సమయముంది. 'రాజధాని ప్రాజెక్టు వల్ల నేరుగా ప్రభావితమయ్యే వారే కాకుండా.. ఈ ప్రాంతంలో ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ సొంత వ్యవసాయ భూమి లేని, ఆదాయం లేని లక్షలాది కుటుంబాలు ఉన్నాయి. ఈ కుటుంబాల భద్రతకు, సంక్షేమానికి భరోసా ఇవ్వటం ఆచరణాత్మకంగా అసాధ్యం' 'ఏపీ ఎదుటనున్న అతి తీవ్రమైన సవాలు.. ఏటా మూడు లక్షల ఉద్యోగాలను సృష్టించటమని నిపుణుల కమిటీ పదే పదే స్పష్టంగా చెప్పింది. కానీ ఈ ఉద్యోగాలేవీ కనిపించటం లేదు. ఇటీవలి తుపానులతో దెబ్బతిన్న పట్టణాలను పునర్మించాల్సి ఉంది. హైకోర్టు వంటి ముఖ్యమైన సంస్థలను రాష్ట్రంలో నిపుణుల కమిటీ సూచించిన విధంగా ఏర్పాటు చేయాల్సి ఉంది.' -
దద్దరిల్లిన ఏపీ శాసనసభ
-
రాజధానిపై ప్రకటనే...చర్చలేదు!
-
రాజధానిపై చర్చ చేపట్టాల్సిందే: వైఎస్సార్సీపీ
దద్దరిల్లిన ఏపీ శాసనసభ సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని వ్యవహారంపై బుధవారం అసెంబ్లీ దద్దరిల్లింది. అధికార, ప్రతిపక్ష సభ్యుల పరస్పర ఆరోపణ లు, వాగ్వాదాల మధ్య సభ గురువారానికి వా యిదాపడింది. రాజధానిపై సభలో చర్చించకుం డా ప్రకటన ఎలా చేస్తారని ప్రతిపక్షం నిలదీయ గా.. ప్రకటన చేసిన తర్వాత చర్చించవచ్చంటూ అధికారపక్షం ఎదురుదాడికి దిగింది. ఈ రెండిం టిలో ఏ పద్ధతినైనా అనుసరించవచ్చని స్పీకర్ చెప్పారు. వైఎస్సార్సీపీ సభ్యులు స్పీకర్ పోడియంను చుట్టుముట్టి శివరామకృష్ణన్ నివేదికపై తక్షణమే చర్చించాలని డిమాండ్ చేశారు. సభా సంప్రదాయాలు తెలియకుండా విపక్షం సభా కార్యకలాపాలను అడ్డుకుంటోందని అధికారపక్షం ధ్వజమెత్తింది. ఈ దశలో సభ ఉదయం 10.57 గంటలకు తొలిసారి వాయిదాపడింది. 11.55 గంటల ప్రాంతంలో సభ తిరిగి ప్రారంభమైనప్పటికీ రాజధానిపై రభస కొనసాగడంతో స్పీకర్ సభను గురువారానికి వాయిదా వేశారు. రాజధానిపై చర్చకు పట్టు బుధవారం ప్రశ్నోత్తరాల సమయం ముగిశాక సీఎం తరఫున మంత్రులు అచ్చెన్నాయుడు, సిద్ధా రాఘవరావులు పబ్లిక్ అకౌంట్స్, అంచనాల, ప్రభుత్వ రంగ సంస్థల, దక్షిణ మధ్య రైల్వే జెడ్ఆర్యూసీసీలకు సభ్యుల ఎంపికకు ప్రతిపాదనలు చేశారు. అనంతరం బడ్జెట్‌పై చర్చకు స్పీకర్ ఉపక్రమిస్తుండగా.. రాజధాని విషయమై చర్చించాలని వైసీపీ సభ్యులు కోరారు. దీనికి స్పీకర్ వైపు నుంచి సానుకూలత వ్యక్తం కాకపోవడంతో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి జోక్యం చేసుకున్నారు. రాష్ట్ర రాజధానిపై తామిచ్చిన 344 తీర్మానాన్ని ప్రస్తావించారు. ‘‘అధ్యక్షా! నిన్న మేము రాజధానిపై 344 తీర్మానం ఇ చ్చాం. రాజధానిపై చంద్రబాబు ఏవేవో ప్రకటనలు చేస్తారని వివిధ పేపర్లలో చదివాం. అష్టమీ, నవమీ అంటున్నారు.. దశమికి ప్రకటన చేస్తారంటున్నారు. కేంద్రం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ నివేదికపై చర్చించకుండా ప్రకటన చేస్తానని బాబు నోటి నుంచే వింటున్నాం. చర్చ జరుపుతారా? జరపరా? అసలింతకీ ఆ కమిటీ నివేదిక ఇస్తారా? ఇవ్వరా? మాకేమీ అర్థం కాకుండా ఉంది. వారంతట వారే ప్రకటన చేసేస్తానంటే ఈ సభ ఎందుకు? మేమిచ్చిన 344 తీర్మానంపై ఎప్పుడు చర్చ పెడతారో స్పష్టంగా చెప్పమనండి’’ అని అన్నారు. దీనికి మంత్రి అచ్చెన్నాయుడు సమాధానమిస్తూ.. శివరామకృష్ణన్ కమిటీ నివేదికను రేపు (గురువా రం) సభలో ప్రవేశపెడతామన్నారు. ఈ దశలో జగన్మోహన్రెడ్డికి, స్పీకర్‌కు మధ్య జరిగిన సంభాషణ ఇలా ఉంది.. జగన్: దశమికి ప్రకటన చేస్తామని కూడా చెబుతున్నారు. చర్చకు ఎంత సమయం ఇస్తారో చెప్పి ముహూర్తం పెట్టండి. చర్చ జరగకుండానే మీరు ప్రకటనలు సిద్ధం చేసుకుంటున్నారు. ఎప్పుడు చర్చ పెడతారు? ఎన్ని రోజులు కేటాయిస్తారో చెప్పమనండి. స్పీకర్: సభలో ప్రకటన చేస్తారనేది ప్రతిపాదనే. సమయం ఎంత కావాలన్నా కేటాయిస్తారు. జగన్: చంద్రబాబునాయుడు ప్రకటన చేసిన తర్వాత చర్చకు అర్థమేముంది అధ్యక్షా..! చర్చ జరగకుండానే ప్రకటనేమిటి? స్పీకర్: సభలోని ఎజెండాపై మాట్లాడాలే తప్ప దాన్ని ఖరారు చేయవద్దు... నిర్దేశించేందుకు ప్రయత్నించవద్దు. ఊహాగానాలు చేయవద్దు. అధికార పక్షం ఎదురుదాడి.. మంత్రి అచ్చెన్నాయుడు జోక్యం చేసుకొని.. ప్రతిపక్ష నేత సభా నియమాలు తెలుసుకుని మాట్లాడాలన్నారు. సభా సమయాన్ని వృథా చేయొద్దని ఎదురుదాడికి దిగారు. చంద్రబాబు ప్రకటన చేస్తారని, ఆ తర్వాత ప్రతిపక్ష పార్టీ సలహాలు ఇవ్వొచ్చని చెప్పారు. సభా గౌరవాన్ని పెంచేలా వ్యవహరించాలే తప్ప తగ్గించవద్దని అన్నారు. మంత్రి వ్యాఖ్యలపై వైఎస్సార్ సీపీ సభ్యులు తీవ్ర నిరసన వ్యక్తంచేశారు. సభ మధ్యలోకి దూసుకెళ్లి నిరసన తెలుపుతూ రాజధానిపై చర్చకు పట్టుబట్టారు. సభా సంప్రదాయాలు తెలియనిదెవరికో చెప్పాలని నిలదీశారు. రెండు పద్ధతులూ అనుసరణీయమే.. దీంతో స్పీకర్ రూలింగ్ ఇచ్చారు. ‘‘చర్చ తర్వాత ప్రకటన చేయవచ్చు. ప్రకటన తర్వాతా చర్చ చేపట్టవచ్చు. ఈ రెండు పద్ధతులూ అనుసరణీయం, ఆమోదయోగ్యనీయమే. మీరు (విప క్షం) మీ సలహాలు చెప్పవచ్చు. సభను అడ్డుకోవద్దు. సజావుగా సాగనీయండి’ అని చెప్పారు. సభను స్తంభింపజేయడం వల్ల విపక్షమే సమయాన్ని కోల్పోతుందని అన్నారు. దీనికి విపక్ష సభ్యులు అభ్యంతరం వ్యక్తంచేస్తూ.. రాజధానిపై ప్రకటనకు ముందే సభలో చర్చ జరగాలని అన్నారు. తమ నాయకునికి మాట్లాడే అవకాశమివ్వాలని కోరారు. దీనికి స్పీకర్ అనుమతిస్తూ జగన్‌ను మాట్లాడాల్సిందిగా కోరారు. ఆవేళ కూడా చర్చ, ఓటింగ్ తర్వాతే నిర్ణయం: జగన్ ‘‘1953 జూలై 1న ఈ పరిస్థితుల మధ్యనే రాజధానిపై చర్చ జరిగింది. ఆంధ్రప్రదేశ్ శాసన సభ్యులే ఈ వ్యవహారమై (రాజధానిపై) నిర్ణయించుకుని భారత ప్రభుత్వానికి తెలియజేయాలని నాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ప్రకటించారు. దానికనుగుణంగా ఐదు రోజులపాటు వివిధ పార్టీలు సభలో సుదీర్ఘ చర్చ జరిపాయి. చివరకు ఓటింగ్ కూడా తీసుకున్నారు. ఆ తర్వాతనే రాజధానిపై నిర్ణయం తీసుకున్నారు. దయచేసి గుర్తుపెట్టుకోండి. అప్పట్లో కూడా చర్చ, ఓటింగ్ జరిగాయి. ఇది గతం. ఇప్పుడు కూడా చర్చ తర్వాతనే ప్రకటన రావాలి. ఆ తర్వాత ఓటింగ్, ఆపైన తీర్మానం జరగాలి’’ అని జగన్మోహన్రెడ్డి స్పష్టంచేశారు. చర్చ, ఓటింగ్ లేకుండా మీ ఇష్టం వచ్చినట్టు చేస్తే అసెంబ్లీ ఎందుకు అని జగన్ ప్రశ్నించారు. ఏ ప్రకటన చేస్తామో తెలుసుకోరా? దీనిపై మంత్రులు అచ్చెన్నాయుడు, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, ఎమ్మెల్యేలు ధూళిపాళ్ల నరేంద్ర, గోరంట్ల బుచ్చయ్యచౌదరి ఎదురుదాడికి దిగారు. చర్చ కావాలనుకుంటే ప్రభుత్వం సిద్ధమేనన్నారు. విపక్షం వాదన అనుభవరాహిత్యానికి నిదర్శనమని, చంద్రబాబు ఏమి ప్రకటన చేస్తారో తెలుసుకోకుండానే రాద్ధాంతం చేస్తున్నారని విరుచుకుపడ్డారు. దీనికి వైఎస్సా ర్సీపీ సభ్యులు తీవ్ర అభ్యంతరం చెప్పారు. తాము అడిగేదానికి సమాధానం చెప్పలేక అధికారపక్షం ఎదురుదాడికి దిగడం విచారకరమన్నారు. ప్రకటన చేసిన తర్వాత చర్చ ఏముంటుందని ప్రశ్నించారు. చర్చ కోసం పట్టుబడుతూ నినాదాలు చేశారు. దానికి ప్రతిగా అధికారపక్ష సభ్యులు కూడా కేకలు వేయడంతో సభలో ఏమి జరుగుతోందో అర్థం కాకుండా పోయింది. దీంతో స్పీకర్ సభను 10.57 గంటల సమయంలో పది నిమిషాలు వాయిదా వేశారు. ఆతర్వాత సభ తిరిగి 11.55 గంటలకు ప్రారంభమైంది. అప్పుడూ ఇదే పరిస్థితి కొనసాగింది. గొడవ సద్దుమణగకపోవడంతో 13 నిమిషాల తర్వాత స్పీకర్ సభను గురువారానికి వాయిదా వేశారు. -
కమిట్ అయ్యి.. కంటితుడుపా?
సాక్షి ప్రతినిధి, అనంతపురం : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ఏర్పాటు ఎక్కడన్న నిర్ణయం ముందే జరిగిపోయిందా? మిగిలిన ప్రాంతాల నుంచి విమర్శలు రాకుండా ఉండేందుకే శివరామకృష్ణన్ కమిటీ జిల్లాల్లో పర్యటిస్తోందా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం రాజకీయ వర్గాలు, మేధావుల నుంచి వస్తోంది. వివరాల్లోకి వెళితే.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సహా కోస్తా జిల్లాల మంత్రులు గుంటూరు-విజయవాడ మధ్య రాజధాని నిర్ణయం జరిగిపోయినట్లు ఇప్పటికే వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు తన ప్రమాణ స్వీకారం కోసం ఆ ప్రాంతాన్ని ఎన్నుకున్నది మొదలు.. నెల రోజుల వ్యవధిలో జరిగిన అనేక పరిణామాలు ఇప్పటికే రాజధాని ఏర్పాటు విషయంలో ఒక నిర్ణయం జరిగింపోయిందన్న తీరుగానే ఉన్నాయి. కొత్త రాజధాని ఏర్పాటుకు ఏ ప్రాంతమయితే అనుకూలంగా ఉంటుందో పరిశీలించేందుకు కేంద్రం ఏర్పాటు చేసిన శివరామకృష్ణన్ నేతృత్వంలోని నిపుణుల కమిటి మొదట గుంటూరు, మంగళగిరి, విజయవాడ, విశాఖ తదితర ప్రాంతాల్లో పర్యటించింది. కమిటీ ఒక నిర్ధారణకు రాక ముందే స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబే రాజధాని గుంటూరు-విజయవాడ మధ్య ఉంటుందని మీడియా ముందే పేర్కొన్నారు. ఈ ప్రకటన వెలువడ్డాక రాష్ట్రంలో ఇతర ప్రాంతాల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. రాజధాని నిర్మాణానికి సంబంధించి కేంద్రం నియమించిన నిపుణుల కమిటీ తన నివేదిక ఇవ్వక ముందే ముఖ్యమంత్రి గుంటూరు-విజయవాడల మధ్య రాజధాని అని ఎలా అంటారని విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో శివరామకృష్ణన్ కమిటీ రాయలసీమ జిల్లాల్లో పర్యటిస్తోంది. ఈ పరిణామాలన్నీ పరిశీలిస్తే... రాజధాని ఏర్పాటు నిర్ణయం ఇప్పటికే జరిగిపోయిందని, కాకపోతే ఇతర ప్రాంతాల నుంచి విమర్శలు రాకుండా ఉండేందుకే ఇపుడు రాయలసీమ జిల్లాల్లో పర్యటిస్తోందన్న అభిప్రాయం రాజకీయ, ఉద్యోగ, మేధావి వర్గాల నుంచి వ్యక్తమవుతోంది. భాషాప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అవతరించినప్పటి నుంచీ కోస్తా నాయకుల వంచనకు రాయలసీమ గురవుతూనే ఉంది. సీమ చేలను బీళ్లు చేసి కృష్ణా జలాలను మూడోపంట సాగుకు కూడా కోస్తా జిల్లాల వారు తరలించుకు పోయారు. కర్నూలు రాజధాని మూన్నాళ్ల ముచ్చటే అయింది. అప్పట్లో జిల్లాకు చెందిన పప్పూరి రామాచార్యులు లాంటి మేధావులు సీమకు జరగనున్న అన్యాయం గురించి హెచ్చరించారు. అయినా ‘విశాలాంధ్ర’ పూనకంతో సీమ నాయకులు ఆరోజు మోసపోయారు. అప్పటికే ఏర్పాటైన రాజధానిని త్యాగం చేశారు. ఇప్పుడు మళ్లీ రాజధాని విషయంలో సీమ జిల్లాకే చెందిన ‘పసుపు నేత’ వంచనకు పాల్పడుతున్నాడన్న విమర్శలు జిల్లా వ్యాప్తంగా వినిపిస్తున్నాయి. దేవినేనికున్న తెగువ జిల్లా మంత్రులకు లేదా..? దేవినేని ఉమ..13 జిల్లాల నవ్యాంధ్రప్రదేశ్‌కు నీటి పారుదల శాఖా మంత్రి. తాను విజయవాడ కేంద్రంగానే తన శాఖ సమీక్షలు, కార్యక్రమాలు నిర్వహిస్తానని ప్రకటించారు. అలాగే చేస్తున్నారు. ఇప్పటికింకా రాజధాని ఎక్కడన్నది ఖరారు కాలేదు. రాష్ట్ర విభజన సందర్భంగా కొత్త రాజధాని ఏర్పాటు అయ్యేవరకూ హైదరాబాదే ఉమ్మడి రాజధానిగా ఉంటుందని కేంద్రం పేర్కొంది. అలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర మంత్రి తన కార్యకలాపాలను విజయవాడ నుంచే కొనసాగిస్తానని ఘంటాపథంగా చెప్పారు. అదే పని జిల్లా మంత్రులైన పరిటాల సునీత, పల్లె రఘనాథ రెడ్డిలు ఎందుకు చేయలేకపోతున్నారన్న ప్రశ్న జిల్లా వ్యాప్తంగా వినిపిస్తోంది. జిల్లా మంత్రులు కూడా తమ కార్యక్షేత్రాన్ని అనంతపురం నుంచో కర్నూలు నుంచో కొనసాగించేందుకు పూనుకుంటే ఆ మేరకు రాష్ట్ర రాజధాని ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయటంపై ఒత్తిడి పెరుగుతుంది. ఆ పని చేసే తెగువ మన జిల్లా మంత్రులకు ఉందా అన్న ప్రశ్నకు ఇకపై వారి ఆచరణే సమాధానం కావాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు.