
విద్యాబాలన్–ఇలియానా–ప్రతీక్ గాంధీ–సెంథిల్ రామమూర్తి... ఈ నలుగురూ కలసి నవ్వించడానికి... ఏడిపించడానికి రెడీ అయ్యారు. వీరి కాంబినేషన్‌లో రూపొందనున్న సినిమా అధికారిక ప్రకటన గురువారం వెల్లడైంది. దర్శకురాలు శీర్షా గుహ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఈ సినిమా గురించి విద్యాబాలన్ మాట్లాడుతూ – ‘‘ఆధునిక మానవ సంబంధాల చుట్టూ ఈ సినిమా ఉంటుంది.
ఇది మీ కథలా అనిపించొచ్చు.. లేకపోతే మీ ప్రెండ్ కథలానూ అనిపించొచ్చు. మొత్తం మీద మనలో ఒకరి కథ. సినిమా ఎంత నవ్విస్తుందో అంతే సమానంగా ఏడిపిస్తుంది కూడా’’ అన్నారు. ‘‘ఈ కథలో నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే... ఇది అందరి కథ. ప్రపంచం మొత్తానికి చెందిన కథ. ఎలాంటి యాక్టర్లతో సినిమా చేయాలని కల కన్నానో వాళ్లతోనే ఈ సినిమా చేస్తున్నాను’’ అని శీర్షా అన్నారు. త్వరలో ఈ సినిమా టైటిల్ ప్రకటించనున్నారు. వచ్చే ఏడాది చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment