Ileana Shares Baby Bump Pics Of Her Ninth Month Goes Viral On Social Media - Sakshi
Sakshi News home page

Ileana 9th Month Baby Bump Photos: నిండు గర్భంతో పోకిరీ భామ.. బేబీ బంప్‌ ఫోటో వైరల్!

Published Thu, Jul 27 2023 4:23 PM | Last Updated on Thu, Jul 27 2023 4:48 PM

Ileana Shares Baby Bump Pics Of Her Ninth Month Goes VIral - Sakshi

పోకిరీ భామ ఇలియానా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మహేశ్ బాబు సరసన 'పోకిరి' సినిమాతో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ అయిపోయింది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కి వెళ‍్లింది. ప్రస్తుతం సినిమాలతో పాటు వెబ్ సిరీసులు కూడా చేస్తోంది. అయితే పెళ్లి కాకుండానే అందరికీ షాకిచ్చింది భామ. ప్రెగ్నెన్సీతో ఉన్నట్లు ప్రకటించి ఊహించని విధంగా ఏకంగా బేబీ బంప్ ఫోటోలను షేర్ చేసింది.  

(ఇది చదవండి: ఫ్రెండ్ పార్టీలో చిల్ అవుతోన్న టాలీవుడ్ హీరోయిన్.. ఏకంగా మందు కొడుతూ!)

అయితే ఆమె  ఇటీవలే తన బాయ్‌ ఫ్రెండ్‌ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది.  ప్రస్తుతం తొమ్మిది నెల గర్భంతో ఉన్న ఇలియానా లేటెస్ట్ బేబీ బంప్ పిక్‌ను పంచుకుంది. ప్రస్తుతం ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇలియానా తన ఇన్‌స్టాలో రాస్తూ.. ' మై లిటిల్'  అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది. 

తెలుగులో స్టార్ హీరోయిన్‌గా నటించిన ఇలియానాకు.. కానీ తర్వాత కాలంలో సరైన సినిమాలు చేయకపోవడం ఈమె కెరీర్‌కు మైనస్ అయిపోయింది. దీనికి తోడు ఆమె ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టకపోవడం కూడా ఓ రకంగా అవకాశాలు తగ్గిపోవడానికి కారణం అని చెప్పొచ్చు. గతేడాది కాస్త సన్నబడినప్పటికీ పెద్దగా ఛాన్సులు అయితే రాలేదు. 

ఇదిలా ఉండగా.. ప్రెగ్నెన్సీ ప్రకటించి సినిమాలకు విరామం తీసుకుంది. బాలీవుడ్‌లోనూ  'బర్ఫీ', 'పటా పోస్టర్ నిఖలా హీరో', 'మెయిన్ తెరా హీరో', 'రుస్తుం' లాంటీ సినిమాల్లో నటించి మంచి హిట్‌లు అందుకుంది.  అయితే ‘రుస్తుం’,‘బాద్‌షాహో’ ‘రైడ్’, ‘ముబారకన్’ వంటి కథ ప్రాధాన్యమున్న చిత్రాల్లో నటించినా... ఇలియానాకు బీటౌన్‌లో సరైన బ్రేక్ లభించలేదు. చివరగా ఇలియానా తెలుగులో రవితేజ హీరోగా తెరకెక్కిన ‘అమర్ అక్బర్ ఆంటోని’ మూవీలో నటించింది.

(ఇది చదవండి: మరింత ముదురుతోన్న ఆష్విట్జ్ వివాదం.. ఆ సినిమాను తొలగించాలంటూ డిమాండ్!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement