Ileana D'cruz Welcomes Baby Boy Shares Picture On Instagram; Pic Viral - Sakshi
Sakshi News home page

Ileana: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ఇలియానా.. రాయలేని భాషలో కామెంట్లు

Published Sun, Aug 6 2023 7:13 AM | Last Updated on Sun, Aug 6 2023 12:15 PM

Ileana Welcomes A Baby Boy Introduces Her Son - Sakshi

పండంటి బిడ్డకు జన్మనిచ్చి నటి ఇలియానా అమ్మ అయ్యారు . ఆగస్టు 1న మగ బిడ్డకు జన్మనిచ్చినట్లు సోషల్‌ మీడియా వేదికగా ఇలియానా తెలిపారు. తన చిన్నారి ఫొటోను షేర్‌ చేస్తూ ఆనందాన్ని ఇలా పంచుకున్నారు. 'ఈ ప్రపంచంలోకి మా ప్రియమైన అబ్బాయి ‘కోవా ఫీనిక్స్ డోలన్‌’ని పరిచయం చేస్తున్నాను. ఇది ఎంత సంతోషంగా ఉందో మాటల్లో వర్ణించలేను.  మా హృదయాలను దాటి ప్రపంచానికి ఇలా పరిచయం చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. దీనిని మాటల్లో చెప్పలేం.' అని ఇలియానా తెలిపారు. దీంతో ఆమెకు పలువురు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

(ఇదీ చదవండి: క్లీంకార గురించి చిరంజీవి చెప్పిందే నిజం అయిందా.. కలిసొచ్చిన వేల కోట్లు)

తాను తల్లి కాబోతున్నట్లు ఇదే ఏడాదిలో ప్రకటించిన ఇలియానా తన ప్రియుడి వివరాలను చాలా గోప్యంగా ఉంచి.. జులైలో ప్రియుడి ఫొటోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. కానీ ఆతని వివరాలు,పేరు ఇప్పటికి వెల్లడించలేదు. దీంతో ఆమెపై నెటిజన్లు ఫైర్‌ అవుతున్నారు. తండ్రి వివరాలు బయటి ప్రపంచానికి చెప్పుకోలేని స్థితిలో ఎలా ఉన్నారని సోషల్‌మీడియా ద్వారా పలువురు కామెంట్లు పెడుతున్నారు.  

కనీసం ప్రియుడితో పెళ్లి అయినా అయిందా..? అంటూ కామెంట్లు చేస్తున్నారు. భర్త వివరాలు ఇంత రహస్యంగా ఎందుకు ఉంచారంటూ ఏకంగా అతనేమైనా టెర్రరిస్టా..? అని ప్రశ్నిస్తున్నారు. మరికొందరైతే రాయలేని భాష ఉపయోగిస్తు ఇలియానపై మండిపడుతున్నారు. ఇప్పటికైనా ఆమె స్పందిస్తే మంచిదని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.

దేవదాసు సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన గోవా బ్యూటీ ఇలియానా. తొలి సినిమాతోనే గుర్తింపు పొందిన ఈమె ఆ తర్వాత పోకిరి సినిమాతో యూత్‌ క్రష్‌గా మారింది. కెరీర్‌ ఆరంభించిన అతి తక్కువ కాలంలోనే స్టార్‌ హీరోయిన్‌గా చక్రం తిప్పింది. స్టార్‌ హీరోలతో పాటు యంగ్‌స్టర్స్‌తోనూ జతకట్టిన ఈ భామ ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ టాలీవుడ్‌కు ఫుల్‌స్టాప్‌ పెట్టేసి బాలీవుడ్‌కు మకాం మారింది. అయితే తెలుగుతో పోలిస్తే అక్కడ ఆశించిన స్థాయిలో సక్సెస్‌ సాధించలేదు. దీంతో కొంతకాలం సినిమాలకు బ్రేక్‌ ఇచ్చింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement