Ileana D'Cruz Secretly Married Michael Dolan On May 13, 2023: Report - Sakshi
Sakshi News home page

Ileana DCruz: ముందు ప్రెగ్నెన్సీ.. ఆ తర్వాత సీక్రెట్‌గా పెళ్లి..!

Published Sun, Aug 6 2023 3:26 PM | Last Updated on Sun, Aug 6 2023 3:46 PM

Ileana DCruz Secretly Got Married In May 2023 - Sakshi

ప్రస్తుతం పోకిరీ భామ ఇలియానా పేరు నెట్టింట మార్మోగిపోతోంది. గతంలో పెళ్లి కాకుండానే ప్రెగ్నెన్సీ ధరించినట్లు ప్రకటించి షాక్‌ ఇచ్చిన భామ.. తాజాగా బిడ్డకు జన్మనిచ్చినట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. అంతే కాకుండా బిడ్డ పేరును సైతం రివీల్ చేసింది. దీంతో ఇలియానా భర్త పేరుపై చర్చ మొదలైంది. ఇంతకీ ఈ ముద్దుగుమ్మ అతన్ని పెళ్లి చేసుకుందా? అని ఆరా తీస్తున్నారు. ఇంతకుముందే తన భర్త ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్న భామ.. అతని పేరు, ఎవరనేది ఇంతవరకు ఎక్కడా వెల్లడించలేదు.

(ఇది చదవండి: నటి ఖుష్బూ కూతురును చూశారా..ఎంత అందంగా ఉందో)

తాజాగా తన  బిడ్డకు కోయా ఫోనిక్స్ డోలన్‌ అనే పేరు పెట్టింది. దీన్ని పెట్టిన పేరును పరిశీలిస్తే ఇలియానా భర్త పేరు మైఖేల్ డోలన్ అని తెలుస్తోంది. అతనితో దాదాపు ఏడాది పాటు డేటింగ్‌లో ఉన్న ముద్దుగుమ్మ.. ఈ ఏడాది మే 13 న  రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందని సమాచారం.  ఇలియానా గర్భం ధరించినట్లు సోషల్ మీడియాలో ప్రకటించడానికి ఒక నెల ముందు పెళ్లి జరిగినట్లు తెలుస్తోంది. 

అయితే పెళ్లి గురించి ఇప్పటివరకు ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. అయితే ఇలియానా భర్త మైఖేల్ గురించి పూర్తి వివరాలు తెలియరాలేదు. కాగా.. గతంలో కత్రినా కైఫ్ సోదరుడు సెబాస్టియన్‌తో రిలేషన్‌షిప్‌లో ఉందని రూమర్స్ వచ్చిన సంగతి తెలిసిందే. కాగా.. గర్భం ధరించాక పలుసార్లు సోషల్ మీడియాలో అప్‌డేట్స్‌ ఇస్తూ వచ్చింది. అదే సమయంలో భర్త ఫోటోలను సైతం రివీల్ చేసింది.

(ఇది చదవండి: చేయి ఆడించడం, ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగా: నటి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement