Ileana D'Cruz Reveals Her Boyfriend's Photo Goes Viral - Sakshi
Sakshi News home page

Ileana DCruz: పెళ్లి కాకుండానే ప్రెగ్నెన్సీ.. బాయ్‌ఫ్రెండ్‌ను పరిచయం చేసిన ఇలియానా!

Published Mon, Jul 17 2023 10:15 AM | Last Updated on Mon, Jul 17 2023 10:54 AM

Ileana DCruz Reveals Her Boy Friend Photo Goes Viral - Sakshi

పోకిరీ భామ ఇలియానా గురించి టాలీవుడ్‌కు పరిచయం చేయాల్సిన పనిలేదు. దేవదాస్ చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ పోకిరీ మూవీ గుర్తింపు తెచ్చుకుంది. ఆ సినిమా బ్లాక్ బస్టర్‌గా నిలవడంతో ముద్దుగుమ్మకు అవకాశాలు అంతేస్థాయిలో వెతుక్కుంటూ వచ్చాయి. అయితే ప్రస్తుతం ప్రెగ్నెన్సీతో ఉన్న ఇలియానా ఇప్పటి వరకు ఆమె భాయ్‌ఫ్రెండ్‌ ఎవరో బయటపెట్టలేదు. ఇటీవల ఇన్‌స్టాలో కొన్ని ఫోటోలు షేర్ చేసినప్పటికీ వాటితో ఎలాంటి స్పష్టత రాలేదు. అంతేకాకుండా ఇలియానా పెళ్లి కాకుండానే ప్రెగ్నెన్సీ ప్రకటించి అభిమానులకు షాకిచ్చింది భామ.

(ఇది చదవండి: పెళ్లి కాకుండానే తల్లి కాబోతున్న ఇలియానా!)

తల్లి కాబోతున్నట్లు ప్రకటించిన తర్వాత కానీ ఎవరితో రిలేషన్ ఉందనేది మాత్రం ఇప్పటివరకు తెలియదు. అయితే తాజాగా తన ఇన్‌స్టాలో స్టోరీస్‌లో పోస్ట్ చేసిన సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ప్రస్తుతం తొమ్మిదో నెల గర్భంతో ఉన్న ఇలియానా.. తన భాయ్‌ఫ్రెండ్‌ను ఫోటోను పంచుకుంది. డేట్ నైట్ అంటూ క్యాప్షన్ ఇచ్చి అతనితో ఉన్న ఫోటోలను షేర్ చేసింది. అయితే పేరును మాత్రం వెల్లడించలేదు. 

కాగా.. గతంలో కత్రినా కైఫ్ సోదరుడు సెబాస్టియన్ లారెంట్ మిచెల్‌తో ఇలియానా డేటింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, తాజా సోషల్ మీడియా పోస్ట్ చిత్రాలలో ఉన్న వ్యక్తి సెబాస్టియన్ కానందున ఊహాగానాలకు తెరపడింది. దీంతో ఈ ముద్దుగుమ్మ త్వరలోనే బిడ్డకు జన్మనివ్వనుంది. అప్పటిలోగా తన భాయ్‌ఫ్రెండ్‌ పేరును ప్రకటిస్తుందో లేదో వేచి చూడాలి.  ప్రెగ్నెన్సీకీ బాలీవుడ్‌లో వెబ్ సిరీస్‌ల్లో నటించింది. 

(ఇది చదవండి: ఆ లీడర్లను నమ్మొద్దు.. ఏపీ పాలిటిక్స్‌పై పూనమ్‌ కౌర్‌ సంచలన ట్వీట్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement