
ఏడేళ్లు అయ్యింది. అజయ్ దేవ్‌గన్ హీరోయిన్ లేకుండా సినిమా చేసి. ఏడేళ్ల క్రితం హీరోయిన్ లేకుండా అజయ్ చేసిన సినిమా ఏంటబ్బా? అని ఆలోచిస్తున్నారా? 2010లో వచ్చిన ‘రాజ్‌నీతి’లో ఆయనకు లేడీ జోడీ లేదు. ‘ధమాల్, డబుల్ ధమాల్’లకు సీక్వెల్‌గా రూపొందనున్న తాజా చిత్రం ‘టోటల్ థమాల్’లోనూ ఆయనకు జోడీ లేదు. మొదటి రెండు భాగాలను తెరకెక్కించిన ఇంద్రకుమార్ మూడో భాగాన్ని కూడా రూపొందించనున్నారు.
ఆల్రెడీ థర్డ్ పార్ట్‌లో అనిల్ కపూర్, మాధురీ దీక్షిత్‌లు కీలక పాత్రల్లో నటించనున్నారు. తాజాగా అజయ్ దేవ్‌గన్‌ను తీసుకున్నారు. మొదట ఇలియానాను అజయ్ సరసన హీరోయిన్‌గా అనుకున్నారట. కానీ, స్క్రిప్ట్ పరంగా అజయ్ క్యారెక్టర్‌కు లేడీ జోడి అవసరం లేదని ఫిక్స్ అయ్యారట ఇంద్రకుమార్. వచ్చే నెలలో ఈ సినిమా షూటింగ్‌ను స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. మేజర్ సీన్స్‌ని లక్నోలో షూట్ చేయనున్నారు. ‘టోటల్ ధమాల్’ చిత్రాన్ని వచ్చే ఏడాది దీపావళికి విడుదల చేయాలనుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment