madhuri Dixit
-
వారెవా డ్యాన్స్ : అదరగొట్టిన మాధురి, విద్యా, వైరల్
వయసు పెరుగుతున్న కొద్దీ అందం, నటనతో అభిమానులను ఆశ్చర్యానికి లోనయ్యేలా చేస్తున్నారు కొందరి తారామణులు. వారిలో ఇప్పుడు ముందు వరసలో చేరారు మాధురీ దీక్షిత్. విద్యాబాలన్‌తో కలిసి ఇటీవల ‘అమి జె తోమార్ 3.0’ యుగళగీతానికి నృత్యం చేస్తున్న షూటింగ్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. భూల్ భులయ్యా3 సినిమాలోని ఈ పాట అక్టోబర్ 25న విడుదల అయ్యింది. ఈ సినిమా ట్రైలర్లో ఇప్పటికే మాధురీ దీక్షిత్‌ను చూసిన నెటిజనులు చెక్కుచెదరని ఆమె అందాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు. ఇంక ‘అమి జె తోమర్ 3.0’ లో 45 ఏళ్ల విద్యాబాలన్‌తో కలిసి 57 ఏళ్ల మాధురి దీక్షిత్ చేసిన నృత్యం విశేషంగా ఆకట్టుకుంటోంది. 2007లో విడుదలైన భూల్ భులయ్యా సినిమాలోని ఒరిజనల్ ట్రాక్‌కి రీమేక్ ఇది. మ్యూజిక్ డైరెక్టర్ ప్రీతమ్ కం΄ోజ్ చేసిన ఈ పాటను శ్రేయా ఘోషల్ పాడారు. View this post on Instagram A post shared by Vidya Balan (@balanvidya) -
మొన్న బిగ్‌బీ.. నేడు మాధురీ దీక్షిత్: అవే షేర్స్ కొంటున్న సెలబ్రిటీలు
ప్రముఖ నటి 'మాధురీ దీక్షిత్' (Madhuri Dixit) ఇటీవల ఫుడ్ అండ్ గ్రోసరీ డెలివరీ ప్లాట్‌ఫామ్ స్విగ్గీలో రూ. 1.5 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. ఈ షేర్లను ఇన్నోవ్8 వ్యవస్థాపకులు 'రితేష్ మాలిక్' నుంచి కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.మాధురీ దీక్షిత్, రితేష్ మాలిక్ ఇద్దరూ రూ. 3 కోట్ల విలువైన షేర్స్ కొనుగోలు చేసి స్విగ్గిలో వాటాదారులయ్యారు. వీరిరువురు ఒక్కో షేరుకు రూ. 345 చొప్పున చెల్లించినట్లు సమాచారం. ఈ విషయాన్ని కంపెనీ అధికారికంగా వెల్లడించలేదు. కాగా ఇప్పటికే స్విగ్గిలో అమితాబ్ బచ్చన్ కూడా ఇన్వెస్ట్ చేసారు.ఇదీ చదవండి: వాటా కొనుగోలు చేసిన బిగ్‌బీ కుటుంబంబెంగళూరు ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న స్విగ్గీ.. త్వరలోనే ఐపీఓకు రానుంది. ఈ ఐపీఓ ద్వారా సుమారు ఒక బిలియన్ డాలర్లు సమీకరించాలని కంపెనీ భావిస్తోంది. అయితే ఈ ఐపీఓకు సంబంధించిన మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో స్విగ్గీ ఆదాయం 36 శాతం పెరిగి రూ. 11,247 కోట్లకు చేరుకుంది. -
అందరి మీదకు అరిచే డైరెక్టర్.. అప్పట్లో ఆ హీరోయిన్ దగ్గర మాత్రం!
లెజెండరీ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీకి కోపమెక్కువ. తనకు గానీ తిక్క రేగిందంటే అవతల ఎవరున్నా సరే ఆగ్రహంతో విరుచుకుపడతాడట! అలాంటిది గతంలో మాత్రం హీరోయిన్‌తో మాట్లాడటానికి కూడా తటపటాయించేవాడట. ఈ విషయాన్ని దర్శకుడు విధు వినోద్ చోప్రా వెల్లడించాడు. 1942: ఎ లవ్ స్టోరీ సినిమా టైంలో విధు వినోద్‌కు సంజయ్ సహాయకుడిగా పని చేశాడు. ఆయన అసిస్టెంట్గాఆ సమయంలోనే అతడి టాలెంట్ గుర్తించి వెన్నుతట్టి ప్రోత్సహించాడు. ఓ ఇంటర్వ్యూలో విధు వినోద్ చోప్రా మాట్లాడుతూ.. సంజయ్ భన్సాలీ.. ఇప్పుడు సంజయ్ లీలా భన్సాలీ అయ్యాడు. అతడు నాకు అసిస్టెంట్‌గా పని చేశాడు. 1942 సినిమాకు అవార్డు వచ్చినప్పుడు వెళ్లి తీసుకోమని తననే పంపించాను. ఇప్పుడేమో ఇలా..ఒకప్పుడు ఎంతో సౌమ్యంగా ఉండేవాడు.. మాధురీ దీక్షిత్‌తో మాట్లాడాలన్నా కూడా భయపడేవాడు. ఇప్పుడేమో అందరి మీదకు గట్టిగా అరుస్తున్నాడు అని చెప్పుకొచ్చాడు. కాగా సంజయ్ లీలా భన్సాలీ ఇటీవలే హీరామండి వెబ్ సిరీస్‌తో ఓటీటీలోనూ అడుగుపెట్టాడు. ప్రస్తుతం దీనికి సీక్వెల్ తెరకెక్కించే పనిలో ఉన్నాడు.చదవండి: నాగార్జున N కన్వెన్షన్ సెంటర్ కూల్చివేత -
మిల మిల మెరిసే దుస్తులలో మాధూరి దీక్షిత్.. ఫొటోలు
-
నో లేడీ జోడి!
ఏడేళ్లు అయ్యింది. అజయ్ దేవ్గన్ హీరోయిన్ లేకుండా సినిమా చేసి. ఏడేళ్ల క్రితం హీరోయిన్ లేకుండా అజయ్ చేసిన సినిమా ఏంటబ్బా? అని ఆలోచిస్తున్నారా? 2010లో వచ్చిన ‘రాజ్‌నీతి’లో ఆయనకు లేడీ జోడీ లేదు. ‘ధమాల్, డబుల్ ధమాల్’లకు సీక్వెల్‌గా రూపొందనున్న తాజా చిత్రం ‘టోటల్ థమాల్’లోనూ ఆయనకు జోడీ లేదు. మొదటి రెండు భాగాలను తెరకెక్కించిన ఇంద్రకుమార్ మూడో భాగాన్ని కూడా రూపొందించనున్నారు. ఆల్రెడీ థర్డ్ పార్ట్‌లో అనిల్ కపూర్, మాధురీ దీక్షిత్‌లు కీలక పాత్రల్లో నటించనున్నారు. తాజాగా అజయ్ దేవ్‌గన్‌ను తీసుకున్నారు. మొదట ఇలియానాను అజయ్ సరసన హీరోయిన్గా అనుకున్నారట. కానీ, స్క్రిప్ట్ పరంగా అజయ్ క్యారెక్టర్‌కు లేడీ జోడి అవసరం లేదని ఫిక్స్ అయ్యారట ఇంద్రకుమార్. వచ్చే నెలలో ఈ సినిమా షూటింగ్‌ను స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. మేజర్ సీన్స్‌ని లక్నోలో షూట్ చేయనున్నారు. ‘టోటల్ ధమాల్’ చిత్రాన్ని వచ్చే ఏడాది దీపావళికి విడుదల చేయాలనుకుంటున్నారు. -
మే 15న పుట్టిన రోజు జరుపుకుంటున్న ప్రముఖులు
ఈరోజు మీతో పాటు పుట్టిన రోజు జరుపుకుంటున్న ప్రముఖులు: మధురి దీక్షిత్ (బాలీవుడ్ నటి), రామ్ (నటుడు) ఈ రోజు పుట్టిన రోజు జరుపుకునేవారికి ఈ సంవత్సరం కొత్త స్నేహాలు, కొత్త బంధాలు ఏర్పడతాయి. వీరి సంవత్సర సంఖ్య 1 అయినందువల్ల నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి, అవివాహితులకు వివాహ యోగం, మీడియా రంగంలో పని చేసేవారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. అవాంఛనీయమైన పాత స్నేహాలు, పాత బంధాలు, దురలవాట్ల నుంచి బయట పడతారు. పిల్లల వివాహం కోసం చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి. కోరుకున్న ప్రదేశాలకు బదిలీ అవుతుంది. విద్యార్థులు కోరుకున్న కోర్సులలో సీటు వస్తుంది. వీరు కొంచెం నోటిదురుసు, అహంభావాన్ని తగ్గించుకుని, నిదానంగా వ్యవహరించటం మంచిది. లక్కీ నంబర్లు: 1,5,6,9, లక్కీ కలర్స్: వైట్, క్రీమ్, రోజ్, ఆరెంజ్. లక్కీడేస్: ఆది, మంగళ, శుక్రవారాలు. శుక్రజపం చేయించుకోవడం, ఆదిత్యహృదయ పారాయణం చేయడం, ఈశ్వరుణ్ణి ఎర్రని పూలతో పూజించడం మంచిది. ఆడపిల్లలకు చదువుకయ్యే ఖర్చును భరించడం, అనాథ వృద్ధులకు అన్నదానం చేయడం వల్ల కలిసి వస్తుంది. - రహిమాన్ దావూద్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్