![Sanjay Leela Bhansali Was Too Scared to Speak to Madhuri Dixit: Vidhu Vinod Chopra](/styles/webp/s3/article_images/2024/08/24/SANJAY.jpg.webp?itok=EuTz8kHp)
లెజెండరీ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీకి కోపమెక్కువ. తనకు గానీ తిక్క రేగిందంటే అవతల ఎవరున్నా సరే ఆగ్రహంతో విరుచుకుపడతాడట! అలాంటిది గతంలో మాత్రం హీరోయిన్‌తో మాట్లాడటానికి కూడా తటపటాయించేవాడట. ఈ విషయాన్ని దర్శకుడు విధు వినోద్ చోప్రా వెల్లడించాడు. 1942: ఎ లవ్ స్టోరీ సినిమా టైంలో విధు వినోద్‌కు సంజయ్ సహాయకుడిగా పని చేశాడు.
ఆయన అసిస్టెంట్‌గా
ఆ సమయంలోనే అతడి టాలెంట్ గుర్తించి వెన్నుతట్టి ప్రోత్సహించాడు. ఓ ఇంటర్వ్యూలో విధు వినోద్ చోప్రా మాట్లాడుతూ.. సంజయ్ భన్సాలీ.. ఇప్పుడు సంజయ్ లీలా భన్సాలీ అయ్యాడు. అతడు నాకు అసిస్టెంట్‌గా పని చేశాడు. 1942 సినిమాకు అవార్డు వచ్చినప్పుడు వెళ్లి తీసుకోమని తననే పంపించాను.
ఇప్పుడేమో ఇలా..
ఒకప్పుడు ఎంతో సౌమ్యంగా ఉండేవాడు.. మాధురీ దీక్షిత్‌తో మాట్లాడాలన్నా కూడా భయపడేవాడు. ఇప్పుడేమో అందరి మీదకు గట్టిగా అరుస్తున్నాడు అని చెప్పుకొచ్చాడు. కాగా సంజయ్ లీలా భన్సాలీ ఇటీవలే హీరామండి వెబ్ సిరీస్‌తో ఓటీటీలోనూ అడుగుపెట్టాడు. ప్రస్తుతం దీనికి సీక్వెల్ తెరకెక్కించే పనిలో ఉన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment