Vidhu Vinod Chopra
-
క్రికెట్లో రికార్డులను తిరగరాస్తున్న బాలీవుడ్ దర్శకుడి తనయుడు
ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు విధు వినోద్ చోప్రా తనయుడు అగ్ని చోప్రా దేశవాలీ క్రికెట్లో రికార్డుల మీద రికార్డులు నెలకొల్పుతున్నాడు. గతేడాది రంజీల్లోకి ఎంట్రీ ఇచ్చిన అగ్ని.. తానాడిన మొదటి నాలుగు మ్యాచ్‌ల్లో సెంచరీలు చేశాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఈ ఘనత ఎవరూ సాధించలేదు. అగ్ని తాజాగా ఆడిన రంజీ మ్యాచ్‌లో మరో రికార్డు నెలకొల్పాడు. రంజీల్లో మిజోరంకు ప్రాతినిథ్యం వహించే అగ్ని.. అరుణాచల్ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ, డబుల్ సెంచరీ చేసి చరిత్ర సృష్టించాడు. దేశవాలీ క్రికెట్లో ఇలా ఒకే మ్యాచ్‌లో సెంచరీ, డబుల్ సెంచరీని ఇంతవరకు ఎవరూ చేయలేదు.అరుణాచల్ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 110 పరుగులు చేసిన అగ్ని.. రెండో ఇన్నింగ్స్‌లో 238 పరుగులు చేశాడు. అగ్ని సూపర్ శతకాలతో చెలరేగడంతో ఈ మ్యాచ్‌లో మిజోరం 267 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. అగ్నికి ప్లేయర్ ఆప్ ద మ్యాచ్ అవార్డు లభించింది.గత సీజన్లోనూ పరుగుల వరద పారించిన అగ్నిఅగ్ని గత రంజీ సీజన్లోనూ పరుగుల వరద పారించాడు. అగ్ని ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఇప్పటివరకు ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో ఐదు సెంచరీలు, మూడు హాఫ్ సెంచరీల సాయంతో 939 పరుగులు చేశాడు. అగ్ని సగటు 78.25గా ఉంది. అతని స్ట్రయిక్‌రేట్ 103.30గా ఉంది. కాగా, అగ్ని తండ్రి విధు వినోద్ చోప్రా గతేడాది "12 ఫెయిల్" అనే సూపర్ హిట్ సినిమాకు దర్శకత్వం వహించాడు. అగ్ని తల్లి అనుపమ చోప్రాకు బాలీవుడ్లో మూవీ క్రిటిక్‌గా మంచి పేరుంది. చదవండి: ఓవర్ వెయిట్..! టీమిండియా ఓపెనర్‌కు ఊహించని షాక్? -
అందరి మీదకు అరిచే డైరెక్టర్.. అప్పట్లో ఆ హీరోయిన్ దగ్గర మాత్రం!
లెజెండరీ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీకి కోపమెక్కువ. తనకు గానీ తిక్క రేగిందంటే అవతల ఎవరున్నా సరే ఆగ్రహంతో విరుచుకుపడతాడట! అలాంటిది గతంలో మాత్రం హీరోయిన్‌తో మాట్లాడటానికి కూడా తటపటాయించేవాడట. ఈ విషయాన్ని దర్శకుడు విధు వినోద్ చోప్రా వెల్లడించాడు. 1942: ఎ లవ్ స్టోరీ సినిమా టైంలో విధు వినోద్‌కు సంజయ్ సహాయకుడిగా పని చేశాడు. ఆయన అసిస్టెంట్గాఆ సమయంలోనే అతడి టాలెంట్ గుర్తించి వెన్నుతట్టి ప్రోత్సహించాడు. ఓ ఇంటర్వ్యూలో విధు వినోద్ చోప్రా మాట్లాడుతూ.. సంజయ్ భన్సాలీ.. ఇప్పుడు సంజయ్ లీలా భన్సాలీ అయ్యాడు. అతడు నాకు అసిస్టెంట్‌గా పని చేశాడు. 1942 సినిమాకు అవార్డు వచ్చినప్పుడు వెళ్లి తీసుకోమని తననే పంపించాను. ఇప్పుడేమో ఇలా..ఒకప్పుడు ఎంతో సౌమ్యంగా ఉండేవాడు.. మాధురీ దీక్షిత్‌తో మాట్లాడాలన్నా కూడా భయపడేవాడు. ఇప్పుడేమో అందరి మీదకు గట్టిగా అరుస్తున్నాడు అని చెప్పుకొచ్చాడు. కాగా సంజయ్ లీలా భన్సాలీ ఇటీవలే హీరామండి వెబ్ సిరీస్‌తో ఓటీటీలోనూ అడుగుపెట్టాడు. ప్రస్తుతం దీనికి సీక్వెల్ తెరకెక్కించే పనిలో ఉన్నాడు.చదవండి: నాగార్జున N కన్వెన్షన్ సెంటర్ కూల్చివేత -
ఆ రికార్డ్ అందుకున్న ఏకైక ఇండియన్ చిత్రంగా '12th Fail'
అనురాగ్ పాథక్ రచించిన 12Th Fail అనే నవలను ఆధారంగా చేసుకుని.. అదే పేరుతో బాలీవుడ్ దర్శకుడు విధూ వినోద్ చోప్రా సినిమాను తెరకెక్కించారు. విక్రాంత్ మస్సే ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం విశేష ఆదరణ సొంతం చేసుకుంది. తాజాగా ఈ చిత్రం 100 రోజులు పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి ఫైనల్ IMDb రేటింగ్ 9.2 దక్కింది. కొద్దిరోజుల క్రితం 69వ 'ఫిలిం ఫేర్' అవార్డుల్లో ఉత్తమ చిత్రంగా నిలిచింది. ఉత్తమ దర్శకుడు, ఉత్తమ స్క్రీన్‌ప్లే వంటి ఐదు అవార్డులను గెలుచుకుంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పుడు 12Th ఫెయిల్ చిత్రం అంతర్జాతీయంగా కూడా దూసుకుపోయింది. ప్రపంచవ్యాప్తంగా 250 ఉత్తమ చిత్రాల జాబితాలో ఈ మూవీకి చోటు దక్కింది. ఏకంగా టాప్- 50లో ఈ సినిమా ఉండటం విశేషం. ఈ సంతోషకరమైన అప్డేట్ని దర్శకుడు విధు వినోద్ చోప్రా తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు. టాప్ -50లో చేరిన ఏకైక ఇండియన్ చిత్రంగా 12Th ఫెయిల్ రికార్డ్ క్రియేట్ చేసింది. ఎందరినో మెప్పించిన ఈ సినిమా నిజమైన ఒక వ్యక్తి జీవితం అని తెలిసిందే. ముంబయి మహానగర అడిషనల్ కమిషనర్ మనోజ్ జీవితమే ఈ కథ. మనోజ్ జీవిత కథను ఆయన మాజీ రూమ్మేట్ పాండే ఉరఫ్ అనురాగ్ పాథక్ 12Th ఫెయిల్ అనే పుస్తకంగా రాశాడు. దాన్నే- ప్రముఖ హిందీ దర్శకుడు విధూ వినోద్ చోప్రా సినిమాగా తెరకెక్కించి సూపర్‌హిట్ అందుకున్నారు. ఆయన పాత్రలో కనిపించిన విక్రాంత్ మస్సే నటనకు సినీ ప్రియులు మెచ్చుకున్నారు. ఈ చిత్రంలో కథానాయికగా మేధా శంకర్ కనిపించారు. ఒక్కసారిగా ఆమె బాలీవుడ్లో గుర్తింపు పొందారు. View this post on Instagram A post shared by Vidhu Vinod Chopra Films (@vidhuvinodchoprafilms) -
మంచి చిత్రాలు తొక్కేసే బ్యాచ్.. భర్త సంపాదనతో ఎంజాయ్..
ఇటీవలి కాలంలో వచ్చిన మంచి చిత్రాల్లో 12th ఫెయిల్ ఒకటి. ప్రేక్షకులను కదిలించిన ఈ మూవీ గతేడాది అక్టోబర్‌లో థియేటర్లలో విడుదలైంది. ప్రస్తుతం హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఈ సినిమా తీస్తున్నప్పుడు దర్శకుడు విధు వినోద్ చోప్రాను ఎంతోమంది భయపెట్టారు. పెట్టుబడిలో పావు వంతు కూడా రాదని, ఓటీటీకి ఇచ్చేయ్ అని ఉచిత సలహాలిచ్చారు. వారిలో విధు వినోద్ భార్య, సినీ క్రిటిక్ అనుపమ చోప్రా కూడా ఒకరు. తెలివైన వాళ్లంటే జెలసీ.. భార్య కూడా తన సినిమా మీద నమ్మకం పెట్టుకోలేదని, ఈ చిత్రం చూసేందుకు ఎవరూ థియేటర్‌కు రారని విమర్శించిందని చెప్పాడు డైరెక్టర్. తాజాగా ఈ వ్యవహారంపై బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్ కంగనా రనౌత్ స్పందించింది. ఎక్స్ (ట్విటర్) వేదికగా అనుపమపై ఫైర్ అయింది. 'విధు సర్ భార్య అనుపమ చోప్రాకు తెలివైన అమ్మాయిలంటే జెలసీ. వాళ్లంటనే ఈమెకు గిట్టదు. అలాంటి వ్యక్తి భర్తపై అసూయపడటంలో ఆశ్చర్యం లేదు. ఆయన సంపాదించిన పేరు, డబ్బుతో ఈమె సొంతంగా వెబ్సైట్ పెట్టింది, చిన్నచిన్నవ్యాపారాలు చేస్తూ ఉంటుంది. ఆ గ్యాంగ్‌తోనే జత కడుతుంది బాలీవుడ్ డైరెక్టర్ భార్యగా సినిమా పార్టీలకు, ఈవెంట్లకు వెళ్తుంటుంది. అక్కడ టాలెంట్‌ను, మంచి చిత్రాలను తొక్కేయాలనుకునే గాసిప్ గ్యాంగ్‌తో జత కడుతుంది' అని విమర్శించింది. ఇది చూసిన నెటిజన్లు నీ అంత బోల్డ్‌గా ఇండస్ట్రీలో ఎవరూ మాట్లాడలేరు అని మెచ్చుకుంటున్నారు. మరికొందరు మాత్రం 'ముందు నీ కెరీర్ క్లోజ్ కాకుండా చూసుకో.. ఈ గొడవలు పక్కన పెట్టి సినిమాల మీద ఫోకస్ చేయు' అని సలహా ఇస్తున్నారు. కాగా గతంలో అనుపమ చోప్రా - కంగనా రనౌత్ ఒకరిపై మరొకరు విమర్శలు గుప్పించుకున్నారు. Vidhu sir’s wife @anupamachopra is a disgrace in the name of film journalist, she is not only xenophobic but also deeply jealous and insecure of younger and intelligent women, no wonder she is jealous of her own husband, on whose name and wealth she built her website and other… pic.twitter.com/u6SchlUehk — Kangana Ranaut (@KanganaTeam) February 4, 2024 చదవండి: ఆ సింగర్ ఇంట్లో పని చేశా.. తర్వాతే ఈ బిజినెస్... సందీప్ కిషన్ ఎంతిచ్చాడంటే? -
'12th Fail' రూ.30 లక్షలు కూడా రావన్నారు, నా భార్య కూడా..
కొన్ని సినిమాలు మ్యాజిక్ చేస్తాయి. ఎంతటి కఠిన హృదయాలనైనా కదిలించేస్తాయి. సినిమా చూసిన తర్వాత కూడా మనల్ని వెంటాడతాయి. అలాంటి సినిమానే 12th ఫెయిల్. గతేడాది అక్టోబర్‌లో రిలీజైన ఈ మూవీ కలెక్షన్స్ కూడా బాగానే రాబట్టింది. హాట్‌స్టార్‌లోనూ మంచి ఆదరణ లభించింది. ఈ సినిమా వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఓ వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు విధు వినోద్ చోప్రా మాట్లాడుతూ.. 'వంద రోజులు వెనక్కు వెళ్తే ఆ రోజు ఈ సినిమా తొలిసారి స్క్రీనింగ్ వేశాం. 12th ఫెయిల్ ఎవరూ చూడరన్నారు అప్పుడు బాక్సాఫీస్ దగ్గర రూ.100 కోట్లు, రూ.500 కోట్లు, రూ.1000- 2000 కోట్ల గురించి మాట్లాడుకుంటున్న రోజులు.. నేను అందులో కొంతైనా రాబడతానా? అనుకున్నాను. అయినా ఈ సినిమా తీయడం వెనక నా ఉద్దేశ్యమేంటి? అని నన్ను నేనే ప్రశ్నించుకున్నాను. మనం నిజాయితీగా సినిమా తీస్తే కలెక్షన్లు వాటంతటవే వస్తాయని నమ్మాను. అయితే 12th ఫెయిల్ చూసేందుకు ఎవరూ థియేటర్స్‌కు రారని చాలామంది భయపెట్టారు. అందులో నా భార్య(అనుపమ చోప్రా) కూడా ఒకరు. విక్రాంత్, నువ్వు కలిసి చేసిన ఈ సినిమాను ఎవరూ చూడరు. రూ.30 లక్షల కంటే ఎక్కువ రావన్నారు నేనైతే ఇలాంటి సినిమాలకు కనెక్ట్ అవను. డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ చేసుకో అని చెప్పింది. కొందరైతే ఈ మూవీ ఓపెనింగ్‌కు రూ.2 లక్షలు వస్తాయి. ఓవరాల్‌గా రూ.30 లక్షలు రాబడితే అదే గొప్ప అని రాసేశారు. చాలా భయపెట్టారు. కానీ నేను ఈ సినిమాను నమ్మాను. నా నమ్మకం వమ్ము కాలేదు. 12th ఫెయిల్ అందరినీ ఆకట్టుకుంది' అని చెప్పుకొచ్చాడు. ఐపీఎస్ అధికారి మనోజ్ కుమార్ శర్మ జీవిత కథ ఆధారంగా ఈ మూవీ తెరకెక్కింది. ఇందులో విక్రాంత్ మాస్సే మనోజ్‌గా నటించాడు. మనోజ్ భార్య, ఐఆర్ఎస్ ఆఫీసర్ శ్రద్ధా జోషి పాత్రలో మేధా శంకర్ మెప్పించింది. దాదాపు రూ.20 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అరవై కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. చదవండి: ఎదురుచూపులకు బ్రేక్.. 19 ఏళ్ల తర్వాత ఓటీటీలోకి సూపర్ హిట్ మూవీ -
చరిత్ర సృష్టించిన 12th ఫెయిల్ డైరెక్టర్ కొడుకు.. ప్రపంచంలో ఒకే ఒక్కడు
ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు విధు వినోద్ చోప్రా కుమారుడు, మిజోరాం ఆటగాడు అగ్ని చోప్రా అరుదైన ఘనత సాధించాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో తన తొలి నాలుగు మ్యాచ్‌లలో నాలుగు సెంచరీలు సాధించిన తొలి క్రికెటర్‌గా అగ్ని చోప్రా ప్రపంచ రికార్డు సాధించాడు. రంజీ ట్రోఫీ-2024లో భాగంగా మేఘాలయాతో మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌లోనూ సెంచరీలతో చెలరేగిన చోప్రా.. ఈ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. ఈ ఏడాది సీజన్‌తో రంజీల్లోకి అరంగేట్రం చేసిన చోప్రా.. సిక్కింతో తన తొలి మ్యాచ్‌లోనే సెంచరీతో మెరిశాడు. తొలి ఇన్నింగ్స్‌లో 166 పరుగులు చేసిన అగ్ని, రెండో ఇన్నింగ్స్‌లో 92 పరుగులు సాధించాడు. అనంతరం నాగాలాండ్, అరుణాచాల్ ప్రదేశ్‌పై సెంచరీలతో కదం తొక్కాడు. ఓవరాల్‌గా ఇప్పటివరకు తన ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ సెంచరీతో మెరిశాడు. ఈ ఏడాది రంజీ సీజన్లో 4 మ్యాచ్‌లు ఆడిన చోప్రా.. 767 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. ఇక ఈ మధ్యే 12th ఫెయిల్ మూవీతో భారీ విజయం అందుకున్న విధు వినోద్ చోప్రా ఇప్పుడు పుత్రోత్సాహంతో పొంగిపోతున్నాడు. చదవండి: Mayank Agarwal: ఆ బాటిల్ తీసుకుని తాగగానే వాంతులు.. భయంకర పరిస్థితి -
12th ఫెయిల్ చిత్రానికి అరుదైన గౌరవం.. !
ప్రముఖ ఫిల్మ్ మేకర్ విధు వినోద్ చోప్రా తెరకెక్కించిన చిత్రం 12th ఫెయిల్. గతేడాది అక్టోబర్ 27న బాలీవుడ్లో విడుదలైన ఈ చిత్రానికి మొదట్లో పెద్దగా ఆదరణ లభించలేదు. కానీ ఆ తర్వాత కేవలం మౌత్ టాక్‌తోనే సూపర్ హిట్‌గా నిలిచింది. తెలుగులో ఈ చిత్రం గతేడాది నవంబర్ 3న రిలీజైంది. తాజాగా ఓటీటీలోనూ రిలీజైన ఈ సినిమాకు అభిమానుల నుంచి విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. ఇటీవలే ఇంటర్నెట్ మూవీ డేటాబేస్ (ఐఎండీబీ)లో అత్యధిక రేటింగ్ సాధించిన ఇండియన్ మూవీగా నిలిచింది. తాజాగా ఈ చిత్రానికి మరో అరుదైన గౌరవం లభించింది. ఇటీవలే మకావులో నిర్వహించిన ఆసియా-యూరప్ యంగ్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఈ చిత్రాన్ని ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఫిల్మ్ ఫెస్టివల్లో పాల్గొన్న ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. ఈ సినిమా ప్రదర్శించే సమయంలో అందరూ ఒక్కసారిగా లేచి నిలబడి అభినందించారు. 12th ఫెయిల్ స్టోరీ ఏంటి? ముంబై క్యాడర్(2005)కు చెందిన అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ మనోజ్ కుమార్ శర్మ రియల్ లైఫ్ నుంచి ఇన్స్పైర్ రాసిన కథ ఇది. ఓ చిన్న పల్లెటూరికి చెందిన మనోజ్.. ఎలాంటి సపోర్ట్ లేకుండా సీవిల్స్‌కి ఎంపికై అందరికి ఆదర్శంగా నిలిచాడు. అయితే ఆయన సీవిల్స్‌కి ప్రిపేర్ అయిన సమయంలో పడిన కష్టాల నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుంది. భారతీయ విద్యావ్యవస్థలోని తీరుతెన్నులను స్పృశిస్తూనే.. ఐపీఎస్, ఐఏఎస్ లాంటి ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే పేద విద్యార్థుల బాధలు, కష్టాలను కళ్లకు కట్టినట్లు చూపించారు. (12th ఫెయిల్ మూవీ రివ్యూ కోసం క్లిక్ చేయండి) ఈ చిత్రంలో విక్రాంత్ మాస్సే , మేధా శంకర్ , అన్షుమాన్ పుష్కర్ , అనంత్ జోషి , హరీష్ ఖన్నా , ప్రియాంషు ఛటర్జీ కీలక పాత్రలు పోషించారు. రూ. 20 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ. 67 కోట్లను వసూలు చేసింది. డిసెంబర్ 29 నుంచి ప్రముఖ ఓటీటీ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఓటీటీలోనూ ఈ చిత్రానికి మంచి ఆదరణ లభిస్తోంది. అయితే ఈ మూవీ కేలవం హిందీలోనే స్ట్రీమింగ్ కావడంతో మిగతా భాషల్లోనూ డబ్ చేయాలని నెటిజన్స్ సోషల్ మీడియా వేదికగా ఓటీటీ సంస్థకు విజ్ఞప్తి చేస్తున్నారు. Such a memorable time @anupamachopra ! Thanks so much to #VidhuVinodChopra for bringing his fabulous #12Fail to #Macao #China for Asia-Europe Festival of Young Cinema.The universal theme really resonated with young Chinese audiences (& in our festival world #Restart is key! ) 👍 https://t.co/B6vlsZwMWF — Deepti DCunha (@deemelinda) January 12, 2024 -
12th ఫెయిల్.. అరుదైన ఘనత, హాలీవుడ్ సినిమాలనూ వెనక్కు నెట్టేసింది!
ప్రముఖ ఫిల్మ్ మేకర్ విధు వినోద్ చోప్రా తెరకెక్కించిన చిత్రం 12th ఫెయిల్. గతేడాది అక్టోబర్ 27న బాలీవుడ్లో విడుదలైన ఈ చిత్రానికి మొదట్లో పెద్దగా ఆదరణ లభించలేదు కానీ.. మౌత్ టాక్ ద్వారా బాగా పుంజుకొని సూపర్ హిట్‌గా నిలిచింది. తెలుగులో ఈ చిత్రం గతేడాది నవంబర్ 3న రిలీజైంది. ఇక్కడ ఈ సినిమాకు సరైన ఆదరణ లభించలేదు. కానీ ఓటీటీలో రిలీజైన తర్వాత మాత్రం దేశం మొత్తం ఈ సినిమా గురించి మాట్లాడుకుంది. విమర్శకుల ప్రశంసలు అందుకుంటూ చివరికి ఇంటర్నెట్ మూవీ డేటాబేస్ (ఐఎండీబీ)లో అత్యధిక రేటింగ్ సాధించిన ఇండియన్ మూవీగా 12th ఫెయిల్ నిలిచింది. గతేడాది హాలీవుడ్లో రిలీజైన స్పైడర్ మ్యాన్: అక్రాస్ ది స్పైడర్ వెర్స్(8.6), ఓపెన్‌హైమర్(8.4), గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ వాల్యూమ్ 3(7.9), కిల్లర్స్ ఆఫ్ ద ఫ్లవర్ మూన్(7.8), జాన్ విక్ చాప్టర్ 4(7.7) లాంటి సినిమాల ఐఎండీబీ రేటింగ్ కంటే కూడా ఎక్కువ రేటింగ్ ఈ 12th ఫెయిల్(9.2) మూవీ సొంతం చేసుకుంది. ఇండియన్ టాప్ 250 సినిమాల్లో 12th ఫెయిల్ మూవీ మొదటి స్థానంలో ఉండడం గమనార్హం. ఈ లిస్ట్ టాప్ 5లో 1993లో వచ్చిన యానిమేటెడ్ మూవీ రామాయణ, మణిరత్నం నాయకుడు, హృషికేష్ ముఖర్జీ గోల్ మాల్, మాధవన్ డైరెక్ట్ చేసిన రాకెట్రీ ఉన్నాయి. 12th ఫెయిల్ స్టోరీ ఏంటి? ముంబై క్యాడర్(2005)కు చెందిన అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ మనోజ్ కుమార్ శర్మ రియల్ లైఫ్ నుంచి ఇన్స్పైర్ రాసిన కథ ఇది. ఓ చిన్న పల్లెటూరికి చెందిన మనోజ్.. ఎలాంటి సపోర్ట్ లేకుండా సీవిల్స్‌కి ఎంపికై అందరికి ఆదర్శంగా నిలిచాడు. అయితే ఆయన సీవిల్స్‌కి ప్రిపేర్ అయిన సమయంలో పడిన కష్టాల నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుంది. భారతీయ విద్యావ్యవస్థలోని తీరుతెన్నులను స్పృశిస్తూనే.. ఐపీఎస్, ఐఏఎస్ లాంటి ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే పేద విద్యార్థుల బాధలు, కష్టాలను కళ్లకు కట్టినట్లు చూపించారు. (12th ఫెయిల్ మూవీ రివ్యూ కోసం క్లిక్ చేయండి) ఈ చిత్రంలో విక్రాంత్ మాస్సే , మేధా శంకర్ , అన్షుమాన్ పుష్కర్ , అనంత్ జోషి , హరీష్ ఖన్నా , ప్రియాంషు ఛటర్జీ కీలక పాత్రలు పోషించారు. రూ. 20 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ. 67 కోట్లను వసూలు చేసింది. డిసెంబర్ 29 నుంచి ప్రముఖ ఓటీటీ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఓటీటీలోనూ ఈ చిత్రానికి మంచి ఆదరణ లభిస్తోంది. అయితే ఈ మూవీ కేలవం హిందీలోనే స్ట్రీమింగ్ కావడంతో మిగతా భాషల్లోనూ డబ్ చేయాలని నెటిజన్స్ సోషల్ మీడియా వేదికగా ఓటీటీ సంస్థకు విజ్ఞప్తి చేస్తున్నారు. -
విధు వినోద్ చోప్రా సినీ అనుభవాలతో ‘అన్‌స్క్రిప్టెడ్’
‘నేను చనిపోయాక ఒకనాడెప్పుడో ఎవరో పాఠకుడు ఈ పుస్తకం చదివి కశ్మీర్‌లోని చిన్న గూడెం నుంచి వొచ్చిన ఈ మనిషి ముంబైకి చేరుకుని తన కలలన్నీ నెరవేర్చుకున్నాడు. తన ఆత్మను అమ్మకానికి పెట్టకుండానే ఈ విజయం సాధించాడు. నేనెందుకు నా ఆత్మను పణంగా పెట్టి రాజీ పడి నాక్కావలసింది పొందాలి అనుకుంటే నాకు అంతేచాలు’ అన్నారు దర్శకుడు విధు వినోద్ చోప్రా. ఆయన రచయిత అభిజిత్ జోషితో కలిసి తన సినిమా అనుభవాలను ‘అన్‌స్క్రిప్టెడ్’ పేరుతో పుస్తకంగా వెలువరించనున్నాడు. ప్రసిద్ధ పబ్లిషింగ్ సంస్థ ‘పెంగ్విన్’ దీనిని ప్రచురించనుంది. ఈ పుస్తకాన్ని రాస్తున్న అభిజిత్ జోషి ‘ఒకసారి నన్ను ఏదో కోట్ (quote) రాయమని వినోద్ చోప్రా అడిగారు. నేను రాసిచ్చాను. ఆయన ఒక కొత్త చొక్కా నాకు అందిస్తూ ‘కోట్ (quote) బదులుగా చొక్కా’ అంటూ ఇచ్చారు. ఆయన ఏది మాట్లాడినా ఒక విశేషం ఉంటుంది. ఆయన జీవితం నిండా విశేషాలే. నటుడుగా మొదలెట్టి దర్శకుడిగా నిర్మాతగా మారారు. రూపాయి లేకుండా ముంబై వచ్చి కోట్ల కలెక్షన్లు రాబట్టిన సినిమాలు తీశారు. ఆ సినిమాల వెనుక ఉన్న విశేషాలు ఈ పుస్తకం నిండా ఉంటాయి’ అన్నారు. చదవండి: పాఠకుల మనసులూ దోచుకున్నాడు! విధు వినోద్ చోప్రా ‘జానే భీ దో యారో’ సినిమాలో నటించారు. ‘పరిందా’ సినిమాకు దర్శకత్వం వహించి గొప్ప పేరు సంపాదించారు. ‘1942 ఏ లవ్ స్టోరీ’ తీశారు. ఆ తర్వాత రాజ్‌కుమార్ హిరాణిని దర్శకుడిగా పరిచయం చేసి ‘మున్నాభాయ్ ఎంబిబిఎస్’, ‘లగే రహో మున్నాభాయ్’, ‘3 ఇడియెట్స్’ సినిమాలు తీశారు. విధు వినోద్ చోప్రా కశ్మీర్ సమస్యను పండిట్ల దృష్టి కోణం నుంచి చెప్పే సినిమాలు తీశారు. వాటిలో ఇటీవల వచ్చిన ‘షికారా’ ముఖ్యమైనది. -
‘మీ భర్త నన్ను ఆత్మహత్యకు ప్రేరేపించాడు’
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణించిన నాటి నుంచి బాలీవుడ్లో బంధుప్రీతి వంటి అంశాలతో పాటు సినీ విమర్శకుల మీద కూడా తీవ్రమైన ఆరోపణలు వెలుగు చూస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం సుశాంత్ ఆఖరిసారిగా నటించిన ‘దిల్ బేచారా’ చిత్రం విడుదల కానుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రసిద్ధ రచయిత చేతన్ భగత్ సిని విమర్శకులను ఉద్దేశిస్తూ.. ‘సంస్కారం లేని, ఉన్నతమైన విమర్శకులకు ఓ విన్నపం. సుశాంత్ సింగ్ ‘దిల్ బేచారా’ ఈ శుక్రవారం విడుదల అవుతుంది. కాస్తా సున్నితంగా ఉండటానికి ప్రయత్నించండి. పనికిమాలిన చెత్త అంతా రాయకండి. సున్నితంగా, స్పష్టంగా ఉండండి. మీ అతి తెలివితేటలను ఉపయోగించకండి. ఇప్పటికే చాలా మంది జీవితాలను నాశనం చేశారు. ఇప్పటికైనా ఆపండి. మేము ప్రతిది గమనిస్తూనే ఉంటాము’ అంటూ చేతన్ భగత్ ట్వీట్ చేశారు. గతంలో విమర్శకులు రాజీవ్ మసంద్, అనుపమ చోప్రా సుశాంత్ చిత్రాల పట్ల క్రూరంగా వ్యవహరించారని చేతన్ భగత్ ఆరోపించారు. (‘సుశాంత్‌ను అందుకే తొలగించారా!’) Ma'am, when your husband publicly bullied me, shamelessly collected all the best story awards, tried denying me credit for my story and drove me close to suicide, and you just watched, where was your discourse? https://t.co/CeVDT2oq47 — Chetan Bhagat (@chetan_bhagat) July 21, 2020 ఈ క్రమంలో అనుపమ చోప్రా, చేతన్ భగత్ ట్వీట్‌పై స్పందించారు. ‘విశ్లేషణ తక్కువగా ఉందని మీరు భావించిన ప్రతిసారి ఇదే జరుగుతుంది’ అని స్పందించారు. దీనికి చేతన్ భగత్ ‘మేడమ్.. మీ భర్త నన్ను బహిరంగంగా తిట్టారు. బెస్ట్ స్టోరి అవార్డులను సిగ్గులేకుండా తీసుకున్నారు. నా కథకు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వలేదు. పైగా ఆయన ప్రవర్తనతో నన్ను ఆత్మహత్యకు ప్రేరేపించారు. మీరు వీటన్నింటిని చూస్తూ ఉన్నారు. మరి మీ విశ్లేషణ ఏది’ అంటూ ప్రశ్నించారు. చేతన్ భగత్ రాసిన ‘ఫైవ్ పాయింట్ సమ్‌వన్’ నవల ఆధారంగా ‘3 ఇడియట్స్’ చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసిందే. అయితే విడుదల సమయంలోనే దీనిపై వివాదం మొదలయ్యింది. ఈ చిత్ర నిర్మాత విధు వినోద్ చోప్రా, దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ ఈ నవల హక్కులను కొనుగోలు చేశారు. అయితే చిత్రం ప్రారంభంలో ‘చేతన్ భగత్ ‘ఫైవ్‌పాయింట్ సమ్‌వన్’ ఆధారంగా’ అని వేశారు. కానీ టైటిల్స్‌లో కథ, స్క్రీన్‌ప్లే అభిజాత్ జోషి అని వేశారు. అంతేకాక ఐఫా, ఫిలింఫేర్ అవార్డుల ఫంక్షన్లలో ఉత్తమ కథ బహుమతిని హిరానీ, జోషి అందుకున్నారు. దీనిపై గతంలోనే చేతన్ భగత్ అభ్యంతరం వ్యక్తం చేశారు. Each time you think the discourse can’t get lower, it does! https://t.co/yhkBUd8VSQ — Anupama Chopra (@anupamachopra) July 21, 2020 -
వారు గాడిదలతో సమానం: దర్శకుడు
తన సినిమాపై ఆరోపణలు చేసిన వారు గాడిదలతో సమానమని బాలీవుడ్ దర్శకుడు విధు వినోద్ చోప్రా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘షికారా’ ఈ నెల 7వ తేదిన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 1989-90 కాలంలో కశ్మీర్ నుంచి వలస వెళ్లిన కశ్మీర్ పండితుల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సరైన వసూళ్లు రాబట్టకపోవడంతో కొంతమంది సినిమాపై తీవ్ర విమర్శలు చేస్తన్నారు. కశ్మీరీల జీవితాలను కమర్షియల్‌గా చూపించిన విధుకు సరైన శాస్తి జరింగిందంటూ విమర్శించారు. అలాగే ట్విటర్లో #BoycottShikara అంటూ హ్యష్‌ట్యాగ్‌తో సినిమాను వ్యతిరేకిస్తున్నారు. మరోవైపు ‘ఇస్లాం తీవ్రవాదానికి మా కుటుంబాలు తుడిచిపెట్టుకుని పోయాయి. ఒక కశ్మీరీ పండిత్‌గా నేను నీ సినిమాను గుర్తించడం లేదు’ అని ఓ కశ్మీర్ మహిళ విధు చోప్రాపై విరుచుకుపడుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. (‘నువ్వు తీవ్రవాదాన్ని చూపించలేదు’) తాజాగా ఈ విమర్శలపై స్పందించిన విధు చోప్రా.. గాడిదలుగా మాట్లాడకండి అంటూ విమర్శకులపై మండిపడ్డారు. ఆయన మాట్లాడుతూ.. ‘నేను నిర్మించిన 3 ఇడియట్స్ మొదటి రోజు రూ. 33 కోట్లు రాబట్టింది. అలాగే షికారా మొదటి రోజు రూ. 30 లక్షలు సాధించింది. అయినా ఈ సినిమా తీయడానికి మేము 11 సంవత్సరాల సమయం కేటాయించాం. నేను మొదటి రోజు రూ. 33 కోట్లు సాధించిన సినిమా చేశాను. కానీ నా తల్లి జ్ఞాపకార్థం కోసం చేసిన సినిమా మొదటి రోజు రూ. 30 లక్షలు వసూలు చేసింది. అయినా కశ్మీర్ ప్రజలు బాధను నేను వాణిజ్యపరంగా చేశానని ప్రజలు మాట్లాడుతున్నారు. ఆ విధంగా భావించే వారు గాడిదలు అని నేను అనుకుంటున్నాను. నేను కేవలం వాస్తవాలనే మాత్రమే చిత్రీకరించాను. నేను మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను.. గాడిదలు కాకండి. ముందుగా సినిమా చూసి ఆ తరువాత ఓ అభిప్రాయానికి రండి’ అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. (‘షికారా’ను నిలిపి వేయాలంటూ పిటిషన్) చదవండి : సినిమాను మా అమ్మకు అంకితం చేస్తున్నా: డైరెక్టర్ -
‘నువ్వు తీవ్రవాదాన్ని చూపించలేదు’
శుక్రవారం బాలీవుడ్ చిత్రం ‘షికారా’ విడుదలైంది. రివ్యూలలో ఐదు స్టార్లకు రెండున్నర స్టార్లు వచ్చాయి. సినిమా పేలిపొద్ది అనుకున్నారు. తేలిపోయింది. ‘‘రిలీజ్‌కు ముందు ఎవరో కోర్టులో కేసు వెయ్యబోయీ ఆగిపోయారని తెలిసింది’’ అని విధు వినోద్ చోప్రా ట్వీట్ కూడా పెట్టారు. ‘షికారా’ సినిమా దర్శకుడు ఆయన. ఇస్లాం తీవ్రవాదుల అమానుష కాండ నుంచి తప్పించుకునేందుకు 1990లలో ప్రాణాలు కోల్పోయిన వాళ్లు కోల్పోగా, కశ్మీర్‌లోయను వదిలిపోయిన లక్షల మంది కశ్మీరీ పండిత్‌ల కథ ఇది. సినిమా కాబట్టి కొంచెం ప్రేమను చొప్పించారు. అదే దెబ్బ కొట్టేసినట్లుంది! ఎక్కడైనా ప్రేమ కానీ, ఒక జాతి జాతి ప్రాణాలు అర చేతిలో పెట్టుకుని జన్మభూమిని వదిలి పరుగులు తియ్యడం ఎంత దయనీయమైన కథాంశం! ఆ దైన్యాన్ని చూపించలేక చేతులు ఎత్తేసినట్లున్నారు చోప్రా. ‘‘నువ్వు తీవ్రవాదాన్ని చూపించలేదు. నువ్వు మారణహోమాన్ని చూపించలేదు. మా కుటుంబాలు మొత్తం ఇస్లాం తీవ్రవాదానికి తుడిచిపెట్టుకుని పోయాయి. ఒక కశ్మీరీ పండిత్‌గా నేను నీ సినిమాను గుర్తించడం లేదు’’ అంటూ ఓ ప్రేక్షకురాలు థియేటర్లో లేచి నిలబడి పెద్దగా అరుస్తున్న వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. థీమ్ ఏదైనా ఓ చుక్క ప్రేమ కలిపి సేల్ చేసుకోవాలని చూస్తే ఇలాగే అరకొర రివ్యూ స్టార్లు, ప్రేక్షకుల ఆగ్రహాలు మిగులుతాయని చోప్రా లాంటివాళ్లు ఎప్పటికైనా గ్రహిస్తారా?! -
‘షికారా’ ను నిలిపి వేయాలంటూ పిటిషన్
విధూ వినోద్ చోప్రా దర్శకత్వం వహించిన ‘షికారా’ మూవీని నిలిపి వేయాలంటూ కశ్మీర్‌కు చెందిన కొందరు వ్యక్తులు కోర్టును ఆశ్రయించారు. షికారాకు వ్యతిరేకంగా జమ్మూ కశ్మీర్ హైకోర్టులో మంగళవారం ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేయబడింది. 1980, 90 లలో వలస వెళ్లిన కశ్మీర్ పండితుల గురించే సాగేకథ ఆధారంగా విధు వినోద్ చోప్రా షికారా సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 8న విడుదల కానుంది. ఇక ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషించిన సాదియా, ఆదిల్ ఖాన్ షికారాతోనే తెరంగేట్రం చేసయనున్నారు. కాగా విడుదల తేది దగ్గర పడుతుండటంతో సినిమాపై కోర్టులో పిటిషన్ నమోదవడం చిత్ర బృందానికి తలనొప్పిగా మారింది.(సినిమాను మా అమ్మకు అంకితం చేస్తున్నా: డైరెక్టర్) ఈ విషయంపై తాజాగా విధూ ట్విటర్ ద్వారా స్పందించారు. ‘‘ఈ విషయాన్ని మా లీగల్ టీం చూసుకుంటుంది. శికారా సినిమాను అడ్డుకుంటూ కొంతమంది కోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు మీడియా ద్వారా తెలిసింది. దీనిపై ఇంకా పూర్తి విషయాలు తెలియాల్సి ఉంది. మా లాయర్ హరీష్ సల్వే దీని గురించి తగిన చర్యలు తీసుకుంటాడు’ అని తెలిపారు. కాగా కశ్మీర్ పండితుల గురించి అసత్యాలను చిత్రీకరించారని పిటిషనర్లు ఆరోపిస్తున్నారు. సినిమాను నిలిపివేయాలని, సినిమాలో ముస్లింలను చెడుగా చూపించే కొన్ని సన్నివేశాలను తొలగించాలని కోరుతున్నట్లు పిల్ దాఖలు చేసిన వారిలో ఒకరు తెలిపారు. -
సినిమాను మా అమ్మకు అంకితం చేస్తున్నా: డైరెక్టర్
బాలీవుడ్ డైరెక్టర్, నిర్మాత విధు వినోద్ చోప్రా దర్శకత్వం వహించిన తాజా మూవీ ‘షికారా’ ప్రీమియర్ షోను ఆదివారం ఢిల్లీలో ప్రదర్శించారు. జమ్మూలోని జగ్తి క్యాంపస్‌కు చెందిన సుమారు 300 మంది కాశ్మీరీ పండితులు, ఇతర ప్రముఖులు ఈ చిత్రాన్ని వీక్షించారు. వీరిలో చాలా మంది పండితులు సినిమాలో కూడా నటించారు. కశ్మీర్ లోయ నుంచి కాశ్మీరీ పండితులను బషిష్కరించి 30 సంవత్సరాలు గడిచిన సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. 1990 జనవరి 19, 20 తేదీల్లో కాశ్మీరీ పండితులు ప్రాణాలను అరచేతిలో పట్టుకొని కశ్మీర్‌ను వదిలి వలస వెళ్లిన విషయం తెలిసిందే. ఆ సమయంలో దాదాపు 4 లక్షల మంది వలస వెళ్లిన పండితుల గురించే సాగేకథ ఆధారంగా విధు వినోద్ చోప్రా షికారా సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సందర్భంగా వినోద్ చోప్రా భావోద్వేగానికి లోనయ్యారు. ఈ చిత్రాన్ని తన తల్లి శాంతి దేవికి అంకితం చేస్తున్నానని తెలిపారు. వినోద్ చోప్రా తల్లి శాంతి.. పరిందా చిత్రం కోసం 1989లో కశ్మీర్ నుంచి ముంబై వచ్చి 1999లో తిరిగి కశ్మీర్ వెళ్లే క్రమంలో మరణించారు. ఈ సినిమా కేవలం చిత్రం మాత్రమే కాదని కశ్మీర్‌లోని తన ఇంటికి తిరిగి వెళ్లకముందే మరణించిన తన తల్లి కోసం రూపోందించానని వినోద్ చోప్రా తెలిపారు. తన కలను సాధ్య పరచడంలో సహకరించిన కాశ్మీరీ పండితులకు చోప్రా కృతజ్ఞతలు తెలిపారు. కాగా షికారాను తెరకెక్కించడానికి తనకు 11 ఏళ్లు పట్టిందని అన్నారు. ఈ మధ్యలో మూడు మున్నా భాయ్ సినిమాలు రెండు 3 ఇడియట్స్ సినిమాలు చేశానన్నారు. ఈ కార్యక్రమంలో షికారా ప్రివ్యూతో పాటు మరో రెండు వీడియోలు కూడా ప్రదర్శించారు. సినిమా రచయితలో ఒకరైన రాహుల్ పండిట్ కూడా 990 లో కశ్మీర్‌ను వదిలి వచ్చిన పండితులలో ఒకరు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.."ఈ సినిమా మన కథను ప్రపంచానికి తెలియజేసే మొదటి ప్రయత్నం. మేము వలవ వెళ్లి 30 సంవత్సరాలు అవుతుంది. మాకు ఇంకా న్యాయం జరగలేదు. న్యాయం జరగాలి’’ అని పేర్కొన్నారు. ఇక ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషించిన సాదియా, ఆదిల్ ఖాన్ షికారాతోనే తెరంగేట్రం చేసయనున్నారు. తమ పాత్రల కోసం దాదాపు రెండేళ్ల పాటు శిక్షణ తీసుకున్నట్లు విధు వినోద్ చోప్రా తెలిపారు. ఈ సినిమా ఫిబ్రవరి 7న విడుదల కానుంది -
ఆమిర్ పిచ్చోడు.. ఇడియట్: దర్శకుడి వ్యాఖ్యలు
''ఇలాంటి సినిమాలను పిచ్చోళ్లు మాత్రమే చేస్తారు.. అసలు గట్టిగా మాట్లాడితే ఆమిర్ ఖాన్ ఒక 'ఇడియట్'...'' అని ప్రముఖ దర్శక నిర్మాత విధు వినోద్ చోప్రా వ్యాఖ్యానించారు. ఇదంతా ఎందుకు అన్నారంటే, 'దంగల్' సినిమా చేసినందుకు. ప్రముఖ రెజ్లర్ మహావీర్ సింగ్ ఫోగట్ జీవిత చరిత్ర ఆధారంగా తీసిన దంగల్ సినిమాకు విమర్శకుల ప్రశంసలు అందుతున్నాయి. ఆ కోవలోనే విధువినోద్ చోప్రా కూడా స్పందించారు. ఆమిర్ ఖాన్‌కు సినిమాలంటే పిచ్చి అని, అతడు 'త్రీ ఇడియట్స్'లో చేసినప్పటి నుంచి తాము ముద్దుగా ఇడియట్ అని పిలుచుకుంటామని ఆయన అన్నారు. జీవితంలో బాగా డబ్బు సంపాదించి తర్వాత మరణించినా మన గురించి ఎవరూ గుర్తుపెట్టుకోరు గానీ.. ఇలా ఒక ప్యాషన్‌తో పనిచేస్తే మాత్రం ఎన్ని తరాలైనా తప్పకుండా గుర్తుపెట్టుకుంటారని ఆయన తెలిపారు. ఇలాంటి సినిమాలు తీయడానికి దమ్ము ఉండాలని, అందులోనూ 51 ఏళ్ల వయసులో ఆమిర్ ఖాన్ రెజ్లర్ పాత్రలో నటించాలంటే చిన్నవిషయం కాదని ఆయన అన్నారు. మహావీర్ సింగ్ ఫోగట్ తన కుమార్తెలు గీతా ఫోగట్, బబితా కుమారిలను కూడా రెజ్లర్లుగా రూపొందించారు. వాళ్లిద్దరూ రియో ఒలింపిక్స్‌లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించారు. ఇక ఆమిర్ ఖాన్ గతంలో నటించిన పీకే, 3 ఇడియట్స్ సినిమాలకు విధు వినోద్ చోప్రా నిర్మాతగా వ్యవహరించారు. -
త్వరలో సినిమాలూ విడుదల...
సంజయ్ దత్ జైలుకెళ్లాడు. వచ్చాడు. జైలు కెళ్లాడు. వచ్చాడు. జైలుకి... ఇంటికి... ఈ ఆట ఇక ముగియనుంది. ముంబై పేలుళ్ల కేసులో ఐదేళ్ల జైలు శిక్ష పడి ఆ శిక్ష అప్పుడు కాస్తా అప్పుడు కాస్తా పూర్తి చేస్తూ గత కొంత కాలంగా పూణె ఎరవాడ జైలులో ఉంటున్న సంజయ్ దత్ నిజానికైతే నవంబర్ 2016 వరకూ లోపలే ఉండాలి. కాని సత్ప్రవర్తన రీత్యా శిక్షాకాలం తగ్గి రాబోయే నెలలో విడుదల కానున్నాడు. ఈ విషయం అధికారికంగా ప్రకటితం కాకున్నా ఇప్పటికే బాలీవుడ్‌కు అంది హుషారుగా స్పందిస్తోంది. సన్నిహితుడు విధు వినోద్ చోప్రా అయితే ఇప్పటికే స్క్రిప్ట్‌లు రెడీ చేసి పెట్టాను... సంజయ్ రావడమే తరువాయి అంటున్నాడు. వీళ్లిద్దరి కాంబినేషన్లో ‘మున్నాభాయ్ ఎంబిబిఎస్’, ‘లగే రహో మున్నాభాయ్’ వచ్చి ఘన విజయం సాధించాయి. మూడో సీక్వెల్‌గా ‘మున్నాభాయ్ ఇన్ ఫ్లయిట్’ స్క్రిప్ట్ సిద్ధమైంది. అది తెరకెక్కేలోపలే సంజయ్ లోపలికి వెళ్లాల్సి రావడంతో దానికి మెరుగులు పెడుతూ ఇన్నాళ్లు బృందం ఊరికే ఉండి పోయింది. సంజయ్ బయటకు రావడంతోటే మొదలుకావచ్చు. అది గాక సంజయ్ కూడా జైలులో దాదాపు పది సినిమాలకు కథలు తయారు చేసుకున్నాడట. వాటిలో ఏది ముందుకు వెళుతుందో చెప్పలేము. ఏమాటకా మాట- జైలులో సంజయ్ ప్రవర్తన నిజంగానే బాగుందట. రోజుకు 25 రూపాయల కూలీకి పేపర్ బ్యాగ్స్ తయారు చేయడం అతడి పని. ఆ తర్వాత అది మానేసి జైలు సిబ్బందితో క్లరికల్ పనులు చేస్తున్నాడు. కోరిన తిండి కోరిన వసతి లేకపోవడం వల్ల సంజయ్ ఇప్పటికి దాదాపు 18 కిలోలు తగ్గాడు. ఇది అతడి మీద సానుభూతిని పెంచింది. -
'ప్రమోషన్స్ కోసం పబ్లిగ్గా డ్యాన్సులు చేయించలేను'
ముంబై: సినిమాల ప్రమోషన్స్ కోసం ఇప్పుడు నటీనటులు పడరానిపాట్లు పడటం చూస్తున్నదే. ముఖ్యంగా షాపింగ్ మాల్స్, పబ్లిక్ ప్రదేశాల్లో సినీ బృందమంతా చేరి స్టెప్పులు వేయడం ఇప్పుడు పరిపాటిగా మారింది. కానీ అలాంటి ట్రెండ్ ను తాను అనుసరించబోనని చెప్తున్నారు ప్రముఖ బాలీవుడ్ నిర్మాత విధూవినోద్ చోప్రా. సినిమా ప్రమోషన్స్ కోసం బిగ్ బీ అమితాబ్ బచ్చన్ లాంటి పెద్దాయనతో పబ్లిగ్గా డ్యాన్సులు చేయించలేనని ఆయన స్పష్టం చేశారు. 'ఈ రోజుల్లో సినిమాను ప్రమోట్ చేయాలంటే.. ఏ మాల్కో వెళ్లి డ్యాన్స్ చేయాలన్నది ట్రెండ్‌గా మారింది. లేకపోతే సినిమా విడుదలవుతున్న సంగతి ప్రజలకు తెలిసే అవకాశం ఉండదు. అయితే, మా సినిమా ప్రమోషన్ కోసం ఇలా అమితాబ్‌తో చేయించడం వికృతంగా ఉంటుంది. కేవలం ప్రమోషన్ కోసం నేను అమితాబ్‌తో పబ్లిగ్గా డ్యాన్స్ చేయించలేను' అని ఆయన తెలిపారు. అమితాబ్, ఫర్హాన్ అఖ్తర్ కలిసి నటిస్తున్న 'వజీర్' సినిమాను విధూ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్ కోసం వినూత్న పద్ధతిని అనుసరిస్తున్నామని, ఈ సినిమాలోని 15 నిమిషాల నిడివి దృశ్యాలను విడుదలకు ముందే జర్నలిస్టులకు చూపించడం ద్వారా ఈ సినిమాను ప్రజల్లోకి తీసుకెళుతున్నామని ఆయన చెప్పారు. గతంలో 'మున్నాభాయ్ ఎంబీబీఎస్' వంటి ప్రముఖ సినిమాలను నిర్మించిన ఆయన 'వజీర్' చిత్రం కూడా ప్రేక్షకులకు చేరువ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. -
'పీకే' నిర్మాత, దర్శకులకు నోటీసులు
న్యూఢిల్లీ: ఆమిర్‌ఖాన్ హీరోగా నటించిన 'పీకే' హిందీ సినిమా కథ తన నవల నుంచి కాపీ కొట్టిందేనంటూ ఓ రచయిత పిటిషన్ వేసిన నేపథ్యంలో ఆ సినిమా నిర్మాత, దర్శకులకు ఢిల్లీ హైకోర్టు బుధవారం నోటీసులు జారీ చేసింది. తన హిందీ నవల 'ఫరిస్తా'లోని పాత్రలు, సన్నివేశాలను పీకే సినిమాలో వాడుకుని భావచౌర్యానికి పాల్పడ్డారని కపిల్ ఇసాపురి అనే రచయిత కోర్టుకు తెలిపారు. తన నవలలోని పాత్రలు, 17 సన్నివేశాలను తెలివిగా కాపీకొట్టారని ఆరోపించారు. తనకు ఆ సినిమా రచయితగా గుర్తింపు ఇవ్వడంతో పాటు కోటి రూపాయల నష్ట పరిహారం ఇప్పించాలని కోరారు. తాను నవలను 2009లో పూర్తి చేశానని, అది 2013లో ప్రచురితమైందని వివరించారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు బుధవారం పీకే సినిమా నిర్మాత విధు వినోద్ చోప్రా, దర్శకుడు రాజ్‌కుమార్ హిరానీ, స్క్రిప్టు రచయిత అభిజత్ జోషీలకు నోటీసులు జారీ చేసింది. ఏప్రిల్ 16న తన ముందు హాజరై పిటిషనర్ ఆరోపణలపై స్పందించాలని న్యాయమూర్తి నజ్మీ వజీరి నోటీసుల్లో ఆదేశించారు. ఇదిలా ఉండగా, సినిమా విడుదలై ఇంతకాలమైన తరువాత ఈ పిటిషన్ దాఖలు చేయడమేమిటని కొందరు ప్రశ్నిస్తున్నారు. -
'పీకే' పోస్టర్ పై పిటిషన్
ముంబై: బాలీవుడ్ నటుడు ఆమిర్‌ఖాన్ పై దాఖలైన పిటిషన్ ను విచారించేందుకు ముంబై కోర్టు శుక్రవారం అంగీకరించింది. ఆమిర్‌ఖాన్ హీరోగా నటించిన 'పీకే' సినిమాలో అశ్లీల దృశ్యాలు, అభ్యంతకర మాటలున్నాయంటూ హేమంత్ పాటిల్ అనే వ్యక్తి ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఈ సినిమా నిర్మాత విదూ వినోద్ చోప్రా, దర్శకుడు రాజు హిరాణిలతో పాటు సెన్సార్ బోర్డుపైనా దావా వేశారు. అయితే సెన్సార్ బోర్డుపై పిటిషన్ ను కోర్టు అంగీకరించలేదు. ఆమిర్‌ఖాన్ నగ్నంగా రైల్వే ట్రాక్ పై నిలబడి ట్రానిస్టర్ అడ్డుపెట్టుకున్న పోస్టర్ పై పిటిషనర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. సినిమా విడుదలకు ముందు ఈ సీన్ తొలగించాలని కోర్టును కోరారు. అయితే పీకే సినిమా ఈ రోజు(19-12-2014) విడుదలైంది. ఈ దావాపై తదుపరి విచారణను కోర్టు జనవరి 22కు వాయిదా వేసింది. ఆమిర్‌ఖాన్ నగ్న పోస్టర్ పై నిషేధం విధించేందుకు ఇటీవల సుప్రీంకోర్టు నిరాకరించిన సంగతి తెలిసిందే. 'మీకు నచ్చక పోతే సినిమా చూడడం మానుకోండి' అంటూ అత్యున్నత న్యాయస్థానం పిటిషనర్ కు చురక అంటించింది.