త్వరలో సినిమాలూ విడుదల... | sanjay duth movies also releasing | Sakshi
Sakshi News home page

త్వరలో సినిమాలూ విడుదల...

Published Thu, Jan 7 2016 11:02 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

త్వరలో సినిమాలూ విడుదల... - Sakshi

త్వరలో సినిమాలూ విడుదల...

సంజయ్ దత్ జైలుకెళ్లాడు. వచ్చాడు. జైలు కెళ్లాడు. వచ్చాడు. జైలుకి... ఇంటికి... ఈ ఆట ఇక ముగియనుంది. ముంబై పేలుళ్ల కేసులో ఐదేళ్ల జైలు శిక్ష పడి ఆ శిక్ష అప్పుడు కాస్తా అప్పుడు కాస్తా పూర్తి చేస్తూ గత కొంత కాలంగా పూణె ఎరవాడ జైలులో ఉంటున్న సంజయ్ దత్ నిజానికైతే నవంబర్ 2016 వరకూ లోపలే ఉండాలి. కాని సత్ప్రవర్తన రీత్యా శిక్షాకాలం తగ్గి రాబోయే నెలలో విడుదల కానున్నాడు. ఈ విషయం అధికారికంగా ప్రకటితం కాకున్నా ఇప్పటికే బాలీవుడ్‌కు అంది హుషారుగా స్పందిస్తోంది.
 
  సన్నిహితుడు విధు వినోద్ చోప్రా అయితే ఇప్పటికే స్క్రిప్ట్‌లు రెడీ చేసి పెట్టాను... సంజయ్ రావడమే తరువాయి అంటున్నాడు. వీళ్లిద్దరి కాంబినేషన్‌లో ‘మున్నాభాయ్ ఎంబిబిఎస్’, ‘లగే రహో మున్నాభాయ్’ వచ్చి ఘన విజయం సాధించాయి. మూడో సీక్వెల్‌గా ‘మున్నాభాయ్ ఇన్ ఫ్లయిట్’ స్క్రిప్ట్ సిద్ధమైంది. అది తెరకెక్కేలోపలే సంజయ్ లోపలికి వెళ్లాల్సి రావడంతో దానికి మెరుగులు పెడుతూ ఇన్నాళ్లు బృందం ఊరికే ఉండి పోయింది.
 
  సంజయ్ బయటకు రావడంతోటే మొదలుకావచ్చు. అది గాక సంజయ్ కూడా జైలులో దాదాపు పది సినిమాలకు కథలు తయారు చేసుకున్నాడట. వాటిలో ఏది ముందుకు వెళుతుందో చెప్పలేము. ఏమాటకా మాట- జైలులో సంజయ్ ప్రవర్తన నిజంగానే బాగుందట. రోజుకు 25 రూపాయల కూలీకి పేపర్ బ్యాగ్స్ తయారు చేయడం అతడి పని. ఆ తర్వాత అది మానేసి జైలు సిబ్బందితో క్లరికల్ పనులు చేస్తున్నాడు. కోరిన తిండి కోరిన వసతి లేకపోవడం వల్ల సంజయ్ ఇప్పటికి దాదాపు 18 కిలోలు తగ్గాడు. ఇది అతడి మీద సానుభూతిని పెంచింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement