
చిత్రాంగదా సింగ్
రీసెంట్‌గా రిలీజ్ అయిన ‘సమ్మోహనం’ సినిమాలో నటుడు కావాలనుకుంటారు నరేశ్. అనూహ్యంగా ఆ అవకాశం లభిస్తుంది. అయితే సినిమాలో తన పాత్రను ఎడిటింగ్‌లో కత్తిరించేస్తారు. చాలా బాధపడతారు నరేశ్. మనకు ఆ సన్నివేశం సరదాగా అనిపించినా అనుభవించిన వాళ్లకు తెలుస్తుంది ఆ బాధ. ఇలాంటి అనుభవాన్నే తాజాగా ఎదుర్కొన్నార ట బాలీవుడ్ భామ చిత్రాంగదా సింగ్. సంజయ్ దత్ హీరోగా చిత్రాంగద, మహీ గిల్ కథానాయికలుగా నటించిన చిత్రం ‘సాహెబ్ బీవీ ఔర్ గ్యాంగ్‌స్టర్ 3’. తిగ్‌మాన్షు ధూలియా దర్శకుడు.
ఈ సినిమాలో ఇద్దరు కథానాయికలు ఉన్నప్పటికీ దర్శకుడు మాత్రం మహీ గిల్‌నే హైలైట్ చేశారట.దాని కోసం చిత్రాంగద ఉన్న సన్నివేశాలను సగానికి పైగా కత్తిరించేశారట. చిత్రాంగదా సింగ్‌కు చివరి నిమిషం వరకూ కూడా ఫైనల్ కాఫీ చూపించలేదట చిత్రబృందం. ఆమె ఇంట్రడక్షన్ సీన్, క్లైమాక్స్, తన ముజ్రా డ్యాన్స్ సీన్స్ అన్నీ ఫైనల్ కాపీలో కనిపించకపోవడంతో కన్నీళ్లు ఆపుకోలేకపోయారట. సుమారు 30 రోజులకు పైగా షూట్ చేసి, చివరికి పాత్ర నిడివి అన్యాయంగా తగ్గించేశారని బోరున ఏడ్చేశారని టాక్. ఎంతో కష్టాన్ని కూడా ఇష్టం చేసుకొని నటించినప్పుడు తీరా తెర మీద కనిపించకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో అది అనుభవించిన వాళ్లకే తెలుస్తుంది కదా.
Comments
Please login to add a commentAdd a comment