Chitrangada Singh
-
నిర్మాతగా మారిన బ్యూటిఫుల్ హీరోయిన్..
Chitrangada Make Film Youngest Param Vir Chakra Awardee Yogendra Yadav: యే సాలీ జిందగీ, దేశీ బాయ్స్, ఐ, మీ ఔర్ మే, బజార్, బాబ్ బిస్వాస్ వంటి చిత్రాలతో నటిగా మంచిల గుర్తింపు తెచ్చుకుంది మోడల్, బ్యూటిఫుల్ హీరోయిన్ చిత్రాంగద సింగ్. 2018లో వచ్చిన 'సూర్మా' చిత్రంతో నిర్మాతగా కూడా మారింది. ఇప్పుడు తాజాగా మరో సినిమాకు నిర్మాతగా మారనుంది ఈ మోడల్. కార్గిల్ యుద్ధంలో పోరాడి 19 ఏళ్ల వయసులో పరమ వీర చక్ర అవార్డు అందుకున్న సుబేదార్ యోగేంద్ర యాదవ్ జీవిత చరిత్ర ఆధారంగా ఓ చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రానికి సంబంధించిన హక్కులు చేజిక్కించుకున్నట్లు శనివారం (జులై 30) చిత్రాంగద తెలిపింది. ''నిజమైన హీరోల గురించి, మన మధ్యలో తిరుగుతూ మరుగున పడిన గొప్ప వ్యక్తుల కథల్ని చెప్పడం నాకు ఎప్పుడూ ఉత్సాహంగానే ఉంటుంది. వాళ్ల అద్భుతమైన ప్రయాణాన్ని, జీవితాన్ని వెండితెరపై ఆవిష్కరించే అవసరం ఎంతైనా ఉంది. నిర్మాతగా 'సూర్మా' తర్వాత ఇది నా రెండో ప్రయత్నం' అని తెలిపింది ఈ ముద్దుగుమ్మ. సీఎస్ ఫిల్మ్స్ దీపక్ సింగ్‌తో కలిసి సంయుక్తంగా ఈ బయోపిక్‌ను నిర్మించనుంది చిత్రాంగదా. -
నమస్కార్.. బాబ్ బిస్వాస్ మొదలైంది
ఎనిమిదేళ్ల క్రితం సుజోయ్ ఘోష్ దర్శకత్వంలో విద్యాబాలన్ ప్రధాన పాత్రలో నటించిన హిందీ చిత్రం ‘కహానీ’. ఈ సినిమాలో సస్వతా చటర్జీ చేసిన ‘బాబ్ బిస్వాస్’ అనే కాంట్రాక్ట్ కిల్లర్ పాత్ర హైలైట్‌గా నిలిచింది. ఇప్పుడు ఆ పాత్ర పేరుతో హిందీలో తెరకెక్కుతోన్న సినిమాలో అభిషేక్ బచ్చన్ హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి దియా ఎ. ఘోష్ దర్శకురాలు. చిత్రాంగదా సింగ్ కథానాయికగా నటిస్తారట. షారుక్ ఖాన్, గౌరీ ఖాన్ (షారుక్ ఖాన్ భార్య), సుజోయ్ ఘోష్, గౌరవ్ వర్మ ఈ చిత్రానికి నిర్మాతలు. శుక్రవారం ఈ సినిమా చిత్రీకరణ కోల్‌కతాలో మొదలైంది. ‘‘లైట్స్... కెమెరా.. నమస్కార్.. ‘బాబ్ బిస్వాస్’ షూటింగ్లో తొలి రోజు పాల్గొన్నాను’’ అన్నారు అభిషేక్ బచ్చన్. ఈ సినిమా ఈ ఏడాదే విడుదల కానుంది. -
అక్రమ వేట కేసులో ప్రముఖ గోల్ఫ్ ప్లేయర్ అరెస్ట్
లక్నో : అక్రమంగా వేటాడుతున్నరనే కేసులో భారత గోల్ఫర్ జ్యోతి రంధావాను ఉత్తర్ ప్రదేశ్‌లోని బహ్రైచ్‌లో పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా రంధావ వద్ద నుంచి ఏ - 22 రైఫిల్, వాహనం (హెచ్ఆర్26 డీఎన్ 5299)తో పాటు వేట సామగ్రిని కూడా స్వాధీనం చేసుకున్నారు. కతెర్నియాఘాట్లోని మోతిపూర్లో రంధావకు వ్యవసాయ క్షేత్రం ఉంది. అక్కడ అనుమానాస్పదంగా వాహనం నడుతుపుతుండటంతో పోలీసులు రంధావాను అరెస్ట్ చేశారు. ఈ సమయంలో అతని వద్ద నుంచి అడవి పంది చర్మం, బైనాక్యులర్‌తో పాటు రంధావ పేరు మీద రిజిస్టర్ అయిన వాహనాన్ని కూడా సీజ్ చేశారు. రంధావాను ప్రస్తుతం కతెర్నియాఘాట్ జిల్లా అటవీ అధికారి విచారిస్తున్నారు. చట్ట పరంగా చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. భారత్ తరఫున ఒకప్పుడు అత్యుత్తమ గోల్ఫర్గా జ్యోతి రంధావ రికార్డులు సృష్టించారు. బాలీవుడ్ నటి చిత్రాంగద సింగ్‌ను పెళ్లి చేసుకున్నారు. కానీ వీరి బంధం ఎంతో కాలం నిలవలేదు. 2014లో వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. అదే ఏడాది జ్యోతి రంధావ ప్రొఫెషనల్ గోల్ఫర్గా మారారు. ఆసియా టూర్లో 8 టైటిళ్లు గెలిచారు. 2004లో యూరోపియన్ టూర్లో జానీ వాకర్ క్లాసిక్‌తో కలిసి అత్యుత్తమంగా రెండో స్థానంలో నిలిచారు. గోల్ఫ్ ప్రపంచకప్ టోర్నీల్లో 2005, 2007, 2008, 2009లో భారత్‌కు ప్రాతినిథ్యం వహించారు. -
నన్ను తగ్గించేశారు
రీసెంట్గా రిలీజ్ అయిన ‘సమ్మోహనం’ సినిమాలో నటుడు కావాలనుకుంటారు నరేశ్. అనూహ్యంగా ఆ అవకాశం లభిస్తుంది. అయితే సినిమాలో తన పాత్రను ఎడిటింగ్‌లో కత్తిరించేస్తారు. చాలా బాధపడతారు నరేశ్. మనకు ఆ సన్నివేశం సరదాగా అనిపించినా అనుభవించిన వాళ్లకు తెలుస్తుంది ఆ బాధ. ఇలాంటి అనుభవాన్నే తాజాగా ఎదుర్కొన్నార ట బాలీవుడ్ భామ చిత్రాంగదా సింగ్. సంజయ్ దత్ హీరోగా చిత్రాంగద, మహీ గిల్ కథానాయికలుగా నటించిన చిత్రం ‘సాహెబ్ బీవీ ఔర్ గ్యాంగ్‌స్టర్ 3’. తిగ్మాన్షు ధూలియా దర్శకుడు. ఈ సినిమాలో ఇద్దరు కథానాయికలు ఉన్నప్పటికీ దర్శకుడు మాత్రం మహీ గిల్‌నే హైలైట్ చేశారట.దాని కోసం చిత్రాంగద ఉన్న సన్నివేశాలను సగానికి పైగా కత్తిరించేశారట. చిత్రాంగదా సింగ్‌కు చివరి నిమిషం వరకూ కూడా ఫైనల్ కాఫీ చూపించలేదట చిత్రబృందం. ఆమె ఇంట్రడక్షన్ సీన్, క్లైమాక్స్, తన ముజ్రా డ్యాన్స్ సీన్స్ అన్నీ ఫైనల్ కాపీలో కనిపించకపోవడంతో కన్నీళ్లు ఆపుకోలేకపోయారట. సుమారు 30 రోజులకు పైగా షూట్ చేసి, చివరికి పాత్ర నిడివి అన్యాయంగా తగ్గించేశారని బోరున ఏడ్చేశారని టాక్. ఎంతో కష్టాన్ని కూడా ఇష్టం చేసుకొని నటించినప్పుడు తీరా తెర మీద కనిపించకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో అది అనుభవించిన వాళ్లకే తెలుస్తుంది కదా. -
చిత్రంగదా...
కుషాన్ నంది తదుపరి చిత్రం ‘బాబు మొషాయ్ బందూక్‌బాజ్’ కోసం బాలీవుడ్ భామ చిత్రాంగద సింగ్ సరికొత్త అవతారం ఎత్తనుంది. ఇందులో చెప్పులు కుట్టే యువతి పాత్రలో కనిపించనుందీ భామ. ఈ చిత్రంలో తన క్యారెక్టర్ సహజంగా ఉండేందుకు... చెప్పులు కుట్టడం టోంది. అలాగే, కథ అవసరం మేరకు ఈ ఢిల్లీ బ్యూటీ బెంగాలీ భాష కూడా నేర్చుకుంటోంది. నవాజుద్దీన్ సిద్దిఖీ కథానాయుకుడుగా నటిస్తున్న ఈ చిత్రం పశ్చిమబెంగాల్లోని కరువు జిల్లాలైన పురిలియా, బుర్ద్వాన్‌లలో షూటింగ్ జరుపుకోనుంది. -
చిత్రాంగదను పక్కకు నెట్టేసిన మిత్రవింద
'మగధీర'లో మిత్రవిందగా మెప్పించిన కాజల్ అగర్వాల్ మరో బాలీవుడ్ అవకాశాన్ని చేజిక్కించుకుంది. దర్శకుడు సుధీర్ మిశ్రా తాను తెరకెక్కించనున్న 'అవుర్ దేవదాస్' చిత్రంలో ఆమెను హీరోయిన్ గా ఎంపిక చేశాడు. మొదట ఈ పాత్ర కోసం చిత్రాంగద సింగ్ తీసుకున్నాయి. తర్వాత ఆమెను తప్పించి కాజల్ కు అవకాశమిచ్చారు. కాజల్ అయితేనే ఈ పాత్రకు సరిగ్గా సరిపోతుందని భావించిన నిర్మాతలు ఆమెను సంప్రదించారట. కాజల్ కూడా తన అంగీకారం తెలపడంతో చిత్రాంగద సింగ్ ను పక్కకు తప్పించారు. రొమాంటిక్ డ్రామాతో తెరకెక్కనున్న ఈ సినిమా షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభమవుతుంది. ఇరానీ సినిమా 'సీజ్ ఫైర్' హిందీ రీమేక్ లోనూ అవకాశం దక్కించుకుని కాజల్ ఇలీవల వార్తల్లో నిలిచింది. అజయ్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శర్మాన్ జోషి సరసన కాజల్ నటించనుంది. -
కల నిజమైందనిపిస్తోంది
ముంబై: ‘పెహలే ఆప్ జనాబ్’ సినిమాలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ సరసన నటించే అవకాశం రావడంతో ఎగిరి గంతేసింది నటి చిత్రాంగద సింగ్. ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభం కానుంది. నగరంలో ఆదివారం రాత్రి జరిగిన యాంబీవ్యాలీ ఇండియా బ్రైడల్ ఫ్యాషన్ వీక్‌లో ర్యాంప్‌పై నటి చిత్రాంగద సింగ్ తరుణ్ తహిల్యానీ రూపొందించిన ఎర్ర లెహంగాతో నడి చింది. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ‘స్క్రీన్ ఐడాల్ సరసన నటించే అవకాశం నాకు రావడంతో చిన్ననాటి కల నిజమైందా అనిపిస్తోంది.మితాబ్బచ్చన్కు అంత సమయం ఉండదు. చిన్ననాటినుంచే నాకు ఆయన స్క్రీన్ ఐడాల్. నాకు ఈ విషయం ఎంతో ఉల్లాసం, ఉత్సాహంగా కలిగించింది. వచ్చే ఏడాది జనవరిలో ఈ సినిమా షూటింగ్ ఆరంభమవుతుంది’ అని చిత్రాంగద తెలిపింది. ‘పెహలే ఆప్ జనాబ్’ సినిమాలో చిత్రాంగద గురువు సుధీర్ శర్మ కూడా నటిస్తున్నాడు. గతంలో హజారోం ఖ్వాయిషే ఐసీ, యే సాలీ జిందగీ, ఇన్కార్ సినిమాలలో వీరిరువురూ కలసి పనిచేశారు. ‘సుధీర్ ఓ మేధావి. ఆయన స్క్రిప్టులు కూడా విభిన్నంగా ఉంటాయి. ఆయన చిత్రాల్లో పాత్రలు వాస్తవాలకు బాగా దగ్గరగా ఉంటాయి. ఆయన తన సినిమాల్లో మహిళలను శక్తిమంతులుగా రూపొందిస్తారు’ అని పేర్కొంది. కాగా కార్పొరేట్ వ్యవస్థలో మహిళలపై లైంగిక వేధింపులే ఇతివృత్తంగా మిశ్రా గతంలో ఇన్కార్ సినిమా తీశారు. తరుణ్ తేజ్‌పాల్ కేసుపై మీ అభిప్రాయమేమిటని మీడియా అడగా ఏమిజరిగిందనే విషయం సరిగ్గా తనకు తెలియదంది.