చిత్రాంగదను పక్కకు నెట్టేసిన మిత్రవింద | Sudhir Mishra picks Kajal Aggarwal over Chitrangda Singh | Sakshi
Sakshi News home page

చిత్రాంగదను పక్కకు నెట్టేసిన మిత్రవింద

Published Mon, Jul 28 2014 9:26 AM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

చిత్రాంగదను పక్కకు నెట్టేసిన మిత్రవింద - Sakshi

చిత్రాంగదను పక్కకు నెట్టేసిన మిత్రవింద

'మగధీర'లో మిత్రవిందగా మెప్పించిన కాజల్ అగర్వాల్ మరో బాలీవుడ్ అవకాశాన్ని చేజిక్కించుకుంది. దర్శకుడు సుధీర్ మిశ్రా తాను తెరకెక్కించనున్న 'అవుర్ దేవదాస్' చిత్రంలో ఆమెను హీరోయిన్ గా ఎంపిక చేశాడు. మొదట ఈ పాత్ర కోసం చిత్రాంగద సింగ్ తీసుకున్నాయి. తర్వాత ఆమెను తప్పించి కాజల్ కు అవకాశమిచ్చారు.

కాజల్ అయితేనే ఈ పాత్రకు సరిగ్గా సరిపోతుందని భావించిన నిర్మాతలు ఆమెను సంప్రదించారట. కాజల్ కూడా తన అంగీకారం తెలపడంతో చిత్రాంగద సింగ్ ను పక్కకు తప్పించారు. రొమాంటిక్ డ్రామాతో తెరకెక్కనున్న ఈ సినిమా షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభమవుతుంది. ఇరానీ సినిమా 'సీజ్ ఫైర్' హిందీ రీమేక్ లోనూ అవకాశం దక్కించుకుని కాజల్ ఇలీవల వార్తల్లో నిలిచింది. అజయ్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శర్మాన్ జోషి సరసన కాజల్ నటించనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement