లక్నో : అక్రమంగా వేటాడుతున్నరనే కేసులో భారత గోల్ఫర్ జ్యోతి రంధావాను ఉత్తర్ ప్రదేశ్‌లోని బహ్రైచ్‌లో పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా రంధావ వద్ద నుంచి ఏ - 22 రైఫిల్, వాహనం (హెచ్‌ఆర్26 డీఎన్ 5299)తో పాటు వేట సామగ్రిని కూడా స్వాధీనం చేసుకున్నారు. కతెర్నియాఘాట్‌లోని మోతిపూర్‌లో రంధావకు వ్యవసాయ క్షేత్రం ఉంది. అక్కడ అనుమానాస్పదంగా వాహనం నడుతుపుతుండటంతో పోలీసులు రంధావాను అరెస్ట్ చేశారు. ఈ సమయంలో అతని వద్ద నుంచి అడవి పంది చర్మం, బైనాక్యులర్‌తో పాటు రంధావ పేరు మీద రిజిస్టర్ అయిన వాహనాన్ని కూడా సీజ్ చేశారు. రంధావాను ప్రస్తుతం కతెర్నియాఘాట్ జిల్లా అటవీ అధికారి విచారిస్తున్నారు. చట్ట పరంగా చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.
భారత్ తరఫున ఒకప్పుడు అత్యుత్తమ గోల్ఫర్‌గా జ్యోతి రంధావ రికార్డులు సృష్టించారు. బాలీవుడ్ నటి చిత్రాంగద సింగ్‌ను పెళ్లి చేసుకున్నారు. కానీ వీరి బంధం ఎంతో కాలం నిలవలేదు. 2014లో వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. అదే ఏడాది జ్యోతి రంధావ ప్రొఫెషనల్ గోల్ఫర్‌గా మారారు. ఆసియా టూర్లో 8 టైటిళ్లు గెలిచారు. 2004లో యూరోపియన్ టూర్‌లో జానీ వాకర్ క్లాసిక్‌తో కలిసి అత్యుత్తమంగా రెండో స్థానంలో నిలిచారు. గోల్ఫ్ ప్రపంచకప్ టోర్నీల్లో 2005, 2007, 2008, 2009లో భారత్‌కు ప్రాతినిథ్యం వహించారు.
Comments
Please login to add a commentAdd a comment